తుఫాను వినాశనం Cyclone Telugu Story – Telugu Kathalu – Telugu Fairytales- Kattappa Kathalu

అది కోదండపురం అనే గ్రామం. అక్కడ నది దగ్గర అందరూ ఆతృతగా నది వైపు చూస్తూ ఉన్నారు. వాళ్ళ కళ్ళల్లో భయం ఏం జరుగుతుందా అని కంగారు ఉంది. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ భయపడుతూ భగవంతుని ప్రార్ధిస్తూ ఉన్నారు. ఇంతలో నది లోపల నుంచి ఒక అమ్మాయి పడవలో ఉన్న జనాలు తో తన కుడి చేతితో పట్టుకొని పైకి లేపుకుని తీసుకొని వస్తుంది.
పడవలో ఉన్న జనాలు అందరూ ఆశ్చర్యపోతున్నారు ఇక బయట ఉన్న వాళ్ళందరూ కూడా నోరెళ్లబెడతారు.
పాప ఆ పడవలో ప్రజలందరినీ తీసుకొని బయటకు బొడ్డు చేరుస్తుంది.
అప్పుడు ఆ పాప చేసిన సాహసానికి అందరూ …. పాప మమ్మల్ని క్షమించు నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను నువ్వు దయ్యం-పిల్ల అని అందరు అనుకున్నాము. అని అందరూ ఆమెను క్షమాపణ కోరు కుంటారు ఇక పాప వాళ్లతో ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లి ఒక చెట్టు దగ్గర కూర్చుంది. అసలు ఎవరు ఈ పాప వాళ్ళందరూ ఆ పాపను ఎందుకు తిట్టారు . నది లోపల పడవ ఎందుకు ఉన్నది. అసలు ఏంటి అనేది కథ లోకి వెళ్లి తెలుసుకుందాం.
ఆ పాప పేరు శోభ తల్లి తండ్రి ఎవరు లేరు ఆమె ఒక బిచ్చగత్తె రోడ్డులో వీధి వీధి తిరుగుతూ ఉండేది. ఆమె రోడ్డుపై బిచ్చమెత్తుకుని వచ్చే పోయే వారిని….. బాబు ఆకలి అమ్మ ఆకలి సహాయం చేయండి. అమ్మ ఎవరైనా నాకు కొంచెం తినడానికి ఇవ్వండి అమ్మ. మీకు పుణ్యం ఉంటుంది తల్లి అందర్నీ అడుక్కుంటూ. దొరికింది తింటూ ఉండేది అలా తన కాలం గడుపుతూ ఉండేది ఒక రోజు ఒక స్వామీజీ అటుగా వెళుతూ ఉంటాడు. ఆ స్వామీజీ ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోతాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి వెళ్ళిపోతారు కానీ ఒక్కరు కూడా స్వామీజీకి సహాయం చేయరు. స్వామీజీ దాహం దాహం అని అని అరుస్తూ ఉంటారు కానీ ఎవరో పిచ్చివాడు మనకెందుకులే అని చెప్పుకొని వెళ్ళి పోతూ ఉంటారు. అప్పుడే పాప స్వామీజీని చూస్తుంది స్వామీజీ దగ్గరకు వెళ్లి స్వామీజీ లేవండి స్వామీజీ అంటూ అతని లేపుతుంది అతను దాహం దాహం అని అంటూ అనడం తో పాప మంచినీళ్ళు తీసుకువచ్చి అతనికి దాహం తీరుస్తుంది.
స్వామీజీ చిన్న కాలేసి కూర్చొని పాపతో….. పాపా నీకు చాలా కృతజ్ఞతలు అమ్మ. సమయానికి నా గొంతు తడి చేసి నా ప్రాణాలు నిలిపావు. అని అంటాడు అందుకు పాప మరి ఏం పర్వాలేదు స్వామి మీరు ఎందుకు ఇలాగా పడిపోయారు నాకు అర్థం కాలేదు మీకు ఆకలి అవుతుందా ఇదిగో మీరు ఈ భోజనం చేయండి తగ్గిపోతుంది అంటూ తను అడ్క్కున్న భోజనాన్ని స్వామీజీ కి ఇస్తుంది స్వామీజీ తన యొక్క మనసుని అర్థం చేసుకొని ఆమెతో….. పాప ఎవరమ్మా నువ్వు నీకు తల్లిదండ్రులు ఎవరు లేరా.
పాపా…. ఎందుకు స్వామి తల్లిదండ్రులు అన్న వాళ్ళు భోజనం ఇస్తేనే నువ్వు తింటావా . నాలాంటి వాళ్ళు భోజనం ఇస్తే నువ్వు తీసుకోవాలి స్వామి అంటూ ఎంతో జాలిగా అడుగుతుంది.
స్వామి చాలా బాధపడుతూ…. అయ్యో పాప అలా ఏం కాదు అమ్మ నేను ఉపవాసం లో ఉన్నాను పచ్చి గంగ తప్ప మరి ఏ అల్పాహారం కూడా నేను తీసుకోను. ఈ ఒక్కరోజు పూర్తయితే నాకు 41 రోజులు అయిపోతాయి. అందుకోసమే వద్దు అంటున్నాను. నీ గురించి చెప్పు.
పాప… నా గురించి చెప్పడానికి ఏముంది స్వామి. నాకు చిన్నప్పుడు నుంచి ఎవరూ లేరు దొరికింది తింటూ ఉంటాను ఇంకా నా పేరు నేను శోభ అని పెట్టుకున్నాను.
వీధివీధి తిరిగి ఆడుక్కు oటాను. అని చెబుతుంది. స్వామీజీ…. ఈ ఒక్కరోజు ఆగు తల్లి నీకు రేపు మంచి బహుమతి ఇస్తాను మీ ఊరి చివర్లో ఉన్న ఆశ్రమం దగ్గరికి రా నీకు తప్పకుండా నేను సహాయం చేస్తాను. అని అంటాడు అందుకు పాప సరే అంటుంది ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం పాప స్వామిజి దగ్గరకు వెళ్తుంది. స్వామీజీ దగ్గరికి వెళ్లి అక్కడ స్వామీజీని పిలుస్తుంది స్వామీజీ లోపలి నుంచి బయటకు వచ్చి….. పాప ఇదిగో ఇది నీళ్లు తాగు అమ్మ అని నీళ్లు ఇస్తాడు పాప నీళ్లు తాగుతుంది నీళ్లు తాగిన వెంటనే ఆమెకు ప్రత్యేకమైన శక్తులు వస్తాయి. స్వామీజీ పాపతో….. పాపా నువ్వు ఇప్పుడు తాగింది మంచినీళ్లు నీకు ఇప్పుడు ఎవరితో పని లేదు.
నువ్వు తలుచుకుంటే ఆహారం మీ ముందు ప్రత్యక్షమవుతుంది నువ్వు ఎంతటి కొండని అయినా సరే . పిండి చేయగలవు అంతా బలవంతురాలివి అంతా మహిమ గల శక్తి ఉంది. అని అంటాడు అందుకు పాపా చాల సంతోషపడుతూ స్వామీజీ కొత్త జ్ఞతలు చెప్పకుండా ఇక పాప ఆ రోజు నుంచి తనకు కావాల్సిన ఆహారాన్ని తానే స్వయంగా ప్రత్యక్షం చేసుకుని తింటే ఉంటుంది అలా ఉండగా ఒక రోజున నది దగ్గర పాప …. నాకు ఆహారం కావాలి అని అడుగుతుంది వెంటనే అక్కడి నుంచి ఆహారం వస్తుంది. ఆహారం తీసుకుంటూ ఉండగా దానిని అంత ఊరి వాళ్ళు చూస్తారు పాపను చూసి….. ఇది ఎవరో మాయలమారి లాగా ఉంది . దీనికి మాయ శక్తులు ఉన్నాయి ఇది వచ్చింది అంటే ఏదో పన్నాగం పొందే ఉంటుంది మనం జాగ్రత్తగా ఉండాలి. చెప్పుకుంటారు మరొకరు అమ్మో. ఇలాంటిది మన ఊర్లో ఉండకూడదు అని ఊర్లోకి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పి అందరి చేత పెద్ద పెద్ద కర్రలు తీసుకురమ్మని చెప్పి చెబుతారు అందరూ కర్రలు తీసుకొని పాపా దగ్గరకు వెళతారు…. ఓయ్ ఎవరు నువ్వు దెయ్యం భూతం నిజం చెప్పు. అని అడుగుతారు పాప…. నేను దయ్యాన్ని కాదు ఏమి కాదు అని అంటుంది వాళ్ళు…. మరి నీకు మాయ చెప్పులు ఎక్కడినుంచి వచ్చాయి నిజం చెప్తావా కొట్టాలా అంటూ ఆమెను కొట్టడం మొదలు పెడతారు పాపా జరిగిన విషయం చెబుతున్న కూడా వాళ్ళు అసలు వినరు పాప ఏడుస్తూ….. చెప్తున్నాను నా మాట నమ్మండి అంటూ అరుస్తోంది. ఆ పాప ఎంత వారికి అదే మాట చెప్పడంతో వాళ్ళు పాపను కొట్టి తిప్పి జాగ్రత్తగా ఉండు ఏమన్నా ఊరికి నష్టం జరిగిందో నీ ప్రాణాలు తీస్తాం అని అంటారు పాప ఏడుస్తూ….. ఎందుకు వీళ్ళకి చెప్పినా కూడా అర్థం కావట్లేదు నువ్వు ఇలా కొట్టాడు అంటూ బాధపడుతుంది తన మాయ శక్తితో ఒంటిపై గాయాలను తొలగించి వేస్తుంది.
ఆమె తన మనసులో….. నా మయ శక్తితో వీళ్ళ అందరిని ఏమన్నా చెయ్యొచ్చు కానీ అలా చేయడం తప్పు. అని అనుకొని ఊరుకుంటుంది ఇక కొన్ని రోజులు. ఒకరోజు ఆ నదిలో పడవ వెళుతుండగా ఒక్కసారిగా పడవ సుడిగుండంలో పడి పోయి అక్కడ వాళ్లు పెద్ద పెద్దగా కాపాడమని అరుస్తూ ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళు అందరూ గుమ్మి కుడతారు కానీ. ఎవరూ లోపలికి వెళ్లే సాహసం చేయరు. అప్పుడే పాపా దానిని గమనించి పరుగు పరుగున తన నదిలోకి వెళ్తుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు పాప తన మాయాశక్తి తో లోపల ఉన్న పడవ ని మనుషులతో సహా బయటకు తీసుకు వస్తుంది .
ఇక పాపా యొక్క మంచితనం సాహసం చూసి అందరూ ఒకప్పుడు కొట్టిన వాళ్లే వాడడం మొదలుపెట్టారు. పాప ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్లి చెట్టు దగ్గర కూర్చుంది ఆమె తన మనసులో….. వీళ్లకు మంచి జరిగితే మనం ఈ పొగుడుతారు. ఏదైనా పొరపాటు జరిగితే మనల్లి పెడతారు నిజాలు తెలుసుకోకుండా ఇబ్బంది పేడుతూ ఉంటారు.
అంటూ చాలా బాధపడుతుంది . ఇక పాప నిజంగా మాయలు గలది అని నమ్మి వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకోవడం కోసం పాప దగ్గరికి వస్తారు పాప వాళ్ళ అందరికీ సహాయం చేస్తూ జరిగింది మర్చిపోయి సంతోషంగా ఉంటుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *