దెయ్యం తల్లి | Telugu kathalu | Telugu Stories | Telugu Moral Stories | Kattapa kathalu

అక్షర పురం అనే గ్రామంలో మమత అనే ఒక ఆమె ఉండేది. ఆమె తన కూతురు శాంతినీ ఎంతో ప్రేమతో చూసుకుంటూ వుండేది. ఆ తల్లి కూతురు ఎంతో సంతోషంగా వాళ్ళ జీవితాలను గడిపే వాళ్ళ. తల్లి చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉండేది. అలా ఉండగా ఒక రోజు ఆ తల్లి తన వ్యాపారం ముగించుకుని ఇంటికి తిరిగి వస్తూ ఉండగా మార్గమధ్యలో వర్షం మొదలైంది. ఆమెకు ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక.
ఆమె ఒక చెట్టు కిందకు వెళుతుంది.
బాగా విపరీతమైన జల్లు ఆమె ముద్దముద్దగా తడిసి పోయింది. ఏం చేయాలో అర్థం కాదు.
ఇది ఇలా ఉండగా ఇంటి దగ్గర తన కూతురు. ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.
వర్షం అలాగే కురుస్తూనే ఉంటుంది.
పాప చాలా కంగారు పడుతూ తన తల్లి కోసం ఏడుస్తూ ఉంటుంది అక్కడ తల్లి కూడా భయపడుతూ తన మనసులో….. భగవంతుడా నా బిడ్డ ఒంటరిగా ఇంట్లో ఉంది. ఉరుములు మెరుపులు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తున్నాయి నా బిడ్డ భయపడకుండా ఉంటే అంతే చాలు. నా బిడ్డ నీ బాయ పెట్టకు దయచేసి అని అనుకోని దేవుని ప్రార్థిస్తూ
ఉంటుంది. ఇంతలో ఒక పెద్ద చెట్టు కొమ్మ ఒక్కసారిగా ఆమె తల మీద పడుతుంది తల్లి పెద్దగా అరుస్తూ భగవంతున్ని ప్రార్థిస్తు….. నా బిడ్డ కే కాకుండా చూసుకో స్వామి అంటూ ఆ వ్యక్తి కిందపడిపోయి తన బిడ్డ గురించి ఆలోచిస్తూ ప్రాణాలు కోల్పోతుంది.
ఇంటి దగ్గర పాప తన తల్లి కోసం ఎదురు చూస్తూ….. అమ్మ ఎక్కడున్నావమ్మా త్వరగా వచ్చేయ్ అమ్మ అంటూ చాలా బాధ పడుతూ.
ఉంటుంది ఇక అలా బాధ పడుతూ అక్కడే ఏడుపు మొదలు పెడుతుంది అమ్మా ఎక్కడున్నావ్ అని.
ఇక అలాగే రాత్రి సమయం గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం తల్లి రాకపోవడంతో పాప తల్లి కోసం వెతుక్కుంటూ వెళ్తుంది . అప్పుడు ఆమెకు తల్లి ఒక చెట్టు దగ్గర మరణించి కనబడుతుంది. దానిని చూసి….. ఏమైందమ్మా నీకు అమ్మ . ఏమైంది అంటూ పెద్ద పెద్ద కేకలు వేసింది. అమ్మ ఒక సారి లేమా అమ్మ ఒకసారి లేమ్మా అంటూ చాలా పెద్దగా ఏడుస్తుంది.
ఆ ఏడుపు చూసి తట్టుకోలేక తల్లి ఆత్మ అక్కడ ప్రత్యక్షమవుతుంది .
తల్లి…. అమ్మ ఎందుకు అలా ఏడుస్తున్నావు.
ఏడవకు అమ్మ నా బంగారు తల్లి కదూ అని అంటుంది
దెయ్యాన్ని చూసి పాప చాలా భయపడుతూ….. ఎవరు ఎవరు అటు దూరంగా భయంతో అక్కడినుంచి పరుగులు తీస్తుంది.
దెయ్యం…. అమ్మ నేను నీ తల్లిని భయపడకు తల్లి . అమ్మ భయపడకు తల్లి నా బంగారు తల్లి కదూ అంటూ ఆమె వెంట పడుతుంది.
ఆ మాటలు విన్న పాప ఒక్క నిమిషం ఆగి… అమ్మ నిజంగా నువ్వు మా తల్లి వా అని ఆశ్చర్యంగా అడుగుతుంది అందుకు ఆమె అవును అని సమాధానం చెబుతుంది.
పాప వెంటనే తల్లిని హత్తుకుని… అమ్మ ఏంటమ్మా ఇది నీ రూపం ఏంటమ్మా ఇలా అయిపోయింది . అంటూ ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది.
తల్లి చాలా బాధ పడుతూ….. అయ్యో నా బంగారు తల్లి ఏడవ కమ్మ.
భగవంతుడు నా మీద చిన్న చూపు చూశాడు . అందుకే ఇలా జరిగింది అని ఆమెకు ధైర్యం చెబుతుంది ఆ తర్వాత ఆమెతో పాటు కలిసి ఇంటికి వెళ్తుంది.
పాప ఆ దెయ్యం తల్లితో ఎప్పటిలాగే కబుర్లు చెబుతూ ఆమె తో ఆడుకుంటూ సంతోషంగా జీవిస్తుంది.
అలా ప్రతిరోజు తల్లి ఆ దయ్యం రూపంలోనే పాపకు కావాల్సిన ఆహారాన్ని తయారుచేసి
ఆమెకు అందిస్తూ ఉంటుంది.
పాప ఆ దెయ్యం తల్లి తో సంతోషంగా జీవిస్తూ ఉంటుంది.
అలా ఆ తల్లీ కూతుళ్లు ఇద్దరూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు.
వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా
అక్కడే ఇంటిదగ్గర కబుర్లు చెప్పుకుంటూ ఆడుకుంటూ సంతోషంగా ఉంటారు అప్పుడే కొందరు ఒక దెయ్యాల మాంత్రికుడు ఆ దయ్యాన్ని చూస్తాడు. ఆ దెయ్యాన్ని చూసి తన మనసులో…… ఈ ఈ కోరికలు తీరక దెయ్యం అయ్యింది. కూతురి మీద ఎంతో ప్రేమ ఉన్నది ఇలాంటి దయ్యాన్ని కనుక నేను బంధిస్తే వచ్చే పౌర్ణమి నాటికి దానికి ఉన్న అతీత శక్తులు అన్నీ నా సొంతమవుతాయి . ఇలాంటి మంచి అవకాశం నేను అస్సలు వదులుకోను. అని చెప్పి ఆమె నీ తన మాయాశక్తి తో బంధించి వేస్తాడు. తల్లి మాయమవడం చూసిన ఆ పాప….. అమ్మ అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయావు అమ్మ. అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తోంది.
అప్పుడే ఆ మంత్ర గాడు చేతిలో తల్లి ఒక ఆత్మ బందీగా ఉండడం చూసిన పాప అతని దగ్గరకు వచ్చి….. స్వామి నీకు దండం పెడతాను . నా తల్లిని వదిలి పెట్టి స్వామి నాకు అమ్మ తప్ప ఎవరూ లేరు. నువ్వు దయచేసి అమ్మ ని వదిలి పెట్టు నీకు పుణ్యం ఉంటుంది. స్వామి దయ చేసి పెట్టు అంటూ ఎంతగానో ప్రాధేయ పడుతోంది.
అందుకు అతను ఏమాత్రం జాలి లేకుండా పాపను పక్కకు నెట్టివేసి అక్కడనుంచి వెళ్ళి పోతాడు.
ఆ తర్వాత అతను ఆ దెయ్యం తో పాటు తన గృహ కి వెళ్ళి పోతాడు.
అక్కడ ఏదో పూజలు చేస్తూ ఉంటాడు.
నా తల్లి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది అక్కడ పాప తల్లి కోసం బాధపడుతూ…… అమ్మ నువ్వు రావమ్మా నా కోసం రావా . అమ్మ ఒక సారి నా కోసం రా అమ్మ అంటూ ఎంతగానో ప్రాధేయ పడుతూ.
ఆకలితో అల్లాడి పోతు….. అమ్మా నాకు చాలా ఆకలిగా ఉంది అమ్మ . అంటూ ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఆ శబ్దాలు మొత్తం తల్లికి వినబడుతూ ఉంటాయి .ఆ
దెయ్యం చాలా పెద్దగా ఏడుస్తూ…… అయ్యో భగవంతుడా నా బంగారు తల్లి ఆకలి అని ఏడుస్తుంది నన్ను ఇలా ఇబ్బంది గా ఉంచడం మీకు భావ్యం కాదు. ఈ మంత్రగాడి చేతి నుంచి నన్ను విడిపించు. నీకు పుణ్యం వుంటుంది. అని ఎంతగానో ప్రాధేయ పడుతూ
పెద్దగా ఏడుస్తూ ఉంటుంది.
అప్పుడు ఆ మాంత్రికుడు ఆ పెద్దపెద్ద ఏడుపులు వినలేక….. నోరు మూసుకొని అరవకుండా ఉండు ఎందుకు ఇలాగా పెద్ద పెద్ద శబ్దాలు చేసి నాకు ఇబ్బంది కలిగిస్తున్నావ్వి.
ఆ దెయ్యం…. నీకు పుణ్యం ఉంటుంది నా బిడ్డ ఆకలి అంటూ ఏడుస్తుంది నా బిడ్డకు నేను అన్నం తినిపించి నీ దగ్గరకు నేను మళ్ళీ వస్తాను నా మాట నమ్ము.
అతను పెద్దగా నవ్వుతూ….హా హా హా ఇదేమన్నా పులి ఆవు కథ అనుకున్నావా.
నువ్వు ఒక పిశాచి ఇవి నేను నేను నమ్మను .
నువ్వు కచ్చితంగా తిరిగి రావు ఆ విషయం నాకు తెలుసు.
అందుకు ఆ దెయ్యం….. లేదు లేదు నువ్వు ఎప్పుడు అలా ఊహించుకోకు.
దయచేసి నన్ను ఒక్క అరగంట విడిచిపెట్టు నేను నా బిడ్డకు అన్నం తినిపించి మళ్ళీ వస్తాను.
అది ఎంతగానో ప్రాధేయ పడుతోంది ఏడుస్తుంది. అప్పుడు ఆ మంత్రగాడు….. సరే అయితే నువ్వు తిరిగి రాకపోతే నేను నీ కూతుర్ని ఏం చేస్తానో చూడు.
అందుకు దయ్యం…. అలాంటిది ఏమీ జరగదు కచ్చితంగా నేను తిరిగి వస్తాను.
అని చెప్తుంది. అందుకు ఆ మంత్ర గాడు సరే అని చెప్పి ఆమెను బందీ నుంచి విడిపిస్తాడు ఆమె చాలా సంతోషంగా తన కూతురు దగ్గరకు వెళ్తుంది.
కూతురు తల్లిని చూసి ఎంతగానో సంతోష పడుతూ ….అమ్మ నువ్వు తిరిగి వచ్చేసావా.
నువ్వు ఇక్కడికి తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.
అని అంటుంది తల్లి….. అమ్మ నీకు ఆకలిగా ఉంది కదా మొదటి నీ ఆకలి తీర్చుకునే అమ్మా అని చెప్పి . ఆమెకు చాలా హడావిడిగా భోజనాన్ని తయారుచేసి పాపకు తినిపిస్తుంది.
ఆ తర్వాత పాపా….. అమ్మ కాసేపు నన్ను ఆడి పెంచూ అని అడుగుతుంది అందుకు దెయ్యం …. అయ్యో నాకు సమయం లేదు తల్లి నీ నేను ఏ విధంగా సమాధానం చెప్పాలి అంటూ భయ పడుతూ ….. సరే త్వరగా రా అమ్మ ఇస్తాను అని ఆమెపైన ఎక్కించుకొని ఆడు పిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి
ఆ మంత్ర గాడు వస్తాడు .
అతన్ని చూసి పాప చాలా భయపడుతుంది ఆ దెయ్యం….. నేను రావడానికి చూస్తున్నాను ఇంతలో నా బిడ్డ ఆడ పింఛమని అన్నది అందుకే ఆడిపిస్తున్నాను. అందుకే ఆలస్యం అయింది నా బిడ్డని ఏం చేయకు . నేను వస్తున్నాను పదండి అని అతనితో అంటుంది అందుకు అతను ….. సరే వెళ్దాం పద.
అని అంటుంది అందుకు ఆమె సరే అని సిద్ధమవుతుంది. ఆమె పాపతో…. అమ్మ నేను మళ్ళీ తిరిగి వస్తానో లేదో తెలియదు కానీ . నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండమ్మా.
ఎవరితో గొడవ పెట్టుకోవద్దు. ఇంట్లోనే ఉండి నీ పని నువ్వు చూసుకో అమ్మా. చాల జాగ్రత్తగా ఉండు అంటూ ఆమెను హత్తుకొని ఏడుస్తుంది.
ఆమె కూడా పెద్దగా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది.
ఆ తర్వాత అతను ఆ దెయ్యాన్ని బంధించి తీసుకొని వెళ్ళి పోతాడు.
పాప అలాగే ఏడుస్తూ ఉంటుంది ఆమె తన మనసులో….. భగవంతుడా ఇంత చిన్న వయసులో నా కూతురికి ఎంత పెద్ద కష్టం వచ్చింది. నువ్వే నా బిడ్డ ని జాగ్రత్తగా చూసుకో అంటూ ఏడుస్తూ
చాలా బాధపడుతుంది.
ఇక ఆ మంత్రగాడు పూజలు చేస్తూ ఆమె అక్కడే ఉంటాడు.
రోజులు గడిచాయి ఆ పాప తిండి తిప్పలు లేక ఎంతో బాధపడుతూ ఉంటుంది.
దెయ్యం తన బిడ్డ గురించి ఆలోచిస్తూ భగవంతుని ప్రార్ధిస్తూ ఉంటుంది.
ఆ దయం చాలా బాధపడ్డాడము చూసినా ఆ మంత్రగాడు … నువ్వు అలా బాధగా ఉంటే నాకు అతీత శక్తులు ఎలా వస్తాయి.
నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉండాలి అప్పుడే నాకు పూర్తి శక్తులు లభిస్తాయి.
దెయ్యం ఏడుస్తూ…. నేను ఆనందంగా ఎలా ఉంటాను చెప్పు. అభం శుభం తెలియని నా బంగారు తల్లి నీ విడిచి పెట్టి నేను ఇక్కడ ఉంటున్నాను. ఆమె ఆకలితో అల్లాడి పోతుంది. ఇలాంటి కడుపు శ్లోకం ఎవరికీ కలగకూడదు. ఏ తల్లికి కూడా రాకూడదు.
భగవంతుడు నా ప్రాణాన్ని తీసుకువెళ్లినా నేను దెయ్యం రూపంలో అయినా నాకు బిడ్డ దగ్గర ఉన్నందుకు చాలా సంతోషపడ్డాను కానీ ఆ సంతోషం కాస్తా పోయింది.
ఏ తల్లి అయినా తన బిడ్డలు బాగుండాలి అని కోరుకుంటుంది . అది నేను కూడా చేస్తున్నాను కానీ ఏం లాభం. నా బిడ్డకు కూడా ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతోంది. ఆకలితో అలమటిస్తున్న ది. ఇలాంటి దౌర్భాగ్య జీవితం ఎవరికి రాకూడదు అంటూ ఎంతగానో ఏడుస్తుంది ఇక అతను ఆమె పైన జాలిపడి ఏం మాట్లాడకుండా ఆమెను వదిలేస్తాడు.
ఆమె చాలా సంతోష పడితే అక్కడి నుంచి బిడ్డను చేరుకుంటుంది. సంతోషంగా ఉండు బాగోగులు చూసుకుంటూ గడిపేస్తోంది ఆ దెయ్యం తల్లి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *