దర్జీ చిరుతపులి_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu Kattapa kathalu

అవి ఒక అందమైన గ్రామం ఆ గ్రామంలో కృష్ణమ్మ అనే ఒక ఆమె ఉండేది.
ఆమెకు ఒక పాప పావని. కృష్ణమ్మ ఒంటరి మహిళ తన పెళ్లి అయిన రెండు సంవత్సరాలకే భర్త చనిపోయాడు. ఆమె జీవనాధారం కోసం కుట్టు మిషన్ తో బట్టలు కుట్టుకుంటూ వచ్చిన డబ్బుతో ఆమె ఆమె కూతురు బ్రతుకుతారు. అది పల్లెటూరు కావడంతో అక్కడకు వచ్చే వారి సంఖ్య కూడా చాలా తక్కువ ఉండేది ఆమె ఆదాయం కూడా చాలా తక్కువ అలా ఉండగా ఒక రోజు తను వంట చేయడానికి అన్ని సామాన్లు సిద్ధ పరుస్తుంది తీరా చూడగా…. అయ్యో నా మతి మరపు మండ . పోయిలో కట్టెలు అయిపోయాయి. నేను నిన్న తీసుకు రావాలి అనుకున్నాను కానీ మర్చిపోయాను ఇప్పుడే వెళ్లి తీసుకోవాలి అని అనుకుంటూ పాపను
నిద్ర పుచ్చుతుంది. పాప గాఢమైన నిద్రలోకి వెళ్తుంది ఆ తర్వాత ఆమె అక్కడి నుంచి
కట్టెల కోసం దగ్గరలో ఉన్న అడవిలో కి వెళ్తుంది.ఆమె కట్టెలు కొట్టుకొని వస్తూ ఉండగా మార్గ మధ్యలో ఒక పులి చనిపోయి
కనబడుతుంది. ఆ పులి దగ్గర దాని పిల్ల ఏడుస్తూ ఉంటుంది దాన్ని చూసిన ఆమె మనసు చలించి పోయి …. అయ్యో పాపం బిడ్డకు జన్మనిచ్చిన తల్లి చనిపోయింది. ఈ బిడ్డ ఇక్కడ ఎలా ఉంటుంది. మగ పులి కంఠ ఈ పిల్ల పడిందంటే రెండు ముక్కలుగా చీల్చిస్తాయి. అయ్యో పాపం పాలకోసం ఎక్కెక్కి ఏడుస్తుంది . అంటూ చాలా బాధపడుతుంది ఆ తర్వాత ఆమె…భగవంతుడా ముందు ముందు ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఏమి చేయాలను ఉంటుంది సరైనది అంతా నీ మీద భారం వేసి ఈ పిల్లని ఇంటికి తీసుకెళ్తాను. అని అనుకొని ఆ పులి పిల్లలను తీసుకొని ఇంటికి వెళ్తుంది. అక్కడ ఆ పులిపిల్ల కు పాలను అందిస్తుంది. ఆకలి మీద ఉన్న పులి పాలు తాగి నిద్రపోతుంది ఆమె దాన్ని చూసి…. పాపం ఈ ప్రపంచంలో ఆకలి దప్పికలు మనుషులకు జంతువులకు సహజమే. మనిషికి మనిషి ఎలా తోడు ఉంటాడో జంతువులు కూడా తోడు అనేది కావాలి. తోడు లేకుండా ఏదైనా చేయొచ్చు ఏమో కానీ జీవితంలో వచ్చే ఒడిదుడుకులు తట్టుకొని ముందుకు వెళ్ళడం తోడు లేకుండా చాలా కష్టంగా ఉంటుంది. నా భర్త తోడు లేక పోవడం వల్లే కదా నాకు ఇంత కష్టం అంటూ చాలా బాధపడుతుంది.
కొంత సమయం గడుస్తుంది పాపా నిద్రనుంచి లేస్తుంది ఆ పాప పులిని చూసి …. అమ్మ ఏంటది.
తల్లి…. నువ్వు దీంతో ఆడుకోవచ్చు అమ్మ దీని పేరు రాజా . సరేనా అంటుంది పాప చాలా సంతోష పడుతూ ఆ పులి తో ఆడుకుంటుంది రోజులు గడిచాయి . ప్రతి రోజు ఆ పాప పులి. ఇద్దరూ ఆడుకుంటూ ఉంటారు. దాన్ని చూసిన ఆ తల్లి చాలా సంతోషపడుతుంది. పాప పులి తో ఆడుకున్న తర్వాత విశ్రాంతి తీసుకుంటోంది. కానీ పులి మాత్రం కృష్ణమ్మ కుట్టే మిషన్ వైపు దీర్ఘంగా చూస్తూ ఉంటుంది అది తన మనసులో… మా అమ్మ ఎప్పుడు ఏదో ఇలా చేస్తూ ఉంటుంది నాక్కూడా దాన్ని అలాగే చేయాలని ఉంది . అని అనుకుంటూ ఉంటుంది. కృష్ణమ్మ తన పని చేసుకుని పక్కకి వెళ్ళి నప్పుడు ఆ పులి మిషన్ కుట్టు తో ఉంటుంది.
దాన్ని చూసిన కృష్ణమ్మ చాలా ఆశ్చర్యంగా…. అరే నీకు మిషన్ కుట్టడం కూడా వస్తుంది. భలే బాలాగా కుడుతున్నావ్ అంటూ సరదాగా
నవ్వుకుంటుంది.
అలా మరి కొన్ని రోజులు గడిచాయి. కృష్ణమ్మ పులిని తన కూతురు తో సమానంగా చూసుకుంటూ ఉంటుంది. ఆ పులి కూడా కృష్ణమ్మ నీ. తల్లి లాగా చూస్తుంది. అలా ఉండగా ఆమె ఒక రోజు కట్టెల కోసం అడవికి వెళ్తూ తన పాపతో…. అమ్మ నువ్వు రాజు తో ఆడుకుంటూ ఉండు. నేను అడవికి వెళ్లి కట్టెలు తీసుకుని వస్తాను. అని చెప్తుంది.
పాప సరే అంటుంది ఆ తర్వాత ఆమె కట్టెలు తీసుకురావడానికి అడవి కి వెళ్తుంది.
ఇంటిదగ్గర పులి పాప తో ఆడుకొని ఆ తర్వాత అక్కడే ఉన్న మిషన్ ని కుడుతూ ఉంటుంది . అలా ఉండగా కొంత సమయం తర్వాత ఆమె ఇంటికి తిరిగి వస్తుంది .
పులి కుట్టిన వస్త్రం చూసి చాలా ఆశ్చర్య పోతూ…. అరే ఇది చాలా ముచ్చటగా ఉంది. రాజు దీనిని భలేగా కుడుతున్నావు . అంటూ ఆమె ఎంతసేపు పడుతుంది అప్పుడు ఒక ఆమె ఎక్కడికి వస్తుంది. ఇంట్లో ఉన్న పులి నీ చూసి చాలా భయపడుతూ …. కృష్ణ అక్క పులినీ పెంచుతున్నవా దాన్ని చూస్తేనే చాలా భయంగా ఉంది. అంటూ ఏడవడం మొదలు పెడుతుంది. ఆమె…అయ్యో ఆ పులి ఏమి చేయదు. నువ్వు బాధపడకు అంటూ జరిగిన విషయం చెప్పింది. తను విన్న ఆమె కొంచెం కుదుట పడిన భయం భయంగా అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఆమె ఆ విషయాన్ని ఊరి పెద్దలు మొత్తానికి చెప్తుంది.
ఊరి ప్రజలంతా దానిని చాలా ఆశ్చర్య పోతూ కృష్ణమ్మ దగ్గరికి వస్తారు వాళ్ళు ఆమెతో….
ఏంటి నువ్వు చేస్తున్న పని ఒక పులి ని తీసుకొచ్చి ఇంట్లో ఉంచారు. దానివల్ల ముందు ముందు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో తెలుసా. అది మనుషులనీ పీక్కు తినడం మొదలు పెడుతుంది . మర్యాదగా దాన్ని తీసుకెళ్లి అడవిలో విడిచి పెట్టండి. లేదంటే మేము దానిని చంపేస్తాము.
కృష్ణమ్మ…. అయ్యో ఎందుకు అలా మాట్లాడుతున్నారు ఆ పులి ఎవరికీ హాని చేయదు హానిచేసేది అయితే మా ఇంట్లో చిన్న పిల్ల ఉంది . ఆమెను చంపేది కదా . నేను ఇంత ధైర్యంగా ఉన్నాను అంటే . అది ఏం చేయలేని అర్ధమే కదా.
అందుకు ఊరిపెద్ద….. కృష్ణమ్మ నువ్వు ఎన్ని చెప్పినా ఊరి వాళ్ళు వినరు దయచేసి దాన్ని విడిచి పెట్టు లేదంటే వాళ్ళ అన్నంత పని చేస్తారు . బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో విడిచి పెడతావా . లేక దాన్ని చంపుకు oటావో నీ ఇష్టం . అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయారు ఆమె ఏడుస్తూ …. అయ్యో నేను బిడ్డ లాగే దీన్ని పెంచుకున్నాను . ఇది ఎవరికీ హాని చేయదు అని . నేను చెప్పిన కూడా వీళ్ళు మాత్రం నామాట అసలు ఉండటం లేదు . నేనేం చేయాలి .కన్న బిడ్డలా పెంచుకుంటున్నాను ఇప్పుడు ఉన్నట్టుడి
ఎలా వదిలి పెట్టాలి అంటూ చాలా బాధపడుతుంది.
కొంత సమయం తర్వాత ఆమె….. అన్యాయంగా దాన్ని ప్రాణాలు తీయడం అంటే ప్రశాంతంగా అడవిలో వదిలేయడం మంచిది .
అని అనుకొని దాన్ని తీసుకొని అడవికి వెళ్తుంది దానిని అడవిలో ఉంచి ఎంతగానో ఏడుస్తూ….. నువ్వు ఎక్కడున్నా బాగుండాలి అనే ఉద్దేశంతో నేను నిన్ను ఇక్కడ వదిలి పెడుతున్నాను. దయచేసి నువ్వు ఊర్లో కి నాకు వస్తే వాళ్లు అన్నంత పని చేస్తారు.
అంటూ ఏడుస్తుంది ఆ పులి తన మనసులో….. అమ్మ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా అమ్మ . నేను ఇక్కడ ఉండను అమ్మా నేను నీతో పాటే వస్తాను అంటూ కంటతడి పెట్టుకుంది . పులి కన్నీళ్లు పెట్టుకోవడం చూసిన ఆమె ఏడుస్తూ….. రాజు ఏడవకు నువ్వు ఏడ్చి నన్ను ఏడిపించకు .
భగవంతుడు మన నుదుటిన రాసినట్లుగానే అంతా జరుగుతుంది. నీకు నాకు రుణం తీరిపోయింది. నేను వెళ్ళొస్తాను. ఇలా వదిలేసి వెళ్తున్నానని అమ్మమీద కోపం పెట్టుకోకు . నేను నీ కేవలం మాత్రమే నిన్ను వదిలి పెట్టి వెళ్తున్నాను. అని చెప్పి ఎంతగానో బాధ పడితే అక్కడ నుంచి ఇంటికి వెళ్తుంది.
ఆ మరుసటి రోజు పులి ని వదిలేసింది అన్న సంగతి తెలుసుకున్న వాళ్లు ఆమెను అభినందిస్తారు అప్పుడు ఆమె ….. మీరు సంతోషంగా ఉన్నారు కానీ నేను మాత్రం ఏ మాత్రం సంతోషంగా లేను. నేను కన్న బిడ్డల దాన్ని పెంచాను . ఇప్పుడు అది లేదు ఒంటరిగా ఎలా బ్రతుకుతుందో అని నాకు చాలా భయంగా బాధగా ఉంది.
అప్పుడు అక్కడ వాళ్ళు అంతా ఆమెని చూసి నవ్వుతూ….హా హా హా కృష్ణమ్మ నీకు పిచ్చి పట్టలేదు కదా. పులి సంతోషంగానే బతుకుతుంది నువ్వు ఇంకా దాని గురించి ఆలోచించకు.
కృష్ణమ్మ…. ఆలోచించకుండా ఎలా ఉంటాను . అది ఎవరికీ హాని చేయదాని చెప్పిన మీరు
మాత్రం వినలేదు. మీ పంతం నెగ్గించుకున్నరుగా ఇక వెళ్ళండి . అంటూ చేతులెత్తి నమస్కరిస్తున్నా వాళ్ళు అక్కడినుంచి వెళ్ళిపోతారు.
అడవిలో పులి …. అమ్మా నాకు ఆకలిగా ఉంది . నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు. నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలి అమ్మ . అమ్మ అంటూ ఏడుస్తూ ఉంటుంది.
ఇంటిదగ్గర కృష్ణమ్మ కూతురు….. అమ్మ నాకు రాజు కావాలి. రాజు తీసుకొని రా . నేను రాజు తో కబుర్లు చెప్పాలి ఆడుకోవాలి . అమ్మ నాకు రాజు కావాలి. అంటూ ఏడుస్తుంది తల్లి ఆమెకు సద్దు చెప్తూ ఉంటుంది .
అక్కడ అడవిలో ఉన్న పులి ఆకలికి ఉండలేక తను వేటాడటం మొదలుపెడుతుంది.
ఇక అలా వేటాడుతూ తమ ఆహారాన్ని తానే స్వయంగా సిద్ధ పరుచూకుంటుంది.
అలా కొన్ని రోజులు గడిచాయి కృష్ణమ్మ ఇంట్లో కట్టెలు అయిపోయాయి అని పాపనీ నిద్రపుచ్చి తాను అడవికి కట్టెల కోసం వెళుతుంది. ఆమె కట్టెలు కొడుతుండగా వెనకనుంచి పులి ఆమెను చూసి తనలో….. ఈరోజు నాకు ఒక మంచి ఆహారం దొరికింది . ఇప్పుడు ఆమెను చంపి నా ఆకలి తీర్చుకుంటాను. అని అనుకుని ఆమె వెనక నుంచి వెళ్లి దాడి చేస్తుంది .
ఆమె చాలా భయపడుతూ ఒక్క సారిగా కింద పడిపోతుంది. అప్పటికే ఆమెకు తీవ్ర గాయాలవుతాయి. ఆమె బాధను భరిస్తూ కింద పడిపోతుంది. పులి ఆమె యొక్క ముఖాన్ని చూసి….. అమ్మ నువ్వు నన్ను క్షమించమ్మా. నేను ఎవరో అనుకోని నీ పైన దాడి చేశాను. నువ్వు చిన్నప్పుడు నాకు పాలు పోసి పెంచావు. కానీ నేను నిన్ను చంపాలనుకున్న మూర్ఖుడిని అమ్మ క్షమించు అంటూ తనలో ఎంతో బాధపడుతూ కన్నీరు కారుస్తూ ఉంటుంది.
కృష్ణమ్మ దాన్ని చూసి….. అయ్యో నా బిడ్డ బాధపడకు . జరిగిపోయిన దాని గురించి ఆలోచించకు జరగాల్సిన దాని గురించి చూడు. ఇంట్లో నా బంగారు తల్లి ఒక్కటే ఉంది . దయచేసి నా బిడ్డను ఇక నుంచి నువ్వే చూసుకోవాలి . తండ్రి లేని పిల్ల ఇప్పుడు నేను కూడా ఉండటం లేదు అంటూ ఆమె కళ్ళు మూసుకుంది.
దాన్ని చూసిన పులి చాలా బాధపడుతూ ఉంటుంది. ఆమె చెప్పినట్లుగానే ఆ పులి ఇంటికి నడుచుకుంటూ వెళుతోంది.
అక్కడ పాప ఏడుస్తుంది….. అమ్మ కావాలి నాకు అమ్మే కావాలి. అంటూ మారాం చేస్తుంది. అప్పుడే పులి అక్కడికి రావడంతో….. రాజు నువ్వు వచ్చావా .
అంటూ చాలా సంతోషపడుతుంది పులి…. అవును వచ్చాను తల్లి అమ్మ ని చంపిన దుర్మార్గుడునీ. అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు ఆ తర్వాత పాపకి కావలసిన అన్ని అందిస్తూ ఆమెను బాగా చూసుకుంటుంది ఆ పులి. అక్కడే ఉన్న తన తల్లి మిషను కుడుతూ ఉంటుంది ఇరుగుపొరుగు వాళ్లు దాన్ని చూసి చాలా ఆశ్చర్య పోతారు. రోజులు గడిచాయి ఆ పులి అందరికీ అలవాటు కావడంతో . దాని దగ్గర బట్టలు కుట్టించుకొని దానికి డబ్బులు ఇచ్చి వెళ్తారు. అలా వచ్చిన డబ్బుతో పాపకి కావాల్సినవన్నీ తీసుకొని వెళుతుంది. అలా అప్పుడు చేసిన తప్పుకి సరిదిద్దుకోవడం కోసం బిడ్డ ని వెతుక్కుంటూ వచ్చి ఆమె నీ చూసుకుంటుంది .

Add a Comment

Your email address will not be published. Required fields are marked *