నాగిని కాపాడగలదా 5_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

నాలుగో భాగం లో స్వామీజీ అందర్నీ కొండగుహలో ఉంచుతాడు ఆ కుక్క వారిని వెతుక్కుంటూ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. వాళ్ళందరూ ఆ గృహంలో బిక్కుబిక్కుమంటూ ఉండగా.

ఆ కుక్క తన మాయాశక్తి తో ఆ గృహానీ తన మాయాశక్తి తో మాయం చేస్తుంది. దానిని చూసిన వాళ్లంతా అక్కడినుంచి భయంతో పరిగెడుతూ ఉంటారు నాగిని తన మాయ శక్తితో ఆ కుక్క ని ఆపాలని ప్రయత్నిస్తుంది.
అలాగే స్వామీజీ మొదలు పెడతాడు.
కానీ వాళ్ల ఎవరి వల్ల అది కాదు.
ఆ కుక్క శ్రీ కన్య తలను పట్టుకుంటుంది ఆమె తల వంకరి వంకరగా పాములాగా తిరిగిపోతుంది. దానిని చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోతారు. మళ్లీ ఆ కుక్క నుంచి శ్రీకన్య తప్పించుకుంటుంది. అసలు అది ఎలా సాధ్యమో ఎవరికీ అర్థం కాదు అక్కడ ఉన్న వాళ్లంతా భయంతో పరిగెడుతూ ఉంటారు.
శ్రీ కన్య ఒక చెట్టు చాటున దాక్కుని….. అయ్యో భగవంతుడా. ఇప్పటివరకు ఇన్ని సమస్యలు ఉన్న మాకు మళ్లీ కొత్త సమస్యలు తీసుకొచ్చావా. దయచేసి ఆ కుక్క ని ఆపు లేదంటే నా ప్రాణాలు తీసుకెళ్ళు. అంటూ భగవంతుని ప్రార్థిస్తూ ఏడుస్తుంది అప్పుడే ఆకాశ ద్వారాలు తెరుచుకొని పెద్ద పెద్ద పెద్ద పెద్ద మెరుపులు మెరుస్తాయి.
ఆ మెరుపుల తాకిడికి ఆ కుక్క చాలా భయపడుతుంది ఒక్కసారిగా ఆకాశం నుంచి వేగంగా ఒక వెలుగు దూసుకు వచ్చి ఆ కుక్క మీద పడుతుంది.
వెంటనే ఆ కుక్క సామాన్యమైన కుక్కగా మారిపోతుంది అప్పుడు ఆ కుక్క సామాన్యమైంది గా మారిపోతుంది. దానిని చూసిన వాళ్లంతా చాలా సంతోష పడతారు.
అప్పుడు ఆకాశం నుంచి ఒక స్వరం వినపడుతుంది….. అందరూ సంతోషంగా ఉండండి. శ్రీ కన్య కు మంచి రోజులు వస్తాయి ఎవరూ భయపడకండి అందరికీ శుభం కలుగుతుంది అని చెప్పి అక్కడి నుంచి మాయమైపోతుంది.
దానిని విన్న వాళ్లు చాలా సంతోషపడుతూ ఆ స్వరానికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు.
నాగిని ,స్వామీజీ శ్రీ కన్య తల్లిదండ్రులతో…. ఆ భగవంతుడే ఆశీర్వదించాడు కదా ఇంక స్వీకరణకు ఎలాంటి బాధ ఉండదు ఇంకా మీరు నిశ్చింతగా ఇంటికి వెళ్ళండి అంటాడు వాళ్ళు స్వామీజీకి నాది నీకు కృతజ్ఞతలు చెప్పుకొని అక్కడినుంచి శ్రీ కన్య ని , కుక్కని తీసుకొని వెళ్ళిపోతారు నాగిని కూడా అక్కడి
నుంచి వెళ్తూ వెళ్తూ స్వామీజీకి నమస్కరించి అక్కడి నుంచి మాయమైపోతుంది.
ఇక స్వామీజీ కూడా అక్కడి నుంచి మాయమైపోతారు రోజులు గడిచాయి.
అలా ఆ రోజు గడిచి పోతుంది ఆ మరుసటి రోజు ఉదయమే శ్రీ కన్య చాలా సంతోషంగా తన కుక్కతో….మిత్రమా ఇప్పుడు మనం స్వేచ్ఛగా అందరి పిల్లలతో పాటు ఆడుకోవచ్చు మనం బయటికి వెళ్లి ఆడుకుందాం. అంటూ కుక్క తో కలిసి ఆడుకుంటున్న పిల్లల దగ్గరికి వెళుతుంది.
ఆ పిల్లలు శ్రీ కన్య ను చూసి ….. నువ్వు ఎందుకు మళ్లీ మా దగ్గరకు వచ్చావు. నువ్వు ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చినా. నీతో మేము ఆడుకో ము దయచేసి వెళ్ళిపో అంటూ ఆమెని అక్కడినుంచి తోస్తారు.
ఆమె కింద పడి ఏడుస్తూ….ఎందుకు మీరు నన్ను ఇలా దూరం చేస్తున్నారు ఇప్పుడు నేను కూడా మీలాగే మనిషినీ నాకు ఎలాంటి శక్తులు లేవు. అని అంటుంది అందుకు వాళ్ళు….దయచేసి వెళ్ళిపో మా అమ్మ వాళ్ళు చూస్తే మమ్మల్ని బయటకు కూడా రానివ్వరు. అంటూ ఆమెను అక్కడి నుంచి పంపించడానికి ప్రయత్నిస్తారు అప్పుడు ఆ కుక్క పెద్ద పెద్ద వాళ్ళని చూసి ఏడుస్తూ ఉంటుంది.
కుక్క అరవడంతో అక్కడున్న పిల్లలంతా పరుగులు తీస్తారు.
శ్రీ కన్య చాలా బాధపడుతూ….. అమ్మ నాగిని ఇంకా వీళ్ళు నన్ను ఎందుకు ఇలా దూరం చేస్తున్నారు. నాకు వాళ్లతో ఆడుకోవాలని ఉంది. దయచేసి నాకు సహాయం చెయ్ అమ్మ.
అని నాగిని ప్రాధేయ పడుతోంది అప్పుడు నాగిని అక్కడ ప్రత్యక్షమై….. శ్రీ కన్య బాధపడకు నేను వచ్చాను కదా వాళ్ళంతా నీ దగ్గరికి వస్తారు నీతో ఆడుకుంటారు. అది చెప్పి తన మాయ శక్తితో పారిపోయిన పిల్లలందరూ మనసును మార్చి అక్కడికి రప్పిస్తుంది.
వాళ్లంతా అక్కడకు వచ్చి…. శ్రీ కన్య ఆడుకుందాం అంటూ పిలుస్తారు దాన్ని చూసిన శ్రీ కన్యా చాలా సంతోషపడుతుంది. కుక్క శ్రీకన్య ఆ పిల్లలు చాలా సంతోషం గా ఆడుకుంటారు అలా సాయంత్రం అవుతుంది శ్రీ కన్యా ఎంతో సంతోష పడుతూ….
అమ్మ నాగిని నీకు చాలా కృతజ్ఞతలు. ఇప్పటివరకు నేను వీళ్ళతో ఆడుకునే లేదు ఇదే నా జీవితంలో చాలా సంతోషకరమైన రోజు.నీకు చాలా కృతజ్ఞతలు అని కృతజ్ఞతలు చెప్పుకుంటుంది.
నాగిని…ఇంక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు వాళ్లు ప్రతి రోజూ నీతో ఆడుకుంటారు.
అని చెప్పి అక్కడ నుంచి మాయమైపోతుంది శ్రీ కన్య చాలా సంతోష పడుతూ తన కుక్క ని తీసుకొని ఇంటికి వెళ్తుంది.
ఆ రోజు ఆమె ఎంతో సంతోషంగా చాలా ఆనంద పడుతూ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుంది. అప్పుడు శ్రీ కన్య మెడ పొడవుగా పాములాగా మారుతుంది.
దానిని గమనించి నాకు ఆమె…. అయ్యో నాకు ఏం జరుగుతుంది రేపు ఏం జరుగుతుంది. నా మెడ నీ ఎవరో పట్టుకుని లాగుతున్నారు. అయ్యో భగవంతుడా కాపాడండి నన్ను కాపాడండి అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఒక్కసారిగా నిద్రనుంచి మేలుకొని ఉంది.
అప్పుడు ఆమె…. ఏంటి ఇదంతా కల మళ్లీ ఏం జరుగుతుందో ఏమో అని నాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడిప్పుడే నేను చాలా సంతోషంగా ఉంటున్నాను. మళ్లీ నాకు ఈ పీడకలలు. అయ్యో భగవంతుడా మళ్లీ నా జీవితంలో ఎలాంటి సమస్య రాకుండా చూడు. అంటూ దేవున్ని ప్రార్ధించు కొని మళ్ళీ విశ్రాంతి తీసుకుంటుంది.ఆరోజు రాత్రి గడిచి పోయింది. ఆ మరుసటి రోజు ఉదయం ఆమె చాలా సంతోషంగా నిద్ర లేస్తుంది. ఆమె చెకచెక తన పనులన్నీ ముగించుకొని. ఆడుకోడానికి తన స్నేహితుడి దగ్గరకు వెళ్తుంది. ఆమె చాలా సంతోషంగా ఆడుకుంటూ ఉండగా. ఒక బిచ్చగత్తె అక్కడకు వస్తుంది. ఆ బిచ్చగత్తె ఆ పిల్లలతో …. బాబు తినడానికి ఏమైనా ఉంటే పెడతారా. నాకు చాలా ఆకలిగా ఉంది.
ఆమెను చూసిన పిల్లలు చాలా భయపడుతూ ఉంటారు.
అప్పుడు శ్రీ కన్య….అమ్మ మిమ్మల్ని చూసి వీళ్లంతా భయపడుతున్నారు అసలు మీరు ఎవరు మేము చిన్న పిల్లలo మా దగ్గరే ఉంటుంది.
అప్పుడు ఆమె…. పెద్దవాళ్లుని ఎవరిని అడిగినా వాళ్లు సహాయం చేయటం లేదు.
అందుకే మీ దగ్గరికి వచ్చాను.
ఏదో ఒకటి ఇవ్వండి తింటాను అని జాలిగా అడుగుతుంది.
అందుకు శ్రీ కన్య…. అమ్మ మా ఇంటికి రండి మీకు భోజనం పెట్టిస్తాను అని చెప్పి తన ఇంటికి తీసుకు వెళుతుంది ఆమె వాడకాన్ని చూసి నాకు ఒక్క ఆ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది.
శ్రీ కన్య కుక్కతో….. మిత్రమా అలా అరవ కూడదు. ఆమె మన ఇంటికి అతిథి.
అని అంటుంది.
శ్రీ కన్య లోపలికి తీసుకెళ్లి తన తల్లికి జరిగిన విషయం చెప్పి. ఆమెకు భోజనం వడ్డించమని అంటుంది.
తల్లి వెంటనే భోజనం తీసుకెళ్లి ఆమెకు వడ్డిస్తుంది వెంటనే ఆ బిచ్చగత్తె నాగిని గా మారుతుంది.
నాగిని చూసిన శ్రీ కన్య చాలా ఆశ్చర్యపోతూ…. అమ్మ నాగిని నువ్వేంటి బిచ్చగత్తె రూపంలో వచ్చావు.
నాగిని… నాకు నిన్ను చూడాలని పించింది. అందుకే వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకో నిన్ను ఒకసారి పరీక్షించాలని అనుకున్నాను. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించావ్వి. భవిష్యత్తులో నీకు అంతా మంచే జరుగుతుంది నీ మంచి మనసుకి భగవంతుడు మంచి చేస్తాడు.
అని అంటుంది అందుకామె చాలా సంతోష పడుతూ ఆమెకు నమస్కారం చేసుకుంటుంది అప్పుడు శ్రీ కన్య…. అమ్మ రాత్రి నాకు ఒక కల వచ్చింది. దాన్ని చూసి నేను చాలా భయపడి పోయాను అంటూ జరిగిన విషయం చెప్పింది.
అప్పుడు నాగిని… శ్రీ కన్య నీకు ఇంకా ఏమీ కాదమ్మా. నీకు ఉన్న దోషం తొలగి పోయింది.
నువ్వు సంతోషంగా ఉండొచ్చు ఆ పిడకల గురించి మర్చిపో. అందుకు ఆమె
సరే అంటుంది.
ఆ తర్వాత నాగిని చాలా సమయం వరకు వాళ్లతో కబుర్లు చెప్పి అక్కడి నుంచి వెళ్లబోయే సమయానికి. స్వామీజీ కూడా అక్కడికి వస్తాడు.
స్వామీజీ నీ చూసి నాగిని వందనాలు చేస్తూ…. స్వామి అనుకోకుండా మీరు కూడా వచ్చారా.
స్వామీజీ….. లేదు నాగిని మీరు ఇక్కడ ఉన్నారు అని తెలిసి వచ్చాను.
నాగిని…. అవునా స్వామి మీ రాకకు గల కారణం తెలుసుకోవచ్చా.
స్వామీజీ… నాగిని రేపు ఒక అద్భుతమైన పౌర్ణమి వస్తుంది. ఆ పౌర్ణమి రోజు దేవాలయంలో ఉన్న నాగమణి భూమి లోపలి నుంచి బయటకు వస్తుంది.
దానిని మహేశ్వరుడు శ్రీ కన్య కు బహుమతిగా ఇవ్వమని నాకు కలలో చెప్పాడు. అద్భుతాన్ని అందరూ చూస్తారు అని అలాగే బహుమతిని శ్రీ కన్య కి ఇవ్వాలని చెప్పడం కోసమే వచ్చాను.
అందుకు అతని మాటలకి చాలా ఆశ్చర్యపోతూ స్వామితో… తప్పకుండా స్వామి దాన్ని చూడడానికి వస్తాము.
అని అంటారు ఆ తర్వాత నాగిని స్వామీజీ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు ఆ మరుసటి రోజు రాత్రి సమయం అందరూ దేవాలయం దగ్గర చేరుకుంటారు.
అప్పుడే పౌర్ణమి కిరణాలు భూమి పై పడ్డాయి. అప్పుడు ఆలయంలో ఉన్న భూమి రెండు భాగాలుగా చీలి అద్భుతమైన ప్రకాశవంతమైన ధగధగ మెరిసే నాగమణి ప్రత్యక్షమవుతుంది.
దాన్ని చూసిన వాళ్ళంతా నమస్కరిస్తూ…. జై జయ శంకర జయ జయ శంకర. అంటూ కేకలు వేస్తారు.
అప్పుడు స్వామీజీ దానిని తీసుకొని శ్రీ కన్య కు ఇచ్చి…. అమ్మ దీనిని తీసుకో. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా దీనిని పట్టుకొని నువ్వు కోరిన వరాన్ని అడుగు స్వామి నీకు తప్పకుండా దానం ఇస్తాడు.అని చెప్తాడు అందుకు శ్రీకన్య చాలా సంతోష పడుతూ స్వామీజీకి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది.
ఆ తర్వాత అందరూ అక్కడే భోజనం చేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు.
శ్రీ కన్య తల్లిదండ్రులు మరియు శ్రీ కన్య అందరు కూడా అక్కడి నుంచి వాళ్ళ ఇల్లు చేరుకుంటారు. శ్రీ కన్య ఆ నాగమణిని పవిత్రమైన ప్రదేశంలో ఉంచుతుంది.
ఆ తర్వాత ఏం జరిగిందో తరువాయి భాగంలో చూద్దాం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *