దెయ్యాల దీపావళి Deepavali | Telugu Kathalu | Bedtime Stories | Panchatantra kathalu | Fairy Tales

ఊరి చివరన ఉన్న ఒక ఇంట్లో రెండు దెయ్యాలు నివసిస్తూ ఉండేవి. ఊరిలో ఉండే మనుషులని అవ్వి ఏమి అనేవి కావు, ఊరి ప్రజలకి ఆ దెయ్యాలంటే భయం ఉండేది కాదు, ఆ దారిలో ప్రజలు వెళ్తున్నప్పుడు వస్తున్నపుడు ఆ దెయ్యాలని పలకరించేవారు, ఏవైనా పని కావాలన్న ఆదెయ్యలతో చేయించుకునేవారు కానీ ఎవ్వరు కూడా ఆ దెయ్యలకి సాయం చేసేవారు కారు, ఊరి ప్రజలు ముద్దుగా ఆదెయ్యలలో పెద్ద దెయ్యాన్ని క్యూటీ అని చిన్న దెయ్యాన్ని ఫ్రూటీ అని పిలిచేవారు.

ఒక రోజు క్యూటీ ఫ్రూటీ ఇలా మాట్లాడుకుంటూ ఉంటాయి,

క్యూటీ : ఫ్రూటీ దీపావళి పండుగ వచ్చింది, నాకు కూడా టపాసులు కాలాచాలని ఉంది, నేను చనిపోక ముందు మా ఇంట్లో దీపావళి పండుగా చాలా ఘనంగా జరుపుకునే దాన్ని, కానీ నేను చనిపోయిన తరువాత నేను లేకుండా పండుగ చేసుకోవద్దం వాళ్లకి నచ్చక  మా కుటుంబ సభ్యులు దీపావళి పండుగ చేసుకోవడమే మానేశారు, నేను వాళ్ళతో కలిసి చేసుకోవాలని వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను చూసి సేయ్యం దెయ్యం అని బయపడడ్డారు, వాళ్ళని భయపెట్టడం ఇష్టం లేక నేను ఇలా వచ్చి ఊరి చివరన ఇంట్లో ఉండాలని వచ్చాను అప్పుడే నువ్వు నాకు పరిచయం అయ్యావు అని తన గతాన్ని చెబుతుంది ఫ్రూటీ దెయ్యానికి

ఫ్రూటీ : నాకు కూడా దీపావళి పండుగ అంటే ఇష్టమే, నన్ను చూసినప్పుడు మా ఇంటి వాళ్ళు కూడా అలాగే భయపడ్డారు, అందుకే నేను ఇక్కడ వచ్చి స్థిరపడ్డాను నాకు తోడుగా నువ్వు వచ్చావు, అని చెబుతుంది

క్యూటీ : అంత బానే ఉందిలే కానీ ఈ ఊరి ప్రజలు మనల్ని చూసి భయపడడం లేదేంటి? అని అడుగుతుంది

ఫ్రూటీ : ఏమో నాకు కూడా తెలియదు, నేను వచ్చినప్పటి నుండి అందరు నాతో ఇలానే మాట్లాడేవారు, ఇంకా కొందరైతే నన్ను తెగ ఆటపట్టించే వారు కూడా, నేను కూడా వాళ్ళని ఏమని దాన్ని కాదు, ఇప్పుడు నువ్వు నాకు తోడుగా వచ్చావు సరే నువ్వు దీపావళి బాంబులు కాల్చుదాం అన్నావు కదా పదా ఊరిలోకి వెళ్లి ఎవరినైనా అడిగి కొన్ని టపాసులు తెచ్చుకొని ఎంచక్కా కాల్చుకుందాం అని అంటుంది,

అలా ఇద్దరు కలిసి ఊరిలోకి వెళ్తారు

అక్కడ రాహుల్ అనే ఒక వ్యక్తి కనిపిస్తాడు ఆ దెయ్యాలకు, అప్పుడు ఫ్రూటీ దెయ్యం రాహుల్ దగ్గరకు వెళ్లి

ఫ్రూటీ : రాహుల్ అన్న రాహుల్ అన్న ఈరోజు దీపావళి కదా మాకు కూడా టపాసులు కాల్చాలని కోరికగా ఉంది, నువ్వు మాకు కొన్ని టపాసులు ఇస్తే మేము ఇంటికి వెళ్లి వాటిని కాల్చుకుంటాము అని అడుగుతుంది ఫ్రూటీ దెయ్యం ఎంతో మర్యాదగా

రాహుల్ : ఏంటి నేను పొలం ఒల్లలిసేలా పొలం పనులు చేసి సంపాదించిన డబ్బులతో మా పిల్లలకోసం టపాసులు కొనుక్కెళ్తున్నాను, ఇప్పుడు దారిలో మీకు వచ్చి మీరడగగానే మీకు ఇచ్చేయాల, మీకు ఇంకా ఎవరు దొరకలేదా, మీకు కొంచమైనా బుద్ధి ఉందా మీరు దెయ్యాలు మీరు టపాసులు కాల్చడం ఏంటి? ఇక్కడ నుంచి వెళ్లిపోండి, లేకుంటే భూత మాంత్రికుడిని పిలిచి మిమ్మల్ని బండి చేయిస్తాను పొండి అని అరుస్తాడు కోపంగా

ఫ్రూటీ దెయ్యం క్యూటీ దెయ్యం రాహులా దగ్గర నుంచి దూరంగా నడుస్తూ ఉంటె క్యూటీ దెయ్యం ఇలా అంటుంది

క్యూటీ : భూత మాంత్రికుడిని పిలిచి మనల్ని బంధీ చేయిస్తాను అంటున్నాడు కదా? ఆ భూత మాంత్రికుడికి ఇచ్చే డబ్బులేదో మనకి ఇస్తే మనం టపాసులు కొనుక్కొని ఆనంద పడతాము కదా, మనతో ఏదైనా పని చేయించుకోవాలంటే ముందుకొస్తారు కానీ మనం అడిగితే మాత్రం ఇలా అవమానించి పంపిస్తారు, ఈ మనుషులంతా ఇంతే స్వార్థం తో ఉంటారు, ఇలా వాళ్ళని వీళ్ళని అడిగితే మనం ఈరోజు టపాసులు కాల్చుకోలేము కానీ ఎదో రకంగా ప్రయత్నించి మనమే ఎలాగోలా టపాసులు సంపాదించుకోవాలి అని అంటుంది

ఫ్రూటీ : ఈ ప్రజలు మనకి ఏమి చేయరు, నువ్వన్నది బానే ఉంది కానీ మనం సంపాదించుకోవడం అంటే ఎట్లా అడుగుతున్నప్పుడే కొంత దూరం లో ఒక పిల్లడు టపాసులు కాలుస్తూ ఉంటాడు

క్యూటీ : చూసావా ఆ పిల్లడు ఎంత ఆనందంగా టపాసులు కాలుస్తున్నాడో, మన దగ్గర టపాసులు ఉంటె మనం కూడా అంతే ఆనందంగా  కాల్చేవాలం కదా అని అంటుంది.

అంతలో పిల్లడు కాల్చుతున్న టపాసులలో ఒకటి అతని చేతిలోనే పేలి ఆ పిల్లాడి చేస్తికి గాయం అవుతుంది. వెంటనే రెండు దెయ్యాలు ఆ పిల్లాడి దగ్గరికికి వెళ్లి తమకు ఉన్న శక్తులతో ఆ దెబ్బని మాయం అయ్యేలా చేద్దామని చూస్తాయి, కానీ వాటికి ఏ శక్తులు ఉండక పోవడం తో ఆ పిల్లాడి గాయాన్ని మాన్పిచలేక పోతాయి, పిల్లాడి ఏడుపు విని పిల్లాడి అమ్మ అనిత బయటకు వస్తుంది,

అనిత : ఎన్ని సార్లు చెప్పినా వినలేదు కదరా, మీ నాన్న దగ్గర మొండి పట్టు పట్టి మరి ఈ టపాసులు కొనిపించుకున్నావు, ఇప్పుడు చూడు ఎం జరిగిందో? ఇలాంటిది ఎదో జరుగుతుందనే నేను వద్దని చెప్పాను ఇదంతా వీటి వల్లనే, అని చెప్పి ఆ టపాసులను తీసుకెళ్లి చెత్తకుప్పలో పడేస్తుంది.

వెంటనే ఆ దెయ్యాలు చెత్త కుప్పలు అనిత పడవేసిన టపాసుల్ని తీసుకొని ఇంటింకి వెళ్లిపోతాయి,

ఫ్రూటీ : మనకి టపాసులు దొరికాయి బాగానే ఉంది కానీ పాపం ఆ పిల్లాడి పరిస్థితి ఏంటి? అతని చేస్తికి తగిలిన గాయం ఎప్పుడు తగ్గుతుందో ఏమో అని అంటుంది

క్యూటీ : అవునక్క ఈ మనుషులు టపాసులు పెద్ద పెద్ద చప్పుడు రావడం కోసం రకరకాల రసాయనాలు వాడి వాటిని చాలా తప్పుగా తాయారు చేస్తున్నారు, అందుకే చిన్న దెబ్బ తగిలినా ఆ గాయం మానడానికి చాలా రోజులు పడుతుంది. సరే అది వదిలేయ్ కానీ మనం వెళ్లి ఉన్న టపాసులనే ఎలాంటి గాయాలు కాకుండా జాగ్రత్తగా కాల్చుకుంధామ్ పదా, అని ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు

క్యూటీ దెయ్యం ఫ్రూటీ దెయ్యం ఎంతో ఆనందంగా టపాసులు కాల్చుకుంటూ ఉంటాయి, ఆ దెయ్యాలు చిచ్చుబుడ్డులు, భూ చక్రాలు, కాకర పువ్వొత్తులు ఎంతో ఆనందంగా కాల్చుకుంటాయి,

క్యూటీ : చూసారు గా మీరు కూడా దీపావళి అంటే దీపాల పండుగ, ఈ దీపావళికి శబ్ద కాలుష్యం కాకుండా వాతావరణ కాలుష్యం కాకుండా అలానే మన శరీరాన్ని గాయ పరుచుకోకుండా జాగ్రత్తగా జరుపుకుందాం, అందరికి మా మంచి దెయ్యాల కుటుంబాల తరఫున మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు

Add a Comment

Your email address will not be published. Required fields are marked *