దేవుడు కాపాడగలడా? Telugu Story – Telugu Kathalu -Telugu Fairytales -Kattappa Kathalu | Fairy tales

కృష్ణాపురం అనే గ్రామం లో రుక్మిణి అనే ముసలావిడ ఉండేది. ఆమె చివర ఒక గుడిసె వేసుకొని తన మనవారాలైన మీరా తో కలిసి బ్రతుకుతుండేది. మీరా చిన్నప్పుడే ఆమె తల్లి చనిపోయింది, మీరా తండ్రి, మీరా ఆడపిల్ల అని తనని చూసుకోలేనని చెప్పి చిన్న పిల్లని వాళ్ళ నానమ్మ దగ్గర వదిలేసి వేరే పెళ్లి చేసుకొని వెళ్ళిపోతాడు. అప్పటి నుండి మీరా వాళ్ళ నానమ్మ అయిన రుక్మిణి దగ్గరే ఉంటూ ఉంది.

రుక్మిణి కూడా మీరా తల్లి తండ్రి లేని పిల్ల అని మీరా  ప్రేమగా చూసుకునేది, మీరా కూడా వాళ్ళ నాన్నమ్మ పట్ల ఎంతో ప్రేమ, మర్యాద తో ఉండేది.

రుక్మిణి ఇంట్లో ఎప్పుడూ ఒక కృష్ణుడి విగ్రహం ఉండేది, ఎప్పుడు ఆమె కి ఏ బాధ వచ్చినా, సంతోషం వచ్చినా ఆ విగ్రహం దగ్గర కూర్చుని ఆ విగ్రహానికి చెప్పి కృష్ణుడితో చెప్పినట్టు భావించేది, అంత అమితమైన భక్తి ఉండేది కృష్ణుడంటే రుక్మిణికి, మీరా వాళ్ళ నానమ్మ దగ్గరికి వచ్చినప్పటి నుండి రుక్మిణి ఆ విగ్రంతో మాట్లాడడాన్ని ఎంతో వింతగా చూసేది. ఒకరోజు మీరా రుక్మిణి దగ్గరికి వెళ్లి

మీరా :- నానమ్మ నువ్వు ఎప్పుడూ ఏ చిన్న సంతోషం వచ్చినా, ఎంత చిన్న బాధ వచ్చినా వెంటనే ఈ విగ్రహం దగ్గరికి వచ్చి చెప్తావు, ఈ విగ్రహం ఎవరిదీ నాన్నమ్మ, ఆ విగ్రహం లో నుండి నీ మాటలన్నీ ఎవరైనా వింటున్నారా? నువ్వు ఎందుకు మాట్లాడుతావు చెప్పు నానమ్మ అని అడుగుతుంది.

రుక్మిణి :- అమ్మా మీరా, నువ్వు పుట్టక ముందు మీ నాన్న పెళ్లి అవ్వగానే మీ అమ్మని తీసుకొని పట్నానికి వెళ్ళిపోయాడు, అప్పుడు నేను ఒంటరి దాన్ని అయిపోయాను, నాకు ఎంతటి కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా చెప్పుకోడానికి ఎవరూ ఉండేవారు కాదు. అప్పటి నుండి నా ఇష్ట దైవం అయిన కృష్ణుడితో మాట్లాడం మొదలుపెట్టాను నా బాధ సంతోషం ఏదైనా ఆయనతో చెపితే కానీ నా బాధ తీరదు, ఇలా నా కృష్ణుడితో మాట్లాడడం నాకు అలవాటయ్యింది, ఆయన నా మాటలన్నీ వింటాడని నేను నమ్ముతాను. అందుకే అన్ని ఆయనకు చెప్తూ ఉంటాను. అని చెప్తుంది రుక్మిణి మీరా తో, అప్పుడు మీరా

మీరా :- నానమ్మ, కృష్ణుడు నిజంగా నీ మాటలు వింటున్నాడా? అయితే మా అమ్మ నాన్నని నా దగ్గర లేకుండా ఎందుకు చేసాడో కూడా అడుగుతావా? కనీసం ఊహ కూడా రాకముందే నన్ను నీకు వదిలేసి వాళ్ళు ఎక్కడికి వెళ్లారో చెప్పమంటావా నానమ్మ అని ఏడుస్తూ అడుగుతుంది మీరా

ఆ మాటలకు రుక్మిణికి ఏమి సమాధానం అర్ధం కాక ఏదోలా మీరా బాధని  పోగొట్టాలి అనుకోని

రుక్మిణి :- చూడు మీరా దేవుడికి ఎప్పుడు ఎవరికీ ఏమి ఇవ్వాలో బాగా తెలుసు, ఒకరి దగ్గర నుంచి ఏదైనా లాక్కున్నదంటే వాళ్లకి అంతకు మించినది ఇంకేదో ఇవ్వబోతున్నాడని అర్ధం, దేవుని దృష్టిలో అందరూ సమానమే, అందరూ ఆయన బిడ్డలే అని చెబుతుంది

ఆరోజు నుంచి మీరా కూడా ఆ కృష్ణుడి విగ్రహం తో అన్ని మాట్లాడడం మొదలు పెడుతుంది. ఏ చిన్న విష్యం జరిగినా వెంటనే వచ్చి ఆ విగ్రహం తో చెప్పడం అలవాటుగా మారిపోయింది మీరా కు

ఇలా రోజులు గడుస్తుండగా మీరా వాళ్ళ ఊరిలో విపరీతమైన వర్షాలు వస్తాయి. అథ భారీ వర్షం రావడం వళ్ళ రుక్మిణి వాళ్ళ ఇల్లు ఊరి చివరన ఉండడం తో పక్కనే ఉన్న వాగులో నీరంతా ఊరి వైపుగా కొట్టుకు వస్తాయి దాని వాళ్ళ రుక్మిణి వాళ్ళ ఇల్లు మొత్తం వర్షం నీటితో నిండిపోతుంది.  మీరా పుట్టినప్పటినుండి అంత పెద్ద వర్షం ఎప్పుడూ చూడలేదు, ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన అంత భారీ వర్షాన్ని చూస్తూ మీరా ఎంతో భయపడి పోతూ ఉంటుంది. మీరా భయాన్ని గమనించిన రుక్మిణి,

రుక్మిణి :- అమ్మ మీరా భయపడకమ్మా, మనకి ఏమి ఎవ్వదు ఆ దేవుడు మానని చూస్తూనే ఉన్నాడు, మనకి ఏమి కానివ్వడు అని చెబుతుంది . అప్పుడు మీరా

మీరా :- లేదు నానమ్మ నా జతకమే ఇంత, నేను పెద్ద దురదృష్ట వంతురాలిని, నేను ఎక్కడ ఉన్నా ఇలానే జరుగుతుంది, నన్ను ప్రాణం లా చూసుకోవలసిన అమ్మ నేను పుట్టగానే అమ్మని చనిపోయింది, మంచి చెడులు చెప్పి నన్ను భాద్యతగా పెంచాల్సిన నాన్న నన్ను వదిలి వెళ్ళిపోయాడు, నీకు తినడానికి నీకే శక్తిలేని ఈ వయసులో నేను నీకు బరువుగా మారాను, ఎలాగోలా కష్టపడి నువ్వు నన్ను పోషిస్తున్నావు అనుకుంటే అంతలో ఇలా ఈ వర్షాల వాళ్ళ మన ఇల్లంతా నాశనం అయ్యింది, నువ్వు ఎంతో కష్టపడి కూడా పెట్టిన ఆహార పదార్థాలు, డబ్బులు కూడా ఈ వరదల్లో కొట్టుకు పోతున్నాయి, ఇదంతా నా వల్లే అని ఎంతో ఏడుస్తూ ఉంటుంది.

రుక్మిణి :- అమ్మ మీరా నువ్వు అలా అనుకోవడం ఎంతో తప్పు, నీ లాంటి మంచి మనసున్న వాళ్లకి అంతా మంచే జరుగుతుంది, అన్నిటికి ఆ దేవుడే ఉన్నాడు, అని చెప్పి ఆ వరద నీటిలోనే నడుచుకుంటూ ఇంట్లో ఉన్న కృష్ణుడి విగ్రహం దగ్గరికి వెళ్తుంది రుక్మని, ఆమె వెంటే వస్తుంది మీరా

అప్పుడు రుక్మిణి మీరా కి కృష్ణుడి విగరహాన్ని చూపిస్తూ

రుక్మిణి :- నువ్వేమి బాధపడకు మీరా అన్నిటికి మనకి ఆ దేవుడే ఉన్నాడు, మన ఇళ్లుతో సహా మొత్తం అన్ని ఈ వరదల్లో కొట్టుకుపోయిన పర్లేదు మనకి ఈ దేవుడి సహాయం ఉంటె చాలు  అని చెప్పి కృష్ణుడి విగ్రహాన్ని తన తలపై పెట్టుకొని ఊరి వైపుగా నడవడం ప్రరంబిస్తారు ఇద్దరు అలా కొంచం ముందుకి వెళ్లేసరికి నీటి ప్రవాహం ఎక్కువ అవ్వడం జరుగుతుంది. ప్రవాహం పెరగడం గమనించిన రుక్మిణి వెంటనే ఒక దుంగ దగ్గరికి వెళ్లి మీరాని ఆ దుగా పై కూర్చో బెట్టి, తాను ఆ దుంగని తూసుకుంటూ వెల్తూ ఉంటుంది, అలా ఆ దుంగ సహాయంతో రుక్మిణి మరియు మీరా ఊరిలోకి వెళ్తారు సరిగా అదే రోజు కృష్ణాష్టమి కూడా కావడం తో ప్రజలందరూ కృష్ణుడి విగ్రహాన్ని మోసుకు వస్తున్న రుక్మిణి మీరా వైపు రావడం మొదలు పెడతారు, భారీ వర్షం పైగా వరదలు, ఆ వరదల్లో అందరి ఇల్లులు, కొట్టుకు పోతున్నాయి, ఏమి చేయాలో దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్న ఊరి జనాలకి ఒక్క సరిగా దేవుడు కనిపించేసరికి అటు వైపుగా వెళ్లి దేవుడికి దండం పెట్టడం మొదలు పెడతారు. ఊరి అందరి పరిస్థితి అలానే ఉందని గమనించిన మీరా ఆ విగ్రహం తో

మీరా :- దేవుడా క్రిష్నయ్య ఈ ఊరిలో ఈ వర్షాలు వరదల వాళ్ళ ఏ ఒక్కరి పరిస్థితి కూడా బాగాలేదు, వీరందరికి సహాయం చేయడం నీ ఒక్కడి వల్లే అవుతుంది, నువ్వే ఎలాగైనా మమ్మల్ని కాపాడాలి స్వామి అని ఆవేడుకుంటుంది ఏడుస్తూ

అప్పుడు వెంటనే వర్షం తగ్గుముఖం పడుతుంది, వరద నీరు కూడా క్రమ క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది, అలా కొంతసేపటికి ఊరి పరిస్థితి మల్లి మామూలోళ్లు స్థితికి వస్తుంది,

అప్పుడు ఆ ఊరి జనాలు ఆ విగ్రహానికి ఎంతో మహిమలు ఉన్నాయని తెలుసుకొని ఊరి మధ్యలో గుడి కట్టించి పూజలు చేస్తూ ఉంటారు, ఎవరికీ ఏ కష్టం వచ్చినా ఆ గుడిలోకి వచ్చి చెప్పుకొని తృప్తి పొందుతారు, అప్పటినుండి రుక్మిణి ఆ గుడి బాగోగులు చూసుకుంటూ మీరా ని చదివిస్తో ఎంతో సంతోషంగా బ్రతుకుతూ ఉంటారు

Add a Comment

Your email address will not be published. Required fields are marked *