దయగల అమ్మ_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

అది ఒక గ్రామం. ఆ గ్రామంలో వనజ గోపి అనే దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ జీవితాన్ని గడిపే వాళ్ళు . గోపికి , బాలయ్య అనేది ఒక వ్యక్తి పరిచయం అవుతాడు అతను అసలు మంచివాడు కాదు. అతనికున్న అన్ని చెడు అలవాటును గోపి కూడా అలవాటు చేస్తాడు . గోపి పూర్తిగా చెడి పోతాడు. మద్యం సేవించడం లాంటి పనులు చేస్తాడు.
అలా ఉండగా ఒకరోజు తన భార్య అతనితో…. ఏమండీ మీరు సంపాదించిన డబ్బు మొత్తాన్ని . ఇలా తాగుతూ ఖర్చు పెడితే మన కుటుంబం ఎలా గడుస్తుంది. పైగా నా కడుపులో ఒక బిడ్డ పెరుగుతున్నాడు ఆ విషయం చెప్పాలని ఎంతగానో ప్రయత్నించాను మీరు ఇంటి దగ్గర ఉంటేనే కదా ఏప్పుడు తాగడం తిరగడం . నా గురించి అస్సలు పట్టించుకోవడం లేదు.
అంటూ ఏడుస్తుంది. ఆ మాటలకు అతను కోపంగా ఆమె వైపు చూస్తూ ఆమెను కొడతాడు.
ఆమె ….. కొట్టకండి కొట్టకండి అంటూ అరుస్తుంది. ఆ తర్వాత అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు .
నెలలు గడుస్తున్నాయి అతను ఇంట్లో ఉన్న డబ్బు నగలు తో సహా ఆన్నీటిని కాచేస్తాడు.
ఆమె చాలా బాధ పడుతూ ఉంటుంది.
ఒకరోజు అతను బాగా తాగి ఇంటికి వచ్చి
…… ఒసేయ్ నా పెళ్ళామా ఎక్కడ చచ్చావే .
అంటూ కేకలు వేస్తాడు. ఆమె ఏడుస్తూ…. ఏమండి ఇక్కడే ఉన్నాను. ఏమన్నా తిన్నారా లేదా. అంటూ కంగారుగా అడుగుతుంది అతను…. నేనంటే నీకు ఎంత ప్రేమ సరే గానీ నాకు డబ్బు కావాలి. అని అడుగుతాడు అందుకు ఆమె… మా దగ్గర డబ్బులు ఎక్కడ ఉందండి. అంతా మీరే తీసుకెళ్లిపోయారు కదా
అందుకు అతను…. ఓహో అవునా అయితే నీ మెడలో తాళి ఉండగా అది నాకు ఇచ్చేయ్ .
అంటూ బలవంతంగా లాక్కొని అక్కడనుంచి వెళ్ళి పోతాడు. ఆమె
ఏడుస్తూ….. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో ఇలాంటి భర్తకు భార్యగా వచ్చాను. అంటూ బాధపడుతుంది .
మరి కొన్ని రోజులు గడిచాయి
ఆమె ప్రసవ వేదన పడుతూ ఒక బిడ్డకు జన్మనిస్తుంది. బిడ్డను చూసినా ఆమె చాలా సంతోషం ఉంటుంది. ఆమె భర్త మాత్రం ఆమె అలాగే వేధిస్తుంటాడు.
ఒకరోజు ఆమెతో డబ్బు గొడవ పడుతూ
ఉంటాడు. ఆమె డబ్బు లేదనీ నన్ను ఇంకా వేధించుకు తినొద్దు నీ కాళ్లు పట్టుకుంటాను అంటూ ప్రాధేయపడినా అతని వినకుండా
ఆమెతో…. డబ్బు లేదు కదా బిడ్డనమ్ముకుంటే డబ్బు వస్తుంది .అని బిడ్డను తీసుకొని అక్కడినుంచి వెళ్లబోతుండగా ఆమె బిడ్డను అతని దగ్గర నుంచి లాక్కొని పరుగులు తీస్తుంది .అతను ఆమె కోసం వెతుకుతాడు కానీ ఆమె ఎక్కడా కనిపించదు.
కొన్ని సంవత్సరాల తర్వాత వనజ కృష్ణాపురం గ్రామం లో నివసిస్తూ ఉంటుంది.
ఆ బిడ్డ కొంచెం పెద్ద వాడు అవుతాడు.
బడికి వెళ్లి బాగా చదువుకున్నాడు.
కానీ అతనికి(రాము) వనజ అంటే అస్సలు ఇష్టం ఉండదు ఆమెకు ఒక కాలు లేదని ఆమెనీ అసహ్యించుకుంటాడు. ఒకరోజు రాము తన స్నేహితులతో ఆడుకుంటుండగా.
అతని తల్లి అక్కడికి వస్తుంది.
ఆమెను చూసిన తన స్నేహితులు… అరే కుంటిది కుంటిది వచ్చింది. అంటూ ఆమెని ఎగతాళి చేస్తూ ఉంటారు.
అప్పుడు ఒక్కడు…. అరే ఆమె ఎవరో కాదు రాము వాళ్ళ అమ్మ. ఆమె బలే కుంటుతూ నడుస్తూ ఉంటుంది కదా రా. అంటూ ఆమెను తిరుగుతూ రాముని హేళన చేస్తూ ఉంటారు.
రాము చాలా బాధపడుతూ అక్కడనుంచి వెళ్ళి పోతాడు.
వాళ్ల మాటలు వింటున్నా ఆమె విని విననట్టు గా వెళ్లి పోతుంది. మరి కొన్ని రోజులు గడచాయి ఒక రోజు వాళ్ళ అమ్మ మీద ద్వేషం పెరిగిపోతూ ఉంటుంది.
ఆమె ఒక రోజు భోజనం తీసుకువచ్చి అతనికి ఇవ్వగా….. నువ్వు నాకు భోజనం ఇవ్వద్దు. నాకు బడిలోనే భోజనం పెడుతున్నారు. నాకు ఒక్క పూట భోజనం సరిపోతుంది. నువ్వా కుంటి కాళ్లతో నాకోసం కష్టపడాల్సిన అవసరం లేదు నాకు నిన్ను చూస్తుంటే నే చిరాగ్గా ఉంటుంది. అని అన్నాం నీ ఆమె మొఖం మీద కొట్టి అక్క నుంచి కోపంగా వెళ్ళిపోతాడు.
ఆమె చాలా బాధ పడుతూ…. భగవంతుడా రాముకి నువ్వే మంచిచెడులు నేర్పించాలి అంటూ బాధపడుతూనే భగవంతుని ప్రార్థిస్తుంది. అలా మరి కొన్ని రోజులు గడిచాయి.
ఒక రోజు అతను ఇంటికి వచ్చి ఆమెతో…. నిన్ను ఈ రోజు బడికి ఎవరు రమ్మని. చెప్పారు . ఆమె…..
బాబు నీ ఫీజు కట్టడానికి వచ్చాను .
అతను…. అదేదో నా చేతికి ఇస్తే నేను వెళ్లి పడతాను కదా . నిన్ను చూసి అందరూ కుంటిది కుంటిది అంటున్నారు. కుంటి దాని కొడుకు అని నన్ను
ఎక్కిరిస్తున్నారు. వాళ్ళన్న మాటలకి నాకు తల తీసేసినట్టు గా ఉంది . మొన్న కూడా అంతే ఆటలు ఆడుకునే దగ్గరకి వచ్చావు . అప్పుడు కూడా అందరు నన్ను ఎలా చేశారు .నీకు దండం పెడతాను దయచేసి నా స్కూల్ కి రావద్దు .
అని కోపంగా అక్కడనుంచి వెళ్ళి పోతాడు ఆ మాటలు విన్న ఆమె చాలా బాధపడుతూ ఉంటుంది. రోజులు గడుస్తున్నాయి . ఆమె చిన్న కూరగాయల కొట్టు ఇంటి ముందు పెట్టుకొని. వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది.
అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి రాము పెద్ద వాడు అవుతాడు. ఆ తర్వాత అతను తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళి పోతాడు.
ఆ తల్లి ఒంటరిగా అక్కడ జీవిస్తూ ఉంటుంది.
కొన్ని రోజులు గడిచాయి ఆమెకు ఆరోగ్యం సరిగ్గా ఉండదు. ఆమె తన బిడ్డని చూడాలని ఎంతగానో ఆశ పడుతూ ఉంటుంది.
అక్కడ రాము అతని భార్య పిల్లలతో సంతోషంగా జీవిస్తూ ఉంటాడు.
చాలా ధనవంతుడు అవుతాడు.
తను తల్లి గురించి పూర్తిగా మర్చిపోయాడు.
ఇది ఇలా ఉండగా తల్లి అతన్ని చూడాలని అనుకొని అతను ఉండే ఇంటికి వెళ్తుంది.
అక్కడ రాము కొడుకైనా లలిత్ ఆమెను చూసి… అమ్మ నాన్న ఎవరో అడుక్కునే ఆమె వచ్చింది. అని కేకలు వేస్తాడు.
అప్పుడే అతని భార్య వెన్నెల అక్కడికి వచ్చి ….. ఎవరమ్మా నువ్వు ఎవరు కావాలి.
అని అడుగుతుంది ఆ మాటలు విన్న వనజా తన మనసులో …. నా కొడుకు చాలా ప్రయోజకుడు అయినట్లు ఉన్నాడు. ఇప్పుడు నేను తన తల్లిని అని తెలిస్తే తనకి పరువు తక్కువ గా ఉంటుందేమో. అని అనుకొని…. నేను వేరే చోటికి వెళ్ళాలనుకొని ఇక్కడికి వచ్చాను. అని అంటుంది.
అప్పుడే రాము బయటికి వస్తాడు. రామునీ చూసిన తల్లి చాలా సంతోషపడుతుంది.
కానీ రాము మాత్రం…. నువ్వా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు. ఇక్కడికి వచ్చి నా పరువు తీయడానికి. కుంటిది మా అమ్మ అని ఇక్కడ కూడా అందరూ చెప్పుకోవడానికా .
నీకు దండం పెడతాను ఇక్కడి నుంచి వెళ్ళిపో.
అని ఉంటాడు ఆ మాటలకి ఆ తల్లి చాలా బాధపడుతూ అక్కడనుంచి వెళ్ళి పోతుంది.
ఆ రోజు గడిచి పోతుంది . ఆ మరుసటి రోజు ఉదయం రాము తను ఎక్కడికో వెళ్తుండగా.
అతని తల్లి ఒక చోట కూర్చొని కనబడుతుంది. ఆమె చేతిలో ఏదో ఒక ఉత్తరం ఉంటుంది.
మొదట అతను ఆమెను చూసి…. నాకెందుకు దారిని పోయే దరిద్రం . ఇప్పుడు ఆమె దగ్గరికి వెళ్లడం అవసరమా. అనుకొని కొంచెం ముందుకు కానీ ఎందుకో తన మనసులో ఒప్పుకోక తిరిగి వెనక్కి వస్తాడు.
ఆమెను చూసి…. ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు వెళ్లిపోవచ్చు కదా . ఇక్కడే ఉన్నావ్ ఎందుకు. అని ప్రశ్నిస్తాడు . కానీ ఆమె ఏం మాట్లాడకుండా అలాగే ఉంటుంది .
అతనికి అనుమానం వచ్చి అవును పట్టుకొని చేస్తాడు. ఆమె చనిపోయి ఉంటుంది.
నన్ను చూసి కొంచెం కంగారు పడుతూ ఆమె చేతిలో ఉన్న ఉత్తరాన్ని చూస్తాడు.
అందులో ఏ విధంగా ఉంటుంది .
బాబు రాము నువ్వు నన్ను అసహ్యించుకున్న ప్రతిసారీ నీ మీద నాకు జాలి కలుగుతుంది.
ఎందుకంటే నువ్వు నా బిడ్డవి రా.
నువ్వు ఏ తప్పు చేసినా నాకు అందంగానే ఉంటుంది కానీ నా మీద ద్వేషం నీకు రోజురోజుకి పెరిగిపోతుంది అని నాకు అర్థం కాలేదు నువ్వు నన్ను ద్వేషంతో అసహ్యించుకుంటూ నా మనసు చాలా సార్లు బాధపడింది నువ్వు నా నుంచి దూరంగా వెళ్లిపోయినడుకు నేను చాలా బాధపడ్డాను బాబు. అసలు నాకు ఈ కాలు ఎందుకు పోయిందో తెలుసా. మీ నాన్న మన దగ్గర ఎందుకు లేడో తెలుసా. చెప్తాను విను
మీ నాన్న ఒక తాగుబోతు . డబ్బు కోసం ఏ పని చేయడానికైనా సిద్ధపడే వాడు .
అలాగే ఒక రోజు డబ్బు కోసం నిన్ను అమ్ముతాను అని చెప్పి బలవంతంగా లాక్కొని వెళ్తూ ఉండగా నేను అతన్ని అడ్డుకుని. అతని నుంచి నిన్ను లాక్కొని పరుగు తీసాను. అప్పుడు మీ తండ్రి తాగిన మత్తులో ఒక పెద్ద కత్తిని నాపై విసిరాడు .
అది నా కాలు తగిలి తీవ్రమైన గాయమైంది.
అంత గాయం ను కూడా నువ్వు కాపాడుకోవాలన్న ఉద్దేశంతో అలాగే పరుగులు తీసాను. నాన్న కూడా నా వెంట పడ్డాడు. అప్పుడే సమయానికి ఒక బస్సు వచ్చింది. నేను అందులో ఎక్కి కృష్ణాపురం కి చేరుకున్నాను. నా కాలికి గాయానికి హాస్పిటల్ లో చూపించుకున్నాను.
వాళ్లు దానికి మందులు ఇచ్చారు. కానీ కొన్ని రోజులకి సెప్టిక్ కావడంతో కాలునీ తీసివేయాలి లేదంటే నాకు ప్రమాదం అని చెప్పారు. అందుకు తప్పనిసరై కాలుని తొలగించారు . నేను నిన్ను కాపాడు కోవడం కోసం చేసిన ప్రయత్నంలో నా కాలుని పోగొట్టుకున్నాను. ఇది బాబు జరిగింది.
అని ఉంటుంది ఆ ఉత్తరం చదివిన అతను …. అమ్మా నన్ను క్షమించు. నువ్వు నా కోసం అంత త్యాగం చేస్తే . నన్ను అర్థం చేసుకోకుండా ఎన్నో మాటలు అన్నాను . నిన్ను అవమానపరిచిను. నన్ను క్షమించు ఇలాంటి కొడుకుని కన్నందుకు నువ్వు ఎవరు లేని అనాధ శవం గా మిగిలి పోయావ అంటూ ఏడుస్తాడు. అతను అలా ఏడుస్తూ ఉండగా
తన తల్లి ఆత్మ రూపంలో వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఆమె…. ఏడవకు బాబు నువ్వు మంచి స్థాయిలో ఉన్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. నాకు ఇంతకంటే ఈ భాగ్యం కావాలి. నువ్వు చాలా ప్రయోజకుడైనందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. జరిగిందేదో జరిగిపోయింది ఇంకా అంతా మర్చిపోయి సంతోషంగా ఉండు .
అతను ఏడుస్తూ…. నేను సంతోషంగా ఎలా ఉండగలను అమ్మ ఈ విషయం ముందే నాకు చెప్పినట్లయితే ఎంతో బాగుండేది.
నిను పువ్వుల్లో పెట్టి చూసుకునేవాడిని.
నువ్వు చాలా పెద్ద పొరపాటు చేసావ్ అమ్మ.
ఆమె…. త్యాగాలు చేసింది అన్న ఉద్దేశంతో తల్లిని ప్రేమించడం కాదు. నవమాసాలు మోసిన తల్లి నేను ఎంతగానో ప్రేమిస్తుందో ఆమె హృదయాన్ని బట్టి ప్రేమించాలి. అప్పుడే
అది నిజమైన ప్రేమ.
అతను…. నిజమే అమ్మ నన్ను క్షమించు అంటూ ఏడుస్తాడు .
తల్లి ఆత్మ అక్కడ నుంచి అయిపోతుంది .
దానిని చూసిన అతను చాలా బాధ పడతాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *