నాగిని కాపాడగలదా 14_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

కింది భాగంలో అందరూ కొత్త ప్రదేశం నుంచి. సంతోషంగా తిరిగి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ భాగంలో తెలుసుకుందాం. కొన్ని రోజులు గడిచాయి.

భైరవ ఒక్కటే ఒంటరిగా కూర్చొని అక్కడున్న పక్షులన్నీ చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది.
ఇంతలో దేవకన్య అక్కడికి వచ్చి…. ఏమైంది భైరవ ఏదో ఆలోచిస్తున్నావ్.
భైరవ…. దేవకన్య నువ్వు మొదటిగా ఇక్కడికి వచ్చేటప్పుడు రెండు రెక్కలు ఉన్నాయి కదా. వాటితో నువ్వు చాలా బాగా ఎగురుతూ ఉంటావు ఇప్పుడు ఆ పక్షుల చూస్తుంటే నాకు కూడా అలా గాలిలో ఎగరాలని ఉంది.
దేవకన్య… అయ్యో భైరవ అది అంత లోపు నీకు రెండు రెక్కలు ప్రసాదిస్తాను. నువ్వు గాల్లో తిరిగి రా.
అందుకు భైరవ…
త్వరగా ప్రసాదించు మిత్రమా నాకు ఎప్పుడెప్పుడు ఆకాశం లోకి వెళ్ళాలని ఉంది.
వెంటనే దేవకన్య ఆ కుక్కకి రెండు రెక్కలు ప్రసాదిస్తుంది. ఆ కుక్క చాల సంతోషపడుతూ ఆకాశంలో ఎగురుతుంది.
అప్పుడే దానిని చూసిన శ్రీ కన్య ఆశ్చర్యంగా… మిత్రమా నాకు ఆశ్చర్యంగా ఉంది.
నువ్వు ఎలా ఎగురుతున్న అని అడుగుతుంది.
పైన ఎగురుతున్న జరిగిన విషయం చెప్తాడు.
శ్రీ కన్య పెద్దగా కేకలు వేస్తూ…. మిత్రమా నన్ను వదిలేసి అలా తిరుగుతున్నావ్ కిందికి రా ఇద్దరం కలిసి తిరుగుదాం.
అని అంటుంది అందుకు భైరవ సరే అని చెప్పి
కిందికి వస్తాడు. అప్పుడు తన ఆకారం పెద్దగా మార్చుకుంటాడు. తర్వాత శ్రీ కన్య తన మీద ఎక్కి కూర్చుంది. అప్పుడు దేవకన్య వాళ్ళతో…..మిత్రులారా మీరు ఎక్కడికైనా వెళ్లండి కానీ సాయంత్రం సూర్యుడు అస్తమించే లోపు ఇల్లు చేరుకోండి లేదంటే మీకున్న శక్తి మాయమైపోయి చాలా ఇబ్బంది పడతారు.
అందుకు వాళ్ళు…. సరే మిత్రమా నువ్వు చెప్పినట్టే త్వరగా తిరిగి వస్తాము. అని చెప్పి గాల్లోకి ఎగురుతారు. అలా వాళ్ళు ఇద్దరు చాలా దూరం ప్రయాణిస్తారు. అలా వెళ్తూ ఉండగా వాళ్లకు కింద ఒక పెద్ద కోట కనబడింది. దాన్ని చూసిన శ్రీ కన్య…. మిత్రమా త్వరగామనం ఆ కోటలోకి వెళ్దాం అక్కడ ఏమి ఉందో చూసి వద్దాం పద. అని అంటుంది అందుకు భైరవ సరే అని చెప్పి కిందికి దిగుతాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఆ కోటలోకి ప్రవేశిస్తారు. అక్కడ పెద్ద పెద్ద శిల్పాలు ఉంటాయి.వాటిని చూస్తూ వాళ్లు చాలా ఆశ్చర్య పోతారు.
వాళ్ళు మొత్తం తిరిగి చూస్తూ ఉంటారు చాలా పెద్ద కోట అక్కడ పెద్ద తోట కూడా ఉంటుంది ఆ తోట లోకి వెళ్తారు.
శ్రీ కన్య….. అబ్బా ఎంత అందంగా ఉంది భైరవ ఇది చాలా చాలా బాగుంది. భైరవ… నిజంగా చాలా బాగుంది. శ్రీ కన్య అంటూ మొత్తం తిరుగుతూ ఉంటారు .
వాళ్ళు ఆ ఆనందంలో సమయము పట్టించుకోరు. చీకటి పడుతుంది భైరవకు ఉన్న రెక్కలు మాయమైపోతాయి.
దానిని చూసిన వాళ్ళు ఇద్దరు చాలా ఆశ్చర్య పోతూ…. అయ్యో మనం సమయం మర్చిపోయినట్టున్నాము.
అందుకే లెక్కలు మాయమైపోయాయి.
శ్రీ కన్య…. అయ్యో మిత్రుమా ఇప్పుడు ఎలాగా నాగినినీ పిల్వచ్చిందే నా.
భైరవ….కాదు మనం ప్రతి దానికి నాగిని చూస్తున్నాము అసలు నాకు ఉన్న శక్తి సంగతి మరచిపోయావా. నా మెడలో ఉన్న రుద్రాక్ష స్వామీజీ బహుమానంగా ఇచ్చింది ప్రమాదంలో ఉన్నప్పుడు దీనిని ఉపయోగించమని. అందుకు ఆమె ….నిజమే
ఇంకెందుకు ఆలస్యం నీ మాయాశక్తి ని ఉపయోగించి.రెక్కలు తీసుకొని రా మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. అని అంటుంది అందుకు భైరవ తన శక్తిని ఉపయోగించి పెద్ద ఆకారం లోకి మారి రెక్కలు తెచ్చుకుంటాడు.
వెంటనే శ్రీ కన్య భైరవ పై కూర్చొని ఆకాశంలోకి ఎగరడం మొదలుపెడతారు.
ఇది ఇలా ఉండగా దేవకన్యా ఇంటి దగ్గర చాలా కంగారుపడుతూ వాళ్ళ కోసం ఎదురు చూస్తు….. అయ్యో నేను చెప్పిన సంగతి మర్చిపోయినట్టున్నారు. అందుకే తిరిగి రాలేదు చాలా ఇబ్బంది పడుతున్నట్టు ఉన్నారు. అని కంగారు పడుతూ ఉండగా.
వాళ్ళిద్దరూ ఆకాశం నుంచి ఆమె ముందు ప్రత్యక్షం అవుతారు.
దాన్ని చూసిన దేవకన్య చాలా ఆశ్చర్య పోతూ…. ఇది ఎలా సాధ్యం నేను నమ్మలేకపోతున్నాను.
అప్పుడు భైరవ తనకున్న శక్తిని గురించి వివరిస్తాడు. దాన్ని విన్న ఆమె…. మరి ఇంకేం ఇందాక కూడా రెక్కలు నువ్వే తెచ్చుకోవచ్చు కదా. నన్ను అడగడం ఎందుకు.
భైరవ…. ఆ సంగతి మర్చిపోయాను. అనుకోకుండా గుర్తొచ్చింది. అని చెప్తాడు అందుకు ఆమె.,.. సరే మంచిది ఎక్కడికి వెళ్లారు అంటూ వివరాలు అడుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళింది ఏం చేసింది అంతా చెప్తారు. దాన్ని విని ఆమె చాలా సంతోషపడుతుంది. భైరవ మామూలు స్థితికి వచ్చేస్తాడు . వాళ్లు చాలా సేపు మాట్లాడుకుని విశ్రాంతి తీసుకుంటారు . ఆ రాత్రి గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం. శ్రీ కన్య తల్లి దగ్గరికి వెళ్లి…. అమ్మ ఎన్నో రోజుల నుంచి నువ్వు ఈ అడవిలోనే ఒంటరిగా ఉన్నావు. మేము అంతా బయట తిరిగి వస్తున్నాము. నువ్వు మాత్రం ఇంట్లోనే ఉంటున్నా ఈరోజు మనం ఎక్కడికైనా వెళ్దామా అమ్మ.
అందుకు తన తల్లి…… నాకెందుకమ్మా మీరు చిన్న పిల్లలు మీరు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. నా గురించి వదిలేయ్ అని ఉంటుంది అందుకు ఆమె….. అలా ఏమి కుదరదు. ఈరోజు నువ్వు నేను భైరవ బయటికి వెళ్తున్నాము. కాదానకు అమ్మ.
అందుకు ఆమె…. సరే అయితే ఎక్కడికి వెళుతున్నామో చెప్పు. అంటుంది అందుకు ఆమె… చెప్పను నువ్వు చూస్తే మీకే అర్థమవుతుంది అది నీకు చాలా బాగా నచ్చుతుంది. అని అంటుంది అందుకు ఆమె సారీ ఉంటుంది కొంత సమయానికి భైరవ కు విషయం అంత చెప్తుంది శ్రీ కన్య.
అందరూ సిద్ధంగా ఉంటారు. శ్రీ కన్య భైరవతో…. సరే అయితే నువ్వు రెక్కలతో సిద్ధంగా ఉండు అమ్మ నేను ఇద్దరం కూర్చుంటాం అని అంటుంది. భైరవ….సరే అయితే అని పెద్ద ఆకారంలో కి మారి రెక్కలు తెచ్చుకుంటాడు.
వాళ్ళిద్దరూ భైరవ మీద కూర్చుంటాడు బైరవ ఆకాశంలోకి ఎగురుతాడు. శ్రీ కన్య తల్లి చాలా సంతోషపడుతూ… అమ్మో నాకు చాలా భయంగా ఉంది కానీ చాలా అద్భుతంగా ఉంది. ఆకాశంలో ఎగరడం నాకు చాలా ఉల్లాసంగా ఉంది.
అంటూ చాలా సంతోషపడుతుంది భైరవ సరాసరి వాళ్ళు తిరిగి చూసిన కోట దగ్గరకు తీసుకెళతాడు. అక్కడ ఆమె చాలా ఆశ్చర్యపోతూ….. అమ్మో ఇంత పెద్ద కోట నేను ఎప్పుడూ చూడలేదు. చాలా బాగుంది అంటూ కోట మొత్తం తిరిగి చూస్తుంది.
అలాగే అక్కడ ఉన్న తోట కూడా తిరిగి చూస్తుంది. అలా చాలా సమయం వరకు వాళ్ళు అక్కడే తిరుగుతూ చాలా సంతోష పడతారు. శ్రీ కన్య తల్లికి చాలా ఆకలిగా ఉంటుంది ఆమె bairavaa తో….. భైరవ నాకు చాలా ఆకలిగా ఉంది. దగ్గరలో ఊరు ఏమన్నా ఉందేమో చూడు అక్కడికి వెళ్లి భోజనం చేద్దాం .
భైరవ…. ఇది చాలా దూరం కదమ్మా ఈ చుట్టుపక్కల అలాంటిదేమీ ఉండదు.
అప్పుడు ఆమె …. చాలా ఆకలిగా ఉంది ఇంటి దగ్గర నుంచి ఏమైనా తీసుకురా వలసిందే. అనుకుంటూ ఉండగా బైరవ తన శక్తితో ….. రుచికరమైన రకరకాల ఆహార పదార్థాలు కావాలి. అని కోరుకుంటాడు వెంటనే అవన్నీ అక్కడ ప్రత్యక్షమవుతాయి.
వాటన్నిటినీ వాళ్లు శుభ్రంగా తింటారు.
వాటన్నిటికీ తిన్న తర్వాత వాళ్ళు కొంత సేపు అక్కడే తిరుగుతూ ఉంటారు.
ఇంతలో ఒక చెట్టు నుంచి వాళ్లకి స్వరo వినపడుతుంది … కాపాడండి ఎవరైనా నన్ను కాపాడండి అంటూ భైరవ దాన్ని చూసి…. ఎవరిది ఎవరు మాట్లాడుతుంది.
అంటారు ఎందుకు ఆ చెట్టు …. ఈ చెట్టు లోపల నన్ను బంధీగా బందీగా ఉంచారు.
దయచేసి నన్ను కాపాడండి. అంటూ కేకలు వేస్తారు
శ్రీ కన్య… భైరవ నాకెందుకో చాలా భయంగా ఉంది. ఇదంతా ఏ మంత్రంగాడి పని కాదు కాదు. అని అంటుంది .
భైరవ… నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను.
శ్రీ కన్య తల్లి…. మనకు ఎందుకు వచ్చిన గొడవ మన వెళ్లి పోదాం పదండి.
అని అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా ఆ చెట్టు నుంచి మళ్ళీ….. అయ్యో దయచేసి నన్ను కాపాడండి నేను మీలో ఎవరికి హాని చేయను . దయచేసి నన్ను కాపాడండి ఈ చెట్టును కూల్చి వేయండి. నన్ను కాపాడండి అంటూ పెద్ద పెద్దగా అరుస్తుంది.
అందు కు వాళ్ళు సహాయం చేద్దాం అని అనుకోని ఆ చెట్టుని కూల్చేస్తారు.
వెంటనే ఆ చెట్టు నుంచి ఒక పెద్ద పాము బయటకు వచ్చి…. నీకు చాలా చాలా కృతజ్ఞతలు మిత్రులారా. నన్ను నన్ను ఎవరో ఒక మాంత్రికుడు బంధించాడు. నేను మిమ్మల్ని పిలుస్తిఉన్నాను కానీఏర్పడలేదు అలా ఎందుకు జరిగిందో నాకు కూడా తెలియదు.
ఈరోజు నా సమయం చాలా బాగుంది. భగవంతుని దయవల్ల మీరు మళ్లీ ఇక్కడికి వచ్చారు నా స్వరాన్ని విన్నారు. అందుకే నేను బయటికి వచ్చాను.
అంటూ వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది.
ఆ మాటలు విన్న భైరవ…. ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావు కదా. ఇక స్వేచ్ఛగా జీవించు. అని అంటుంది అందుకు ఆ పాము… సరే మిత్రులారా ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. ఆ మాంత్రికుడు ఎప్పుడైనా రావచ్చు. అందుకే మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపొండి అని అంటుంది.
అందుకు వాళ్లు సరే అని చెప్పి అక్కడి నుంచి బయల్దేరుతారు. వాళ్ళు మళ్ళీ ఆకాశంలో ఎగురుతు తిరిగి ఇంటికి వస్తారు.
అక్కడ స్వామీజీ దేవకన్య నాగిని ముగ్గురు… మీరు ఎక్కడికి వెళ్లారో మాకు తెలుసు కానీ ఆ పదేపదే అక్కడికి ఎందుకు వెళ్తున్నారు. అది అంత మంచి ప్రదేశం కాదు. ఇంకెప్పుడూ అటుగా వెళ్ళకండి.
అని అంటాడు అందుకు భైరవ… మరేం పర్వాలేదు ఇప్పుడు నాకు కూడా శక్తులు ఉన్నాయని తెలిసింది వాటిని ఉపయోగిస్తున్నాను. మా గురించి మీరు ఎవరు కంగారు పడొద్దు. నేను ఉన్నా కదా అంటూ వాళ్ళకు చెప్తాడు ఆ మాటలు విన్న వాళ్లు… భైరవ నువ్వు అందరినీ సరైన సమయంలో కా పడుతున్నావ్. ముందు నీ గురించి కూడా ఆలోచించి ఆ తర్వాత మా గురించి ఆలోచించు.
భైరవ…. నా జీవితం కంటే ముందు మీ జీవితం నాకు చాలా ముఖ్యమైంది . మీరు బాగుంటే నేను కూడా బాగున్నాను నా గురించి మీరు ఆలోచించండి.
అని అంటాడు స్వామి…. సరే మరి ఏం పర్వాలేదు. కొన్ని రోజుల్లో శివరాత్రి రాబోతుంది. మనం జాగరణ చేస్తూ స్వామినీ అంటి పెట్టుకుని పూజ చేసుకునాదం మీరు ఎవరు ఎక్కడికి వెళ్ళకండి.
అందుకు వాళ్ళు…. సరే మేము ఎక్కడికి వెళ్ళాము ఇక్కడే ఉంటామ్ము ఆ స్వామిని దర్శించుకుంటాము.
స్వామీజీ…. అయితే రాబోయే పూజకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయండి.
అని అంటారు వాళ్ళు సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్లి ఏర్పాట్లు మొదలుపెడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాత భాగంలో చూద్దాం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *