నదిలో మాయా చేప | Telugu kathalu | Telugu Stories | Bedtime Dreams Telugu | Kattapa kathalu

కోదండపురం అనే ఒక గ్రామంలో వర్షిని అనే ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి ఒకరోజు స్కూలు నుంచి ఇంటికి వస్తుండగా. ఆమెకు మార్గ మధ్యలో ఒక చిన్న నా గాజు సీసాలలో చేపలు అమ్ముతూ ఒక వ్యక్తి కనబడతాడు. పాప అతని దగ్గర ఉన్న చేపలు చూసి …. అబ్బా బలే బలే. చాలా బాగుంది ఈ చేప అంటూ అక్కడికి వెళ్ళిన అలా చూస్తూ ఉంటుంది . అతను ఆమెను చూసి…. పాపా ఏం కావాలి నీకు.
చేప బాగా నచ్చినట్లు ఉంది.
పాప… అవును అంకుల్ ఈ చేప ఎంత.
అని అడుగుతుంది. అందుకు అతను…. చూడు పాపా ఇది 150 రూపాయలు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా.
పాప…. నేను ఇంటి దగ్గర దాచి పెట్టుకున్న డబ్బులు ఉన్నాయి. వాటిని తీసుకొని వస్తాను అని అక్కడి నుంచి వెళ్తుంది. తను సరాసరి ఇంటికి వెళ్లి తాను దాచుకున్న హుండీ నీ పగలగొట్టి అందులో 150 రూపాయలు తీసుకొని చాలా హడావిడిగా అక్కడికి వెళుతుంది అతనికి డబ్బులు ఇచ్చి …. ఆ చేపను తీసుకొని ఇంటికి వెళ్తుంది.
దానిని ఒకచోట పెట్టుకొని. దాంతో ఆడుకుంటూ ఉంటుంది ఇంతలో తన గుడ్డి తల్లి అక్కడికి వచ్చి….. అమ్మాయి ఏం చేస్తున్నావు ఎక్కడున్నావు అని పిలుస్తూ ఉంటుంది ఆమె …. అమ్మ నేను ఇక్కడే ఉన్నాను ఇదిగో నేను కొత్త చేప తీసుకువచ్చాను. చాలా బాగుంది నేను దాచిపెట్టుకున్న డబ్బులతో నేను తీసుకు వచ్చాను అమ్మ.
తల్లి… అమ్మా ఈ రోజు ఒకటో తారీకు నాకు పెన్షన్ వస్తుంది. నన్నుఆరాధన దగ్గరికి తీసుకు వెళ్తావా. ఇప్పుడు డబ్బులు ఆమె ఇస్తుందట.
అందుకు పాప… సరే అమ్మ వెళ్దాం పదా అని
తన గుడ్డి తల్లి ని తీసుకొని ఆరాధన అనే ఆమె దగ్గరకు వెళ్తుంది.
ఆమె… ఏంటి శారదా ఈరోజు డబ్బులు తీసుకోవాలని ఉద్దేశం లేదా నీకు . చాలా ఆలస్యంగా వచ్చావు.
ఆమె…. లేదు ఆరాధన ఈరోజు ఒకటో తారీకు అని నాకు తెలియలేదు పక్కింటి పార్వతి గారు చెప్తే. అప్పుడు గుర్తొచ్చింది నా కూతురు బడి నుంచి వచ్చిన తర్వాత వెళ్దాం అని అనుకున్నాను ఇదిగో ఇప్పుడే వచ్చింది ఇంకా పాపం తీసుకొని వచ్చాను అని చెబుతోంది .
ఆ తర్వాత ఆరాధన ఆమె చేత వేలి ముద్ర వేయించుకుని . ఆమెకు డబ్బులు ఇస్తుంది.
డబ్బులు తీసుకొని పాపా తల్లి ఇద్దరు కూడా అక్కడి నుంచి ఇంటికి తిరిగి వెళతారు.
అలా తిరిగి వెళ్ళిన వర్షిని ఆ చేపను చూసి చాలా ఆశ్చర్య పోతూ ఎందుకంటే ఆ చేప రంగు మారి ఉంటుంది .
దాన్ని చూసి ఆమె…. ఇదేంటి ఇందాక చేప రంగు ఒక లాగా ఉంది ఇప్పుడేమో మరలా ఉంది నాకు ఏమీ అర్థం కావట్లేదు నేను చూసింది సరైందేనా.
అని అనుకుంటూ ఉండగా మాటలు తల్లి విని … ఏంటమ్మా నువ్వు అంటుంది చేప రంగు మారడం ఏంటి నువ్వు ఏదో భ్రమ పడుతున్నావు.
పాప…. అవును అదే నిజం అనుకుంటా అని అంటుంది కొంచెం సమయం తర్వాత తల్లి…. అది సరే గానీ చేపనీ తీసుకొచ్చావు మరి దానికి ఆహారం ఏం పెడతావు.
పాప…. అయ్యో నేను అతన్ని ఆ విషయం అడగడం మర్చిపోయాను ఇప్పుడే అక్కడికి వెళ్లి వస్తాను అని చెప్పి పరుగుపరుగున అక్కడికి వెళుతుంది . కానీ అక్కడ ఎవరు ఉండక పోవడంతో ఆమె చాలా బాధపడుతూ వెనక్కి తిరిగి వస్తుంది తల్లితో…. అమ్మ చేపలు అమ్మే అంకుల్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను ఏం పెట్టాలి దానికి అది ఆహారం తినకపోతే చనిపోతుంది ఏమో.
తల్లి… అన్నం వండిన వెంటనే కొన్ని మెతుకు లను దానికి అందించు . అది తింటుంది ఏమో అది తినకపోతే మన ఊరి చివర ఉన్నది లో దాన్ని వదిలి పెట్టు అది చనిపోతే మనకి పాపం అనుకుంటుంది.
అని మాట్లాడుతూ ఉండగా ఆ ఇంటి యజమాని అక్కడకు వచ్చి…. మరి మాకు డబ్బులు సరిగ్గా ఇవ్వకపోతే మాకు పాపం అంటూ కోదా ఇప్పటికి మూడు నెలలు అయింది అద్దె కట్టి. డబ్బులు ఈ నెల అయిన ఇస్తారా లేదా బయటకు వెళ్తారా.
తల్లి….. అన్నయ్య గారు నా దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి అవి తీసుకోండి తర్వాత మిగిలిన డబ్బులు కూడా ఇచ్చేస్తాను.
అంటూ పెన్షన్ డబ్బుల్ని అతనికి ఇస్తుంది.
అతను దాన్ని తీసుకొని….. రెండు నెలల మళ్లీ ఆపవా ఇలా అయితే చాలా కష్టంగా ఉంది ఇక మీరు ఖాళీ చేసి వెళ్లిపోండి.
ఆమె… అలా మాట్లాడుతారు ఎందుకు అన్నయ్య . నా భర్త బతికి ఉంటే ఈ కష్టాలు వచ్చేవి కాదు . నాకు వచ్చిన పెన్షన్ డబ్బులు మీకు అద్దె కడుతున్నాను.
మిగిలిన డబ్బులు ఇంటి ఖర్చులకి సరిపోతున్నాయి. మీరైనా అర్థం చేసుకోండి.
అతను మాత్రం ఏమీ వినకుండా ….. చూడమ్మా ఒక మాట చెప్తాను విను. నా ఇంటి పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. నీ మీద జాలిపడి ఇదిగో ఈ డబ్బులు కూడా తీసుకో నాకు డబ్బులు ఇవ్వదు కానీ. రెండు మూడు రోజుల్లో ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోండి . నా కుటుంబ పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటం వల్లనే దీనిని అది తీర్చుకున్నాను అసలు డబ్బులు లేకపోతే నేను చాలా ఇబ్బంది పడతాను. చాలామంది అద్దె కోసం వస్తున్నారు. డబ్బులు కచ్చితంగా ఇచ్చే వాళ్ళకి ఇచ్చుకుంటాను దయచేసి వెళ్ళిపోండి . మళ్లీ నేను ఇక్కడికి వచ్చేటప్పటికే మీరు ఉంటే . నేనే సామాన్లన్నీ బయట పడేస్తాను. అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ మాటలకు ఆ తల్లి కూతురు ఇద్దరు చాలా బాధపడుతూ ఉంటారు. తల్లి… ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్లాలి అమ్మ నాకు చాలా బాధగా ఉంది.
పాపా…. అమ్మ అసలు నీకు కళ్ళు ఎందుకు లేవు. నాన్న ఎందుకు చనిపోయాడు.
అంటూ ఏడుస్తూ అడుగుతుంది అప్పుడు ఆమె…. నీకు పుట్టినప్పుడే కళ్ళు లేవమ్మా డాక్టర్లు చూపు వస్తుంది కళ్ళు పెట్టొచ్చు అని అన్నారు . కొంచెం పెద్దయిన తర్వాత ఆపరేషన్ చేస్తామన్నారు కళ్ళు కోసం చాలా ప్రయత్నించాను కానీ ఎక్కడా దొరకలేదు . ఆ తర్వాత నా కళ్ళ నీకు ఇచ్చాను తల్లి అంటూ ఏడుస్తుంది.
ఆ మాటలు విన్న….. అమ్మ నాకోసం నీ కళ్ళు త్యాగం చేస్తావా అంటూ ఏడుస్తూ ఉంటుంది మరి నాన్న ఎలా చనిపోయాడు అమ్మ.
ఆమె…. మీ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు అమ్మ. మీ నాన్నకు యాక్సిడెంట్ అయినప్పుడు . ఇల్లు అమ్మి ఆ డబ్బుతో నేను మీ నాన్న బతికించుకోవాలి అని అనుకున్నాను డబ్బు అయితే పోయింది కానీ మీ నాన్న బ్రతకలేదు. అంటూ చాలా ఏడుపొస్తుంది అందుకు వాళ్ళిద్దరూ కూడా కూర్చుని ఏడుస్తారు . వాళ్లు బాధతో ఏమీ తినకుండా రెండు రోజులు గడిచిపోయాయి.
ఆ తర్వాత రోజు ఆ యజమాని మళ్లీ ఇంటికి వస్తాడు… ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నారు మర్యాదగా వెళ్లమని చెప్పాను కదా.
అని అంటాడు అందుకు ఆమె…. వెళ్తున్నాం బాబు కొంచెం సమయం ఇవ్వండి అన్నీ సర్దుకొని వెళ్ళిపోతాం . సరే అంటాడు పాపాన్ని సర్దుతూ ఉంటుంది చాలా సమయం తర్వాత వాళ్ళు ఆ మూట ముల్లె సర్దుకొని బయటకు వస్తారు . పాప ఆ చేపనీ చేతిలో పట్టుకొని …. ఈ చేపను నేను ఎంతో ఇష్టంగా తెచ్చుకున్నాను మనకే నీడ లేదు . దీన్ని నేను నదిలో వదిలిపెట్టి వస్తాం అమ్మా నువ్వు ఈ చెట్టు దగ్గర కూర్చో. మనం ఎక్కడికి వెళ్లాలో ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం అమ్మ. అని తల్లి నీ ఒక చెట్టు దగ్గర కూర్చోబెట్టి ఆమె ఆ చేపను తీసుకొని తను నది దగ్గరికి వెళుతుంది. ఆమె చాలా బాధ పడుతూ…. ఓ చేప నిన్ను చాలా బాధ పెంచుకుందామని అనుకున్నాను కానీ అదృష్టం నాకు లేదు నీతో నేను స్నేహం చేయలేక పోతున్నాను నన్ను క్షమించు. మేము ఉండడానికి ఏ మాకు నీడ లేదు. ఇంక నువ్వు మా వల్ల ఇబ్బంది పడడం నాకు అస్సలు ఇష్టం లేదు. నీకు ఇక్కడ చాలా మంది స్నేహితులు ఉంటారు. కానీ నన్ను కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకో నేను కూడా నీ స్నేహితురాలిని అంటూ ఆ చేపని నదిలో వేస్తుంది. అలా నదిలో వేసిన వెంటనే ఆ చేపా ఒక్కసారిగా పెద్దగా మారుతుంది.
ఆ చేపను చూసి పాప చాల భయపడుతుంది.
ఆ చేప…. భయపడకు నేను ఒక మాయ చేప ని. నన్ను ఇక్కడ వదిలి పెట్టి చాలా మంచి పని చేశావు ఇక నీ కష్టాలన్నీ తీరిపోయి నట్టే . నువ్వు నాతో పాటే ఉండొచ్చు అది కూడా నా శరీరంలో. అని అంటుంది ఆ మాటలకి పాపకి ఏం చెప్పాలో అర్థం కాదు.
పాప…. నాకు ఏమీ అర్థం కావడం లేదు నువ్వు ఏం చెప్తున్నావ్.
చేప …. ఇప్పుడు అర్థం అవుతుంది చూడు అని ఒక పెద్ద పడవ లాగా మారుతుంది ఆ పడవ పైన పెద్ద చేప. దాని లోపలికి ప్రవేశించడానికి ఆ చేప శరీరంపైన ద్వారాము
ఉంటుంది దాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతుంది పాప అది చూడ్డానికి చేప పడవ ఇల్లు లాగా ఉంటుంది అని ఎంతో కేరింతలు కొడుతూ ఉంటుంది పాప.
ఇక పాప చాలా సంతోష పడుతూ తన తల్లి దగ్గరికి వెళుతుంది. ఆమెతో…. అమ్మ అమ్మ త్వరగా రా మనకి ఇల్లు దొరికింది.
తల్లి…. ఎక్కడమ్మా ఎవరు ఇల్లు అది చెప్పు అమ్మా అని అడుగుతుంది. పాప జరిగిన విషయం అంతా చెబుతుంది దాన్ని విన్న ఆమె చాలా ఆశ్చర్యపోతూ…. భగవంతుడా ఈ రూపంలో మాకు సహాయం చేశావు అనమాట. సరే పద వెళ్దాం తల్లి అని ఆ సామాన్లు తీసుకొని ఇద్దరు బయలుదేరుతారు.
సరాసరి వాళ్ళు అక్కడికి వెళ్తారు పాప చేపతో… మా అమ్మ మా అమ్మ కి కళ్లు కనపడవు. మా అమ్మ ఈ ఇల్లు చూడటానికి కూడా నోచుకోలేదు . తను నా కోసం తన కళ్ళని త్యాగం చేసింది అంటూ జరిగిన విషయం చెప్పి ఏడుస్తుంది.
అప్పుడు ఆ మాయ చేప…. అయ్యో నువ్వేమి బాధపడకు మీ అమ్మ ఇప్పుడు నన్ను చూడగలదు అంటూ తన మాయాశక్తి తో ఆమెకు కళ్ళు అమరుస్తుంది. ఆమెకు చూపు వచ్చి ఆ ఇంటిని చూస్తుంది.
దానిని చూసి ఆమె చాలా ఆశ్చర్య పోతూ…. ఓరి భగవంతుడా ఎంత అందంగా ఉంది ఈ ఇల్లు. చాలా అద్భుతంగా ఉంది అంటూ చేప కి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది.
ఆ చేప…. మీరు ఇక ఇక్కడే సంతోషంగా ఉండొచ్చు నా మా శక్తితో మీకు కావలసిన ఆహారాన్ని నేనే అందిస్తాను. మీరు ఎక్కడికి వెళ్లాలి నా అవసరం ఉండదు.
అని చెబుతుంది ఆ మాటలకి వాళ్ళిద్దరూ చాలా సంతోష పడతారు వాళ్ళు నది ఓడ్డు నుంచి కొంచెం నడుచుకుంటూ వెళ్లి ఆ పదవిని ఎక్కుతారు.
ఇక దాన్ని ఎక్కి లోపలంతా చూసి…. చాలా చాలా అద్భుతంగా ఉంది. చాలా చాలా కృతజ్ఞతలు ఓ మాయ చేప అంటూ ఎంతో సంతోషంగా మరోసారి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఇక వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా అక్కడే ఉంటూ. వాళ్ల కావాల్సినవి తింటూ. ఎంతో సంతోషంగా వాళ్ల కొత్త జీవితానికి నాంది పలుకుతారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *