దెయ్యానికి కడుపు చేసిన మనిషి_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

సుప్రియ పృథ్వి ఎంతో కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఒకరోజు సుప్రియ…. పృథ్వి నీకు ఒక విషయం చెప్పాలి మన ప్రియ విషయం మా ఇంట్లో తెలిసిపోయింది. ఇప్పుడే మనం ఎక్కడికైనా వెళ్లి పెళ్లి చేసుకోవాలి.

పృథ్వి….. ఇప్పటికి ఇప్పుడు అంటే ఎలా సుప్రియా నన్ను కొంచెం ఆలోచించుకో నువ్వు.
సుప్రియ…. అదంతా నాకు తెలియదు ఈరోజు మన పెళ్లి జరిగి పోవాల్సిందే.
అందుకే అతను బాగా ఆలోచించి సరే నేను నా స్నేహితుడికి కాల్ చేస్తాను. అని తన స్నేహితులైన సుమన్ కి కాల్ చేస్తాడు కానీ అతని ఫోన్ కలవడం తో…. సుప్రియ నువ్వు రెండు నిమిషాలు ఇక్కడ కూర్చో నేను మా మిత్రుని తీసుకొని వస్తాను. అని చెప్పి అతని దగ్గరికి వెళ్లి జరిగిన విషయం అంతా చెప్తాడు.
దాన్ని విని అతను…. ఏంట్రా నువ్వు అనేది మరి నాకు ఎన్ని రోజుల నుంచి విషయం చెప్పలేదు కనీస అమ్మాయి ఫోటో అన్న చూపిస్తావా లేదా. అంటాడు అందుకు అతను తన ఫోన్ లో ఆమె ఫోటో చూపిస్తాడు. ఆ ఫోటో చూసిన సుమన్ ఆశ్చర్యపోయి… రేయ్ ఏం మాట్లాడుతున్నావ్ రా ఆమె ఎవరో తెలుసా ఆమె నా చెల్లెలు చని పోయి సంవత్సరం పైనే అవుతుంది. ఆమె చనిపోయింది అన్న మాట వినగానే. పృథ్వి కి చాలా భయం వేసింది… అప్పుడు అతను సుప్రియ కి అతనికి మధ్య జరిగిన విషయాలను గుర్తు తెచ్చుకుంటాడు.
//ఒక రోజు రాత్రి పృథ్వి…. సుప్రియ చేస్తాడు. సుప్రియా ఫోన్ మాట్లాడుతూ…. పృథ్వి నాకు నిన్ను చూడాలని ఉంది వెంటనే ఊరి అవతల ఉన్న స్మశానం దగ్గరికి రా. అని అంటుంది పృథ్వి…. కానీ స్మశానం దగ్గరకు ఎందుకు సుప్రియ ఇంకొక ప్లేస్ ఏమీ దొరకలేదా.
సుప్రియ…. అదంతా తర్వాత చెప్తాను కానీ నువ్వు త్వరగా రా అని ఫోన్ కట్ చేస్తుంది.
సరే అని చెప్పి పృథ్వి అక్కడికి వెళ్తాడు స్మశానం లో పెద్ద పెద్ద అరుపులు శబ్దాలు వినపడుతున్నాయి.
పృథ్వి…. సుప్రియ నాకు చాలా భయంగా ఉంది ఆయన ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు.
సుప్రియ…. ఎందుకంత భయం చచ్చిపోతే నువ్వు కూడా ఎక్కడికి రావాలి కదా.
పృద్వి… అంటే దాని ఉద్దేశం.
సుప్రియ…. అరే ఏం లేదు మనం చనిపోతే అంటున్న. నేను ఇక్కడే ఉంటాను నాకు అసలు భయమే ఉండదు.
పృథ్వి.. నువ్వు ఇక్కడ ఉంటావా ఏంటి నువ్వు వింతగా మాట్లాడుతున్నావ్.
సుప్రియ… అయ్యో నీకు ఏం చెప్పేది అర్థం కావటం లేదు. మా ఇల్లు ఇక్కడే కదా దగ్గర్లోనే ఉంది. అందుకే ఇక్కడే ఉంటాను అని చెప్పాను కదా నీకు అంతా ఇక్కడ భయం భయంగా ఉంది అంటున్నావ్. అని చెప్పి ఇద్దరు అక్కడినుంచి వెళ్ళిపోతారు.
//అలా జరిగిన విషయం అంతా గుర్తు తెచ్చుకుంటాడు. అప్పుడు అతనికి సుమన్ చెప్పిన మాటలు నిజమే అని అనుకొని అతనితో స్మశానం లో జరిగిన విషయం కూడా చెప్తాడు.
సుమన్…. అరే నువ్వు వెంటనే నా మాట విని మీ ఊరి వెళ్ళిపోయి అక్కడ మీ మావయ్య కూతురు భాగ్యశ్రీ ని పెళ్లి చేసుకో. ఇక్కడే ఉంటే మా చెల్లెలు ఆత్మ నిన్ను ఏదో ఒకటి చేస్తుంది. ఆ మాటలు విని పృద్వి సరే ఇప్పుడే బయలుదేరుతాను అని చెప్పి తన ఊరికి వెళ్లి పోతాడు. కొన్ని రోజుల తర్వాత పృథ్వి తన మరదలు భాగ్యశ్రీ ని పెళ్లి చేసుకుంటాడు.
ఆ దెయ్యం అతన్ని వెతుక్కుంటూ సరిగ్గా వాళ్ళిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో వాళ్ళని చూసి…. పృథ్వి నేను నిన్ను ఎంత గాఢంగా ప్రేమించాను. నన్ను కాదని దీని పెళ్లి చేసుకుంటావు కదా. నాకు దక్కనిది నా చేతికి వచ్చే వరకు పోరాటం నా అలవాటు. నీతో మధురమైన క్షణాలు నేనే గడపాలి. అంటూ భాగ్యశ్రీ శరీరంలోకి ప్రవేశిస్తుంది. కొంత సమయం తర్వాత వాళ్ళు నిద్ర పోయిన తర్వాత ఆ దయ్యం ఆమె శరీరం నుంచి బయటికి వెళ్లి పోయింది. అలా రోజులు గడిచాయి భాగ్యశ్రీ ఒకరోజు వాంతులు చేసుకుంటూ కనిపిస్తుంది. దాన్ని చూసిన పృద్వి… ఏమైంది భాగ్య నీకు అంతా సరిగ్గానే ఉంది కదా.
భాగ్యశ్రీ…. లేదండి నాకు రెండు రోజుల నుంచి ఇలాగే వాంతులు అవుతున్నవి. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దామా. అని అంటుంది పృద్వి సరే అని చెప్పి ఆమెని డాక్టర్ దగ్గరికి తీసుకు వెళ్తాడు. అక్కడ ఆమె భాగ్య శ్రీ నీ పరీక్షించి…. కంగ్రాట్స్ మీరు తల్లి కాబోతున్నారు. అనే తియ్యని వార్త చెప్తుంది.
ఆ వార్త విని వాళ్లు చాలా సంతోషించి ఆమె కి థాంక్స్ చెప్పి అక్కడి నుంచి ఇంటికి వస్తారు ఆ రోజు రాత్రి సమయం వాళ్ళిద్దరు ఏకాంతంగా మాట్లాడుకుంటున్నప్పుడు. ఆ దయ్యం దాన్ని చూసి…. అది ఎలా సాధ్యం. రాత్రి సమయాల్లో అతనితో ఏకాంతంగా గడిపే ఉంది మీ శరీరంలో ఉన్న నేను. అప్పుడు ఆ గర్భం నాకే రావాలి. ఎందుకంటే నా భర్త నాకు మాత్రమే సొంతం మరి ఎవరికి కాదు. ఆ గర్భాన్ని నేను ఎలా పొందాలో నాకు తెలుసు. అంటూ ఆమె శరీరంలోకి ప్రవేశిస్తుంది. కొంత సమయానికి వాళ్ళిద్దరు నిద్ర పోయారు ఆ తర్వాత ఆ దెయ్యం ఆమె శరీరం నుంచి బయటకు వచ్చి ఆమె పొట్ట పై చేయి వేసుకొని… ఇప్పుడు నా బంగారు బిడ్డ నా కడుపులో పెరుగుతున్నాడు. మా ఇద్దరికి ప్రేమ గుర్తు వీడు. ఈ బిడ్డను నవమాసాలు మోసి నేనే కానీ నేనే పెంచుకుంటాను మా ఇద్దరి ప్రేమ గుర్తుగా చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. ఇక ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండదు. ఎవరు నన్ను ఏమి చేయలేరు. హా..హా..హా. అని అనుకుంటూ అక్కడినుంచి మాయమైపోతుంది. అలా ప్రతిరోజూ ఆ దెయ్యం వాళ్ళిద్దరు ఏకాంతంగా ఉన్న సమయాల్లో మాత్రమే ఆమె శరీరంలోకి ప్రవేశించి. తన భర్తతో మధురమైన క్షణాలను గడిపి. వాళ్లు నిద్రించిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటుంది. అలా రోజులు గడిచాయి భాగ్యశ్రీ గర్భవతి అన్న మాటే కానీ ఎన్ని నెలలు అయినా ఆమె పొట్ట భాగం పెరగకపోవడంతో. ఆమెకు అనుమానం వచ్చి…. ఏమండీ నేను గర్భందాల్చి చాలా నెలలు అవుతుంది. కానీ నా పొట్ట భాగం ఏమాత్రం పెరగలేదు. నాకెందుకో అనుమానంగా ఉంది మన బిడ్డ లోపల సరిగ్గా పెడుతున్నాడా లేదా అని. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దామా. అని అంటుంది అందుకు అతను సరే వెళ్దాం పద. అంటూ ఇద్దరూ కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్తారు.
అక్కడ భాగ్య శీనీ పరీక్షించిన ఆమె ఆశ్చర్యపోయి…. ఏంటి ఇలా జరిగింది మీరు మునుపట వచ్చినప్పుడు. ఈమె గర్భవతి కానీ ఇప్పుడు ఆ గర్భం లేదు ఏం జరిగింది. నువ్వు ఏమైనా బరువులెత్తడం కానీ . లేదా ఏమైనా మెడిసిన్ తీసుకున్నావా. అందుకు వాళ్లు లేదు అని చెప్తారు.
డాక్టర్….. కానీ నీ గర్భం ఎలా పోయిందో నాకు అర్థం కావటం లేదు.
అని అంటుంది ఆ మాటలు విన్న వాళ్ళిద్దరు ఎంతో బాధతో అక్కడి నుంచి ఇంటికి తిరిగి వస్తారు. పాపం ఆ రోజు నుంచి భాగ్యశ్రీ ఎంతో బాధపడుతూ ఉంటుంది. అసలు ఆమెకు ఏం జరిగిందో ఏమీ అర్థం కాదు. ఆ ల కొన్ని రోజులు గడిచాయి. భాగ్యశ్రీ దాని గురించి ఆలోచించడం తో ఆమెకు మనశ్శాంతి కలిగించడం కోసం. పృథ్వి ఆమెను ఒక పూజారి దగ్గరికి తీసుకువెళ్లి జరిగిన విషయమంతా చెప్తాడు. అప్పుడు ఆయన….. ఇప్పుడు బాబు నిన్ను ఒక దెయ్యం ఇష్టపడుతుంది ఆ దెయ్యమే ఇదంతా చేస్తుంది. ఆ మాటలు విన్న అతనికి చాలా భయం వేసింది అది ఇక్కడికి కూడా వచ్చిందని చాలా కంగారు పడిపోతాడు.
పృథ్వి…. పూజారి గారు మరి మా సమస్యకు పరిష్కారమేంటి నా నా భార్య గర్భంలో ఉన్న బిడ్డ ని అది దొంగిలించింది . మరి ఆ బిడ్డ సంగతి ఏంటి.
పూజారి….. మీరు కంగారు పడకుండా నేను చెప్పినట్టు చేయండి ఈరోజు రాత్రి సమయం . అది ఖచ్చితంగా మీ భార్య శరీరం లోకి వస్తుంది. ఆ సమయంలో ఆమెకు ఇష్టమైన వాళ్ళని ఆమె ముందు నుంచి ఆమెతో మాట్లాడించండి అప్పుడు ఖచ్చితంగా ఆమె మనసు కరిగి మీ బిడ్డను మీకు తిరిగి ఇస్తుంది.
అందుకు తను సరే అతని భార్యను తీసుకొని ఇంటికి వెళ్తాడు. అతను తన భార్యకి తన పట్టణం లో ఉన్నప్పుడు ఏం జరిగిందో మొత్తం
చెప్తాడు. దాన్ని విని ఆమె చాలా భయపడుతూ ఏడుస్తు….. ఏవండీ ఏదోవిధంగా నా బిడ్డని నాకు తీసుకురండి.
పృథ్వి నువ్వు ఏడవకు నేను ఉన్నా కదా. అంటూ తన స్నేహితుడికి కాల్ చేసి జరిగిన విషయం అంతా చెప్తాడు.
అతను వెంటనే నువ్వేమీ కంగారు పడకు రా నేను మా అమ్మ ఇద్దరూ ఈ రోజే నీ దగ్గరికి వస్తున్నాo అని చెప్పి సుమంత్ వాళ్ళ అమ్మ తో పాటు కలిసి పృద్వి ఇంటికి వస్తాడు.
ఆ రోజు రాత్రి సమయం పృథ్వి అతని భార్య ఏకాంతంగా ఉన్నప్పుడు ఆ దెయ్యం ఆమె శరీరంలో ప్రవేశించింది. అప్పుడు ఆమె కళ్ళను చూస్తాడు. ఆ కళ్ళు రెండు చాలా ఎర్రగా ఉంటాయి. అప్పుడు అతనికి అర్థమవుతుంది ఆమె శరీరంలోకి దయ్యం వచ్చిందని. వెంటనే అతడు…. సుమన్, అమ్మ వెంటనే రండి అని కేకలు వేస్తాడు అరుపులు విన్న వాళ్ళిద్దరూ అక్కడికి వస్తారు ఆ దెయ్యం వాళ్ళిద్దరు చూసి ఆమె శరీరం నుంచి బయటికి వస్తుంది.
అది అని చూసిన ఆ తల్లి…. అమ్మ సుప్రియ నేను అమ్మ మీ అమ్మని. అంటూ బోరున ఏడుస్తుంది.
ఆమె తల్లి చూసిన సుప్రియ కూడా అమ్మ అంటూ బోరున ఏడుస్తుంది.
అప్పుడు తన తల్లి….. ఏంటి సుప్రియ ఏంటమ్మా ఇది వాళ్లని ఎందుకు ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నావు. తప్పమ్మా వాళ్ళు బిడ్డను తిరిగి వాళ్ళకి ఇచ్చేయ్.
అప్పుడు ఆమె చాలా కోపంతో…. అమ్మ నేను ఈ బిడ్డను ఇవ్వను ఎందుకంటే నేను ఇప్పుడు దీన్ని చాలా ఇష్టపడుతున్నాను. పృద్వి అప్పుడప్పుడు మన ఇంటికి వచ్చేవాడు కదా.
అప్పుడే అతన్ని చూసి చాలా ఇష్టపడ్డాను. నా ప్రేమ విషయం ఎలాగైనా చెప్పాలనుకున్నాను. అది చెప్పేలోపే నేను యాక్సిడెంట్లో చనిపోయాను. నా ప్రేమను గెలుచుకోవడం కోసమే నేను ఇలా దెయ్యంలా గా మారి ఇతని దగ్గరికి వచ్చాను. నేను పొందాలనుకున్న మధుర క్షణాలు అన్ని ఇదిగో ఈ అమ్మాయి ఎలా తీసుకోవాలి అనుకుంటుంది. అందుకే ఇలా చేశాను.
తల్లి….. నువ్వు చేస్తుంది సృష్టికి విరుద్ధంగా తల్లి. నీకు నిజంగా ప్రేమ ఉంటే నువ్వు ఇలా చెయ్యవు. ప్రేమించిన మనిషి ని ఎప్పుడు బాధ పెట్టవు. నీ వల్ల భార్య భర్తలు ఎంత ఇబ్బంది పడుతున్నారోచూడు. ఒక మనిషి చనిపోయిన తరువాత దెయ్యం గా మారి లేదా ఆత్మ గా మారి బతికి ఉన్న మనిషిని పొందాలనుకోవడం చాలా పెద్ద తప్పు. మీ ఇద్దరికీ దేవుడు రాసి పెట్టలేదు కాబట్టి ఇలా జరిగింది. అంతా మంచిగా ఉంటే మీరు ఇద్దరు పెళ్లి చేసుకునే వాళ్ళు కదా. ఒకసారి ఆలోచించూ.
దెయ్యం….. లేదమ్మా నువ్వు ఎన్నిసార్లు చెప్పినా సరే.నేను మాత్రం నీ బిడ్డని తిరిగి ఇవ్వను నీ బిడ్డని అపురూపంగా నేనే పెంచుకుంటాను నా ప్రేమకు గుర్తుగా పెంచుకుంటాను. నేను దయ్యంగా మారి అతని దగ్గరికి వచ్చి ఎంత ప్రేమను అతనికి పంచా నో అడగండి.
పృథ్వి….సుప్రియ నువ్వు అన్నది నిజమే కానీ అప్పుడు నువ్వు నాకు దెయ్యానివి అన్న విషయం తెలియదు. తెలుసుకున్న తర్వాత నేను దూరంగా వచ్చేశాను. అసలు నువ్వు నా స్నేహితుడి చెల్లెలి అని నాకు మీ అన్నయ్య చెప్పిన దాకా తెలియదు. మీ అన్నయ్య నాకు కేవలం ఒక సంవత్సరం నుంచి మాత్రం తెలుసు కానీ నేను ఎప్పుడు నిన్ను చూడలేదు. మీ అన్నయ్య నాకు ఒక చెల్లి ఉందన్న విషయం చెప్పాడు కానీ. అది నువ్వే అని తర్వాత తెలిసింది. అందులో నా తప్పేమీ లేదు నువ్వు నిజంగా ఒక మనిషివని అని చెప్పి నేను ప్రేమించాను.
దెయ్యం….. అయినా సరే నేను మాత్రం ఈ బిడ్డని ఎవ్వరికీ ఇవ్వను. ఈ బిడ్డ నా సొంతం నా బిడ్డగానే పెరగాలి.
అప్పుడు తన తల్లి…..సుప్రియ చూడు ఆ బిడ్డను వాళ్లకి తిరిగి ఇవ్వకపోతే నేను ఇక్కడే చనిపోతాను. నాతోపాటు మీ అన్నయ్య నువ్వు ప్రేమిస్తున్నా వే అతను ఆ అమ్మాయి అందరం చనిపోతాం. అప్పుడు మా చావులు చూసి నువ్వు సంతోషంగా ఉండు కానీ. అని ఏడుస్తూ ఒక కత్తి తీసుకుని ఆమెను ఆమె పడుకో బోతుండగా.
ఆ దయ్యం ఏడుస్తూ…. వద్దమ్మా అలా చేయొద్దు. నన్ను క్షమించు నేను మీ ప్రాణాలు బలి కోరుకునే దాన్ని కాదు. నా వల్ల మీరు ఇబ్బంది పడింది చాలు. ఇదిగో ఆ బిడ్డకు ఆమె తిరిగి ఇస్తున్నాను అని చెప్పి ఆ దెయ్యం తీసుకున్న గర్భాన్ని ఆమెకు తిరిగి ఇచ్చేస్తుంది.
అప్పుడు ఆ దెయ్యం పెద్ద పెద్దగా ఏడుస్తూ… నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ… అని కేకలు వేస్తూ ఇంక నేను ఎప్పుడూ మీ జోలికి రాను మీరు అందరూ సంతోషంగా ఉండాలి. నీకు దంతాలు మీ జీవితంలోకి వచ్చినందుకు నన్ను క్షమించండి. అంటూ చేతులు జోడించి వాళ్ళని ప్రాధేయ పడుతూ అక్క డ నుంచి మాయమైపోతుంది.
అప్పుడు పృథ్వి చాలా సంతోషిస్తూ…. అమ్మ మీకు చాలా కృతజ్ఞతలు నా బిడ్డని నాకు తిరిగి తీసుకు వచ్చారు. మీరే గనక లేకపోతే నాకు బిడ్డ వుండేవాడు కాదు. మీ ఇద్దరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
పృథ్వి భార్య కూడా ఆమెకు నమస్కరించి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. అందుకు ఆమె… నా బిడ్డ వల్ల మీరు ఇబ్బంది పడ్డారు. అందుకు మేమే క్షమాపణ చెప్పాలి.
సుమన్.., సర్లే జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు అంతా సంతోషమే కదా. జరిగిందంతా మర్చిపోయి అందరం సంతోషంగా ఉందాం.అని అంటాడు అందుకు వాళ్లు అందరూ సంతోషంగా నవ్వుకుంటారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *