దెయ్యం తల్లి ప్రేమ_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

కంచ పురం అనే గ్రామంలో సీతమ్మ అనే ఒక ఆవిడ ఉండేది ఆమెకు బాలు అనే ఒక బాబు కూడా ఉండేవాడు తన భర్త లేని కారణంతో ఆ కుటుంబాన్ని తన కష్టంతో నెట్టుకొని వస్తుంది బాలు అంటే ఆమెకు ఎంతో ప్రేమ ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునేది ఎంతో ప్రేమతో అతనికి అన్నం తినిపించడం అతని బాగోగులు చూసుకోవడం తన విధులను చాలా చక్కగా చేసేది బాలు కి కూడా తన తల్లి అంటే ఎంతో ప్రేమ ఒక్క క్షణం కూడా తల్లిని విడిచి ఉండేవాడే కాదు ఇది అలా వుండగా ఒక రోజు ఆమె పొలం పనుల కోసం వెళ్తుండగా మార్గమధ్యంలో పాముకాటుకు గురి అయింది ఆమె అక్కడికక్కడే కుప్పకూలిన పోయి ఎంతో బాధతో తనలో ఇలా అనుకుంటుంది
సీతమ్మ: అమ్మ అమ్మ దేవుడా నా బాలు కి నన్ను కాకుండా చేస్తున్నావు నీకు ఇది న్యాయంగా ఉందా బాబు బాలు నా బంగారుకొండ నేను కూడా నీకు దూరమైj పోతున్నాను నా బిడ్డ నువ్వు ఎలా బ్రతుకుతావు ఏమో నా చిట్టి తండ్రి అనుకుంటూ కనులు మూసి నది అదే రోజు సాయంత్రం
బాలు: అమ్మ నువ్వు ఎక్కడున్నావ్ అమ్మ ఇంత రాత్రి అయింది నాకు చాలా ఆకలిగా ఉంది అమ్మ త్వరగా రా అమ్మ వచ్చి నాకు అన్నం తినిపించి అంటూ ఒంటరిగా కూర్చొని ఏడవడం ప్రారంభించాడు
సీతమ్మ
బాలు మీద ప్రేమతో దెయ్యం అయ్యింది ఎంతైనా తల్లి ప్రేమ కథ ఆమె తన బిడ్డ బాలు ఎలా ఉన్నాడో ఏంచేస్తున్నాడో ఎంత కంగారు పడుతున్నాడు అని అనుకుంటూ పరుగున బాలు దగ్గరికి బయలుదేరి వెళ్ళింది
బాలు: అమ్మ రామ్మా ఆకలిగా ఉంది అమ్మ రా అమ్మ ఆ మాటలకు ఆ తల్లి హృదయం చలించిపోయింది తను ఉండబట్టలేక తన దెయ్యం అయ్యింది అన్న సంగతి మరిచి తన బిడ్డ బాలు ముందుకు వచ్చింది ఆ రూపాన్ని చూసి బాలు భయంతో పెద్దగా అమ్మ దెయ్యం అమ్మో దయ్యం అంటూ అరిచింది సృహ కోల్పోయాడు
అప్పుడా తల్లి: అయ్యో భగవంతుడా నా బిడ్డ నా రూపాన్ని చూసి భయపడి పోయాడు పాపిష్టి దాన్ని నా బిడ్డ భయపడతాడని ఆలోచించకుండా వాడి ముందుకి వచ్చాను నా బిడ్డకు ఏమయ్యిందో
అని అనుకుంటూ బాలుని తన చేతితో ఎత్తుకొని మంచంపై పడుకోబెట్టి తన తలని ఆమె చేత్తో నిమురుతూ ఇలా అంటుంది
తల్లి: ఎప్పుడు అమ్మ అమ్మ అంటూ నా దగ్గరికి ప్రేమగా వచ్చే నా బిడ్డ ఈరోజు దయ్యం దయ్యం అంటూ నన్ను చూసి భయపడి పోయాడు ఇలాంటి కష్టం ఏ తల్లికి కూడా రాకూడదు భగవంతుడా ఒక్కసారి నా బిడ్డకు నేను ఎవరో తెలియజేయి
అంటూ దేవుని ఎంతో బాధతో ప్రార్ధించింది ఆ సమయంలో బాలు కలలో తన తల్లి కి ఏం జరిగిందో ఇప్పుడు తను ఎలా ఉందో బాలు కళ్లలో కనిపించింది ఆ కలను చూసిన బాలు కి వెంటనే మెలుకువ వచ్చింది ఎదురుగా ఉన్న దెయ్యాన్ని చూసి అమ్మ అంటూ కౌగిలించుకొని ఇలా అంటున్నాడు
బాలు: అమ్మ నన్ను క్షమించు అమ్మ నువ్వు నా తల్లివి అని తెలియకుండా దెయ్యం దెయ్యం అని అరిచాను అమ్మ నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలను అమ్మ ఇంకా నన్ను ప్రేమగా ఎవరు చూసుకుంటారు నాకు నువ్వు కావాలి అమ్మ నన్ను కూడా నీ దగ్గరికి తీసుకు వెళ్ళు అని అన్నాడు ఆ మాటలకు ఆ దెయ్యం తల్లి ఇలా అంటుంది
తల్లి: తప్పు నాయన నువ్వు అలా అనకూడదు నేను దేవుడి దగ్గరికి వెళ్లాను అక్కడికి వెళ్ళి నీ గురించి దేవునికి ఏం చెప్పానో తెలుసా బాలు చాలా మంచి అబ్బాయి చెప్పిన మాట వింటాడు ఎవరితో గొడవ పెట్టుకోడు అల్లరి చెయ్యడు బాగా చదువుకుంటాడు అని చెప్పాను అప్పుడు దేవుడు నాతో ఏమన్నాడో తెలుసా బాలు ఏడవకుండా ఉంటే చాలా బహుమతులు ఇస్తానని చెప్పాడు అని ఆ తల్లి బాలు తో చెప్పింది
అందుకు బాలు: నిజంగానా అమ్మ అయితే నేనెప్పుడూ ఏడవను బాగా చదువుకుంటాను అని అన్నాడు అప్పటినుంచి బాలుని ఆ దెయ్యం తల్లి ఎంతో ప్రేమతో దెయ్యం రూపంలోనే తనని కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చింది
నీతి: తల్లి ప్రేమ చాలా గొప్పది ఆ ప్రేమ ఎప్పుడూ తన బిడ్డల పైనే ఉంటుంది ఆమె ఏ రూపంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఆ ప్రేమ మాత్రం కొంచెం కూడా తగ్గదు

Add a Comment

Your email address will not be published. Required fields are marked *