దెయ్యం పట్టిన భార్య_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

అందుకు మల్లికాఆమె పేరు సీత మహాలక్ష్మి ఆమెకి ఒక అందమైన కుమార్తె ఉంది ఆమె పేరు మల్లిక మల్లిక అంటే మహాలక్ష్మికి చాలా ఇష్టం. తండ్రి లేని కారణంగా మహాలక్ష్మే చాలా కష్టపడి పని చేసి ఆమెను పెంచి పోషించి పెద్దదాన్ని చేస్తోంది. అనుకోకుండా ఒక రోజు మహాలక్ష్మి జబ్బు చేసి మంచాన పడి ఉంటుంది. ఆ సమయంలో మహాలక్ష్మి మల్లిక తో….. ఏడుస్తూ…. అమ్మ నాకు అర్థం అయింది ఇంక నేను బ్రతుకుతాను అన్నట్టుగా నాకు ఏం కనిపించలేదు. కానీ నాది ఒకటే బాధ నీ పెళ్లి చూడకుండా చనిపోతున్నా అనే ఒక బాధ మిగిలిపోయింది అమ్మ . నా చివరి కోరిక తీర్చు తల్లి. ఏడుస్తూ…. ఏంటమ్మా ఆ మాటలు నువ్వు అలా అంటుంటే నాకు ఏడుపొస్తుంది. దయచేసి అలా మాట్లాడు కమ్మ.
తల్లి…. నిజమే కదా అమ్మ ఈ లోకంలో ఎవరికి ఎవరు శాశ్వతం కాదు నీ పెళ్లి ముచ్చట ఒక్కటి తీరింది అంటే నా ఆత్మకు శాంతి కలుగుతుంది .ఇప్పటికిప్పుడు పెళ్ళంటే చాలా హడావిడి ఉంటుంది ఆ విషయం నాకు తెలుసు. కానీ ఏం చేస్తాం నిన్ను ఎవరో ఒక అయ్య చేతిలో పెట్టాల్సిందే గా. అదేదో తెలిసిన వాళ్లకి ఇస్తే నాకు కొంచెం మనశ్శాంతి గా ఉంటుంది. రవి బావ ని పెళ్లి చేసుకుంటా అమ్మ.
అందుకు మల్లికా… సరే అమ్మ నేను బావ ని పెళ్లి చేసుకుంటాను. అని అంటుంది వెంటనే తన మేనల్లుడైన రవి కి ఉత్తరం రాసి కబురు పంపబడుతుంది. ఆ ఉత్తరం చదివిన అతను వెంటనే తన ఊరు నుంచి బయలుదేరి వాళ్ళ దగ్గరకు చేరుకుంటాడు. అక్కడ పరిస్థితి అంతా గమనించి పెళ్లికి సరే అని ఒప్పుకుంటాడు ఆ మరుసటి రోజే పెళ్లి కూడా జరిగిపోయింది. ఆ రోజు నుంచి రవి కూడా వాళ్ళతో పాటే కలిసి ఉంటాడు.నిజానికి మహాలక్ష్మి చేసిన పెద్ద తప్పు ఏంటంటే అతడు ఎలాంటి వాడో తెలుసుకోవాలనుందా అయినవాడు అని చెప్పి పెళ్లి చేయడమే. రవి అసలు మంచివాడు కాదు తాగుడు జూదం అలవాటు కలవాడు. రోజు రాత్రి సమయంలో ఇంటికి తాగి వచ్చి మల్లిక తో….. ఏమే ఏం కూర చేసినవ్. నాకు తెలిసే నువ్వు ఏం కూర చేశావు పప్పు బెండకాయ ఇవేగా నీకు ఎన్ని సార్లు చెప్పాను మాంసం కావాలి అని.
మల్లికా…. రోజు మాంసం అంటే ఎలా అండి మీరు ఏ పని చేయకుండా ఇలా తాగితే మనకు డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి.
రవి…. నాకే ఎదురు సమాధానం చెప్తావా. అంటూ ఆమెను ఇష్టమొచ్చినట్టుగా కొడుతూ ఉంటాడు. ఆ గొడవ చూసి మంచాన ఉన్నా సీతామహాలక్ష్మి….. అయ్యో నా బంగారు తల్లి తెలిసి తెలిసి ఒక ఒక నరా రూప రాక్షసుడికి నీకు ఇచ్చి పెళ్లి చేశాను. అన్యాయంగా నీ గొంతు చేతులారా నేను కోశా ను నన్ను క్షమించమ్మా. అంటూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది.
మల్లికా…. ఊరుకో అమ్మ నా రాత దేవుడిగా రాసి పెడితే ఎవరు ఏం చేస్తారు. అని ఆమె కూడా బాధపడుతుంది రవి వాళ్ళ మాటలు విని కోపంగా అక్కడనుంచి వెళ్ళి పోతాడు. రోజులు గడిచాయి కానీ రవి లో మాత్రం ఏ మార్పూ రాలేదు. అలా ఉండగా
ఆ రోజు రాత్రి మహాలక్ష్మి … హు హూ హు అని దగ్గుతూ…. అమ్మ అమ్మ దాహం మల్లిక దాహం . అంటూ పెద్దగా అరుస్తుంది మల్లిక ఆ మాటలు విని తన తల్లి కి నీళ్ళు తీసుకెళ్లి ఇస్తుంది. వాటిని తాగి ఎంతో ఆయాసపడుతూ….. అమ్మ మల్లిక ఇంక నా పని అయిపోయింది నేను ఇంకా వెళ్లి వస్తాను ఆ దేవుడు నన్ను పిలుస్తున్నాడు. నువ్వు జాగ్రత్త తల్లి నువ్వు జాగ్రత్త అంటూ ఆమె కన్నుమూసింది. మల్లికకు ఉన్న ఒక్కగానొక్క తోడు కూడా ఇంకా లేదు.
ఆ రోజు రాత్రి సమయం రవి మళ్ళీ తాగి వచ్చి…. ఏమి మీ అమ్మ సచ్చింది గా ఇంకా ఏడుస్తూనే ఉన్నావ్ ఏంటి. లే లేచి అన్నం పెట్టా. అని కోపంగా అంటాడు మల్లికా చాలా ఏడుస్తూ అతనికి భోజనం వడ్డిస్తుంది.
రవి దాన్ని తింటూ….. చి చి దీనిని ఎవరైనా అన్నం అంటారా. అంటూ ఆ ప్లేట్ ను విసిరికొట్టి. ఆమెని చితకబాదాడు.
పాపం మల్లిక ఏడుస్తూ అక్కడే ఉండిపోతుంది.
కొంత సమయం తర్వాత రవి అక్కడికి వచ్చి… ఆమెతో….. ఏమే నాకు డబ్బులు కావాలి డబ్బులు ఇవ్వు.
మల్లికా ఏడుస్తూ…. డబ్బా డబ్బు ఎక్కడ ఉంది మీరు సంపాదించారా నా దగ్గర ఇలాంటి డబ్బు లేదు. అని అంటుంది ఆ మాటలకి రవి కి కోపం వచ్చి ఆమె ఇష్టం వచ్చినట్టుగా కొట్టి…. నీ మెడలో తాళిబొట్టు ఉందిగా ఆ ఒక్కటి చాలు అంటూ ఆ మెడలో ఉన్న గొలుసు ని తీసుకొని అక్కడనుంచి వెళ్ళి పోతాడు. అప్పుడు మల్లికా ఏడుస్తూ తన తల్లి ఫోటో ముందు నిలబడి….. అమ్మ చూసావా అమ్మ కనీసం నా మెడలో ఉన్న తాళిబొట్టు ని కూడా వదిలి పెట్టలే దు ఆ రాక్షసుడు. నేను ఏం చేయమంటావ్ అమ్మ. నీకు ఒకటి చెప్పాలి ఇప్పుడు నేను గర్భవతిని . కానీ తల్లి అవుతుం న న న్న సంతోషం నాకు లేదు. ఎందుకంటే నా భర్త ఒక తాగుబోతు. రేపు బిడ్డలు పుడితే వాడిని కూడా ఇలాగే వేధించుకొని తింటాడు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నేను కూడా నీ దగ్గరకు వచ్చేస్తా నమ్మ. అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ సృహ తప్పి కింద పడిపోయింది.
ఆ సమయంలో ఆ బాధను అంత చూస్తున్న తన తల్లి దయ్యంగా మారి అక్కడకు వచ్చి ఆమెను తన ఒడిలో పడుకోబెట్టుకుని….. అయ్యో నా బిడ్డ అన్యాయంగా నాకోసం పెళ్లి చేసుకుని ఇప్పుడు బలైపోతుంది అంటున్నావా తల్లి. వద్దమ్మ నేను కాపాడుకుంటాను. ఇకనుంచి నేను మీ శరీరంలో ఉండి ఆ దెబ్బలన్ని నేను తింటాను. అని అనుకొని ఆమె శరీరంలోకి ప్రవేశిస్తుంది.
ఆ మరుసటిరోజు రవి ఇంటికి వస్తాడు.
మల్లిక అతన్ని చూస్తూ ఏం మాట్లాడకుండా ఉంటుంది. రవి…. ఏంటే దయ్యం లాగా అలా చూస్తున్నావ్. మొగుడు ఇంటికి వస్తే తిండి తిన్నావా లేదా అని అడగవా. మొగుడంటే రానురాను లెక్క లేకుండా పోతుంది. ఇంట్లో ఉండి ఉండి ఏ పని చేయకుండా పొట్ట బాగా పెంచుతున్నావు. అంటూ మళ్లీ అతను ఆమె నీ కొడతాడు. కానీ ఆమె లోపల ఉంది తన తల్లి ఆత్మ ఆ తల్లి మల్లికకు ఏమిటి దెబ్బలు తగలకుండా కాపాడుతూ ఉంటుంది. ఆమె ను కొట్టిన ఆ తర్వాత రవి భోజనం చేసి అక్కడినుంచి కోపంగా వెళ్ళిపోతాడు.ఆ తర్వాత మళ్లీ క శరీరంలో ఉన్న తన తల్లి ఆత్మ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత
పాపం మల్లిక అలా ఒంటరిగా కూర్చొని చాలా బాధ పడుతూ ఉంటుంది.
అప్పుడు ఆమె దెయ్యం తల్లి…. అయ్యో భగవంతుడా ఈ రాక్షసుడు నా కూతురు గర్భవతి అని తెలియకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఆమె నీ చిత్రహింసలు పెడుతున్నాడు. ఏ ఆడపిల్లయినా నేను తల్లి కాబోతున్న అని తన భర్త కి చెప్పుకుంటుంది. కానీ ఆ అవకాశం ఆ బిడ్డకు లేదు నేను ఇలాగే వదిలేస్తే వాడు ఇంకా రెచ్చిపోతారు. ఈరోజు ఎలాగైనా వాడి పని చెప్తాను .వారిలో మార్పు తీసుకొస్తాను అని అనుకొని రవి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది ఇంతలో రవి అక్కడికి వచ్చి ఏం మాట్లాడకుండా ఉత్తి పుణ్యానికి మల్లిక పై చేయి చేసుకుంటాడు..
అప్పుడు దెయ్యం తల్లి అక్కడ ప్రత్యక్షమై…. ఏరా నా కూతుర్ని చిత్రహింసలు పెడుతుంది సరిపోవటం లేదా. ఇప్పుడు ఆమె గర్భవతి రా. గర్భవతిగా ఉన్న పిల్లల్ని చిత్రహింసలు పెడుతున్నావు నువ్వు మనిషివి కాదు నీ పని చెప్తాను అని ఆ గర్భాన్ని అతనికి వచ్చేలాగా చేస్తుంది. అప్పుడు అతను ఆ బరువును మోయలేక….. అమ్మ అయ్యా ఏంటిది ఎవరు నువ్వు.
దెయ్యం….. నేను ఎవరా మీ అత్తని నా కూతుర్ని హింస పెట్టిన పాపానికి నీకు ఇచ్చే బహుమతి. అని అంటుంది అది అంత చూస్తున్న మల్లిక ఆశ్చర్యంతో నిలబడి ఉంటుంది. అప్పుడు ఆ దెయ్యం తల్లి…. మల్లిక ఇప్పుడు ఏం పర్వాలేదు అతని నువ్వు కొట్టు. మల్లికా…. వద్దమ్మ నేను నా భర్త ని కొట్టలేని నన్ను క్షమించు. అప్పుడు తల్లి… నువ్వు కొట్టుకుపోతే నేనే కొడతాను అంటూ అతన్ని ఇష్టమొచ్చినట్టుగా కొడుతుంది.
ఆ దెబ్బలకి రవి కొయ్య మొర్రో అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తాడు. అప్పుడు మల్లికా అడ్డుపడి…. అమ్మ నీకు చేతులెత్తి దండం పెడతాను నా భర్తను కొట్టొద్దు. నీకు పుణ్యం ఉంటుంది అంటూ కన్నీరు విడుస్తుంది.
అప్పుడు రవి మల్లిక ఆమెపై చూపిస్తున్న ప్రేమకు ఆశ్చర్యపోయి… అయ్యో నన్ను క్షమించు మల్లిక నేను నిన్ను ఎంత హింసించినా. నువ్వు మాత్రం నన్ను కాపాడడానికి వచ్చావు నీ కాళ్లు మొక్కిన తప్పేం లేదు అంటూ ఆమె కాళ్లపై పడ్డ బోతుండగా.
…..తప్పండి అలా చేయొద్దు నేను నీ భార్యని
నా పై పూర్తి అధికారం మీకు ఉంటుంది కానీ మీరు కూడా కొన్ని విషయాలు అర్థం చేసుకుంటే బాగుండేది. అని ఏడుస్తుంది.
ఆ మాటలకి రవి కూడా తప్పంతా నాదే మీ అమ్మ నాకు సరిగ్గా బుద్ధి చెప్పింది నువ్వు నాకు గర్భవతిగా అని తెలియదు అయినప్పటికీ నేను కొడుతున్న దెబ్బలకి ఎలా తట్టుకున్నా వో నేనే తట్టుకోలేక పోయాను . నిజంగా నువ్వు నన్ను క్షమించాలి సిందే. ఆడవాళ్లకి సహనం ఎక్కువ అంటూ ఉంటే నేను నమ్మలేదు. కానీ నిన్ను చూస్తుంటే అది నిజం అనిపిస్తుంది. నువ్వు నిజంగా దేవతవి మల్లిక. నేను నేను నిన్నే కాదు ఆడ జాతి మొత్తాన్ని అవమానించినట్టే. గర్భంతో ఉన్న నిన్ను ఎన్నో మాటలని చిత్రహింసలు పెట్టి కొట్టాను. ఇంకెప్పుడూ ఇలా జరగదు మన పుట్టబోయే బిడ్డ పై ఒట్టేసి చెబుతున్నాను. అంటూ కంటతడి పెట్టుకుంటాడు. అతనిలో మార్పు చూసిన దెయ్యం…..ఈ మార్పు కోసం ఎదురు చూస్తున్నాను మీరు ఇలాగే కలకాలం చిలకాగోరింకల్లా గా ఉండండి. నేను బ్రతికి ఉండి మీకు ఏం చేయలేక పోయాను. కనీసం చచ్చిన తర్వాత ఇలాగ దయ్యంగా మారి. మీ ఇద్దరిని ఒకటి చేశాను. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నా ఆత్మ శాంతి గా ఉంటుంది. నేను కోరుకున్నది ఇప్పటికి నెరవేరింది ఇక ఇది చాలు. రవి నీలో మళ్ళీ ఏదైనా చెడు మార్పు వస్తే నేను తప్పకుండా మళ్ళీ వస్తాను జాగ్రత్త అంటూ అతనికి ఇచ్చిన గర్భాన్ని తిరిగి మళ్లీ ఎందుకు ఇచ్చి. నేను వెళ్లి వస్తాను తల్లి వెళ్లి వస్తాను రవి అంటూ అక్కడి నుంచి మాయమైపోతుంది ఇక ఆరోజు నుంచి రవి పూర్తిగా మారిపోయి మళ్లీ క ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *