నదిలో మాయా టమాటా చెట్టు | Telugu kathalu | Telugu Stories | Telugu Moral Stories | Kattapa kathalu

ఆమె ఒక కూరగాయల వ్యాపారి పేరు కవిత. ఒకరోజు ఆమె నది దగ్గరకు బట్టలు ఉతకడానికి వెళ్తుంది. అప్పుడే నదిలో టమోటాలు కుప్పలు కుప్పలుగా కొట్టుకుపోతూ ఉంటాయి. వాటిని చూసి ఆమె చాలా ఆశ్చర్య పోతూ…. ఇదేంటి టమాటాలు కుప్పలు కుప్పలుగా వెళ్లి పోతున్నాయి. అని వాటిని తీసుకుని చూస్తుంది. కవిత…. తాజా టమోటోలు ఎక్కడికి వెళ్లి పోతాయి నా చేతిలో పడిన తర్వాత అని ఒక అటు ఇటు చూస్తుంది ఆమెకు రెండు కర్రలు కనబడతాయి. వెంటనే ఆమె ఆ కర్రలు కి చీరను కట్టి వల లాగా మార్చి ఆ టమాటాలు ఆ చీరలో పడే లాగా చేస్తుంది. ఆ టమోటా మొత్తం చీరలో పడతాయి. వెంటనే ఆమె ఆ బట్టలు టమాటాలు తీసుకొని తన ఇంటికి వెళ్తుంది.
ఆమె తన మనసులో… ఈ తాజా తాజా టమోటాలు ఎక్కడి నుంచి వచ్చాయో కానీ ఈరోజు నేను మార్కెట్కి వెళ్ళి టమోటాలు తీసుకు వచ్చే అవసరం లేకుండా పోయింది.
అని అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి ఒక ఆమె వస్తుంది. ఆమె పేరు విమల ఆమెది పేద కుటుంబం. విమలకు కవితా సహాయం చేస్తూ ఉంటుంది.
విమల…. కవితా అక్క కవిత అక్క అని పిలుస్తుంది అప్పుడు కవిత ఇంట్లో ఉండి ఆమెతో…. ఏమైంది విమల అక్కడే ఆగిపోయావు లోపలికిరా. అంటూ ఆమెనీ లోపలికి పిలుస్తుంది.అమి లోపలికి వెళ్తుంది. ఆమె
లోపలికి వెళ్ళిన తర్వాత కవిత విమల తో…. ఏమైంది విమల రెండు రోజుల నుంచి ఇంటికి రాలేదు. ఏమైంది కూరగాయలు కూడా ఏమీ తీసుకెళ్ళలేదు.
అందుకు ఆమె ఏడుస్తూ…. ఏం చెప్పమంటావు అక్క నా భర్త మంచాన పడ్డాడు. నేను ఏం పని చేసిన వచ్చే డబ్బులు మందులకి సరిపోతున్నాయి దానికితోడు నా కు కూడా ఒంట్లో బాగుండటం లేదు . అని ఏడుస్తూ సమాధానం చెప్తుంది.
కవిత… అయ్యో బాధపడకు కవిత .అనీ ఆమెను ఓదారుస్తుంది.
ఆ తర్వాత ఆమెకు కూరగాయలు ఇస్తుంది.
అలాగే నదిలో ఉన్న టమోటాను చాలా వాటిని ఆమెకు ఇస్తుంది.
వాటన్నింటినీ తీసుకుని ఆమె….. అక్క అక్క కి ఇన్ని సంవత్సరాల నుంచి నా మీద జాలి పడి నువ్వు నాకు డబ్బులు లేకుండా కూరగాయలు ఇస్తున్నావు. నీ రుణం నేను మర్చిపోలేను అక్క. చాలా కృతజ్ఞతలు అంటూ ఏడుస్తుంది అందుకు ఆమె…. ఎందుకలా మాట్లాడుతున్నావు అక్క అన్న ఒక అది చాలు . నాకంటూ ఎవరూ లేరు కదా.
అని అంటుంది అందుకు ఆమె చాల సంతోషపడుతూ వాటిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లి పోతుంది . ఆ తర్వాత కవిత… ఈరోజు ఏమి అనుకుంటూ నాది దగ్గరికి వెళ్ళానో కానీ టమాటాలు చాలా దొరికాయి అసలు ఎక్కడి నుంచి వచ్చాయో కూడా తెలీదు. ఏదేమైనా ఈ రోజు చాలా మంచి జరిగింది నాకు రెండు వేల రూపాయలు మిగిలిన టే అసలుకే టమాట ధర మండిపోతుంది. అయినా రేపు కూడా ఒక సారి అక్కడికి వెళ్ళి చూస్తాను రేపు కూడా టమాటా దొరుకుతుందేమో .
అని అనుకుంటుంది ఆ తర్వాత ఆమె కూరగాయల అమ్ముకుంటూ ఊర్లో….. రావాలి బాబు రావాలి తాజా తాజా కూరగాయలు. రావాలి బాబు రావాలి అంటూ బుట్టలో కూరగాయల అమ్మ కంటూ ఉంటుంది ఇంతలో ఒక ఆమె…. ఓ కూరగాయలు అమ్మే అమ్మాయి కవిత ఇలా రా. అని కేకలు వేస్తోంది కవిత అక్కడికి వెళుతుంది. ఆమె కవితా తో…. టమాటాలు ఉన్నాయా!?
కవిత ….ఉన్నాయి.
అని సమాధానం చెబుతుంది ఆమె…. ఒక కేజీ టమాటా ని ఇవ్వు .
అని అడుగుతుంది కవిత వెంటనే టమాటాలు తీయడానికి తన బుట్ట నీ దించి …… అయ్యో టమాటాల సంచి ఇంటి దగ్గరే మర్చిపోయి వచ్చానమ్మా. పొరపాటు లో హడావిడిగా వచ్చేసాను . ఇక వెనక్కి తిరిగి వెళ్ళకూడదు .
ఒకసారి ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళితే ఆ రోజు బేరం అంత వెనక్కి వెళ్లినట్లే ఉంటుంది .
అందుకు ఆమె సరే వెళ్ళు అని అంటుంది కవిత అక్కడ నుంచి తన వ్యాపారం చేసుకుని వెళ్ళిపోతుంది . ఇక కూరగాయలు అమ్ముకొని సాయంత్రం ఇంటికి తిరిగి వెళుతుంది .
అక్కడ విమల ఇంటి దగ్గర కూర్చుని ఉంటుంది విమల నీ చూసి కవిత ….. ఏంటి విమల ఏమైంది ఇక్కడ ఉన్నావు.
అని అడుగుతుంది అందుకు ఆమె…. చాలా సేపు నుంచి నీకోసం ఎదురు చూస్తున్న అక్క ఏం లేదు మా పక్కింటి వాళ్లు పొద్దున తీసుకొచ్చిన టమాటానీ చూసి చాలా బాగున్నాయి టమాటా పచ్చడి కోసం కావాలి అని అడిగారు డబ్బులు కూడా ఇచ్చారు నీ దగ్గర ఉన్న టమాటా అయిపోయినాయా ఉన్నాయా అక్క.
ఆమె…. పొద్దున టమాట తీసుకెళ్ళడం మర్చిపోయాను విమల ఉన్నాయి .
ఎన్ని కావాలట ఉన్న మొత్తం ఇవ్వు అక్క 1000 రూపాయలు ఇచ్చారు.
ఆమె…. సరే ఉన్నవి తీసుకెళ్ళు నాకు 500 రూపాయలు చాలులే. మిగిలిన 500 నీ ఖర్చులకు వాడుకో.అని డబ్బులు 500 తీసుకోని ఉన్నాయి మొత్తం ఇస్తుంది .
ఆమె వాటిని తీసుకొని అక్కడ నుంచి వెళ్లి పోతుంది. ఆరోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం మళ్లీ కవిత ఆ నది దగ్గర టమోటాల కోసం వెళ్తుంది. చాలా సమయం ఎదురు చూస్తుంది కానీ టమాటాలు దొరకవు ఆమె…. సరే నిన్ను ఏదో ఎలాగో టమోటాలు వచ్చాయి. ఎలా వచ్చాయో అర్థం కాలేదు కానీ.
అని అనుకొని తిరిగి వెళ్ళిపోతుంది ఇక ఆరోజు తన పని చేసుకొని మళ్ళీ కూరగాయల వ్యాపారానికి వెళుతుంది అలా రోజులు గడిచాయి. ఒకసారి ఆమె కూరగాయలు అమ్ముకుంటూ….. కూరగాయల అమ్మ కూరగాయలు రావాలి తాజా తాజా కూరగాయలు అని అనుకుంటూ వెళ్తూ ఉంటుంది అప్పుడే మా ఊర్లో ఉన్న బంగ్లా కి రంగులు వేస్తూ ఉంటారు దాన్ని చూసిన ఆమె …. ఎవరూ ఈ బంగ్లా అని కొన్నట్లు ఉన్నారు. అని అనుకుంటూ ఉండగా అక్కడ విమల…. సరిగ్గా చూసుకునే పని లేదా రంగులు వేయడం రాధా కొత్త ఏంటి. అబ్బాబ్బ ఈ పని వాళ్ళు ఇలా చేస్తారా అని అస్సలు అనుకోలేదు కాస్త డబ్బులు ఎక్కువైనా. మంచి పని వాళ్ళని తీసుకు రావాల్సింది అని అరుస్తూ ఉంటుంది దాన్ని చూసిన కవిత. విమల దగ్గరకు వెళ్లి…. విమల ఏంటి నువ్వు ఈక్కడున్నావు . ఏంటి నాకు అర్థం కాలేదు.
విమల…. ఎవరు మీరు నా పేరు విమల కాదు వెన్నెల మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో. అని అంటుంది ఆ మాటలు విన్న ఆమెకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది…. అయ్యో నన్ను క్షమించండి మా చెల్లెలు విమల అనుకొని ఆమె అక్కడి నుంచి పలకరించాను అని ఆమె అక్కడి నుంచి వెళ్లి పోతుంది .
ఇక రోజులు గడిచాయి అందరూ విమల గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు దాన్ని విన్న కవిత….. అయితే ఆరోజు నేను పలకరించింది విమల అనే కానీ నాతో ఎందుకు అలా మాట్లాడింది ఉన్నట్లుండి ఆమెకు అంత డబ్బు ఎలా వచ్చింది భర్త ఆరోగ్యం కూడా కుదుట పడింది. ఇదంతా ఎలా సాధ్యం. ఒకసారి వెళ్లి అడుగుదామా. కానీ మొన్న ఆమె నాతో అలా మాట్లాడను విధానం నచ్చలేదు ఎందుకో అలా అన్నది .
పైగా కొన్ని రోజుల నుంచి నా దగ్గరికి రావడం లేదు . అసలు ఏంటో తెలుసుకోవాలి అని ఆమె దగ్గరకు వెళ్తుంది . విమల ఆమెను చూసి… ఎవరూ అడుక్కునే వాళ్ళు వచ్చారు బిక్షము వేయండి పని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ పని చూడండి అని పెద్దగా అరుస్తూ ఉంది.
ఆ మాటలు విన్న విమలా చాలా బాధపడుతూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆమె మనసు చాలా బాధపడుతుంది .
ఆమెకు ఏమీ అర్థం కాదు . ఆమెకు ఇంట్లో ఏమీ తోచక రాత్రి సమయం నది దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది . అది పున్నమి రాత్రి చంద్రుడిని చూస్తూ ఆమె అన్నిటినీ మర్చిపోతుంది అప్పుడే ఒక్క సారిగా ఒక పడవ ప్రత్యక్షమవుతుంది.
పడవ ని చూసి ఆమె చాలా ఆశ్చర్యపోతుంది . ఆ పడవ ఆమెతో …. కవిత ఈ పడవలో ప్రయాణించు నిన్ను ఒక అద్భుతమైన వ్యక్తికి పరిచయం చేస్తాను.
అందుకు ఆమెకు నోటి వెంట మాట కూడా రాదు ఏం మాట్లాడకుండా చాలా ఆశ్చర్యపోతూ ఆ పడవలో ఎక్కుతుంది. చాలా దూరం వెళ్ళిన తరువాత ఆ పడవ ఒక పెద్ద టమాటా చెట్టు దగ్గర ఆగుతుంది.
ఆ పెద్ద పెద్ద టమోటాలను చూసి ఆమె చాలా ఆశ్చర్యపోతుంది. ఆ చెట్టు…. ఎలా ఉన్నావు కవిత బాగున్నావా. ఆమె బాగున్నాను అని చెబుతుంది చెట్టు…. అది సరే కానీ నీకోసం వజ్రాలు ఉన్న టమోటాలు పంపిస్తే పిచ్చిదాని లాగా వాటిని విమలకు ఇచ్చావ్ ఎందుకు.
ఆమె… మీరు మాట్లాడుతుంది నాకు ఏమీ అర్థం కావడం లేదు.
చెట్టు… సరే ఇలా చూడు ఆ రోజు విమల నీ దగ్గరకు వచ్చి టమాటాలు తీసుకు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో !? అని కళ్ళకి కట్టినట్టుగా ఒక దృశ్యాన్ని చూపిస్తుంది ఆ దృశ్యంలో. మొదటిసారి విమల టమోటాలు తీసుకువెళ్లి ఇంటి దగ్గర కూర వండడం కోసం వాటిని కోస్తుంది. వెంటనే అందులో నుంచి వజ్రాల వస్తాయి. వాటిని చూసి ఆమె ఆశ్చర్య పోయి అన్నిటినీ పోస్ట్ చూస్తుంది అన్నిట్లో వజ్రాలు ఉంటాయి. ఆమె…. ఇది మాయ టమోటాలు వెంటనే కవిత దగ్గర వీటిని దొంగతనం చేయాలి ఈ విషయం ఆమెకు తెలియక ముందే ఈ పని చేస్తా . ఇవి ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో తెలియదు కానీ నాకు మాత్రం చాలా అదృష్టం. అని అనుకొని ఆ వజ్రాల లో కొన్నిటిని అమ్మి డబ్బు తీసుకొచ్చి పరుగు పరుగునా వేళ్లి కవిత ఇంటి ముందు ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటుంది .
విమల… దేవుడి దయ వల్ల వాటిని అమ్మకుండా ఉంటే చాలు. అని అనుకుంటూ ఉంటుంది కవిత తిరిగి వస్తుంది .
కవితా టమాటాలు మర్చిపోయాను అని చెప్పినప్పుడు ఆమె … హమ్మయ్య అయితే అది మొత్తం నాకే సొంతం అని మనసులో అనుకుంది ఆ తర్వాత అబద్ధం చెప్పి ఆ టమాటాలు తీసుకుని వెళ్తుంది.
ఆ తర్వాత వాటిని అమ్మి వచ్చిన డబ్బుతో బంగ్లను కొంటుంది. ఆ రోజు కవిత ఆమెను పలకరించినప్పుడు తన మనసులో…. అమ్మో వజ్రాల గురించి తెలిసింది అంటే ఇంకా అదే పని. అని అనుకొని ఆమె పేరు అబద్ధం చెబుతోంది. ఇదంతా కళ్లకు కట్టినట్టుగా ఆ మాయ చెట్టు కవితకు చూపిస్తుంది.
కవిత చాలా ఆశ్చర్యపోతూ…. కానీ ఆమె నన్ను చాలా బాధ పరిచింది ఈరోజు అని జరిగిన విషయం చెప్తుంది మాయ టమాటా చెట్టు…. ఏం బాధపడకు నేను ప్రతి పౌర్ణమి రోజు ఉదయం . ఇలాగే వజ్రాల టమోటాలను నదిలో పంపిస్తూ ఉంటాను . అవి దొరికిన వాళ్ళు ధనవంతులు అవుతారు ఒక్క నువ్వు మాత్రం విషయం గమనించలేకపోయారు అందుకే నేను ఇక్కడికి తీసుకు వచ్చాను. పైగా నువ్వు కొన్ని సంవత్సరాలుగా ఆమెకు సహాయం చేస్తున్నావు నీ మంచి మనసు నాకు నచ్చింది. అందుకే ఇక్కడికి వచ్చావు ఇదిగో ఈ పెద్ద టమోటా తీసుకో ఇది నువ్వు ఏం కోరుకుంటే అది నీకు ఇస్తుంది.
అని పెద్ద టమోటా ని ఇస్తుంది దాన్ని చూసి …. చాలా కృతజ్ఞతలు అని ఆమె చెప్పుకుంటుంది ఆ తర్వాత మాయ చెట్టు …. చాలా మంచిది నిన్ను అవమానించిన విమల పరిస్థితి మారిపోతుంది మళ్లీ ఆమే మొదటి స్థానానికి వస్తుంది. ఆమె…. అయ్యో దయచేసి మీరు అలా చేయకండి. ఆమెది చాలా పేద కుటుంబం ఇప్పుడు కొంచెం బాగుపడింది అంతే చాలు. ఆమె స్థితిని మళ్ళీ మార్చకండి మీకు పుణ్యం ఉంటుంది. అని అంటుంది ఆమె మంచి మనసు మళ్ళీ చూసి మాయ చెట్టు…. చాలా గొప్ప దానివి అవుతావు అని దీవించి అక్కడి నుంచి పంపించి వేస్తుంది . ఆ మాయ టమాటా సహాయంతో ఆమె చాలా ధనవంతురాలు అవుతుంది. ఆ డబ్బుని ఎంతోమంది పేద వాళ్లకి అందిస్తూ చాలా సంతోషంగా జీవిస్తుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *