నాగిని కాపాడగలదా 11_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

పదో భాగం లో బైరవ శ్రీ కన్య కోసం వెతుక్కొంటూ వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ భాగంలో చూద్దాం. భైరవ అలా వెతుక్కుంటూ ఉండగా ఇంతలో శ్రీ కన్య ఒకచోట కనబడుతుంది. భైరవ తన మనసులో…. ఏమైంది ఈ శ్రీ కన్య కు ఇలా ఒంటరిగా కూర్చొని ఇక్కడ ఏం చేస్తుంది అబ్బా వెళ్లి అడిగితే పోలేదు.
అని అనుకొని శ్రీ కన్య దగ్గరకు దగ్గరకు వెళ్తుంది. భైరవ శ్రీ కన్య తో….. శ్రీ కన్య ఓ శ్రీ కన్య పిలుస్తుంది నిన్నే. అంటూ పిలుస్తుంది.
కానీ ఆమె మాత్రం పట్టించుకోకుండా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది.
భైరవ…. ఏమైంది ఈ శ్రీ కన్య కు నా మాట కూడా పట్టించుకోవడం లేదు. అనుకుంటుంది . అప్పుడే శ్రీకన్య లేచి నడుస్తూ తన లో….. నేను నా స్నేహితులనీ కలిసి చాలా రోజులు అవుతుంది. నాకు వాళ్ళని చూడాలనిపిస్తుంది నేను ఒంటరిగా ఇక్కడ ఉండలేకపోతున్నాను. నాకు చాలా కష్టంగా ఉంది అంటూ బాధపడుతూ ఏడుస్తుంది అప్పుడే భైరవుడు అక్కడికి వచ్చి…. ఏమైంది శ్రీ కన్య ఎందుకు అలా బాధ పడుతున్నావు.
శ్రీ కన్య…. భైరవ నాకు ఇక్కడ నుంచి మన ఊరికి వెళ్లాలని ఉంది నా మిత్రులతో ఆడుకోవాలని ఉంది.
అందుకు భైరవుడు….. సరే కదా అయితే మనం ఎవరికీ చెప్పకుండా అలా వెళ్లి ఇలా వచ్చేద్దాం. అని అనుకొని ఇద్దరూ కలిసి ఊరికి బయలుదేరతారు అలా ఇద్దరు వెళుతుండగా మార్గ మధ్యలో శ్రీ కన్యకు చెరకురసం బండి కనబడుతుంది.
ఆమె చాలా సంతోష పడుతూ….
అబ్బా చెరుకు రసం తాగి ఎన్ని రోజులు అవుతుందో. అని అక్కడికి వెళ్తూ ఉంటుంది
భైరవుడు కూడా చిన్నగా వెలుగుతూ ఉంటాడు అప్పుడే దగ్గరలో ఒక ఎద్దు ఉంటుంది. ఆ శ్రీ కన్య వేసుకున్న ఎర్రని వస్త్రాలు చూసి చాలా చూస్తూ తన కట్లను విప్పుకొని ఆమె వైపు ఒక్కసారిగా దూసుకొని వస్తుంది. ఆమె చాలా భయపడుతూ పరుగెడుతూ ఉంటుంది ఇంతలో ఆ ఎద్దు వెనకనుంచి వచ్చి ఆమెను దూరంగా తన కొమ్ములతో విసిరి కొడుతుంది. ఆమె వెళ్ళి సరాసరి ఆ చెరుకు రసం బండి పై పడి తన కాలు ఇరుక్కు పోతుంది. (ఆ చెరకురసం బండి పై పడి తన చేయి ఇరుక్కు పోతుంది.)
ఆమె పెద్దగా అరుస్తూ….. అమ్మ భగవంతుడా. నొప్పి నా చేయి. (నా కాలు) నుజ్జు నుజ్జు అయిపోయింది. రక్తం ధారగా కారుతుంది. అమ్మ ఎవరైనా నన్ను కాపాడండి. sooha తప్పి కింద పడిపోతుంది దాన్నంతా చూస్తున్నా . వాళ్లు చాలా భయపడుతూ ఆమె దగ్గరికి వెళ్లడానికి కూడా ఇష్టపడరు.
వాళ్లు దూరంగా నిలబడి ఆమెను చూస్తూ ఒకరితో ఒకరు…. అబ్బా ఎంత దారుణం జరిగిపోయింది. రక్తం ధారలుగా కారి పోతుంది ఎంత దురదృష్టవంతురాలు ఈ అమ్మాయి పాపం అనిపిస్తుంది అంటూ ఆమె పై జాలి కలుస్తారు కానీ ఎవరు ముందుకు మాత్రం వెళ్లరు.
దానంత చూస్తున్న bairavaa చాలా బాధ పడుతూ….. శ్రీ కన్య నీకు ఏం కాదు ధైర్యంగా ఉండు. నాగినినీ పిలుద్దాం అని తన మనసులో అనుకుంటూ నాగిని నీ ప్రార్థిస్తూ ఉంటుంది .
అక్కడ నాది నీ స్వామీజీ ఇద్దరూ ఘోర పూజలో నిమగ్నమై పోయి ఉంటారు.
ఎంత పిలిచినా నాగిని రాకపోవడంతో.
ఆ కుక్క తనకి శక్తులు ఉన్న సంగతి గుర్తు తెచ్చుకొని పెద్ద ఆకారంలోకి మారుతుంది. అలా మారిన తరువాత భైరవుడు నోటితో శ్రీ కన్య ను పట్టుకొని అక్కడి నుంచి పరుగులు తీస్తూ ఉంటాడు. మనుషులు అంతా దూరంగా పరుగులు తీస్తారు. ఆ భైరవుడు సరాసరి అడవిలోకి వెళ్లి . ఆమెను కిందకు దించి అక్కడ వున్న వాళ్ళని పిలుస్తూ ఉంటాడు అప్పుడు నాగిని స్వామీజీ ఒక్కసారిగా పూజ నుంచి లేచి పరుగుపరుగున అక్కడ చేరుకుంటారు అప్పుడు ఆ భైరవుడు జరిగిన విషయమంతా చెప్పాడు. దానిని విన్న వాళ్లు చాలా ఆశ్చర్యపోతారు.
నాగిని…. అసలు ఎవరు మిమ్మల్ని వెళ్ళమని చెప్పారు. అయ్యో ఎంత దారుణం జరిగిపోయింది. తన చేయి అంతా నుజ్జునుజ్జు గా మారిపోయింది. (తన కాలు అంతా నుజ్జు నుజ్జు మారిపోయింది)
అంటూ బాధపడుతుంది.
ఆ తర్వాత నాకు నీ తన మాయాశక్తి తో ఆమె కాలునీ (ఆమె చేతిని) తిరిగి ప్రత్యక్షం చేసి ఆమెను మేలుకొనిలా చేస్తుంది.
అప్పుడు శ్రీ కన్య మేలుకొని ఆమెనీ ఆమె చూసుకొని….. ఏడుస్తూ అమ్మ నాగిని మీకు చాలా కృతజ్ఞతలు నేను మళ్ళీ చనిపోయాడని అనుకున్నాను. ఎవ్వరూ నా దగ్గరికి కూడా రాలేదు. నేను చాలా పెద్ద పొరపాటు చేశాను. మీకు ఎవరికీ చెప్పకుండా గ్రామానికి వెళ్లినందుకు నన్ను క్షమించండి.
ఇంకెప్పుడు ఇలా చెయ్యను నాకు బుద్ధొచ్చింది అంటూ చాలా బాధపడుతుంది.
దాని అంతా చూస్తున్న తల్లి…..ఊరుకో అమ్మ దేవుడు మనకి కష్టం ఇచ్చిన వాటన్నిటినీ జయించి కలిగే శక్తిని ఇస్తున్నాడు మనకు తోడుగా వీళ్ళందర్నీ ఇస్తున్నాడు. బాధపడకు ఇంకెప్పుడు గ్రామంలోకి వెళ్ళకు.
అని అంటుంది అందుకు శ్రీ కన్య…. సరే అమ్మ ఇంకెప్పుడు నేను వెళ్ళను. అంటూ ఉండగా
నాగిని ఆమెతో ….. శ్రీ కన్య నువ్వు నీ స్నేహితులతో ఆడుకోవాలి అంతే కదా నేను ఇప్పుడే చింటూ గణేశుని పిలుస్తాను.
అంటూ తన మాయాశక్తి తో ఆ పిల్లలిద్దర్ని అక్కడికి రప్పిస్తుంది.
వాళ్ళిద్దరూ చూసినా శ్రీ కన్యా చాలా సంతోష పడుతూ…..మిత్రులారా మీ ఇద్దరినీ చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. అంటూ ఆనంద భాష్పాలు కురిపిస్తుంది.
ముగ్గురు కలిసి అక్కడ సంతోషం గా ఆడుకుంటారు. చీకటి పడడంతో నాగిని…. ఇంక మీరు ఇళ్లకు వెళ్లే సమయం అయింది. ఇక వెళ్ళండి కావాలంటే రేపు నేను మిమ్మల్ని తీసుకు వస్తాను అని చెప్పి.
వాళ్ళిద్దర్నీ మాయం చేసి వాళ్ళ ఇంటికి పంపిoచేస్తోంది.
ఆ తర్వాత నాగిని…. శ్రీ కన్య నువ్వు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నావు కదా. ఇంకెప్పుడైనా నీకు మీ స్నేహితులతో ఆడుకోవాలనిపిస్తే. నాకు చెప్పు నేను వారిని తీసుకొని వస్తాను. అని అంటుంది అందుకు ఆమె సరే అంటుంది అలా మరి కొన్ని రోజులు గడిచాయి. చింటూ గణేష్ లు ఇద్దరూ కూడా శ్రీకన్య దగ్గరికివచ్చి ఆడుకుంటూ చాలా సంతోష పడుతూ ఉంటారు రోజులు గడిచాయి.
ఒకరోజు శ్రీ కన్య తండ్రి పండ్ల కోసం అడవిలోపలికి విషపూరితమైన పాము కాటు వేసి కింద పడి….. అమ్మ శ్రీ కన్య నాగిని ఎక్కడున్నారు.ఎవరైనా నన్ను కాపాడండి అంటూ కేకలు వేస్తాడు నాగిని ఆ కేకలు విని అతని దగ్గరకు చేరుకునేలోపే అతని ప్రాణం పోతుంది.
అతన్ని చూసి నాగిని చాలా బాధపడుతూ …. అయ్యో ఎంతపని జరిగిపోయింది.
అంటూ చాలా బాధపడుతుంది ఇంతలో అతని భార్య , శ్రీ కన్య స్వామీజీ భైరవ అందరూ అక్కడికి చేరుకుంటారు .
భార్య… ఏమండీ ఒకసారి లేవండి నన్ను చూడండి. నాగమ్మ కాపాడు తల్లి భర్త ప్రాణాలు కాపాడు. నీకు ఎన్నో మహా శక్తులు ఉన్నాయి కదా. నా భర్తను కాపాడు అంటూ భోరున ఏడుస్తూ విలపిస్తుంది.
శ్రీ కన్య….. ఒక్కసారి లే నాన్న నన్ను చూడు నాన్న. స్వామి నా తండ్రిని కాపాడండి మీ కాళ్లు పట్టుకుంటాను.తండ్రీ నీ కాపాడండి అంటూ ఆమె కూడా పెద్ద పెద్దగా ఏడుస్తుంది.
నాగిని ఆ దృశ్యాన్ని చూసి చాలా బాధ పడుతూ… నేను ఏం చేయలేను ఆయన కాలం ముగిసింది. అంతే పరమేశ్వరు ఆడిన ఆట ముగింపు చేరుకుంది.
శ్రీ కన్య…..అమ్మ మరి ఎన్నో మాయలు శక్తులు ఉన్నాయి కదా నాకు ఎన్నో సార్లు మీరు ప్రాణ బిక్ష పెట్టారు మరి నా తండ్రి విషయంలో ఎందుకు అలా మాట్లాడుతున్నారు.
దయచేసి నా తండ్రిని కాపాడండి.
నాగిని….బాగు చేయడం వరకే నా బాధ్యత కాని ప్రాణాలు తిరిగి తీసుకు వచ్చే అంత గొప్ప శక్తి కాదు.
స్వామీజీ….. అవునమ్మా జంతువులకి ఆత్మ ఉండదు కాబట్టి మేము వాటిని బ్రతికించ గలము కానీ మనిషికి ఆత్మ ఉంటుంది.
చావు పుట్టుక అనేది ఈ లోకంలో సహజమే కదా. ఇంకా జరిగిందేదో జరిగిపోయింది.
జరగవలసిన కార్యక్రమం చూద్దాం అని అంటాడు. వాళ్ళిద్దరూ అక్కడే చాలా సమయం వరకు ఏడుస్తూ కూర్చుంటే ఆ తర్వాత నాగిని…. బాధపడకండి ఇక దూరంగా జరగండి అంటూ తన మాయాశక్తి తో భూమినీ రెండు భాగాలుగా చీల్చి వేస్తుంది అతని శరీరం భూమి లోపలికి వెళ్లి భూమి మళ్లీ అదే స్థానానికి వస్తోంది.
దాన్ని చూసి వాళ్ళు చాలా బాధపడుతూ అక్కడినుంచి ఇళ్ళకు తిరిగి వెళ్ళారు రోజులు గడిచాయి. చనిపోయిన అతను దెయ్యం గా మారతాడు. అతని ఆత్మ అక్కడే తిరుగుతూ ఉంటుంది.
అది ఒకసారి భైరవునికి కనిపించడంతో భైరవుడు పెద్ద పెద్దగా అరవడం మొదలు పెడతాడు.
అప్పుడు ఆత్మ భైరవుని దగ్గరికి వచ్చి….. భైరవ ఎందుకు నన్ను చూసి అలా అరుస్తున్నావు నేను నిన్ను ఏమీ చేయను.
నా భార్య బిడ్డలు చూసుకోవడం కోసం నేను ఇక్కడ తిరుగుతూ ఉన్నాను. నన్ను నేను కాపాడుకోలేక పోయినా వాళ్ళిద్దరినీ నేను కాపాడుకోవాలి కదా. అని అంటాడు అందుకు భైరవుడు చాలా బాధ పడుతూ…. అవును మీరు బ్రతికి ఉంటే చాలా బాగుండేది.వాళ్లకి చాలా తోడుగా ఉండేది కానీ ఇప్పుడు వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు భోజనం సరిగా చేయడం లేదు ఎప్పుడు మీ గురించే ఆలోచిస్తున్నారు ఎప్పుడూ నీ ధ్యాసే పట్టుకున్నారు.
వాళ్ళు తృప్తిగా భోజనం చేసి ఎన్నో రోజులు అవుతుంది స్వామీజీ నాగిని ఎన్ని చెప్పిన వాళ్లు మాత్రం వాళ్ల మొండి పట్టు వీడటం లేదు మీరు ఒకసారి వాళ్ళకి కనిపించి వాళ్ళ చేత భోజనం తినిపించండి. అని చెప్తాడు భైరవుడు అందుకు తను సరే అని చెప్పి .
ఇంటి లోపలి కి వెళ్తాడు అప్పుడు ఆ తల్లి కూతురు ఇద్దరూ ఎంతో బాధపడుతూ…..ఆ భగవంతుడు మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్లాడు. నాకు చాలా బాధగా ఉంది నన్ను కూడా తీసుకెళ్తే బాగుండు. ఇద్దరం ఒకే చోట కలిసి ఉండేవాళ్ళం. అంటూ భోరున ఏడుస్తూ ఉండగా ఆత్మ అక్కడికి వచ్చి…. అయ్యో ఎందుకు నా గురించి ఇంకా ఆలోచిస్తూ బాధపడుతున్నారు. మీరు అలా బాధ పడ్డ నాకు ఏమాత్రం ఇష్టం లేదు. మీరు ఎప్పటిలాగే సంతోషంగా నవ్వుతూ ఉండాలి.
భార్య…. ఎలా ఉంటానండి . మీరు లేకుండా మిగిలిన జీవితాన్ని ఊహించుకుంటేనే చాలా ఘోరంగా ఉంది. ఈ బాధను భరించలేను నన్ను చంపేయండి. నేను కూడా మీ దగ్గరికి వచ్చేస్తాను.
భర్త… దయచేసి అలా మాట్లాడకు నువ్వు చేస్తే ఆ బిడ్డ వంటరిగా మిగిలిపోతుంది. నాగిని స్వామీజీ బైరవ వీళ్ళ ముగ్గురు ఉన్న తల్లి ప్రేమ లేకపోతే ఎవరైనా పూర్తిగా కుంగిపోతారు. అందుకే నువ్వు బ్రతికి ఉండాలి ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలి.
అప్పుడు శ్రీ కన్యా ఏడుస్తూ….. నన్ను మీ కడుపున నిన్ను పుట్టకపోయినా నన్ను ఎందుకు ఇంతగా ప్రేమిస్తున్నారు. పాపిష్టి దానిని నేను నీకు దొరక్కపోయినా బాగుండేది. నీకు ఎన్ని కష్టాలు వచ్చేవి కాదు మీరు ఇక్కడ దిక్కులేని చావు చావాల్సిన్న అవసరం ఉండేది కాదు . తప్పంతా నాదే నన్ను చంపేయండి అంటూ ఏడుస్తూ తల బాధకుంట్టి ఉంటుంది.
అప్పుడు తండ్రి…. వద్దు శ్రీ కన్య అలా చేయకు విధి రాసిన రాత ను ఎవరు తప్పించుకోలేరు.
ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది.
నేను మీ దగ్గరికి రావడం నాకు సంతోషంగా ఉంది మరి నేను మీ దగ్గరికి రావడం మీకు సంతోషంగా ఉందా.
అందుకు వాళ్ళిద్దరూ…. మాకు చాలా చాలా సంతోషంగా ఉంది.
భర్త…. అయితే మీరు నన్ను నిజంగా ప్రేమించి సంతోషపరిచాడు అనుకుంటే భోజనం చేయండి లేదంటే ఇంకెప్పుడు నేను మీ కంటికి ఇలా కూడా కనపడను.
అందుకు అతని మాటలకు భయపడి వాళ్ళు…. వద్దు వద్దు మీరు అలా చేయకండి మేమిద్దరం భోజనం చేస్తాం అంటూ ఇద్దరు కూర్చుని భోజనం చేస్తారు.
ఆ తర్వాత అతను …. ఇప్పుడు నాకు.చాలా సంతోషంగా ఉంది ఇక నేను వెళ్లి వస్తాను.
అని చెప్పి అక్కడ నుంచి మాయమై పోతాడు.
ఆ తర్వాత ఏం జరిగిందో తరువాయి భాగంలో చూద్దాం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *