దెయ్యం దీపావళి Telugu Kathalu | Telugu Stories | Stories in Telugu | Horror Stories | fairy tales

గణాపూర్ గ్రామంలో ఊరి చివర్న ఉన్న ఇంట్లో ఒక దెయ్యం తన కూతురుని చూసుకుంటూ జీవిస్తూ ఉండేది, కానీ ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మ ఒక దెయ్యం అనే విష్యం తెలియదు, ఆమె పేరు చిన్నారి, దెయ్యం చిన్నారిని  ని ఎంతో [ప్రేమగా చూసుకుంటూ ఉండేది, చిన్నారి  తల్లి పేరు కమల ఆమె దెయ్యంగా మారడానికి కారణం

కమల ఒక ఒంటరి మహిళ తన భర్త చనిపోయినప్పటి నుండి కూతురు చిన్నారిని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంది, ఒకరోజు కమల

కమల :- ఇప్పటికైతే ఏ కూలో నాలో చేసుకుంటూ చిన్నారి కడుపు నిముతున్నాను కానీ అది కొంచం పెద్దయ్యాక, స్కూల్ ఖర్చులు, చిన్నారి అవసరాలు కూడా పెరుగుతాయి, దానికికి జీవితం లో ఏ లోటు రాకుండా చూసుకోవాలి అంటే నేను ఇప్పటి నుండే ఇంకా బాగా కష్టపడి చాలా డబ్బులు సంపాదించాలి అనుకుంటుంది

రోజులాగే ఒకరోజు పని కోసం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఒక అదుపు తప్పి వచ్చిన కార్ కమలాన్ని గుద్దుతోంది, ఆ ప్రమాదంలో కమల గాయాలతో చాలా దూరంగా పడిపోతుంది,

చావు బ్రతుకుల మధ్య ఉన్న కమల

కమల :- అయ్యో దేవుడా ఏంటి నాకు ఈ పరీక్ష, ఇప్పుడు నాకు ఏమైనా జరిగితే నా కూతురు అనాధ అయిపోతుంది, దానికి నేను తప్ప ఈ లోకంలో ఎవరు లేరు, అది పుట్టినప్పుడే తండ్రిని తీసుకెళ్లిపోయావు, ఇప్పుడు దానికోసమే బ్రతుకుతున్న నన్ను ఇలా చేస్తున్నావు, నేను కూడా చనిపోతే దాని తోడు ఎవరు అని అనుకుంటూ ఉండగానే కమల చనిపోతుంది. కమలకి తన కూతురిమీద ఉన్న చెప్పలేని ప్రేమ మరియు బాద్యత వల్ల చనిపోయిన తరువాత దెయ్యం లా మారుతుంది.

దెయ్యం కమల :– మనిషిలా తనకు నేను ఏమి చేయలేక పోయాను, ఇలా దెయ్యంగా మారాక అయినా నా కూతురు తోడుగా ఉండాలి అనుకుంటుంది, ఇంతలో కమలకి ఆక్సిడెంట్ అయినా ప్రదేశానికి చిన్నారి వస్తూ ఉంటుంది, కమల వెంటనే రోడ్ పై పది ఉన్న తన శవాన్ని మాయం చేసి దెయ్యం లాగా ఉన్న కమల మాములుగా మారిపోయి చిన్నారి దగ్గరికి వస్తుంది,

కమల ;- చిన్నారి ఏంటమ్మా నువ్వు ఇక్కడికి వచ్చావు, ఏమయ్యిందమ్మా?  అని అడుగుతుంది కమల

చిన్నారి :- అమ్మ రోజు నువ్వు పనికి వెళ్ళాక నేను ఇంటి బయట కూర్చుని ఆడుకుంటూ ఉంటాను, ఈరోజు కూడా అలాగే ఆడుకుంటూ ఉండగా ఒక అతను వచ్చి “మీ అమ్మ ఆక్సిడెంట్ అయ్యి చనిపోయి రోడ్ మీద పడిపోయింది” అని చెప్పాడు, నాకు ఎంతో బయమేసిందమ్మా అనుదుకే పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చ్హాను, అని చెబుతుంది చిన్నారి ఏడుస్తూ

కమల :- లేదమ్మా నాకు ఏమి అవ్వలేదు, నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను, ఇదిగ్గో చూడు నేను నీ తోనే ఉన్నాను, నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికైనా వెళ్తానా సరే పదా మనం ఇంటికి వెళదాం రేపు దీపావళి పండుగ కదా, మనామ్ బజారుకి వెళ్లి చాలా టపాసులు తెచ్చుకొని ఈ దీపావళి పండుగ ఎంతో ఘనంగా జర్పుకుందాం, అని చెప్పి చిన్నారిని ఇంటికి తీసుకెళుతుంది.

ఇంటికిఎళ్లిన తరువాత చిన్నారి కమల తో

చిన్నారి :- అమ్మ నువ్వు చనిపోయావని ఊరందరు అంటున్నారు, నువ్వ్వు బ్రతికే ఉన్నావు కదా అమ్మ వాళ్లేంటి మరి అలా అంటున్నారు?

కమల :- చూడమ్మా నేను చనిపోయి ఉంటె నీ ముందు ఎలా ఉండగలను చెప్పు, అయినా మనం టపాసులు తెచుకుందామా అనుకున్నాం కదా, షాప్కి వెళ్లి తెచ్చుకుందాం పదా  అని అడుగుతుంది

ఆ మాటలకు చిన్నారి ఆలోచనలో పడుతుంది. ఏదైనా సరే తనకి టపాసులు తెచ్చుకోవాలన్న ఆశతో మిగతా విషయాలన్నీ పక్కకు పెడుతుంది.

కమల దెయ్యంగా కనిపించకుండా, మామూలు మనిషిలా మారి చిన్నారితో టపాసులు కొనుక్కోవడడానికి బజారుకి వెళ్తుంది.

ఒక టపాసుల షాప్కి వెళ్లి కమల

కమల :- బాబు ఈ డబ్బులు తీసుకొని చాలా టపాసులు ఇవ్వు అని అడుగుతుంది దానికి ఆ షాప్ వ్యక్తి కమలాన్ని చూసి

షాప్ వాడు :- ఏంటమ్మా నువ్విచ్చిన డబ్బులకి చాలా టపాసులు రావు అని చెప్పి కొన్ని టపాసులు ఇస్తాడు ఇంతలో అక్కడికి వచ్చిన గని అనీ వ్యక్తి షాప్ యజమాని దగ్గరికి వచ్చి

గని :- రేయ్ రేయ్ ఇందాక ఆక్సిడెంట్ లో చనిపోయింది ఈమెనే, తన కూతురు మీద ఉన్న ప్రేమతో తన కూతురుని విడిచిపెట్టి పోలేక దెయ్యంగా మారినా కూడా తన కూతురుని చూసుకోవడానికి వచ్చింది. ఇప్పుడు నువ్వు మాట్లాడేది దెయ్యంతోనే అని అంటాడు. 

అది విన్న చిన్నారి

చిన్నారి :- అందరు ఏంటమ్మా నిన్ను దెయ్యం అంటున్నారు నువ్వు  నిజంగా చనిపోయావా అమ్మ, ఇప్పుడు నువ్వు నా అమ్మవి కావా దేయ్యనివా అని అడుగుతుంది.

చిన్నారి మాటలు విన్న వెంటనే కమల దెయ్యంగా మారి

దెయ్యం కమల :- అవునమ్మా నేను ఇందాక నాకు జరిగిన కార్ ఆక్సిడెంట్ లో చనిపోయాను, కానీ నిన్నను ఎలా కాపాడుకోవాలో తెలియక విదిరాఅతని ఎదురించి నీ దగ్గరకు వచ్చాను, అని నువ్వు నన్ను దెయ్యం లా చూస్తే బయపడి నా దగ్గరకు రావడం మానేస్తావేమో అని రూపం మార్చుకొని ఇలా మామూలు మనిషిలా వచ్చాను, ఈ విషయం నీకు చెప్పకూడని కాదమ్మా, నువ్వు భయంతో నన్ను విడిచిపెడతావేమో అప్ప్పుడు నీ ఆలనా పాలనా చూసుకోవడడానికి ఎవరు  ఉండరు అని ఇలా మారు వేషంలో నీ దగ్గరికి వచ్చాను, ఇందులో నేను చేసిన తప్పేమి లేదమ్మా అని అంటుంది దెయ్యం ఏడుస్తూ

చిన్నారి :- అమ్మ ఆ దేవుడు నిన్ను నాకు కాకుండా చేసినప్పటికీ నీకు నాపై ఉన్న ప్రేమ వల్ల నువ్వు ఎదో ఒక రూపం లో నా దగ్గరికి వచ్చావు, ఇంత ప్రేమించేవాళ్ళు నాకు ఈ ప్రపంచంలో ఎక్కడ వెతికినా దొరకరు, నువ్వు ఏ రూపంలో ఉన్న నా అమ్మవే, ఈ సమాజం ఆ దేవుడు ఒప్పుకోకపోయినా నువ్వు నాతోనే ఉండాలమ్మ అని చిన్నారి ఏడుస్తూ చెబుతుంది.

దెయ్యం కమల మరియు చిన్నారి మాట్లాడే మాటలు విన్న షాప్ యజమాని మరియు గని అనే వ్యక్తి కూడా ఎంతో బాధ పడతారు. గని దెయ్యం దగ్గరికి వచ్చి

గని :- అమ్మ మీ ఇద్దరి తల్లి బిడ్డలా ప్రేమ చూసాకా నాకు ఎంతో గొప్పగా అనిపిస్తుంది. ఈ టపాసులకి విలువకట్టి మీ ప్రేమకి ఆనందాన్ని నేను కొలత చెప్పలేను, మీకు కావలసినన్ని టపాసులు తీసుకెళ్లండి, అదే మీ ప్రేమకి నేను ఇవ్వగలిగే కానుక అని ఆచెప్తాడు

అప్పుడు దెయ్యం గానికి ధన్యవాదాలు చెప్పి తమకు కావలసినన్నీ టపాసులు తీసుకొని చిన్నారి మరియు కమల ఇంటికి వెళ్తారు.

ఇంటికి వెళ్ళాక దెయ్యం కమల మరియు చిన్నారి కలిసి టపాసులు కాల్చుతూ ఆనందంగా దీపావళి జరుపుకుంటారు.

ఆరోజు నుంచి ఊరి ప్రజలందరూ చిన్నారిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు, ఊరి వాళ్ళు చిన్నారిని ఎంతో ప్రేమగా చూసుకోవడమ్ చూసిన కమల కూడా ఎంతో సంతోషిస్తుంది….

Add a Comment

Your email address will not be published. Required fields are marked *