దెయ్యం పట్టిన భర్త_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

కృష్ణ పల్లవి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాళ్లు చాలా చక్కగా వాళ్ళు జీవితాన్ని గడుపుతున్నారు వాళ్ళకి ఒక అబ్బాయి కూడా కలిగాడు. అతని పేరు రఘు.రోజులు గడిచాయి రఘు కొంచెం పెరిగి పెద్ద అయ్యాడు. అప్పుడు వాళ్ళ అమ్మ పల్లవికి ఏదో తెలియని జబ్బుతో మంచాన పడి చనిపోయింది. ఆ తరువాత కృష్ణ నీలిమ అనే ఆమె నీ పెళ్లి చేసుకున్నాడు. నీలిమ మొదట్లో రఘు ని చాలా బాగా చూసుకునేది. దాన్ని చూసి కృష్ణ చాలా సంతోష పడే వాడు. రోజులు గడిచేకొద్దీ అత నీ పురుగు ల చూడడం మొదలు పెట్టింది. ఒకరోజు రఘు బయట నుంచి ఇంటికి వచ్చి….. పిన్ని నాకు ఆకలిగా ఉంది. అన్నం పెట్టావా.

నీలిమ…. మహా రాజు వచ్చాడు నోరు మూసుకొని కింద కూర్చో. పెడతాను. మీ అమ్మ పోతూ పోతూ నాకు శని అంటగట్టి పోయింది. మీ అమ్మతో పాటుగా నువ్వు కూడా పోవాల్సింది. ఒక దరిద్రం వదిలింది ఎంచక్కా నేను ఆయన చాలా సంతోషంగా గడిపే వాళ్ళం చి చి.. అంటూ ఛేదించుకుంటూ అన్నం పెట్టిన ప్లేట్ ను అతని ముందుకు విసిరి కొడుతుంది.
రఘు దాన్ని తీసుకొని తింటూ…. పిన్ని అన్నం వాసన వస్తుంది.
నీలిమ…. నీ మొహానికి అదే ఎక్కువ నోరు మూసుకొని తింటే తిను లేదంటే అవతలకు వెళ్ళా. అని కసురుకుంది. రఘు చాలా ఏడుస్తూ…. తన తల్లి ని గుర్తు తెచ్చుకుంటాను. అప్పుడు అతనికి తన తల్లి తినిపించిన గోరుముద్దలు గుర్తుకు వస్తాయి.
అతను భోజనం చేసిన తర్వాత బయటికి వెళ్లి ఒంటరిగా కూర్చొని….ఏడుస్తూ….. అమ్మ పిన్ని నన్ను ఎలా కొడుతుందో తిడుతుందో చూస్తున్నావా. కనీసం నాకు తిండి కూడా మంచిగా పెట్టడం లేదు. ఎందుకమ్మా నేను ఏం తప్పు చేశాను. నువ్వుంటే నాకు చాలా బాగుండేది. నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు. ఈ విషయం నాన్నకు చెప్పినా దాన్ని కూడా పట్టించుకోడు. అంటూ చాలా బాధపడతాడు.ఆ
బాధనంతా చూస్తున్న తన తల్లి…. ఏడుస్తూ భగవంతుడా నా బిడ్డ కి ఇంత చిన్న వయసులో ఇన్ని కష్టాలు పడతావు అని నేను అనుకోలేదు. వాడి తలరాతను ఎందుకలా రాశావు. నీకంటూ జాలి దయ ఏమీలేదు. నా బిడ్డ నీ నేను కాపాడుకోగలను. నువ్వు కళ్ళు ఉండి కూడా చూస్తూనే ఉంటావ్వు కానీ సహాయం చేయవు. అని బాధ పడుతుంది. కొంత సమయానికి కృష్ణ ఇంటికి వచ్చాడు. అప్పుడు నీలిమ ….. వచ్చారా రండి మీ కోసమే ఎదురు చూస్తున్నా ను. మీ కోసం రకరకాల వంట పదార్థాలు చేసి ఉంచాను.
తిందురు గాని రండి.
అందుకు కృష్ణ….. రఘు తిన్నాడా.
నీలిమ….. ఆయనగారికి పెట్టకుండా నేను ఎప్పుడైనా ఉన్నానా కొత్తగా అడుగుతున్నారు. అయినా పెళ్ళాం తిన్నదో లేదో మాత్రం పట్టించుకోరు. కొడుకు మీద ఎంత ప్రేమ కారిపోతుందో.
ఆ మాటలు కృష్ణ…. నాకు ఇద్దరూ సమానమే తల్లి లేని పిల్లోడు కదా. అందుకని అడిగాను నువ్వు అని ఎలా చూసుకుంటావో నాకు తెలుసు. రోజురోజుకీ వాడి పట్ల ను కఠినంగా ప్రవర్తిస్తున్నావు.
నీలిమ…. అయ్యో రామా ఇదెక్కడి విడ్డూరం నీకు కొడుకు అయితే నాకు మాత్రం కొడుకు కాకుండా పోతాడా. నా కడుపులో పుట్టలేదనే కానీ నా సొంత కొడుకు కన్నా ఎక్కువగానే చూసుకుంటాను. అయినా ఈ రోజు ఏంటి మీకు నోరు బాగా పైకి లేస్తుంది. కొంచెం అదుపులో పెట్టుకోండి లేకపోతే నా సంగతి తెలుసుగా. ఆ మాటలకి కృష్ణ ఏమి అనలేక తలదించుకుంటాడు. దాన్ని అంత చూస్తున్న
పల్లవి దెయ్యం…. నా భర్తని కీలుబొమ్మ చేసి ఆడుకుంటున్నావు. ఈ రోజుతో నీ ఆటలు సాగనివ్వను అంటూ తన భర్త శరీరంలోకి ప్రవేశిస్తుంది. వెంటనే అతను…. ఏమే నీకు భర్త అంటే గౌరవం లేదా. నోరు ఉంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు. ఏం చేస్తున్నావే. రేపటి నుంచి చెప్తున్నా నా పిల్లగాడు బాగోగులు అన్ని నువ్వే చూసుకోవాలి. అంతకుముందు ఎలాగైతే ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. వాడికి సరైన సమయానికి భోజనం ఇవ్వాలి. పాడైపోయిన అన్నం వాడికి పెట్టావో నువ్వు తినే అన్నంలో విషం కలిపి నిన్ను చంపేస్తా. అంటూ ఆమెను చితకబాదాడు.
ఆమె…. వదలండి వదలండి నన్ను వదలండి ఎంత ధైర్యం వచ్చింది మీకు. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. నా మీద చేయి చేసుకుంటారా.
కృష్ణ….. పుట్టింటికే కాకపోతే ఏట్లో కి పోయి దూకు ఒక పీడ వదులుతుంది. నేను నా కొడుకు హాయిగా ఉంటాం.
నీలిమ…. ఎన్ని మాటలు అంటున్నారు ఈరోజు మీకు దెయ్యం గాని పెట్టలేదు కదా. ఇలా ప్రవర్తిస్తున్నారు. అని పెద్ద పెద్దగా ఏడుస్తూ కేకలు వేస్తోంది. ఆ అరుపులు విన్న రఘు పరుగుపరుగున ఇంట్లోకి వచ్చి…. నాన్న ఏం చేస్తున్నారు మీరు పిన్ని నీ ఎందుకు కొడుతున్నారు. దయచేసి వదిలేయండి. నాకు అమ్మ ఎటు లేదు కనీసం పిన్ని కూడా లేకుండా చేద్దాం అనుకుంటున్నారా.
ఆ మాటలు విన్న ఆమె మనసు కరిగిపోతుంది.
కృష్ణ…. చూసావా నిన్ను కొడుతుంటే అడ్డం వచ్చి ఎలాగా ఏడుస్తున్నాడో. వాడు నిన్ను అమ్మ అ అని పిలవడానికి ఎన్ని సార్లు ప్రయత్నించాడో. కానీ నువ్వు ఒక్కసారైనా వాడికి అమ్మ లాగా ప్రవర్తించావా. సూటిపోటి మాటలతో వాడిని బాధ పెడుతూనే ఉన్నావు.
బంధం విలువ తెలిస్తే ఇలా ప్రవర్తించవుయ్. మొదట నువ్వు ఆడదానివాని తెలుసుకో.
అని అంటాడు అందుకే ఆమె ఏడుస్తూ…. నన్ను క్షమించండి నేను నిజంగానే రఘు పట్ల కఠినంగా ప్రవర్తించాను. వాడు నన్ను అమ్మ అని పిలిస్తే వాతలు పెడతానని చెప్పాను. అందుకే వాడు నన్ను పిన్ని అని పిలుస్తున్నాడు. కానీ వాడి మనసు ఎంత నేర్చుకుందో వాడి కన్నీరు చూస్తే ఇప్పుడు అర్థం అవుతోంది. అంటూ అతన్ని దగ్గరగా తీసుకొని…. రఘు ఇప్పుడు అమ్మ అని పిలువు. మీ అమ్మని నీకు పిన్ని ని కాదు అంటూ ఏడుస్తుంది.
వెంటనే కృష్ణ శరీరము లో ఉన్న దెయ్యం ఆత్మ బయటకు వచ్చి…… నన్ను క్షమించు నీలిమ నిన్ను కొట్టినందుకు కేవలం ఇదంతా నీలో మార్పు కోసమే . నా బిడ్డ నీ నా నుంచి ఆ దేవుడు దూరం చేశాడు. కనీసం నీ ప్రేమతో అయినా నా తల్లి ప్రేమ లభిస్తుందని కృష్ణ నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. కానీ నువ్వు వాడి పట్ల కఠినంగా ప్రవర్తిస్తున్నావు. దాన్ని చూసి తట్టుకోలేని ఇంకా మీరు ఇలా చేయాల్సి వచ్చింది. వారి నువ్వు బాగా చూసుకో లేకపోయినా పర్వాలేదు. కానీ అమ్ము ఉంటే బాగుండు అనే పదం మాత్రం రాకూడదు నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను నా బిడ్డని దండించ కు నీకు పుణ్యం ఉంటుంది అంటూ ఏడుస్తుంది.
అందుకు నీలిమ….. అయ్యో నన్ను క్షమించు ఒక తల్లి మనస్సు నేను అర్థం చేసుకోలేకపోయాను. నేను చేసిన ప్రతి తప్పు కి మీ అందరికీ క్షమాపణ చెప్తున్నాను. ఇకమీదట ఎప్పుడూ నేను ఇలా ప్రవర్తించను నా బిడ్డని ఎప్పుడు దండించను. అని ఏడుస్తుంది.
అందుకాదెయ్యం…. నీకు చాలా కృతజ్ఞతలు నేను ఇక వెళతాను అని అంటుంది.
తన తల్లి ఆత్మలు చూసిన నా రఘు ఎంతో ఆశ్చర్యపోయి…. అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళద్దు అమ్మ ఇక్కడే ఉండమ్మా. మనం అందరం కలిసి ఉందాం అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్లొద్దు అమ్మా అంటూ ఏడుస్తాడు .
తన తల్లి…. లేదు బాబు నేను వెళ్ళాలి. ఇప్పుడు నీకు నేను అమ్మను కాదు . మీ అమ్మ అదిగో ఆమె నీకు అన్నీ సర్వస్వం ఆమె. కన్న తల్లి మర్చిపోయి పెంచిన తల్లిని కన్నతల్లిగా భావించు.
వేణు…..పల్లవి నన్ను అర్థం చేసుకున్నందుకు నీకు చాలా కృతజ్ఞతలు. బయట అందరూ రూ వ్యామోహం తో మరో పెళ్లి చేసుకున్నాను అని అంటున్నారు కానీ నేను కేవలం మన బిడ్డ కోసమే పెళ్లి చేసుకున్నాను.ఆ నిజం ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు. మీకు చాలా కృతజ్ఞతలు పల్లవి.
దెయ్యం…. నేను మిమ్మల్ని అర్థం చేసుకోకపోతే మన ప్రేమకి అర్థమే సిరియా లాంటి వాళ్లు నాకు తెలుసు. ఇప్పుడైనా మించిపోయింది ఏమీ లేదు లేండి. ప్రజలకి పోనుపోను అదే అర్థమవుతుంది. ఇప్పుడు నీలిమ మనసు కూడా మారిపోయింది.ఇక మీరందరూ సంతోషంగా ఉంటే నేను ఏ లోకంలో ఉన్నా మీ సంతోషాన్ని చూసి మీరు కూడా సంతోషిస్తాను. ఎన్ని బాధలు కష్టాలు ఉన్నా మీరు మాత్రం సంతోషంగా ఉండాలి అప్పుడు నేను అక్కడ సంతోషిస్తాను సరేనా
అందుకు వాళ్లు సరే అని అంటారు.
దెయ్యం…
ఇక నేను సెలవు తీసుకుంటాను.అని అందరికీ వీడ్కోలు చెప్పి అక్కడినుంచి మాయమైపోతుంది. ఇక అప్పటి నుంచి నీలిమ రఘు ని తన సొంత బిడ్డ లాగే చూసుకుంటూ ఉంటుంది. అలా వాళ్ళు అందరూ వాళ్ళ జీవితాన్ని హాయిగా సాగిస్తూ ఉంటారు. తల్లి ప్రేమ చాలా గొప్పది దానిని దేనితోనూ సమానంగా చూడలేము. అలాంటి తల్లి ప్రేమ కోల్పోయిన పిల్లలకు తల్లి ప్రేమ అందించే గొప్ప మాతృ మూర్తులందరికీ ఈ కథ అంకితం చేస్తున్నాం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *