నదిలో మాయా గులాబీ చెట్టు 7 Telugu kathalu |Telugu Stories | Bedtime Dreams Telugu | Kattapa kathalu

కోదండ పూరి అనే ఒక గ్రామంలో. మంజు అనే ఒక అమ్మాయి ఉండేది . ఆ అమ్మాయి ఒకరోజు నది దగ్గర ఆడుకుంటూ ఉంటుంది. ఇంతలో ఎవరో ఆమెను వెనుకనుంచి వచ్చి నది లో విసిరేసారు. ఆమె నదిలో నుంచి కేకలు వేస్తూ ఉంటుంది…. కాపాడండి కాపాడండి అని. కానీ చుట్టుపక్కల ఎవరూ ఉండరు . ఆమె అలా కొట్టుకొని వెళ్ళిపోతుంది. ఇంటిదగ్గర తల్లిదండ్రులు ఆమె కోసం ఎదురుచూస్తూ ఉంటారు తల్లి…. అయ్యో ఏంటి అండి మంజు ఇంతవరకు ఇంటికి రాలేదు. నాకెందుకు చాలా భయంగా ఉంది.
తండ్రి….. ఎందుకు భయం ఎక్కడో ఆడుకోడానికి వెళ్లి ఉంటుంది వస్తుందిలే.
అని సర్ది చెప్తాడు సాయంత్రం సమయం అవుతుంది అయినప్పటికీ కూడా ఆమె ఇంటికి రాకపోవడంతో ఆ తల్లిదండ్రులు ఇద్దరూ వెతకడం మొదలు పెడతారు.
కానీ ఎక్కడా కూడా కనపడక పోవటంతో వాళ్ళ నాయనమ్మ ఇంటికి వెళ్తారు అక్కడ…. అత్తయ్య మంజు ఏమన్నా వచ్చిందా.
ఆమె….. రాలేదు శ్యామల ఏం జరిగింది.
శ్యామల….. మధ్యాహ్నం భోజనం చేసి బయటికి ఆడుకోడానికి అని వెళ్ళింది. అప్పటి నుంచి ఇంటికి తిరిగి రాలేదు. మాకు చాలా భయంగా ఉంది.
అత్త…. ఒరేయ్ గోపాల్ వెంటనే వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇవ్వరా. ఎందుకంటే రోజులు అస్సలు బాలేదు పిల్లల్ని దొంగిలించే వాళ్ళు చాలామంది ఉన్నారు. త్వరగా వెళ్ళు.
గోపాల్….. సరే అమ్మా అదే పని చేస్తాను ఒకసారి వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్లి వస్తాను.
అని అనుకొని శ్యామల తల్లి ఇంటికి వెళ్తారు అక్కడ తల్లి తో శ్యామల….. అమ్మ నా కూతురేమ్మన ఇటు వచ్చిందా.
ఆమె…. లేదు ఇటు రాలేదు . అని సమాధానం చెబుతుంది ఆమె ఏడుస్తూ జరిగిన విషయం చెబుతోంది.
ఇక అందరూ కలిసి వెతకడం మొదలు పెడతారు కానీ పాప ఎక్కడా కనిపించకపోవడంతో పోలీస్ అధికారి తో ఆ విషయం గురించి చెప్తారు.
పోలీస్ అధికారి…. తప్పకుండా పాప ఎక్కడ ఉందో నేను కానిపెడతాను మీకు ఎవరిపైన అయినా అనుమానం వుందా మీకు ఎవరైనా
శత్రువులు ఉన్నారా.
వాళ్లు…. కాయకష్టం చేసి బతికే వాళ్ళం సారు . మాకు ఎవరు శత్రువులు లేరు ఉన్నదాంట్లో తింటాం ఉన్నచోటే పoడతాం.
అని బాధగా చెప్తారు అందుకు తను సరే అని చెప్పి. మేము వెతుకుతాను భయపడకండి అని తన గాలింపు మొదలు పెడతాడు రోజులు గడిచాయి పాపా ఆచూకీ ఎక్కడా కనపడదు.
ఆ విషయమై తల్లిదండ్రులు చాలా బాధ పడుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా నదిలో పడి పోయిన ఒక పెద్ద మాయ గులాబీ దగ్గర స్పృహ లేకుండా పడి ఉంటుంది.
ఆమె ఒక్కసారిగా నిద్రలేచి….. ఈ పడవ ఎక్కడి నుంచి వచ్చింది నేను ఎక్కడ ఉన్నాను అని అటూ ఇటూ చూసింది ఆ పెద్ద రంగు గులాబీ నీడలో ఆమె ఉందని తెలుసుకొని…. అయ్య బాబోయ్ ఇంత పెద్ద గులాబి నేను ఎక్కడా చూడలేదు. అంటూ అటూ ఇటూ చూస్తూ ఎవరూ లేకపోవడంతో చాలా భయపడుతుంది.
ఇక ఆమె…. అమ్మ కావాలి , నాకు అమ్మ కావాలి అంటూ ఏడవడం మొదలు పెడుతుంది. అప్పుడే ఆమెకు ఒక స్వరం వినపడుతుంది…. పాపా ఎందుకు ఏడుస్తున్నావు .
పాప ఆ మాటలు విని చాలా ఆశ్చర్యంగా… ఎవరున్నారు ఎవరు మాట్లాడుతున్నారు అంటూ. పెద్ద పెద్దగా కేకలు వేస్తోంది ఆ మాయా గులాబీ పువ్వు…. పాప నేనే మాయ గులాబీ ని మాట్లాడుతున్నాను.
అంటుంది ఆమె గులాబి వైపు చూసి….. నువ్వా ఇంత పెద్దగా నువ్వు ఎలా ఉన్నావు . అసలు నువ్వు అలా మాట్లాడుతున్నావు.
గులాబీ…. నేను వరం పొందిన మాయ గులాబీని. అది సరే కానీ నువ్వు ఇన్ని రోజుల నుంచి ఉలుకు పలుకు లేకుండా విశ్రాంతి తీసుకుంటూనే ఉన్నావు. ఒకరోజు పడుకుంటే నువ్వు నిద్ర పోతూనే ఉంటావా ఏంటి.
అందుకు పాప…..హా హా హా కాదు నేను అలా ఎప్పుడు నిద్ర పోను . కానీ నన్ను ఎవరో నదిలో నెట్టివేశారు. అది ఎవరో నాకు తెలీదు ఇంక నేను ఇక్కడికి వచ్చాను కానీ ఈ పడవ ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు.
మాయ గులాబీ….. నిన్ను చూసి నేను నిన్ను కాపాడును కానీ ముందు మీకు చాలా ఆకలిగా ఉంది కదా ముందు ఈ పండ్లు తిను అని తన గులాబీ రెక్కలను కిందకి విడిచి
వాటిని పండ్ల రూపంలోకి మారుస్తుంది.
దాన్ని చూసిన ఆ పాప చాలా ఆశ్చర్యపోతూ ఆ పండ్లు తీసుకొని తింటూ….. భలే అద్భుతంగా ఉన్నాయి ఈ పండ్లు. చాలా బాగున్నాయి. అంటుంది ఆ తర్వాత మాయ గులాబీ…. సరే మంచిది. ఇంతకీ నిన్ను ఎవరు నదిలో పడి వేశారో చూస్తావా.
అందుకు ఆమె…. ఆ చూస్తాను.
అప్పుడు మాయ గులాబీ తన శక్తితో అసలు ఏం జరిగిందో చూపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్.
//పాపా నది దగ్గర ఆడుకుంటూ ఉండగా ఒక పిచ్చి ఆమె…. బలే బలే ఎవరు ఈ పాప . పాపం నీళ్ల కోసం ఇక్కడ ఉందేమో అందట్లేదు అనుకుంటా నీళ్లు నేను పాపని లోపలికి నేడతను తాను అప్పుడు పాప ఎంచక్కా నీళ్లు తాగుతుంది.
అని పాప వెనుక నుంచి వచ్చి ఆమెను నదిలోకి తోస్తుంది.
పాప… కాపాడండి కాపాడండి అంటూ అరుస్తూ ఉండగా ఆ పిచ్చి ఆమె….. మరేం పర్వాలేదు నీకు నచ్చనని నీళ్లు తాగి ఇక్కడి నుంచి తర్వాత వెళ్ళు . బలే బలే బలే అని చప్పట్లు కేరింతలు కొట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
ఇదంతా చూసిన పాపా…. ఓ మాయ గులాబీ పాపం ఆ పిచ్చి ఆమె తెలియక అలా చేసింది పాపం. కానీ ఆమె ఎలాంటి దురుద్దేశంతో అలా చెయ్యలేదు. ఓ మాయ గులాబీ నీకు ఎన్నో మాయలు ఉన్నాయి కదా ఆమెను
ఇక్కడికి తీసుకొచ్చి మంచి ఆమె గా మార్చు.
అని అంటుంది అందుకు మాయ గులాబీ ….. తప్పకుండా అదే చేస్తాను . అని ఆ పిచ్చి ఆమెను అక్కడ మాయం చేసి. తన దగ్గరికి తీసుకు వస్తుంది అక్కడ ఆమె చాలా ఏమైనా చూస్తూ ఉంటుంది . ఆ మాయ గులాబీ తన మాయాశక్తి తో ఆమెను మంచి దాని లాగా మారుతుంది.
ఆమె పిచ్చితనం నుండి మంచిగా మారిపోయి…. ఎవరు నేను నేను ఇక్కడికి ఎలా వచ్చాను. అప్పుడు పాప జరిగిన విషయం అంతా చెబుతుంది.
దాన్ని విన్న ఆమె…. అయ్యో పాప నన్ను క్షమించు నాకు అసలు ఏమీ గుర్తు లేదు.
అసలు నేను ఎవరు ఎందుకు అలా మారిపోయానో నాకు తెలియదు అంటూ ఏడుస్తుంది అప్పుడు మాయ గులాబీ…. బాధ పడకమ్మా అసలు నువ్వు ఎవరో ఎందుకు పిచ్చిదాని లాగా మారావో. మీకు తెలిసేలా చేస్తాను చూడు. అని తన మాయ శక్తితో జరిగిన గతం ఏంటో చెబుతోంది.
//గతం//
ఆమె పేరు వనజ భర్త కుమార్ వాళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. వాళ్ల కాపురం చాలా చక్కగా సాగిపోతుంది ఇంతలో వనజ గర్భవతినీ తెలుస్తుంది ఆ విషయం తెలుసుకున్న అతను చాలా సంతోష పెడుతాడు. ఆమెకు నెలలు దగ్గరకు వస్తున్నాయి ఒకసారి వాళ్ళిద్దరూ హాస్పిటల్ కి వెళ్లి తిరిగి వస్తుండగా ఆమె కళ్ళ ముందే భర్త యాక్సిడెంట్లో చనిపోతాడు దాన్ని చూసి వనజ పెద్దగా అరుస్తుంది.
ఇక ఆమెకు మతి స్థిమితం ఉండదు పిచ్చిది అయిపోతుంది . ఆ రోజు నుంచి ఆమె పిచ్చిదాని లాగా రోడ్లవెంబడి తిరుగుతూ ఉంటుంది. ఒక రోజు ఆమె ప్రసవ వేదన పడుతూ ఒక పాపకు జన్మనిస్తుంది.
ఆ పాపను తీసుకుని రోడ్లపై తిరుగుతూ ఉండగా ఎవరో కొందరు వ్యక్తులు దాన్ని చూసి…. ఎవరో పిచ్చిది పిల్ల వాడిని ఎందుకు పోతుంది పట్టుకోండి పట్టుకోండి అంటూ వెంబడి ఆమెను కొడుతూ ఉంటారు.
అప్పుడే శారద ఆమె భర్త అక్కడికి వచ్చి అడ్డుకొని…. వద్దు కొట్టకండి దయచేసి పెట్టకండి నాకు తెలియక తప్పు చేసిందేమో వదిలేయండి అన్నీ సర్ది చెప్పి పంపించారు ఇక శారద… ఏవండీ పాప చాలా ముద్దుగా ఉంది. మనకు పిల్లలు లేరు కదా మనం పెంచుకుందాం అండి.
భర్త అందుకు సరే అంటాడు శారదా ఆమెతో….. ఇదిగో ఆ పాపని ఇలా ఇవ్వు.
ఆమె…. నేను ఇవ్వను నేను ఇవ్వను ఇది నా పాప. నేను ఇవ్వను అంటూ మారాం చేస్తుంది శారద ఆమెకు … నువ్వు పాపనీ ఇస్తే నీకు తినడానికి ఇస్తాను అని తన చేతిలో ఉన్న తినే పదార్థాన్ని ఆమెకు ఇస్తుంది. ఆమె దాన్ని తీసుకొని …. భలే భలే అని దాన్ని తీసుకొని పాపనీ వాళ్లకి చేస్తుంది అలా వాళ్ళు ఆ పాపని పెంచుకుంటూ ఉన్నారు.
ఆ పాప పెరిగి పెద్దదయిన తర్వాత ఆడుకుంటుండగా ఆ పిచ్చి ఆమె పాపను నదిలో నెట్టివేస్తుంది. అలా జరిగింది మొత్తం ఆ మాయ గులాబీ కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తుంది దాన్నంతా చూసిన వాళ్ళు ఇద్దరు పెద్ద పెద్దగా ఏడవడం మొదలు పెడతారు.
ఆమె పాపతో…. నా బంగారు తల్లి. నేను చేసిన తప్పులకి నన్ను క్షమించు. మీ నాన్న దూరమవ్వడం . నేను పిచ్చిదానిగా మారడం. నా పాలిట శాపం మనీ పాలిట శాపం తెలియదు కానీ మళ్ళీ ఈ మాయ గులాబీ సహాయంతో మనం కలుసుకున్నాం అంటూ ఏడుస్తూ ఆ పాపని హత్తుకుంటుంది పాప కూడా ఏడుస్తూ.
ఇక వాళ్ళిద్దరూ ఆ మాయ గులాబీకి కృతజ్ఞతలు చెప్పుకుంటారు.
ఆ మాయ గులాబీ…. అయితే మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఈమె పెంచిన తల్లిదండ్రులకి నిజం చెప్పండి.
అలాగే వాళ్లను నా దగ్గరికి రమ్మని చెప్పండి నేను వాళ్లకి తప్పకుండా సహాయం చేస్తాను. అని అంటుంది అందుకు వాళ్లు సరే అంటారు ఇక ఆ తల్లి కూతురు ఇద్దరూ సంతోషంగా ఇంటికి తిరిగి వస్తారు పాప ఇంటికి రావడం చూసి పెంచిన తల్లిదండ్రులు ఇద్దరూ సంతోష పడతారు.
అప్పుడు కన్నతల్లి జరిగిన విషయం అంతా చెబుతుంది వాళ్ళు చాలా బాధ పడుతూ…. నిజమే కానీ కన్న కూతురి కంటే ఎక్కువగా పెంచుకున్నాము. ఇప్పుడు నేను తీసుకెళ్తాను అంటే నాకు చాలా బాధగా ఉంది నాకు పిల్లలు కూడా లేరు అంటూ ఏడుస్తుంది శారద ఆమె…. బాధపడకండి మీకు కచ్చితంగా ఆ మాయ గులాబీ సహాయం చేస్తుంది . మీరిద్దరూ కలిసి నదిలో ఉన్నా ఆ గులాబీ దగ్గరికి వెళ్ళండి అని చెబుతుంది అందుకు వాళ్లు సరే అంటారు ఇక ఇద్దరు కలిసి పడవలో ప్రయాణం అయ్యి . ఆ మాయ గులాబీ ఎక్కడుందో అక్కడికి చేరుకుంటారు.
అక్కడ మాయ గులాబీ నమస్కారం చేస్తారు. మాయ గులాబీ…. ఇదిగో ఈ గులాబీ రెబ్బను తెంచి తిను శారద అంటుంది. అందుకు ఆమె సరే అని చెప్పి దాన్ని తింటుంది .
వెంటనే ఆమెకు గర్భం వస్తుంది.
దాన్ని చూసి ఆమె సంతోషపడుతూ…. మీకు చాలా కృతజ్ఞతలు. మేము తల్లిదండ్రులు కాబోతున్నాను అని సంతోష పడతారు. ఇక వాళ్ళిద్దరూ కూడా ఆ మాయ గులాబీ కి కృతజ్ఞతలు చెప్పుకొని ఇంటికి తిరిగి వెళ్తారు.
ఆ విధంగా ఆ మాయ గులాబీ రెండు కుటుంబాలకి సహాయం చేస్తుంది. ఇక వాళ్లు ఎంతో సంతోషంగా జీవిస్తారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *