దెయ్యాల కూర | Telugu Kathalu | Bedtime Stories | Panchatantra kathalu | Horror Stories |Fairy Tales

అది ఒక బాగా అభివృద్ధి చెందిన గ్రామం. ఆ గ్రామంలో శంకర్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతను ఒక పెద్ద హోటల్ యజమాని అక్కడ రోటి ఫేమస్. ఆ రోటీనీ మనుషుల చేత కాకుండా ప్రత్యేకంగా ఒక మిషన్ ద్వారా తయారు చేస్తూ ఉంటాడు గోధుమలు మిషన్లో పోసిన వెంటనే అవి రోటీ గా మారి బయటకు వస్తుంది. అక్కడ వాళ్ళు ఆ రోటి నీ కావాల్సిన వాళ్ళకి అందజేస్తూ ఉంటారు. శంకర్ హోటల్ మీద చాలా డబ్బు సంపాదిస్తాడు . చాలామంది పని వాళ్ళని పెట్టుకున్నాడు. అలా రోజులు గడిచాయి ఒకరోజు శంకర్ పనివాళ్ళ మీద అరుస్తూ ఉంటాడు అతను….. ఈ శ్యామ్ ఎక్కడికి వెళ్ళాడు. చెప్ప చేయకుండా పని ఎందుకు మానేస్తారు అర్థం కాదు. ఫోన్ చేస్తుంటే ఫోను స్విచ్ఛాఫ్ వస్తుంది . అని పెడుతూ ఉంటాడు శ్యామ్ అనే వ్యక్తి ఎందుకు అక్కడికి పనికి రాలేదట అందుకే అతను అంత కోపంగా ఉంటాడు. ఇక ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు కూడా మరో శ్యామ్ కాకుండా వెంకట్ అనే వ్యక్తి కూడా పనికిరాడు.
శంకర్…. ఏమైంది మీ అందరికీ జీతాలు బాగానే ఇస్తున్నాను కదా ఒక్కొక్కరిగా చెప్పా చేయకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు .
అని చాలా కోపంగా ఉంటాడు.
ఆ రోజు గడిచి పోతుంది ఈ రోజు ఏదో ఒక ఆడ రావడంతో అక్కడ ప్రసాదు మరియు కృష్ణ అనే ఇద్దరు పనివాళ్ళు ఏవో తయారు చేస్తూ ఉంటారు. ఇక రాత్రి సమయం అవుతుంది ఇంతలో ప్రసాద్ పరుగుపరుగున శంకర్ వాళ్ళ ఇంటికి వెళతాడు.
తలుపులు కొడుతూ…… అయ్యా తలుపు తీయండి అయ్యా అయ్యా ఒకసారి తలుపు తీయండి. అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ పిలుస్తాడు. లోపల ఉన్న శంకర్ చాలా కంగారు పడొద్దు బయటకు వచ్చి….. ఏం జరిగింది ప్రసాదు ఎందుకు అలాగ కేకలు వేస్తున్నావు. ప్రసాదు….. కృష్ణ దెయ్యం దెయ్యం వన్ టూ కంగారు పడుతూ భయంతో చెబుతూ ఉంటాడు. శంకర్…. ఏమైంది రా సరిగ్గా చెప్పు . అందుకే అతను… ఒకసారి హోటల్ కి వెళ్దాం పదండి అయ్యా . అని హోటల్ కి తీసుకు వెళ్తాడు అక్కడ రోటి మిషన్ ఉన్న గదిలో రొట్టె మిషన్ ను ఉన్న ఒక్కొక్క రోడ్డుపై తల , చేయి, కాలు అలా ఒక్కొక్క భాగం ఉంటుంది. దాన్ని చూసి వాళ్లు చాలా కంగారు పడిపోతారు. ఇంతలో ఒక దెయ్యం ఒక మనిషిని తీసుకు వచ్చి ఆ మిషన్లో వేస్తుంది. ఆ తరువాత గోధుములు తీసుకొచ్చి అందులో వేస్తుంది.
ఇక ఆ మెషిన్ నుంచి అతని శరీర భాగాలు
మరియు ఒక రొట్టె పైన వస్తూ ఉంటాయి.
దాన్ని చూసి వాళ్లు మరింత భయపడిపోతారు ఆ దెయ్యం ఒక్కొక్క రోటీని శరీర భాగాలతో
నంచుకొని తింటుంది.
ఆ తర్వాత ఆ దెయ్యం పెద్దగా నవ్వుతూ ….హా హా హా చాల రుచి గా ఉన్నారు. ఆ శంకర్ ని ఎప్పుడు ఇలాగే తింటాను ఆ రోజు ఎప్పుడు వస్తుందో అంటూ పెద్ద పెద్దగా నవ్వుతూ కేకలు వేస్తూ ఏడుస్తూ అరుస్తూ గందరగోళం చేసి అక్కడి నుంచి ఆ దెయ్యం మాయమైపోతుంది.
శంకర్ భయపడుతూ….. అయితే పని వాళ్లందర్నీ దెయ్యం చంపేస్తుదన్న మాట . నన్ను కూడా చెప్పాలనుకుంటుంది ఎవరు ఏంటి అనేది నాకు అర్థం కావడం లేదు.
అని అనుకొని ప్రసాద్ తో ….. చూడు ప్రసాద్ కొన్ని రోజులు హోటల్ కి సెలవా . మీరు వెంటనే ఇక్కడినుంచి వెళ్లిపోండి అని అంటాడు . ఇక అక్కడి నుంచి అందరూ వెళ్లిపోతారు హోటల్ మూతపడుతుంది .
శంకర్ ఇంటి దగ్గర చాలా భయపడుతూ ఉంటాడు ఇది ఇలా ఉండగా అక్కడ హోటల్లో మిషిన్ ఉన్న గదిలోకి దెయ్యం ప్రసాద్ ని తీసుకు వచ్చింది. ప్రసాద్ చాలా భయపడుతూ…. నన్నేం చెయ్యొద్దు. నన్నేం చెయ్యొద్దు . ఎంతగానో ప్రాధేయపడతాడు ఆ దెయ్యం పెద్దగా నవ్వుతూ….హా హా హా అంటూ అతన్ని మిషన్లో వేసి గోధుమలు వేస్తుంది ఇక దాని నుంచి శరీర భాగాలతో రొట్టెలు బయటకు వస్తాయి.
ఆ తర్వాత ఆ దెయ్యం చాలా సంతోష పడుతూ దానిని తింటుంది.
ఆ రోజు గడిచి పోతుంది శంకర్ కు చాలా భయం ఎక్కువ అవుతుంది. రాత్రి సమయంలో అతన్ని ఎవరో వెంబడిస్తున్నట్టుగా. ఎవరో పిలుస్తున్నట్టు గా అనిపిస్తుంది . మధ్యరాత్రి లేచి పెద్దపెద్దగా కేకలు వేస్తూ ఉంటాడు దానిని గమనించిన భార్య …. ఏమైందండీ అని ప్రశ్నిస్తుంది . అతని ప్రవర్తనలో మార్పు చూసిన భార్య ఒక స్వామీజీనీ ఇంటికి తీసుకు వస్తుంది .
అతను అను తన దివ్య దృష్టితో చూసి….. నీ భర్తకు మరణం తప్పదు. ఆ దెయ్యం పగ తో రగిలి పోతుంది పగ తీర్చుకునే కానీ వెళ్లదు. ఆమె…. ఎవరు ఆ దెయ్యం స్వామీజీ అని అడుగుతుంది.
స్వామీజీ…. సరిగ్గా సంవత్సరం క్రితం కృష్ణ పల్లి గ్రామంలో నీ భర్త స్నేహితుడు రఘువీర్ ఎంతో కష్టపడి ఒక రొట్టెల మిషన్ ని తయారు చేసాడు. దానితో వ్యాపారం చేస్తున్నాడు చాలా చక్కగా సాగిపోతుంది. నీ భర్త దానిని అడిగాడు కానీ అతను ఇది ఇవ్వను
కావాలంటే నేను తయారు చేసి ఇస్తాను .
అని చెప్పాడు . అందుకు నీ భర్త …. తయారు చేయడానికి చాలా సంవత్సరాలు పడుతుంది కదా మిత్రమా. ఎంత డబ్బు అయినా ఇస్తాను అది నాకు ఇవ్వు . మా ఊర్లో హోటల్ చాలా చక్కగా సాగుతుంది ఇది తీసుకెళ్తే ఇంకా నాకు అధిక లాభం వస్తుంది. డబ్బులు ఇస్తాను ఇవ్వు కొత్తవి నువ్వు తయారు చేసుకో. అని అడిగాడు అందుకు అతను ఒప్పుకోలేదు . దానిని ఎలా అయినా సొంతం చేసుకోవాలని మీ భర్త అనుకున్నాడు . అతను చెప్పాలని నిర్ణయించుకొని అతను తల పైన కొట్టాడు కానీ అతను చనిపోలేదు పిచ్చివాడు అయిపోయాడు. ఆ పని చేయడానికి నీ భర్త దగ్గర పనిచేసే కొందరు పనివాళ్ళు సహాయం చేశారు . ఆ పిచ్చివాడిని ఒక చోట ఉంచి తిండి నీళ్లు లేకుండా చేశారు . కొన్ని రోజులకి అతనికి సృహ వచ్చింది . అప్పుడు చాలా కఠినంగా ప్రవర్తించి . అతని చావుకి కారణం అయ్యాడు. అందర్నీ చంపేసింది ఆ దెయ్యం ఇక మిగిలింది నీ భర్త . అని చెప్తాడు అందుకు ఆమె ఏడుస్తూ పరిష్కార మార్గం అడుగుతోంది దానికి స్వామిజి …హా హా హా అని పెద్దగా నవ్వుతూ దెయ్యం రూపంలోకి మారి పై గదిలో నిద్రపోతున్న భర్తను తీసుకొని… వెళ్లి వస్తాను అని చెప్పి అతన్ని మాయం చేసి హోటల్ లో ఉన్న మెషిన్ లో అతని వేసి అతనిని కూడా రొట్టెలో నంచుకొని తినేస్తుంది. దెయ్యం పగ తీరడంతో అక్కడినుంచి మాయమైపోతుంది ఆ దెయ్యం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *