నాగిని కాపాడగలదా 6_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

ఐదో భాగంలో లో నా నాగమణి తీసుకొని శ్రీ కన్య వాళ్ళు ఇంటికి వస్తారు ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం రోజులు గడిచాయి. శ్రీ కన్య ఇంటికి స్వామీజీ నాగిని ఇద్దరు వచ్చి శ్రీ కన్య తల్లిదండ్రులతో…. చూడండి మేమిద్దరం కాశీనాధుని దర్శించుకోడానికి. ఆకాశ ద్వారాలు తెరవబడతాయి.రాత్రికే వెళ్తాము అప్పటివరకు మీ కుటుంబం రక్షణ గా ఆ నాగమణి మరియు ఈ కుక్క ఉంటాయి జాగ్రత్తగా ఉండండి. అని చెప్పారు వాళ్లు సరే అంటారు ఆ రోజు రాత్రి సమయం ఆకాశంలో ద్వారాలు తెరుచుకోని సోపానాలు వస్తాయి.

ఆ సోపాన లపై నడుచుకుంటూ నాగిని మరియు స్వామీజీ. ఇద్దరు కూడా వెళ్తారు ఆ తర్వాత ఆ ద్వారాలు మూసుకుపోతాయి.
వాళ్లంతా విశ్రాంతి తీసుకుంటారు ఆ రోజు రాత్రి గడిచి పోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం శ్రీ కన్య, కుక్కను తీసుకొని ఆడుకోడానికి వెళ్తుంది.
ఆ సమయంలో ఇంట్లో తల్లిదండ్రులు ఎవరు ఉండరు అప్పుడే ఒక ఆమె …. వదిన వదిన ఎవరైనా ఉన్నారా ఇంట్లో . ఇంట్లో బియ్యం అయిపోయాయి కొంచెం బియ్యం ఉంటే ఇస్తారా అంటూ కేక వేస్తోంది. ఇంట్లో ఎవరూ పలకకపోవడంతో…..ఏంటి ఇంట్లో ఎవరూ లేరా అంటూ అటూ ఇటూ చూస్తూ ఉంది అప్పుడు ధగధగా మెరుస్తూ నాగమణి కనబడుతుంది. దాన్ని చూసిన ఆమె చాలా ఆశ్చర్యపోతూ…. వామ్మో ఈ వజ్రం ఏంటి ఇలా త్వరగా మెరుస్తుంది. వీళ్ళకి ఇది ఎక్కడి నుంచి వచ్చింది. ఆ ఎక్కడి నుంచి వస్తే నాకెందుకు ఆమ్ముకుంటే కోట్ల రూపాయలు వస్తాయి. అని అనుకొని ఆ నాగమణి దొంగిలించుకుని తీసుకొని వెళుతుంది.
అప్పుడే బయట ఆడుకుంటున్న శ్రీ కన్య ను ఒక కారు వేగంగా వచ్చి ఆమె కాలు నీ తొక్కించి వెళ్తుంది.
శ్రీ కన్య పెద్దగా అరుస్తూ…. అమ్మ నొప్పి నొప్పి అంటూ ఏడుస్తూ ఉంటుంది.ఆ కుక్క పెద్ద పెద్దగా అరుస్తూ కార్ వెంట పడుతుంది.
అప్పుడే శ్రీకన్య తల్లిదండ్రులు ఇద్దరూ అక్కడికి వస్తారు తల్లి…. అయ్యో నా బంగారు తల్లి ఏం జరిగింది. ఎవర్రా పాపిష్టి వాడు ఇలా అన్యాయంగా బిడ్డ కాలునీ ఎక్కించి వెళ్ళిపోయాడు. మనిషి చనిపోయిన కూడా అంతే వదిలేసి వెళ్తారా కనికరం లేని పశువా వాడు అంటూ భోరున ఏడుస్తూ. ఆ బిడ్డను తన చేతుల్లోకి తీసుకొని ఇంటికి వెళ్తుంది.
తండ్రి….ఎందుకు అమ్మాయిని ఇక్కడికి తీసుకు వచ్చావ్ తొందరగా హాస్పిటల్ కి తీసుకెళ్లి వైద్యం చూపిద్దాం.
అప్పుడు ఆమె….మర్చిపోయారా స్వామీజీ నాగిని ఏం చెప్పారు వారికి రక్షణగా నాగమణి ఉంది అన్నారు కదా. దాంతో అమ్మాయి కాలునీ బాగు పడేలా చేయవచ్చు అని నాగమణి ఉన్న ప్రదేశానికి వెళ్తుంది కానీ అక్కడ నాగమణి లేకపోవడంతో చాలా కంగారుగా…. ఏవండీ నాగమణి లేదు. ఎవరో దొంగిలించారు. అంటూ భోరున ఏడుస్తూ ఉంది.
అతను…. దాని గురించి తర్వాత ఆలోచిద్దాం ముందు అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్దాం.
అంటూ శ్రీ కన్య నువ్వు హాస్పటల్లో చేర్పిస్తారు .
అక్కడ వైద్యురాలు వెంటనే ఆమెను పరీక్షించి వాళ్లకు ధైర్యం చెబుతుంది.
ఆ తర్వాత శ్రీ కన్యను ఆపరేషన్ చేయాలి అని చెప్పి తీసుకువెళుతుంది.
కొన్ని గంటలు గడుస్తాయి. కొంత సమయం తర్వాత వైద్యురాలు బయటకు వచ్చి వాళ్లతో…. కాలు చాలా దెబ్బ తిన్నది అది అలాగే ఉంచితే వాడికి ఇన్ఫెక్షన్ వచ్చి ఆమె చనిపోయే ప్రమాదం ఉంటుంది అందుకే కాలునీ తీసేయాల్సి వచ్చింది.
ఆ మాట వినగానే ఆ తల్లిదండ్రులిద్దరూ ఖంగుతిన్నారు… ఆమె తల్లి గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది….
అయ్యో నా తల్లి పుట్టిన దగ్గర నుంచి నీకు అన్నీ కష్టాలే. భగవంతుడా ఏలాంటి రాత రాసవాయ్యా . అని ఏడుస్తుంది ఆమె భర్త ఆమెను ఓదారుస్తాడు.
వైద్యురాలు…. వాళ్ళిద్దరికీ ధైర్యం చెప్పి…కొంచెం సమయం తర్వాత మీరు అమ్మాయిని చూడొచ్చు. అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
కొంత సమయం తర్వాత ఆ తల్లిదండ్రులిద్దరూ శ్రీకన్య దగ్గరికి వెళ్తారు.
శ్రీ కన్య… అమ్మ నాన్న ఎందుకు మీరు అలా బాధ పడుతున్నారు ఇప్పుడు నాకు ఏమైందని. కాలు లేకపోతే ఏమౌతుంది కర్ర సహాయంతో నడుస్తున్న ను మీరు బాధపడకండి.
అని అంటుంది . అలా రోజులు గడిచాయి ఆమెను హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకు వెళతారు. శ్రీ కన్య…. అమ్మ మన కుక్క ఆ కారు వెంట వెళ్ళింది ఇంత వరకు తిరిగి రాలేదు. అని చెబుతుంది అందుకు వాళ్లు… అవునమ్మా నాకు భయంగా ఉంది అది ఎక్కడికి వెళ్లిపోయిందని. అనుకుంటారు ఆరోజు ఉదయం శ్రీ కన్య కు ఇంట్లో చాలా చిరాగ్గా ఉంటుంది.
ఆమె ఒక కర్ర సహాయంతో కుంటుకుంటూ రోడ్డు మీదకు వస్తుంది అక్కడ తన స్నేహితులు గణేష్, చింటూ ఆడుకుంటూ ఉంటారు.
శ్రీ కన్య వాళ్లను చూసి….నా కాలు సరిగ్గా ఉన్నట్టయితే ఇప్పుడు నేను వాళ్ళతో పాటు ఆడుకునేదాన్ని.భగవంతుడా ఎందుకు నాకు ఇన్ని కష్టాలు పెట్టావు. ఆ కారు నా కాలుని కాకుండా నా తల మీదుగా వెళ్ళినట్లయితే పీడ వదిలిపోఏదీ. ఏ గొడవ ఉండేది కాదు కదా ఎందుకు ఇంత నరకం చూపిస్తున్నావ్వ.
నాకు అంటూ బాధపడుతుంది.
ఆమె కన్నీరు చూసిన గణేష్ చింటూ ఇద్దరూ ఆమె దగ్గరికి వెళ్లి…. శ్రీ కన్య బాధపడకు మేమున్నాము కదా మేము ఉన్నాం కదా మేము కూడా నీతో పాటు కూర్చొని ఆడుకుంటాము. నువ్వు బాధపడకు అంటూ ఆమెను ధైర్య పరుస్తారు.
ఆ చిన్నారి మాటలు వింటున్న తల్లి….. భగవంతుడా నీ సృష్టి చాలా విచిత్రమైనది.
కల్మషం లేని పిల్లల్ని శ్రీ కన్యకా చూపించి మనోధైర్యాన్ని పెంచుతున్నావు. అసలు ఇదంతా ఎందుకు స్వామి నీ ఆట ఏంటో ఎవరికీ అర్థం కాదు. అది అనుకుంటుంది ఆ రోజు రాత్రి సమయం ఆ భార్యాభర్తలు ఇద్దరూ ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటారు.
భార్య…. ఏవండీ ఆ నాగమణి సంగతి పట్టించుకోలేదు కదా. అది ఎవరో దొంగిలించుకుని తీసుకువెళ్లారు.
అది ఉన్నట్టయితే మన శ్రీ కన్య కా లు చక్కగా
ఉండేది. స్వామీజీ నాగిని తిరిగి వస్తే కానీ మన శ్రీ కన్య కాలు తిరిగి రాదు .
వాళ్లు త్వరగా వస్తే బాగుండు.
భర్త…. నేను అదే కోరుకుంటున్నాను . అసలు ఆ నాగమణి దొంగిలించిన వాళ్ళు ఎవరో కానీ
భగవంతుడు ఊరికే వదిలిపెట్టడు. అని మాట్లాడతాడు భార్య….మన కుక్క అప్పుడన్నైగా వెళ్ళింది అండి ఇప్పటివరకు ఇంటికి తిరిగి రాలేదు. మానా అమ్మాయి దాని మీద దిగులు పెట్టుకుంది.
దేవుడి దయవల్ల ఆ కుక్క ఇంటికి త్వరగా తిరిగి వస్తే బాగుండు. అని వాళ్లు మాటలు చెప్పుకుంటూ ఉంటారు శ్రీకన్య ఒంటరిగా కూర్చొని…భగవంతుడా నా కుక్క కి ఏం కాకుండా చూడు త్వరగా ఇంటికి తిరిగి వచ్చేలా చెయ్యి. అంటూ భగవంతుని ప్రార్థిస్తున్నా రోజులు గడిచాయి.
ఆమె ప్రతి రోజు కొట్టుకుంటూనే అన్ని పనులు చేసుకుంటూ ఎంతో బాధపడుతుంది ఆమె బాధను చూస్తూనే తల్లిదండ్రులు బాధపడతారు. ఇరుగుపొరుగు వాళ్లు శ్రీ కన్య గురించి…. చి చి ఇంత నష్టం జాతకురాలి ఎక్కడా చూడలేదు. పుట్టగానే తల్లిదండ్రులు చచ్చిపోయారు. పెంచిన తల్లిదండ్రులు ఎప్పుడు పేదరికంలోనే ఉన్నారు.మొన్నటివరకు క్షుద్రపూజలు అవి ఇవి అని చెప్పి దెయ్యాలు అన్ని ఆ అమ్మాయి వెంట పడ్డాయి. ఇక చివరిగా కాలే పోయింది.
ఇలాంటి నష్ట జాతకులు అన్నీ నేను ఎక్కడ చూడలేదు. మన పిల్లలు ఆ పిల్ల తో ఆడుకుంటే ఆ దోషాలు, గీషాలు మన పిల్లలకు ఎక్కడ అనుకుంటయని నాకు భయంగా ఉంది.
మరో ఆమె…. నిజమే వదిన అని అనుకుంటారు దాన్ని విన్న తల్లి ఎంతగానో బాధపడుతూ చిందిస్తుంది.
ఆ రోజు గణేష్ చింటూ శ్రీ కన్య తో ఆడుకుంటూ ఉండగా. చింటూ తల్లి వచ్చి …. రేయ్ ఇంటికి వెళ్దాం పద అంటూ చింటూ నీ పిలుస్తుంది.
చింటూ…. నేను కొంచెం సేపు ఉన్నాక వస్తానమ్మా అప్పటివరకు నేను ఆడుకో ఇవ్వు .
తల్లి కోపంగా…. కుంటి దానితో నీకు ఆటలు ఏంట్రా అంటూ అతన్ని కొట్టుకుంటూ ఇంటికి తీసుకెళుతుంది చింటూ మారం చేస్తూ ఏడుస్తూ ఇంటికి వెళ్తాడు.
గణేష్ తల్లి కూడా అదే విధంగా ప్రవర్తిస్తూ ఆమెను సూటిపోటి మాటలు అంటుంది.
ఆ మాటలు విన్న శ్రీ కన్య మనసు చాలా బాధపడుతుంది.
అప్పుడు తల్లి దగ్గరకు వచ్చి…. అమ్మ వాడు చెప్పింది నిజమే కదా.కుంటి దాంతో వాళ్ళకి ఏం పని ఉంటుంది అంటూ ఏడుస్తూ లోపలికి ఆరోజు రాత్రి సమయం ఆకాశ ద్వారాలు తెరుచుకుంటాయి. స్వామీజీ , నాగిని ఇద్దరూ భూమి మీదికి వస్తారు. సరాసరి వాళ్లు శ్రీ కన్య ఇంటికి వెళ్తారు అప్పుడు శ్రీ కన్య వాళ్లతో… స్వామీజీ ,అమ్మ నాగిని వచ్చారా. ఈ ఘోరాన్ని చూడండి అంటూ జరిగిన విషయం చెప్పి బాధపడుతుంది.
తల్లిదండ్రులు కూడా ఆ నాగమణి విషయం గురించి చెప్పి బాధ పడతారు అప్పుడు నాగిని…. మరేం పర్వాలేదు నేను వచ్చాను కదా. నేను నిన్ను బాగు చేస్తాను అంటూ ఆమె పోయిన కాలునీ తిరిగి తీసుకొస్తుంది.
దాన్ని చూసిన శ్రీ కన్య తల్లిదండ్రులు చాలా సంతోష పడుతూ ఉంటారు. అప్పుడే కుక్క శ్రీ కన్య ను కారుతో ఢీకొన్న వ్యక్తిని అక్కడికి తీసుకొని వస్తుంది అతను…. మీ అందరూ నన్ను క్షమించాలి. తాగిన మత్తులో ఏం చేస్తున్నారు అర్థం కాని పరిస్థితుల్లో అలా జరిగిపోయింది. నన్ను క్షమించండి దానికి బదులుగా ఈ డబ్బు తీసుకోండి అంటూ డబ్బులు ఇస్తాడు వాళ్ళు వద్దు వద్దు అని ఎంతగానో ప్రాధేయపడిన అతను డబ్బు తీసుకుని అంతవరకు బలవంతం చేసి క్షమాపణ కోరి అక్కడనుంచి వెళ్ళి పోతాడు.
కుక్క చేసిన తెలివైన పనికి వాళ్లంతా కుక్కని మెచ్చుకుంటూ ఉంటారు అప్పుడు నాగిని…. ఇప్పుడు నువ్వు చేయాల్సిన మరొక పని ఉంది. ఇంట్లో నాగమణి దొంగిలించిన వ్యక్తి ఎవరో పట్టుకుని తీసుకొని రావాలి.
అని అంటుంది ఆ కుక్క సరే అని చెప్పి అక్కడ మొత్తం చుట్టూ తిరిగి వాసన చూసి దగ్గర్లో ఉన్న ఒక ఇంటి ముందుకు వెళ్లి పెద్దపెద్ద గా అరుస్తుంది. అప్పుడు వాళ్లంతా…. అయితే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళే నాగమణి దొంగిలించారనుకుంటా. అని వాళ్ళ ఇంటికి వెళ్తారు అక్కడ ఉన్న ఆమెను నిలదీస్తారు అప్పుడు ఆమె జరిగిన విషయం అంతా చెప్పి నేనే తీసుకు వచ్చాను నన్ను క్షమించండి.
ఇప్పుడే దానిని తీసుకుని వస్తాను అని లోపలికి వెళ్తుంది కానీ అక్కడ నాగమణి ఉండదు.
దాన్ని చూసి ఆశ్చర్యపోయి కంగారుగా బయటకు వచ్చి వాళ్లతో…… అయ్యో నాగమణి కనబడటం లేదు. దాన్ని ఎవరు తీసుకెళ్లిపోయారు అంటూ కంగారు పడుతూ చెబుతుంది. దాన్ని విన్న వాళ్ళు ఆశ్చర్యపోతూ ఆమే వైపు చూస్తారు.
అసలు ఆ నాగమణి ఎవరు దొంగిలించారో
ఎందుకు దొంగిలించారో తరువాయి భాగంలో తెలుసుకుందాం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *