దెయ్యం తల్లి ప్రేమ రెండవ భాగం_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu


మొదటిగా దెయ్యం తల్లిప్రేమ రెండో భాగం అర్థం కావాలి అంటే. మొదటి భాగం చూడాల్సి ఉంటుంది దానిని కింద డిస్కషన్లో లింక్ ఇచ్చాను తప్పకుండా చూడండి పిల్లలు. బాలు తన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం చాలా చక్కగా చదువుకుంటున్నాడు ఆటల్లోనూ పాటల్లోనూ అన్నిటిలోనూ బాలు మొదటి స్థానం ఎన్నో బహుమతులు సంపాదించాడు ఆ బహుమతులను ఇంటికి తీసుకువచ్చి తన అమ్మతో అమ్మ చూడమ్మా ఎన్నో బహుమతులు సంపాదించాం అమ్మ
తల్లి ::నా బంగారు కొండ నా వెండి కొండ నా బాలు మంచి అబ్బాయి చెప్పింది చెప్పినట్టు చేస్తాడు
బాలు: అమ్మ నేను బాగా చదువుకుంటే నాకు దేవుడు బహుమతులు ఇస్తాడు అని చెప్పావు కదా ఇప్పుడు నేను దేవుణ్ణి ఒకే ఒక బహుమతి అడుగుతాను అమ్మ నీ రూపాన్ని తిరిగి నీకు ఇవ్వమని అడుగుతాను ఇస్తాడు కదా అమ్మ అమ్మ ఏదో ఒకటి మాట్లాడు చెప్పమ్మా దేవుడు నాకు ఇస్తాడు కదా
అందుకు ఆ తల్లికి ఏం చెప్పాలో అర్థం కాక ఎంతో వేదనతో మనసులో బాధ ఉన్నా పైకి మాత్రం నవ్వుతూ నా బుజ్జి కన్నయ్య అని ప్రేమతో బాలుడు కౌగిలించుకుంది ఆ అమ్మ ఒడిలో బాలు అన్నింటినీ మర్చిపోయి హాయిగా నిద్రలోకి జారుకున్నాడు
ఇదంతా దూరం నుండి గమనిస్తున్న ఒక పిల్ల దెయ్యం తనలో తల్లి ప్రేమ అంటే ఇదే కాబోలుఈ తల్లి బిడ్డల ప్రేమ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది మళ్లీ నా మనసులో దుఃఖంగా కూడా ఉంది అని బోరున ఏడవసాగింది ఆ ఏడుపును గమనించిన బాలు తల్లి ఎక్కడిది ఏడుపు అని బాలు నిద్రపోతున్నాడు అని నిర్ధారించుకుని ఏడుస్తున్న పిల్ల దయ్యం దగ్గరికి వెళ్ళింది అక్కడికి వెళ్లి ఎవరమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు
అప్పుడు ఆ పిల్ల దెయ్యం అమ్మా నా పేరు రాధ నాకు ఎవ్వరూ లేరు మీ తల్లి బిడ్డల ప్రేమ చూస్తే నాకు సంతోషంగా ఉంది నాక్కూడా ప్రేమ కావాలని ఉందమ్మా నన్ను నీ బిడ్డగా తీసుకుంటావా ప్రేమగా చూసుకుంటార అని దీనంగా అడిగింది
అందుకు బాలు తల్లి నా బిడ్డ బాలుని ఏ విధంగా అయితే చూసుకుంటున్నాను నా బిడ్డ తో సమానంగా నిన్ను కూడా చూసుకుంటాం అమ్మ అని ఆ పిల్ల దెయ్యాన్ని కౌగిలించుకుంది అప్పుడా పిల్ల దయ్యం అమ్మా నాకు ఆకలిగా ఉంది అమ్మ అందుకు బాలు తల్లి రామ్మ నిన్ను ఇంటికి తీసుకెళ్లి భోజనం పెడతాను అని ఇంటికి తీసుకు వెళ్ళింది తనకి భోజనం పెట్టింది ఆహారాన్ని పిల్లలు ఏం ఆవురావురు తినడం ప్రారంభం చేసింది దాన్ని చూసిన బాలు తల్లి అమ్మ రాధ నువ్వు భోజనం చేసి ఎన్ని రోజులు అవుతుంది
అందుకు పిల్ల దయ్యం హ హ హ అమ్మ నాకు భోజనం అంటే చాలా ఇష్టం నేను ఇందాకే తిన్నాను
అందుకు బాలు తల్లి ఓసి దొంగ పిల్ల చూడ్డానికి ఏమో చిన్నపిల్లవి తినడం లో మాత్రం చాలా పెద్ద పిల్లవి అని ముక్కున వేలేసుకున్నారు పిల్లలు ఈ కథ ఇంకా అయిపోలేదు ఆ రాధా దయ్యం బాలుతో ఎలా కలిసి ఉంటుందో ఎంత అల్లరి చేస్తుందో మూడవ భాగంలో చూద్దాం

Add a Comment

Your email address will not be published. Required fields are marked *