దుర్గామాత కరుణా కటాక్షం_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

కేసరపల్లి అనే ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో అనురాధ గోపయ్య అనే దంపతులు ఉండేవాళ్ళు. వాళ్లది చాలా గొప్ప కుటుంబం చాల ధనవంతులు కానీ ఎంత డబ్బు ఉన్నప్పటికీ పిల్లలు లేరు అన్న ఒక ఉద్దేశం మాత్రం వారిని వేధించుకు తింటూ ఉంటుంది. దానికోసం ఎన్నో దానధర్మాలు ఎంతో మంది మహర్షులు ని కలిశారు కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. ఒకరోజు అనురాధ ఏడుస్తూ….. ఏమండీ నాకు ఈ బ్రతుకు బ్రతకాలని లేదు. కొంతమంది తల్లి బిడ్డ లను చూస్తుంటే నాకు ఎందుకు అలాంటి భాగ్యం కలగలేదు అని మనసులో చిత్రహింసలు పడుతున్నాను. అంటూ కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది.

దాన్ని చూసిన గోపయ్య….. అయ్యో అనురాధ బాధపడకు ఆ దుర్గామాత ఇప్పటికైనా మన పైన జాలి చూపిస్తుందని అనుకుంటున్నాను అందుకే కదా మనం ప్రతిరోజు అమ్మవారి దేవాలయానికి వెళ్తున్నాము కచ్చితంగా అమ్మ ఆశీర్వాదం మనకు లభిస్తుంది. అని ఆమెకు ధైర్యం చెప్తాడు. ఆ మరుసటి రోజు ఉదయం వాళ్ళిద్దరూ దుర్గామాత ఆలయం దగ్గరకు వెళ్లి అక్కడ ఉన్న కొలనులో స్నానం చేసి తడి బట్టలతో అమ్మవారి దగ్గరికి వెళ్తారు. అక్కడ ఇద్దరూ చేతులు జోడించి అమ్మవారి విగ్రహం ముందు….. అమ్మ మాతా ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయం చేశావు. మమ్మల్ని కూడా ఒకసారి చూడమ్మా నీ కృప నాపై కురిపించి తల్లి ఎంతో కాలంగా ఈ సేవ చేసుకుంటున్నాము. జాలి చూపించు మాకు బిడ్డని ప్రసాదించు తల్లి అంటూ మొక్కుకొని కొంత సేపు అక్కడే గడిపి తిరిగి వస్తూ ఉండగా ఇంతలో మార్గ మధ్యలో ఒక ఆమె కనబడుతుంది . ఆమె వాళ్ళిద్దరినీ చూసి….. మీకు పిల్లలు లేరా .
అందుకు వాళ్ళు…. అవునమ్మా దాని కోసమే ఎదురుచూస్తూ అమ్మవారిని ప్రార్థిస్తున్నాము.
అందుకు ఆమె…. సరే నేను మీకు కొన్ని సూత్రాలు చెప్తాను మీరు కనుక అది చేస్తే ఖచ్చితంగా మీకు పిల్లలు కలుగుతారు.
అందుకు వాళ్ళు…. చెప్పండమ్మా అదేంటో కచ్చితంగా చేస్తాము.
ఆమె…. వేప చెట్టుకి రాగి చెట్టు కి పెళ్లి చేయాలి. అలాగే పేద వాళ్లకి వస్త్రాలు దానం . అలాగే వాళ్ళకి అన్నదానం చేయాలి. చివరిగా మీరు కటిక నేల పైన భోజనం చేయాలి. అలాగే ప్రతిరోజు రాత్రి సమయం అమ్మవారి గుడిలో నిద్రించాలి. వీటిలో ఏ ఒక్కటి తూచా తప్పిన ఇంక మీకు ఎప్పటికీ పిల్లలు కలగారు.
అందుకు వాళ్లు…..అలా ఏం జరగదు అమ్మ కచ్చితంగా మీరు ఏదైతే చెప్పారో అవన్నీ మేము పాటిస్తాం.
అమ్మ చూస్తే పెద్దవాళ్ళు ఉన్నారు మీరు కూడా మాతో పాటు ఉంటే మాకు కొంచెం ధైర్యం గా ఉంటుంది. కాదనకండి అమ్మ కేవలం మేము ఇద్దరు మాత్రమే అన్ని చేస్తున్నాము మీరు గనక తోడుగా ఉంటే మాకు ఒక మనిషి తోడు గా ఉన్నట్టు ఉంటుంది అలాగే మంచిచెడులు చెప్పగలరు.
అందుకు ఆమె….. సరే మీ దీక్ష పూర్తయ్యేంత వరకు నీతోనే ఉంటాను. అని చెప్తుంది అందుకు వాళ్లు సరే అని అంటారు ఆ మరుసటి రోజు ఉదయమే ఆ ఊరిలో రాగి చెట్టు వేప చెట్టు ఎక్కడ కనపడినా అక్కడ పూజలు చేయడం ప్రారంభం చేస్తారు.
అలాగే ఆ రెండూ కలిసి ఉన్న చోట వాటికి పెళ్లిళ్లు చేస్తారు. దానిని చూసిన ఊరు ప్రజలంతా….పాపం ఎన్ని సంవత్సరాల నుంచి పిల్లలు లేక బాధపడుతున్నారు ఇప్పుడు చివరికి రావిచెట్టు వేప చెట్టుకు పెళ్లి కూడా చేస్తున్నారు. ఆ అమ్మవారు ఇకనైనా వాళ్ళ పైన దయ చూపించి పిల్లలు ఇస్తే ఎంతో బాగుండు. అని చెప్పుకుంటారు వాళ్ళు పెళ్లిళ్లు చేయడం పూర్తి అవుతుంది ఆ రోజు సాయంత్రం సమయం. వాళ్లు ఆమెతో…. అమ్మ మీ ఊరిలో ఉన్న అన్ని వేప చెట్టు కి అలాగే రావి చెట్టు కి పెళ్లి చేసాము. ఇంకా ఈ రోజు మమ్మల్ని ఎక్కడ విశ్రాంతి తీసుకోమంటారు.
అందుకు ఆమె… వీరిద్దరూ ముందు వెళ్ళి కొలనులో స్నానం చేసి కటిక నేల పైన భోజనం చెయ్యండి ఆ తరువాతే. ఏదైనా చెప్తాను అని అంటుంది అందుకు వాళ్లు సరే అని వెళ్లి కొలనులో స్నానం చేసి అక్కడికి వస్తారు అప్పుడు ఆమె నేల మీద వాళ్ళకి భోజనాన్ని వడ్డిస్తుంది.
అందుకు వాళ్లు…. అమ్మ మరి మీరు ఎలా తింటారు నేను మీకోసం ఇంటికి వెళ్లి ఏమన్న తీసుకొని రానా.
అందుకు ఆమె….. ప్రస్తుతానికి నాకు ఏమి వద్దు మీరు ముందు భోజనం చేయండి ఆ తర్వాత నాకేం కావాలో చెప్తాను.
అని అంటుంది అందుకు వాళ్లు సరే అని చెప్పి ఆ నేలపైనే కూర్చొని భోజనం చేస్తారు
వాళ్లు అలా భోజనం చేసిన తర్వాత ఆమె…. ఈ రోజు దీక్ష పూర్తి అయిపోయింది.
రేపు మరొకటి ప్రారంభం చేయాలి.
సరే కదా
అందుకు వాళ్ళు… సరే అమ్మ నేను మీరు చెప్పినట్టే చేస్తాను అని అంటారు.
ఆమె… సరే మీరు అలా విశ్రాంతి తీసుకోండి అని చెబుతోంది వాళ్ళు అమ్మవారి మందిరంలోనే విశ్రాంతి తీసుకుంటారు.
ఆ తరువాత ఆమె కూడా అక్కడే విశ్రాంతి తీసుకుంటుంది.
అలా ఆ రోజు గడిచి పోతుంది ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఆమె వాళ్లని నిద్ర లేపి….. సమయం అవుతుంది త్వరగా నిద్ర లేచి కొలనులో స్నానం చేసి రండి ఆ తర్వాత ఏం చేయాలో చెప్తాను.
అందుకు వాళ్లు సరే అని చెప్పి వెళ్లి స్నానం చేసి అక్కడికి చేరుకుంటారు ఆమె… మీ దగ్గర ఉన్న డబ్బుతో కొన్ని వస్త్రాలు కొనండి అవి పేదవాళ్ళకి ఇవ్వండి.
అందుకు వాళ్ళు….. అమ్మ మా దగ్గర నూతనమైన వస్త్రాలు చాలా ఉన్నాయి ఒక ముని దానం చేయమనీ చెప్పాడు మేము సరే అని వాటిని కొనుగోలు చేసాము ఆ తర్వాత మహర్షి కనబడలేదు. మా ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు వాటిని దానం చేస్తూ ఉన్నాము.
ఆమె….. సరే అనురాధ నువ్వు వెళ్లి మీ ఇంట్లో ఉన్న వస్త్రాన్ని తీసుకొని రా అని అంటుంది అనురాధ సరే అని చెప్పి.తన ఇంటికి వెళ్లి నూతనమైన వస్త్రాలను తీసుకొని మళ్ళీ తిరిగి ఆ ఆలయం దగ్గరికి వస్తుంది.
అప్పుడు వాటిని చూసిన ఆమె….. సరే మీరిద్దరూ కలిసి నాతో పాటు రండి నేను ఒక చోటికి తీసుకు వెళతాను అని చెప్పి వాళ్ళని ఒక కలిగించడానికి తీసుకెళ్తుంది అక్కడ కొంతమంది వ్యక్తులు ఆకలితో దాహంతో దరించడానికి సరైన బట్టలు కూడా లేక ఉంటారు వాళ్లని చూసినా అనురాధ…. అయ్యో పాపం ఎంతమంది అనాధలుగా ఉన్నారు పాపం వాళ్ళ ని చూస్తుంటే నాకు చాలా జాలి వేస్తుంది.
అందుకు అతను…. అవును పాపం ఇంత మంది ఆకలితో అల్లాడి పోతున్న రండి నేను మొదటిసారి చూస్తున్నాను.మనకి చాలా డబ్బు ఉంది కాబట్టి ఈ పేదరికం గురించి మనకి తెలియదు పాపం అని అనుకుంటూ ఉంటారు పక్కనే ఉన్న ఆమె ….. సరే మీరు ఈ రోజు వాళ్ళకి వస్త్రాలు దానం చేయండి. రేపటి రోజున వీళ్ళకి అన్నదానం చేయండి.
అని అంటుంది అందుకు వాళ్లు సరే అంటారు అనురాధ అతని భర్త ఇద్దరూ కలిసి అక్కడే ఉన్న వాళ్లకి వస్త్రాలు ఇస్తూ ఉండగా అందులో ఒక ఆమె వాటిని తీసుకొని….. అమ్మ పిల్లాపాపలతో కలకాలం పచ్చగా ఉండండి మీ మేలు ని ఎప్పటికీ మర్చిపోలేము.
అనురాధ…. అమ్మ అది సరే కానీ నీకు పిల్లలు ఎవరూ లేరా అమ్మ.
అందుకే ఆమె ఏడుస్తూ….. ఎందుకులే రాఅమ్మ నాకు ఇద్దరు మగ పిల్లలు ఒక ఆడపిల్ల ఆడపిల్ల కి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాము. ఉన్న ఇద్దరు మగ పిల్లలకు కూడా పెళ్లి చేశాము పెళ్లయిన తర్వాత అందరూ మారిపోయారు.
నన్ను గాలికొదిలేశారు నా భర్త వాళ్లు చిన్నప్పుడే చనిపోవడంతో నేను ఒంటరి దాన్ని అయిపోయాను అంటూ ఏడుస్తుంది.
అనురాధ…. అయ్యో బాధపడకండి అమ్మ నేను ఉన్నంతకాలం నీకు బట్టలు తిండి ఎలాంటి బాధ ఉండదు అలాగే మీ అందరికీ కలిపి ఒక నివాసస్థలం కూడా ఏర్పాటు చేస్తాము అని చెప్తుంది.
అందుకామె చాలా సంతోష పడుతుంది అక్కడ ఉన్న వాళ్ళందరికీ బట్టలు దానం చేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్తారు అప్పుడు అప్పుడు అనురాధ తన భర్తతో…. ఏమండీ వాళ్ళని చూస్తే నాకు చాలా జాలి వేస్తుంది వాళ్ళ పిల్లలు ఎందుకు అలా చేసి ఉంటారు రేపు మనకి పిల్లలు పుట్టనా కూడా అలాగే ఉంటుందా.
అందుకు అతను…. అందరూ పిల్లలు ఒకే లాగా ఉండరు. అలా గనుక ఉంటే ప్రపంచంలో ఎవరూ తల్లిదండ్రులతోపాటు ఉండేవాళ్లే కాదు . అయినా మన పిల్లలు దుర్గామాత బహుమతి మన పిల్లలకి మంచి బుద్ధులే వస్తాయి.
అని ఆమెకు ధైర్యం చెప్తాడు.
అలా ఆ రోజు సాయంత్రం వాళ్లు గుడి దగ్గర నేల పైన భోజనం చేసి అక్కడే విశ్రాంతి తీసుకుంటారు.
ఆ మరుసటి రోజు ఉదయమే లేచి ఆ పేద వాళ్లకి భోజనం స్వయంగా తయారు చేసి అనురాధ అతని భర్త ఇద్దరూ కలిసి వడ్డిస్తారు.
అలా ఆరోజు పూర్తయిపోతుంది అక్కడే ఉన్న ఆమె….. చూడండి మీరు దీక్షని చాలా చక్కగా చేస్తున్నారు. ఆ దుర్గామాత పూజ చివరిగా మిగిలి పోయింది దాన్ని కూడా చేయండి.
అందుకు వాళ్లు సరే అని చెప్పి దుర్గామాత ముందు పూజ చేస్తారు.
అలా ఆ రోజు కూడా పూజా పూర్తయిపోతుంది అప్పుడు అనురాధ….. అమ్మ మీరు చెప్పినట్టుగా అన్ని తూచా తప్పకుండా పాటించాము.కచ్చితంగా ఆ దుర్గామాత మాపై కరుణ చూపిస్తుంది కదా.
అందుకు ఆమె…. ఖచ్చితంగా చూపిస్తుంది.
ఒకవేళ చూపించలేదు అంటే మీరు ఆమెకు దయ కలిగేంతవరకు దానధర్మాలు చేస్తూనే ఉండండి.
అని అంటుంది అందుకు వాళ్లు సారి అని చెప్తారు ఆ రోజు నుంచి వాళ్లు దానధర్మాలు ఎన్నో చేస్తూ ఉంటారు ఒకరోజు రాత్రి సమయం ఆ దుర్గామాత ఆలయం దగ్గరకు వచ్చి …. అమ్మ భవాని మా దగ్గర ఉన్న ఆస్తి అంతా కరిగిపోయింది. ఇప్పుడు మేము సామాన్య కుటుంబం లాగా వున్నాము ఇంక దానధర్మాలు చేయడానికి మా దగ్గర ఆ ఒక్క ఇల్లు తప్ప మిగిలింది ఏమీ లేదు అది కూడా ఎవరికన్నా ఇచ్చేస్తాను తల్లి మాకు పిల్లలు కలిగేలా చెయ్ అమ్మ నీకు పుణ్యం ఉంటుంది.
అంటూ బోరున ఏడవడం మొదలు పెడుతుంది అతని భర్త కూడా….. అమ్మ మా మీద దయ చూపించు. దయచేసి దయ చూపించు.ఇంక మేము నీ కోసం ఏం చేయాలి నీ కృప పొందాలంటే ఏం చేయాలి తల్లి అంటూ బోర్న్ ఏడుస్తాడు.
అక్కడే ఉన్న ఆమె….. బాధపడకండి అమ్మవారు ఖచ్చితంగా మీ పై దయ చూపిస్తుందనీ అనురాధ చేయి పై తలపెట్టి అక్కడినుంచి మాయమైపోతుంది.
అప్పుడు అనురాధ వాంతులు చేసుకోవడం మొదలు పెడుతుంది.
దాన్ని చూసిన వాళ్ళిద్దరు చాలా ఆశ్చర్యపోతూ…..అమ్మ ఇన్ని రోజులు మాతో ఈ పనులన్నీ చేయించి నువ్వే నా తల్లి నీకు ఎంతో కృతజ్ఞతలు అమ్మ . స్వయానా అమ్మవారే మాతో ఇన్ని రోజులుగా ఉందంటే మేము నమ్మలేకపోతున్నాం. ఇప్పుడు నేను గర్భవతి అని నాకు అర్థం అయింది అమ్మ నీకు వందనాలు అంటూ ఉండగా అమ్మవారి విగ్రహం వెలుగుతూ….. ఇన్ని రోజులు మిమ్మల్ని నేను పేదరికంలో ఉన్న వాళ్ళ ఆకలి గురించి మీకు తెలియజేశాను పిల్లలు కలిగిన తర్వాత ఉండే బాధలు మీకు తెలియజేశాను.
మీరు అన్నిటినీ భరించారు. మీరు ఎంతో దానధర్మాలు చేసి నా మనసుని ఇప్పించారు అలాగే ఎంతోమంది పేదవాళ్లకు సహాయం చేయండి. అని అంటూ కొంత బంగారం డబ్బుని ప్రత్యక్షం చేస్తుంది.
దాన్ని చూసిన వాళ్ళు చాలా సంతోషపడుతూ…. తప్పకుండా చేస్తాను తల్లి అంటూ నమస్కరిస్తారు. అలా రోజులు గడిచాయి వాళ్ళకి ఒక పండంటి మగ బిడ్డ పుడతాడు.ఆ కుటుంబం ఆ బిడ్డను చూసుకొని ఎంతో సంతోష పడుతూ అమ్మ వారికి ఇచ్చిన మాట ప్రకారం ఎన్నో దానధర్మాలు చేస్తూ సంతోషంగా జీవిస్తారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *