తోడి కోడళ్ళు

అది ఒక్క చిన్న గ్రామం .ఆ గ్రామంలో
కామాక్షి అనే ఒక ఆమె ఉండేది ఆమెకు ఇద్దరు కొడుకులు. ఒకని పేరు రవి మరొకరి పేరు కిరణ్. వాళ్ళిద్దరు బాగా చదువుకోనీ గ్రామానికి పక్కనే ఉన్న పట్టణంలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. అయితే పెద్దవాడు రవి అదే ఊర్లో ఉంటున్నా. లక్ష్మి అనే అమ్మాయిని చాలా ఇష్టపడతాడు ఆమె పెద్దగా చదువుకోలేదు. వ్యవసాయం చేసుకుని బతికే కుటుంబం.
ఎలా అయినా ఆమెకు ప్రేమ విషయం చెప్పాలని ఒక రోజు రవి ఆమె దగ్గరికి వెళ్తాడు. ఆమెతో….. లక్ష్మి నువ్వంటే నాకు చాలా ఇష్టం ఎప్పటినుంచో ఈ విషయం చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. నువ్వు ఒప్పుకుంటే మీ నాన్నతో మాట్లాడి పెళ్లి చేసుకుంటాను.
ఆ మాటలు వినగానే లక్ష్మీ పెద్దగా నవ్వుతూ….హా హా హా ఏవండీ మీరు జోకులు వేయడానికి నేనే దొరికానా.
ఆమె అలా అనేటప్పటికి రవికి చాలా ఆశ్చర్యం కలిగింది…. ఎందుకని అలా మాట్లాడుతున్నారు .
లక్ష్మి…. ఇంకెలా మాట్లాడాలి అండి మీరేమో బాగా చదువుకొని పట్టణంలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు. నేనేమో బురదలో తిరిగేదాన్ని నాకు మీకు పెళ్లి ఏంటి . ఎవరికైనా తెలిస్తే ముక్కులతో నవ్విపోతారు.
రవి…. పెళ్లికి చదువుకి ఉద్యోగానికి సంబంధం ఏంటో నాకు అర్థం కాలేదు నేను మిమ్మల్ని ఇష్టపడ్డాను మీరు నన్ను ఇష్టపడితే చెప్పండి పెళ్లి చేసుకుంటాను. నేనైతే నిజమే చెప్తున్నాను. అని అంటాడు అతను లక్ష్మితో అలా మాట్లాడడం లక్ష్మి తండ్రి వింటాడు తండ్రిని చూసిన లక్ష్మీ భయంతో అక్కడినుంచి వెళ్ళిపోతుంది.
అతను రవి తో…. ఎవరు బాబు నువ్వు ఏంటి ఇదంతా నువ్వు మా అమ్మాయి నిజంగా ప్రేమిస్తే మీ అమ్మానాన్న నీ ఇక్కడికి తీసుకు వచ్చి మాట్లాడాల్సింది. ఇలా ఒంటరిగా ఆడపిల్లలతో మాట్లాడటం మంచిది కాదు.
అందుకు రవి…. ఏవండీ నాకు తండ్రి లేడు మా అమ్మ ఒక్కటే ఉంది. నేను బాగా చదువుకుని ఉద్యోగం చేస్తున్నాను. రేపు మా అమ్మ ని తీసుకు వచ్చి మాట్లాడి ఇస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
అతడు సరాసరి తల్లి దగ్గరికి వెళ్లి లక్ష్మి గురించి చెప్తాడు.
తన తల్లికి లక్ష్మీ ముందుగానే తెలుసు . ఎందుకంటే పొలం పనులకు లక్ష్మి వస్తూ ఉంటుంది. చాలా మంచిది చాలా గుణం కలది అని అందరికీ తెలిసిందే ఆ విషయం తన తల్లికి కూడా తెలుస్తుంది ఆమె వెంటనే…. ఒరేయ్ మంచి అమ్మాయి రా పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో. వాళ్ళ నాన్న తో రేపు మాట్లాడదాం అని అంటుంది .
ఆ మాటలు వినగానే రవి చాలా సంతోష పడతాడు.
ఆరోజు గడిచిపోతుంది ఆ మరుసటిరోజు లక్ష్మి లక్ష్మి తండ్రి ఇంట్లో ఉంటారు చాలా సమయం గడిచిపోతుంది.
లక్ష్మీ తండ్రి గోవిందు…. అమ్మ లక్ష్మి నేను వచ్చిన పిల్లాడు ఎంత వరకు రాలేదు చూసావా. వాడు పెళ్లి చేసుకుంటాను అన్నది అది అంతా అబద్ధం. చాలామంది అమ్మాయిలు ఇలాంటి మాయ గాళ్ల వలలో పడి మోసపోతుంటారు. వాడి ఇంకెప్పుడైనా కనపడినీ . వాడి కాళ్ళు విరగ కొడతా ను.
అని అంటాడు . ఇంతలో రవి తన తల్లితో పాటు అక్కడికి వస్తాడు అతను ఆ మాటలు విని…. మావయ్య నా కాళ్ళు మీద కొడితే నీ కూతురు పరిస్థితి ఏంటో ఆలోచించావా.
అని అంటాడు వాళ్ళిద్దర్నీ చూసి గోవిందు చాలా ఆశ్చర్య పోతాడు…. బాబు క్షమించు ఆకతాయి అనుకున్నాను అంటూ కంగారుపడుతూ వాళ్ళని కూర్చోమని చెబుతాడు అందుకు వాళ్ళిద్దరు కూర్చుంటారు.
ఇక వాళ్ళు అన్నీ మాట్లాడుకుంటారు. కానీ కట్నం లేకుండా పెళ్లికి సిద్ధం అవుతుంది ఆ కుటుంబం. కట్నకానుకలు లేకపోవడంతో గోవిందు చాలా సంతోష పడుతూ కంటతడి పెట్టుకున్నాడు.
లక్ష్మీ దాన్ని చూసి ఆమె కూడా కంటతడి పెట్టుకుంటుంది ఇంకా కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది.
చిన్న కోడలు ప్రియాంక కూడా చాలా మంచిది పాలతో పాటు బాగా కలిసి పోతుంది అలా రోజులు గడిచాయి ఒకరోజు ప్రియాంక లక్ష్మి తో…. అక్క ఈ ఊర్లో ఎక్కడో అడవి ఉందంట కదా ఒకసారి అక్కడికి వెళ్దామా.
లక్ష్మి…. ఆ ఇప్పుడు ఎందుకు లే ప్రియా. పైగా మనం వాడికి అంటే అత్త పంపించు అక్క చూడడానికి ఏముంటుంది . చెట్లు తప్ప .
ఆమె… అదేంటి అక్క అలా అంటావు. ఏదో జలపాతం ఉంది అన్నారు. అడవి చాలా అందంగా ఉంటుందని చెప్పారు.
లక్ష్మి….. నిజమే కానీ సరే లే. అత్తతో చెప్పి వెళ్దాం . అని అనుకుంటారు . ఆ తర్వాత ఆ వాళ్ళిద్దరూ అత్త దగ్గరికి వెళ్తారు అత్తతో….. అత్తయ్య మేము అడవి దాకా వెళ్లి వస్తాము.
అని అడుగుతారు అందుకు ఆమె…. సరే త్వరగా వెళ్ళిరండి. అని చెబుతుంది ఆ తర్వాత ఇద్దరూ కలిసి అడవికి వెళ్తారు.
చిన్న కోడలికి అడవిలో చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది చాలా అద్భుతమైన వాతావరణం. అలా వాళ్ళు కొంచెం ముందుకు వెళ్తారు అక్కడ ఒక పెద్ద జలపాతం కనబడుతుంది. కొండ మీద నుంచి నీళ్లు పడుతూ ఉంటే చూడ్డానికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చిన్న కోడలు ప్రియాంక…. అక్క అసలు ఎంత అద్భుతంగా ఉందో కదా ఇది.
ఆమె అవును అని సమాధానం చెబుతుంది.
చాలా సమయం వరకు వాళ్ళిద్దరు ఆ ఆడవిలో తిరుగుతూనే ఉంటారు. చాలా సమయం తర్వాత చిన్న కోడలికి ఆ బాగా ఆకలివేస్తుంది. చిన్న కోడలు…. అక్క నాకు చాలా ఆకలిగా ఉంది. తినడానికి ఇక్కడ ఏమైనా దొరుకుతుందా.
పెద్ద కోడలు….. అయ్యో ఇక్కడ తినడానికి ఏమీ దొరకదు. మనం ఇంటికి వెళ్దాం లే.
ఇక్కడ తిరిగింది చాలు అని అంటుంది .
అందుకు సరే అని చెప్పి ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తుండగా.
చిన్న కోడలు మార్గ మధ్యలో ఒక చెట్టు కనబడుతుంది ఆ చెట్టు కి పండ్లు ఉంటాయి. వెంటనే చిన్న కోడలు ఆ పండ్లను కోసుకొని.
తినేస్తుంది. పెద్దకోడలు దానిని గమనించి అలా ముందుకు వెళ్ళి పోతూ …. అవును ప్రియాంక నువ్వు ఎప్పుడు అడవిని చూడనట్టుగా . ప్రవర్తిస్తున్నావు ఏంటి .
అని అంటుంది ఆమె ఏం సమాధానం చెప్పకపోవడంతో.
పెద్ద కోడలు…. ప్రియాంక ఏమైంది ఏం మాటలు రావట్లేదు. అంటూ వెనక్కి చూస్తోంది
ఆమె ఉండదు.
పెద్ద కోడలికి భయం వేసి….. ప్రియాంక ఎక్కడికి వెళ్ళిపోయావు . ప్రియాంక ఎక్కడికి వెళ్ళిపోయావు అని పిలుస్తూ ఉంటుంది.
అప్పుడే ప్రియాంక నల్ల నీడ రూపంలోకి
ఆమె ముందుకు వస్తుంది.
దానిని చూసి పెద్ద కోడలు చాలా భయపెడుతు…. ఏంటి ప్రియాంక ఏంటి నువ్వు ఇలా అయిపోయావు ఏం చేసావు .
అందుకు ఆమె…. అక్క ఆకలి వేసింది అందుకే ఇక్కడ ఉన్న పండ్లు తినేసాను తర్వాత ఇలా మారిపోయాను.
అని జరిగిన విషయం చెబుతుంది ఆ మాటలు విన్న ఆమె…. అయ్యో ఎంత పని చేసావు ప్రియాంక. అయినా మీకు చెప్తూనే ఉన్నారు కదా . ఇంటికి వెళ్ళిన తర్వాత తిందామని ఇంతలోనే ఇది చేసేసావా ఇప్పుడు ఏం చెయ్యాలి నాకు అర్థం కావడం లేదు.
చిన్న కోడలు… అయ్యో అక్క ఏంటి అలా మాట్లాడుతున్నావ్. ఏదో ఒకటి చేసి నా రూపాన్ని మళ్లీ నాకు తీసుకొని రా .
పెద్ద కోడలు…. నాకు ఏమన్నా చెప్పి చేసావా.
అయినా ఆగు నేను ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఈ విషయం మా ఇంట్లో తెలిస్తే నన్ను అరుస్తారు.
అని బాధపడుతూ ఉంటుంది చిన్న కోడలు…. అక్క మా సాఫ్ట్వేర్ లో కోడింగ్ ఎర్రర్ వస్తే నేను వాటిని సవరించి సరిచేస్తాను.
అలాగే ఇప్పుడు నువ్వు రైతు కాబట్టి వీటికి కూడా ఏదైనా system ఉండే ఉంటుంది నువ్వు కూడా ఏదైనా తప్పు జరిగితే తొలగించాల్సిన బాధ్యత నీ మీదే ఉంది.
పెద్ద కోడలు…. అయ్యో ప్రియాంక అదంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం కాబట్టి మీకు ఏదో ఉంటాయి . కానీ ఇలాంటి సమస్యలు నేనెప్పుడూ చూడలేదు వినలేదు. ఇవి ఏదో మాయ పండ్లు లాగా ఉన్నాయి.
కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం నేను కాదు స్వామీజీ దగ్గరికి తీసుకెళ్దాం.
చిన్న కోడలు…. అయితే నాకు అర్థం అయింది ఏంటి అంటే ఇప్పుడు నాకు వచ్చిన bug I mean error నీ తొలగించడానికి స్పెషలిస్ట్ స్వామిజి అన్నమాట.
ఇంకెందుకాలస్యం త్వరగా వెళ్దాం పద.
పెద్ద కోడలు …. ఏంటో నీ సాఫ్ట్వేర్ భాష నాకు ఏమీ అర్థం కావట్లేదు సరే ముందు అయితే ఇక్కడి నుంచి త్వరగా స్వామిజి దగ్గరికి వెళ్దాం పద .
అందుకనే సారి అంటుంది పెద్దకోడలు ఎందుకైనా మంచిది అని చెప్పి కొన్ని పండ్లు అలాగే చెట్లు ఆకులు తీసుకుని స్వామిజి దగ్గరికి బయలు దేరుతుంది .
ఇక ఇద్దరు స్వామిజి దగ్గరికి వెళ్తా రు
అక్కడ పెద్ద కోడలు స్వామీజీకి జరిగిన విషయం అంతా చెబుతుంది.
స్వామీజీ…. ఏదమ్మా ఆ చెట్ల పండ్లు గాని ఆకులు గానీ ఏమన్నా ఉన్నాయా.
అని అడుగుతాడు అందుకు పెద్ద కోడలు…. మీరు అడుగుతారని ముందే ఊహించి తీసుకొచ్చాను స్వామి ఇదిగోండి అవి ఇవే అని. వాటిని ఇస్తుంది స్వామీజీ వాటిని చూసి…. అమ్మ చాలా అద్భుతం. కొన్ని వేల సంవత్సరాలకు ఈ పండ్లు వస్తాయి అలాగే ఈ చెట్లు కూడా వస్తాయి. వీటి వల్ల పెద్ద పెద్ద భయంకరమైన వ్యాధులు తగ్గించవచ్చు. మీ వల్ల చాలా పెద్ద ఉపయోగం జరిగింది అమ్మా.
అని అంటాడు ఆ మాటలు విన్న ఆ ఇద్దరు కోడళ్ళు చాలా ఆశ్చర్యపోతారు.
ఇక స్వామిజీ ఆకులని అలాగే పండ్లని ఒక రోడ్ లో దంచుతూ ఉంటాడు.
చిన్న కోడలు….. ఏంటి అక్క వ్యాధి నయం చేస్తానని చెప్పి . స్వామీజీ ఏంటో చేస్తున్నాడు.
పెద్ద కోడలు…. ప్రియాంక నువ్వు అలా అరవకుండా అక్కడ నిలబడి స్వామీజీ చెప్పాడు కదా మందు తయారు చేయాలి అని అదే పనిలో ఉన్నారు స్వామీజీ.
అందుకు ఆమె…. ఓ నాకు అర్థమైంది నాలో వచ్చిన ఎర్రర్స్ నీ తొలగించడానికి స్వామీజీ ప్రయత్నం చేస్తున్నాడు.
అంతే కదా పెద్ద కోడలు…. అవును నువ్వు ఏది చెబితే అదే సరైనది.
కొంత సమయం తర్వాత స్వామీజీ మందు తయారు చేసి ఆమె నీడ పైన చల్లుతాడు వెంటనే ఆమె రూపం అమ్మ కి తిరిగి వస్తుంది .
దాన్ని చూసి ఆ ఇద్దరి కోడళ్లు చాలా సంతోష పడతారు.
వాళ్ళిద్దరు స్వామీజీకి కృతజ్ఞతలు చెప్పుకుంటారు.
స్వామీజీ….. మీరు కృతజ్ఞతలు నాకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు నీకే నేను చెప్పుకోవాల్సి ఉంటుంది . మీరు తీసుకువచ్చిన వీటితో ఎంతో మంది వ్యాధి నయమవుతుంది. అందుకు నేనే మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అని
అంటాడు. ఇంక వాళ్ళిద్దరు ఒకరివైపు ఒకరు చూసుకొని మనం అడవికి చాలా మంచి పని చేసాం అని నవ్వుకుంటూ అక్కడినుంచి తిరిగి ఇంటికి వెళ్లిపోతారు. ఆ విధంగా ఆ సాఫ్ట్ కోడలు చేసిన పనితో. ఒక మంచి జరిగింది అని చెప్పుకోవచ్చు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *