దెయ్యం సవతి తల్లి ప్రేమ deyyam savathi thalli |Telugu Kathalu |Telugu Stories | Telugu Moral Stories

శోభ తన సవతి తల్లి శారద తో కలిసి నివసిస్తూ ఉండేది. బేబీ తండ్రి శంకర్ శారదా నోటి దురుసు కి భయపడి. ఆమెకు ఎదురు మాట్లాడేవాడు కాదు. అలా రోజులు గడిచాయి.
ఇంట్లో శోభ పని మొత్తం చేస్తూ ఉండేది. ఆమె ఆ పని చేయలేక ఎంతగానో బాధ పడుతూ ఉండేది. దాన్ని చూసిన శంకర్ …. ఒసేయ్ శారదా నువ్వు మారవా నువ్వు మనిషివి కాదే . పశువు వి ఆ పశువు కైనా జాలిగుణం ఉంటుంది. కానీ నీకు మాత్రం జాలి గుణం లేదు. నువ్వు ఒక పెద్ద గయ్యాలి వి బండ వి అనే ఇష్టమొచ్చినట్టుగా. ఆమెను తిడితే ఉంటాడు ఆమె కూడా అతనికి సమాధానం చెబుతూ పెద్ద పెద్ద గా అతని పైన అరుస్తూ కేకలు వేస్తోంది ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. రోజులు గడిచాయి అతను గోల భరించలేక ఇల్లు వదిలి పెట్టి వెళ్లి పోతాడు. ఇక పాపా అక్కడి నుంచి ఐదువేల లేక ఆమె దగ్గరే ఉండి చెప్పింది పనులు చేస్తూ తన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది.
సరిగ్గా ఐదు నెలల్లో గడిచిపోతాయి శారద…. ఇక మీ నాన్న నా దగ్గరికి రాడు నువ్వు నాకు అడ్డం ఎందుకు.
మీ నాన్ని పెళ్లి చేసుకొని నేను సుఖపడింది ఏమీ లేదు. కాబట్టి నేను నాకు ఇష్టం వచ్చిన వాడి పెళ్లి చేసుకోవచ్చు. నీకు నా అడ్డం ఉండకూడదు.
నాకు నీ అడ్డం ఉండకూడదు. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా. లేక నేనే బలవంతంగా పంపించినా.
ఆ మాట వినగానే శోభా చాలా భయంతో ఏడుస్తు…. పిన్ని నేను బయటికి ఎక్కడికి వెళ్ళగలను. దయచేసి నన్ను బయటకు పంపించకు. మీకు పుణ్యం ఉంటుంది పిన్ని నిన్ను మీ ఇంట్లో పనిమనిషి అయినా ఉంటారు ఒక్క ముద్ద అన్నం పెట్టు చాలు.
అంటూ ఏడుస్తుంది ఆమె…. సరే అయితే పనిమనిషి కావాలి కదా. నువ్వైతే ఉండు. అనిచెప్పి లోపలికి వెళ్ళి పోతుంది రోజులు గడిచాయి. ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఇక ఆమె అతనితోపాటు. శోభని కూడా
తీసుకొని వేరే గ్రామానికి వెళ్లి పోతుంది.
అక్కడ గొడ్డు చాకిరీ చేస్తూ శోభ ఉంటుంది.
కానీ పెళ్లి చేసుకున్న వ్యక్తి మాత్రము….. శారదా నాకు ఈ పిల్లని ఈ మన ఇంట్లో ఉంచుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. చుట్టుపక్కల వాళ్ళు నానారకాలుగా అనుకుంటున్నారు. పైగా అంత చిన్న పిల్లల చేత పని చేయించడం కూడా మంచిది కాదు బయటికి పంపించు. అని అంటాడు అందుకు ఆమె ఏదో ఒకటి చెబుతూ వస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఆ భార్యాభర్తలిద్దరికీ గొడవలు జరుగుతూ ఉంటాయి.
ఇక శారద లాభం లేదు ఆమె అడ్డు తొలగించుకోవాలని అని చెప్పి. ఆమె కోసం ఇష్టమైన పరమాన్నం తయారు చేస్తుంది.
ఆమెకు ఒక గ్లాస్ లో ఉంచి అందులో విషము కలుపుతుంది . ఆ తరువాత పాపని పిలిచి…. శోభ నీకిష్టమని ప్రమమని చేశాను. దీన్ని తాగు కొంచెం కూడా వదిలి పెట్టకూడదు. అందుకు పాప సరే అంటుంది. క్లాస్ తీసుకుని పక్కకు వెళుతుంది . పాప తన మనసులో….. ఇంత పాయసం నేను తినలేను ఏమో అని వంటగదిలోకి వెళ్లి. అక్కడే ఉన్న పాయసం గిన్నెలో దీనిని కొంత భాగం కలిపేసి మిగిలింది. తినడానికి బయటకు తీసుకు వెళుతుండగా ఒక్కసారిగా చేయి జారి కింద పడిపోతుంది. వాళ్ల పిన్ని చూస్తుందన్న భయం తో
త్వరత్వరగా దానిని శుభ్రం చేసి బయటపడేస్తుంది.
ఇంతలో వాళ్ళ పిన్ని….. శోభ పాయసం తిన్నావా ఏంటి ఆ శబ్దం. అని అడుగుతుంది అందుకు పాప నేను తినేసాను పిన్ని అని అబద్ధం చెబుతుంది.
ఇక శారద వంటగదిలోకి వెళ్లి….. సరే ఇది ఎలాగో కాసేపట్లో చచ్చిపోతుంది. ఇప్పుడు నోరు తీపి చేసుకోవడం చాలా మంచిది. అని చెప్పి ఆ పాయసం తింటుంది అందులో విషం కలిపి ఉండడంతో
ఆమె ఒక్కసారిగా కింద పడిపోయి మరణిస్తుంది.
దాన్ని చూసిన పాప చాలా కంగారు పడుతూ….. కాపాడండి ఎవరైనా కాపాడండి మా అమ్మ కింద పడిపోయింది. దయచేసి కాపాడండి అంటూ కేకలు వేస్తోంది. చుట్టుపక్కల వాళ్లు ఆమెను హాస్పిటల్కి చేరుస్తారు. ఆమె మరణిస్తుంది.
ఆమె మరణంతో ఆమె రెండో భర్త చాలా కుంగిపోతాడు. ఇక పాప ని ఇంట్లో నుంచి బయటకు పంపించేశాడు. పాప చాలా బాధపడుతూ ఎటు వెళ్లాలో తెలియక తన గ్రామం నుంచి చేరుకుంటుంది అక్కడ తన ఇంటికి వెళ్తోంది. అక్కడ తండ్రిని చూసి చాలా ఆశ్చర్యపోతుంది. అతని పట్టుకొని ఏడుస్తూ… ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న ఎన్ని రోజులు అని చెప్పి అడుగుతుంది అందుకు అతను ఏడుస్తూ ఏం చేయమంటావ్ మీ పిన్ని బాధ తట్టుకోలేక వెళ్ళిపోయాను. మళ్లీ ఇక్కడికి తిరిగివస్తే జరిగిన విషయమంతా చెప్పారు నువ్వు ఎందుకు అమ్మ ఇక్కడికి వచ్చావు.
అప్పుడు పాప ఏడుస్తూ జరిగిన విషయమంతా చెబుతాడు ఆ విషయం వినగానే అతను చాల సంతోషపడుతూ…… పిచ్చిదానా అది నిన్ను చంపాలి అనుకుంది. భగవంతుడు అదే చచ్చి పోయేలాగా చేశాడు.
అంటూ సంతోష్ పడతాడు. ఇక అతను కూలి పని చేసుకొని పాపని బాగా చూసుకుంటూ ఉంటాడు కొన్ని రోజుల తర్వాత ఒకరోజు రాత్రి సమయం వాళ్ళిద్దరు నిద్రపోతుండగా ఒక దెయ్యం అక్కడ ప్రత్యక్షమవుతుంది. అది ఎవరో కాదు చనిపోయిన శారద ఆమె పాప దగ్గరకు వచ్చి….. ఒసేయ్ శోభ నీ వలనే నేను చనిపోయాను జరిగింది ఏంటో నాకు బాగా అర్థమైంది ఇప్పుడు నిన్ను చంపకుండా వదిలిపెట్టను. అని చెప్పి పాపను తీసుకుని బావి దగ్గరికి వెళ్లి ఆమెను కట్టివేసి….హా హా హా హా అని పెద్దగా నవ్వుతూ ఉంటుంది ఒక్కసారిగా పాప నిద్ర నుండి మేల్కొని నాకు భయంగా ఉంది. ఎవరు నువ్వు నన్ను కాపాడు ఈ దెయ్యం నన్ను బావిలో పడేస్తోంది కాపాడండి నాన్న. దయచేసి నన్ను కాపాడు నాన్న అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటుంది . ఆ అరుపులు విన్న తండ్రి బయటకు వస్తాడు ఇంతలో దయ్యం మాయమైపోతుంది.
పాప బావిలో పడి పోతుంది. వెంటనే తండ్రి ఆమెను బావి నుంచి బయటకు తీసుకు వస్తాడు.
పాప ఏడుస్తూ….. నాన్న ఒక దెయ్యం నన్ను ఇలాగే చేసింది. అని చెబుతుంది దానిని వెంటనే అతను భయపడి పోతాడు. ఖచ్చితంగా అది శారదా అని అనుకుంటాడు. ఆ రోజు నుంచి ఈ పాపను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు కానీ ప్రతిరోజు రాత్రి
అందరు నిద్ర పోయిన తర్వాత శారదా దెయ్యం రూపంలో వచ్చి…హా హా హా రావే నిన్ను నాతో పాటు తీసుకెళ్తాను. ఒసేయ్ రావే . నీ ప్రాణం తీస్తాను అంటూ ఆమె గొంతు పట్టుకుంటుంది.
పాప భయంతో ఏడుస్తూ ….. నాన్న నాన్న అని అంటుంది అతను నిద్ర లేచి…. శారదా చచ్చిన తర్వాత కూడా నా కూతుర్ని వదిలిపెట్టం లేదా. నా కూతురు నీకేమి అన్యాయం చేసింది.
దెయ్యం పెద్దగా నవ్వుతూ ….. ఏం చేసిందో నీకు తెలుసు నాకు తెలుసు . దానికి కూడా తెలుసు
తండ్రి….. ఒసేయ్ నీ పాపం పండింది కాబట్టి భగవంతుడు నువ్వు చచ్చిపోయాక చేశాడు.
మళ్లీ అది సరిపోదు అంటూ ఇక్కడికి వచ్చావా. దెయ్యం…. హ హ హ చంపేస్తాను. మీ ఇద్దరిని చంపేస్తాను. అంటూ వాళ్ళిద్దరి గొంతు పట్టుకుంటుంది. శంకర్ ఆమె నుంచి విడిపించుకొని వంటగదిలో ఉన్న. స్వామి యొక్క విభూతి తీసుకు వచ్చి దెయ్యం పై చల్లుతాడు.
ఆ భగవంతుని మహిమ తో ఆ విభూది అగ్నిగోళం గా మారి. ఆ దెయ్యాన్ని దహించివేస్తుంది.
దెయ్యం పెద్ద పెద్ద కేకలు వేస్తూ అగ్నిగుండంలో అంతమైపోతుంది.
ఆ తర్వాత వాళ్ళిద్దరు భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకొని. ఆ ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళి పోతారు. అక్కడ జరిగింది అంతా మర్చిపోయి సంతోషంగా వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *