దెయ్యం ప్రాంక్ Deyyam Prank | Telugu Kathalu | Telugu Stories | Ghost Stories Telugu | Moral Stories

శోభ ప్రతి రోజు బడి నుంచి ఇంటికి వచ్చినప్పుడు తన స్నేహితులతో ఆడుకుంటూ ఉంటుంది. అయితే ఆమెకు ఇది తనం ఉండేవి. దాని కారణంగా తన స్నేహితులు ఆమెను ఆటపట్టిస్తూ ఉంటారు. ఒక రోజు రాత్రి తన స్నేహితుడు రాము దెయ్యం వేషం వేసుకుని sobha నీ భయపెట్టాలని అనుకుంటాడు. అతను అనుకున్నట్టుగానే అతను దెయ్యం వేషం వేసుకొని శోభ వెళ్తుండగా వెనకనుంచి….. ఏయ్ శోభ వెనక్కి తిరిగి చూడు.
నేను నీ స్నేహితుడిని వచ్చాను. అని అంటాడు వెంటనే శోభ వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ దెయ్యాన్ని చూసి భయపడుతూ….. అమ్మ దెయ్యం అమ్మ దెయ్యం కాపాడండి నన్నేం చెయ్యొద్దు. నన్నేం చెయ్యొద్దు అంటూ కేకలు వేస్తూ అక్కడి నుంచి పరుగులు తీస్తోంది. దెయ్యం కూడా నిన్ను చంపేస్తాను. నిన్ను వదిలిపెట్టను అంటూ పరుగులు తీస్తాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత రాము త న దెయ్యం మూసుగుని తొలగించి. పెద్దగా నవ్వుతూ….హా హా హా హా శోభ నేను నీ స్నేహితుడు రాముని. నిన్ను భయపెట్టాలని నేను ఇలా చేశాను . అని అంటాడు శోభ ఏడుస్తూ… నేను ఎంత బాధ పడ్డానో తెలుసా నాకు చాలా భయం వేసింది.
అంటూ ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతుంది. శోభ ఇంటికి వెళ్లి తన తల్లితో….. అమ్మ నన్ను రాము భయపెట్టాడు అంటూ జరిగిన విషయమంతా చెబుతుంది. అప్పుడు తన తల్లి…… చూడు శోభా నువ్వు ఇలా ప్రతి చిన్నదానికి భయపడుతూ ఉన్నావు అంటే నీ స్నేహితులే కాదు ఈ సమాజం కూడా నిన్ను చిలకల గా చూస్తుంది. నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా నిలబడతారో అప్పుడు ఎవరూ కూడా నీ జోలికి రారు. అతి భయం ఎందుకు వస్తుంది మీలో ఆత్మవిశ్వాసం లేనప్పుడే భయం వేస్తుంది. నీకంటే గొప్ప వాళ్ళు లేరు అని గర్వంగా నువ్వు ఎప్పుడైతే అనుకున్నది అనుకున్నట్టు సాధిస్తావ్ ఓ అప్పుడు నిన్ను ఎవరూ కూడా ఏమీ చేయలేరు ఏ భయం మీ దగ్గరికి రాదు.
అని ఎంతగానో ధైర్యం చెబుతుంది. శోభ సరే
కొన్ని రోజులు తన స్నేహితుల దగ్గర కానీ ఎక్కడికీ వెళ్లదు. ఆమె దీనిని చూసే భయపడుతోందో దాని దగ్గరికే పదేపదే వెళ్తుంది. ఆ భయాన్ని పోగొట్టుకుంటుంది. ఆమెకు నిప్పు అంటే భయం అని ఇప్పుడు దగ్గరికి వెళుతుంది. ఆమెకు బల్లి కుక్క అంటే భయం వాటిని. చూస్తూ ఉంటుంది. కుక్క ని దగ్గరకు తీసుకుంటుంది. అలా ఆమె భయపడే వాటికి పూర్తిగా భయపడ్డం మానేస్తుంది.
ఆమెలో ఎంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
ఇక తన మనసులో .. …. ఇప్పుడు నన్ను ఎవరూ కూడా బయట పెట్టలేరు. నన్ను తమాషా చేసాడు కదా రాము ఇప్పుడు నేను తమాషా అంటే ఎలా ఉంటుందో అతనికి చూపిస్తాను.
అని అనుకుంటుంది. అనుకున్నట్టుగానే తన స్నేహితుడి దగ్గరకు వెళ్ళు…. రాము ఎలా ఉన్నావ్. అని. అడుగుతుంది అందుకు అతను….. నేను బాగానే ఉన్నాను నువ్వు ఏంటి. మొన్న దెయ్యం వేషం వేసిన అందుకే ఎన్ని రోజులు బయటకు రాలేదు జ్వరం తగ్గిందా. అలా భయపడే వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు. అన్నీ నవ్వుతూనే ఒక బల్లి బొమ్మని తీసుకువచ్చి ఆమె మీద వేశాడు.
ఆమె ఏ మాత్రం భయపడకుండా దాన్ని తీసి అతని మీద వేసింది దానిని చూసి అతను చాలా ఆశ్చర్యపోతడు. ఆమె పెద్దగా నవ్వుతూ…హా హా హా ఏంట్రా అలా చూస్తున్నావు. భయపడుతున్నావా భయం వేస్తుందా అంటూ పెద్ద నాలుకని బయటకి పెడుతుంది దాన్ని చూసి అతను చాల భయపడి పోతాడు అమ్మో దయ్యం. అంటూ అక్కడి నుంచి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు ఆమె వెంటనే అతన్ని పట్టుకుని….. ఎక్కడికి పోతావు రా . ఎన్ని రోజులు
శోభన భయపెట్టి ఆమె దగ్గర తీసుకున్నది నే పదార్థాలన్నీ ఈరోజు నువ్వు నాకు బహుమతిగా ఇవ్వాలి. అందుకు రాము….. ఏంటి నువ్వు రెండు విధాలుగా మాట్లాడుతున్నావు అసలు నువ్వు ఎవరు.
శోభ పెద్దగా నవ్వుతూ……హా హా హా నేను శోభ శరీరంలో ఉన్న దెయ్యాన్ని. శోభ కి సహాయం చేయడానికి వచ్చాను. అని ఆ మాటలు వినగానే మరింత భయపడి పోతాడు రాము.
వెంటనే అతని బ్యాగ్ లో ఉన్న అన్ని ఆహార పదార్థాలన్నింటినీ ఆమె ముందు ఉంచుతాడు.
ఆమె పెద్ద నాలుకతో మొత్తం వాటిని తినేస్తుంది.
దాన్ని చూసి కంగారు పడిపోయి రాము….. నన్ను వదిలిపెట్టి ఇంక నేను వెళ్తాను. అందుకు ఆమె….
వెళ్ళు ఇక రోజు నువ్వు నేను ఏం చెప్పినా చేయాలి. అని అంటుంది అందుకు అతను సరే అంటాడు.
అక్కడనుంచి వెళ్ళి పోతాడు. అతను వెళ్లిపోయిన తర్వాత శోభ….. నవ్వుకుంటూ హా హా హా
ఇప్పుడు దారిలోకి వచ్చావు. అని అనుకోని అక్కడి నుంచి వెళ్లి పోతుంది ప్రతిరోజు కూడా
అతను ఆమె దగ్గరికి వస్తాడు తాను తీసుకొచ్చిన అన్నిటినీ ఆమె పొడవాటి నాలికతో మొత్తం తినేస్తూ ఉంటుంది. దాన్ని చూసి రాము చాలా భయపడిపోతూ ఉండేవాడు.
శోభ….. నాకు మనిషి రక్తం తాగాలని ఉంది. అని అతనితో అంటుంది ఆ మాట వినగానే రాము గజగజ వణికి పోతాడు.
రాము….. మనిషి రక్తం ఎక్కడ దొరుకుతుంది అయినా మనిషిని చంపడం పాపం.
శోభ….హా హా హా పాపం నీకేమో చనిపోయిన నాకు కాదు ఎవరో రక్తం ఎందుకు తాగుతాను నీ రక్తమే తాగుతాను. నువ్వు తీసుకొచ్చిన అన్ని పదార్థాలు రోజు నేను తింటున్నాను కదా. అవి చాల రుచి గా ఉంటున్నాయి అంటే ప్రతి రోజు వాడిని నువ్వు కూడా తింటూనే ఉన్నావు కదా. అంటే నీ రక్తం మరింత రుచిగా ఉంటుందని నాకు బాగా తెలుసు.
నిన్ను ఈరోజు వదిలిపెట్టను నీ రక్తం తాగేస్తాను.
అని అంటుంది అందుకు అతను …. వద్దు వద్దు నన్నేం చెయ్యొద్దు నన్ను చంపేసి నీకు ఇవన్ని రోజు ఎవరు ఇస్తారు. వద్దు నన్ను చంపొద్దు.
శోభ…. నువ్వు కాకపోతే నాకు ఇచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. నీ రక్తం తాగిన తర్వాత వాళ్ల అంతు చూస్తాను. అంటూ పెద్దగా నవ్వుతూ
అతన్ని గట్టిగా పట్టుకుంటుంది అతను ఆమె నుంచి విడిపించుకుని. అక్కడి నుంచి పరుగులు తీస్తాడు ఆమె కూడా పరుగులు తీసి అతన్ని పట్టుకుంటుంది.
అతని పట్టుకొని అతని గొంతు కొరికుతున్నట్టుగా నటిస్తూ….హా హా హా అని నవ్వుతూ….. రాము ఇంకా భయపడింది చాలు కానీ. ఇంకెప్పుడు ఇలా భయపడకు నేను నీ స్నేహితురాలు శోభనే అంటూ తన నకిలీ నాలుకను బయట పడేస్తుంది.
దాన్ని చూసి అతను….. అమ్మో శోభ ఇదంతా నాటకమా నాకు చాలా భయం వేసింది తెలుసా.
నన్ను ఎక్కడ చంపేస్తావో అని నాకు ఎంత భయం వేసిందో. ఏదేమైనా ప్రతి చిన్న దానికి భయపడి నువ్వు . ఇదంతా ఎలా చేశావు.
అప్పుడు శోభ….. నువ్వు నన్ను దెయ్యం వేషంలో భయ పెట్టావు కదా ఆ రోజు నేను మా అమ్మతో చెప్పాను మా అమ్మ నాకు ఎన్నో విషయాలను చెప్పింది. అప్పటినుంచి నేను చిన్న విషయానికి భయపడకుండా అన్నిటినీ చూస్తూ. వచ్చాను అందుకే కొన్ని రోజులు అందరికీ దూరంగా ఉన్నాను.
ఇక నీకు బుద్ధి చెప్పాలి అని చెప్పి ఇక్కడికి వచ్చాను. ఎలా ఉంది నేను చేసిన దెయ్యం ప్రాంక్.
అందుకు అతను….. అమ్మో నిజంగా చాలా బాగుంది. ఇన్ని రోజులు నిజంగానే నీకు దెయ్యం పట్టింది అని అనుకున్నాను. ఇప్పుడు నిజం తెలిసిన తర్వాత చాలా నవ్వొస్తుంది. నేను కూడా నీలాగే అన్నిట్లోనూ ధైర్యం తెచ్చుకుంటాను. మన స్నేహితులతో కూడా ప్రతి దానికి భయపడే వాళ్ళకి మనం ధైర్యంగా ఎలా ఉండాలో నేర్పిద్దాం.
అందుకు ఆమె….. తప్పకుండా అలాగే చేద్దాం.
అని అంటుంది. అలా ఒక దెయ్యం ప్రాంక్ తో వాళ్లలో భయాల అన్ని తొలగిపోయి ధైర్యం పొందుతారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *