నాగిని కాపాడగలదా 7_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

ఆరో భాగం లో స్వామీజీ నాగిని శ్రీ కన్య మరియు కుటుంబం అందరూ కలిసి నాగమణి దొంగలించిన కుటుంబం దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఆమె నిజాన్ని ఒప్పుకో ని నాగమణి ని తీసుకురావడానికి లోపలికి వెళ్తుంది కానీ నాగమణి లేదు అని అందరికీ చెప్తుంది. దానిని విన్న వాళ్లు ఆశ్చర్యపోతారు అప్పుడు నాగిని…. నిజం చెప్పకపోతే నేను ఇప్పుడే బూడిద చేస్తాను.

అప్పుడు ఆమె… నేను నిజమే చెప్తున్నాను.
నన్ను నమ్మండి అంటూ ప్రాధేయ పడుతోంది అప్పుడే ఒక దొంగ తీసుకొని దూరంగా పరిగెడుతూ ఉండడం కుక్క గమనిస్తుంది.
ఆ కుక్క పెద్ద పెద్దగా అరుస్తూ అతని వెంట పడుతుంది. అతను అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక బస్సు ఎక్కుతాడు.
ఆ కుక్క ఆ బస్సు వెనకాల పరిగెడుతూ ఉంటుంది. శ్రీ కన్య కూడా పరిగెత్తడం మొదలు పెడుతుంది.
నాగిని స్వామీజీ అక్కడున్న ఆమెతో…. నిజం చెప్పు అతను ఎవరు అతనికి నువ్వే దానిని ఇచ్చి పంపించావు కదా.
స్వామీజీ…. మాట్లాడకుండా అలా ఉంటావే నిజం చెప్పు లేదంటే నీ పని అయిపోతుంది జాగ్రత్త.
అప్పుడు ఆమె భయపడుతూ…. అవునమ్మా ఆ కుక్క అరవడం నేను చూశాను ఎందుకలా చేస్తుందో కిటికీలోనుంచి చూడగా మీరు రావడం గమనించాను నేను అందుకే నా భర్త కి దొంగ వేషం కట్టి . దానిని తీసుకొని వెళ్లమని చెప్పాను.
నా భర్త ఏం జరుగుతుందా అని కాసేపు ఇక్కడ నిలబడి చూసి ఇప్పుడే పరిగెత్తుకుంటూ వెళ్ళి నట్టు ఉన్నాడు.
అని నిజాన్ని ఒప్పుకుంటుంది దాన్ని విన్న వాళ్ళంతా చాలా ఆశ్చర్యంగా ఆమెను తిట్టడం మొదలు పెడతారు.
అక్కడ బస్సు వెనకాల కుక్క అరుస్తూనే పరిగెడుతుంది ఇంతలో బస్సు అదుపు తప్పి ఒక లోయలో సగం వైపు పడుతుంది.
దాన్ని చూసిన కుక్క చాలా భయపడుతూ ఉంటుంది.
లోపల ఉన్న వాళ్ళు ఆ బస్సు ఎక్కడ లోయలో పడి పోతుందన్న భయంతో పెద్దపెద్దగా కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉంటారు.
అప్పుడే అక్కడికి శ్రీ కన్య చేరుకుంటుంది ఆ బస్సు ప్రమాదంలో ఉండటం చూసి ఆ కుక్క తో…… మిత్రమా ఇప్పుడు మనం ఏదో ఒకటి చేసి బస్సు లోయలో పడి పోకుండా బయటకు
లాగాలి.
అంటూ అటూ ఇటూ చూస్తారు.
ఇందులో శ్రీకన్య కు ఒక తాడు కనబడుతుంది.
ఆమె భగవంతుని ప్రార్ధిస్తూ……. భగవంతుడా నాకు ఈ బస్సు ని బయటికి తీయడానికి బలాన్ని ప్రసాదించు. అంటూ ఆ తాడుని బాసు కట్టి దాన్ని ఒక చెట్టుకి కట్టేస్తుంది ఆ తర్వాత కుక్క మరియు ఇద్దరూ కలిసి ఆ బస్సుని బయటకు లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దాన్ని లాగడానికి వాళ్ళ బలం సరిపోదు.అయినప్పటికీ వాళ్ళు ప్రయత్నిస్తారు చాలా బలంగా కొంతవరకు లాగుతారు బస్సు కొంచెం ముందుకు వస్తుంది అప్పుడు నాగిని స్వామీజీ అక్కడికి వస్తారు.
దాన్ని గమనించి ఆ బస్సుని మరింత ముందుకు తీసుకొని వస్తారు.
బస్సులో ఉన్న వాళ్లంతా ప్రాణాలతో బయటపడిన అందుకు ఊపిరి పీల్చుకుంటారు.
ఆ వ్యక్తి తన దగ్గర ఉన్న నాగమణి ఇచ్చి
…… నన్ను క్షమించండి నా భార్య చెప్పుడు మాటలు విని నేను ఇలా చేశాను. మీరు కనుక కాపాడక పోయినట్లయితే. నేను ఇప్పటికి చనిపోయిన ఆత్మ లాగ తిరుగుతూ ఉండే వాడిని అలా జరక్కుండా చేసినందుకు మీకు చాలా కృతజ్ఞతలు. అని క్షమాపణ చెప్పి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు నాగమణి తీసుకున్న శ్రీ కన్య చాలా సంతోషపడుతుంది నాగిని స్వామీజీ అతనితో….. ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చేయకండి అని అతనికి బుద్ధి చెప్పి అతని పంపించేస్తారు.
నాగిని…. శ్రీ కన్య చిన్నపిల్లల అయినా నీ వంతు చాలా కష్టపడి తెలివిగా ప్రవర్తించావ్వు.
అని ఆమెను మెచ్చుకుంటారు శ్రీ కన్య నాగిని కి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది.
ఆ తర్వాత అందరూ సంతోషంగా అక్కడినుంచి ఇంటికి వెళ్లిపోతారు.
ఆరోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం శ్రీ కన్య కుక్క ఆడుకుంటూ ఉండగా గణేష్ అక్కడికి వస్తాడు.
గణేష్ శ్రీ కన్య తో…. శ్రీ కన్య నీ కాలు అంతా బాగా అయిందా. నాకు చాలా సంతోషంగా ఉంది.
అని అంటాడు అప్పుడు శ్రీ కన్య గణేష్ తో….. గణేష్ మీ అమ్మ నిన్ను నావల్ల కొట్టింది కదా నన్ను క్షమించు.
అని అంటుంది అందుకు అతను…. మరేం పర్వాలేదు మా అమ్మ కొట్టిన నేను నీ దగ్గరికి రావడానికి చాలా ఇష్టపడతాను నువ్వు నా స్నేహితురాలివి.సంతోషపడుతుంది ఆ తర్వాత ముగ్గురు కలిసి ఆడుకుంటే ఉండగా.
అక్కడికి నాగిని వస్తుంది.
నాగిని చూసినా వాళ్ళిద్దరూ చేతులెత్తి నమస్కారం చేస్తారు.
అప్పుడు నాగిని… పిల్లలు మీరు నాతో పాటు వస్తారా మీకు ఒక అద్భుతమైన ప్రదేశాన్ని చూపిస్తాను. అక్కడ మీరు ఎంచక్కా ఆడుకోవచ్చు.
అని అంటుంది అందుకు వాళ్ళు చాల సంతోషపడుతూ కేరింతలు కొడుతూ తప్పకుండా వస్తాము . అని అంటాడు అప్పుడు నాగిని తన తోక ని పెద్దగా చేస్తోంది
దాన్ని చూసిన వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు అప్పుడు నాగిని మీరు నా తోక మీద కూర్చుండి నేను మిమ్మల్ని మేఘాల మీద నుంచి ఆకాశం లోకి తీసుకు వెళతాను.
అని అంటుంది అందుకు వాళ్లు సరే చెప్పి ఆ తొక్క మీద కూర్చుంటారు.
కుక్క గణేష్ శ్రీ కన్యనీ ఆ నాగిని ఆకాశం లో నుంచి తీసుకు వెళుతూ ఉంటుంది.
ఆ వచ్చే పోయే మేఘాలు చూసి వాళ్ళు కేరింతలు కొడుతూ చాలా సంతోష పడతారు.
అక్కడ చంద్రమండలం లో కొండల్ని చూసి వాళ్ళు చాలా సంతోష పడతారు అక్కడ
దూరంగా కనబడుతున్నా పెద్ద పెద్ద చుక్కలు.
చాలా అద్భుతంగా ఉంటాయి.
నాగిని వాళ్ళతో…. పిల్లలు మీరు దీన్ని చాలా ఇష్టపడుతున్నారు కదా.
అందుకు వాళ్ళు…అవునమ్మా నిన్ను చాలా ఇష్టపడుతున్నాను చాలా బాగుంది.
అని అంటారు.
కుక్క….అమ్మా నాగమ్మ నువ్వు అసలు నా గురించి పట్టించుకోవడం లేదు నన్ను ఏమి అడగటం లేదు ఎందుకు.
నాగిని…. అయ్యో నేను నీ గురించి మర్చిపో లేదు. నీ దగ్గరికే వస్తున్నాను కానీ నువ్వే ఇంత లో మాట్లాడటం మొదలుపెట్టావ్వు.
అని అంటుంది అందుకు కుక్క అవునా అని ఆశ్చర్య పడుతూ అడుగుతుంది అప్పుడు నాగిని….శ్రీ కన్య అది సరే కానీ నీకు పేరుంది గణేష్ కి పేరు ఉంది మరి నీ కుక్కకి ఏం పేరు పెట్టలేదు ఎందుకు.
శ్రీ కన్య…. అవునమ్మా నేను దాని సంగతే మర్చిపోయాను నా కుక్క కి మీరే ఏదన్న పేరు పెట్టండి.
అప్పుడు నాగిని ఆ కుక్కకి భైరవ అని పేరు పెడుతుంది బైరవ అన్న పేరు విన్న ఆ ఇద్దరు పిల్లలు చాలా సంతోష పడుతూ కేరింతలు కొడుతూ… భలే భలే బాగుంది పేరు భైరవ భైరవ అంటూ పిలుస్తూ ఉంటారు.
ఆ తర్వాత నాగిని…. సరే పిల్లలు ఇంక మనం భూలోకానికి వెళ్దాం పదండి.
అని చెప్పి వాళ్ళని మళ్లీ భూలోకానికి తీసుకొని వస్తుంది.
అప్పుడు నాగిని …. మీరు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి నీ స్నేహం చాలా దూరం వెళ్తుంది. మీరు ఇద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటున్నాడు కాబట్టి మంచి స్నేహాన్ని ఎప్పుడు విడిచి పెట్టకండి. కొట్టుకోదు తిట్టుకోవద్దు అల్లరి చెయ్యద్దు. సంతోషంగా ఉండండి అని చెప్పి అక్కడ్నుంచి మాయమైపోతుంది.
వాళ్ళిద్దరూ ఒకరివైపు ఒకరు చూసుకొని…. చాలా చాలా బాగుంది కదా అక్కడ అంటూ చాలా సంతోష పడతారు.
ఆ తర్వాత ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు.
అలా రోజులు గడిచాయి ఒక రోజు అనుకోకుండా ఊరి ప్రజలకు తెలియని వ్యాధి సోకుతుంది. అందరూ చాలా కంగారు పడుతూ మంచాల పడతారు ఆ విషయం తెలుసుకున్న స్వామీజీ శ్రీ కన్య ఇంటికి వస్తాడు అప్పుడు ఆ కుటుంబ సభ్యులు స్వామీజీకి నమస్కారం చేసి…. స్వామి ఊరిలో ప్రజలకి తెలియని వ్యాధి సోకింది కానీ మా కుటుంబానికి ఎలాంటి వ్యాధి సోకలేదు. అందుకు మేము భగవంతున్ని ప్రార్థిస్తున్నాం.
స్వామీజీ…..వచ్చాను మీ ఇంట్లో ఉన్న నాగమణి శక్తి కారణంగా మీ కుటుంబానికి ఏమి కాలేదు. ఇప్పుడు మీరు చేయాల్సిన లక్షణమైన పని ఒక్కటే.
అందుకు వాళ్ళు ఏంటి స్వామి చెప్పండి మేము చేస్తాము అని అంటారు అప్పుడు స్వామీజీ… శ్రీ కన్య ఉపవాసం ఉండి స్వామీజీ పూజ చేసి. ఇంటింటికి తిరిగి బిక్షం ఎత్తుకో వాలి. బిక్షం ఎత్తుకో గా వచ్చిన ఆహారాన్ని వండి అందులో నాగమణినీ ఉంచాలి .
ఆ తర్వాత ఆహారన్ని ఆమె తిని ఊరి ప్రజలకి ఇంటింటికీ తిరిగి అందించాలి.
అలా చేస్తే ఊరి ప్రజల యొక్క పాపం అంతరించిపోతుంది ఆ వ్యాధి అంతమైపోతుంది.
అని అంటాడు అందుకు వాళ్లు…
తప్పకుండా మీరు చెప్పినట్టే చేయిస్తాను స్వామి కానీ ఈ వ్యాధి ఇలా రావడానికి గల కారణం ఏమిటి.
స్వామీజీ…. పాపం చేసినవాడు శిక్ష అనుభవించక తప్పదు కదా. చాలా మంది వాళ్ళ మనసులో నన్ను ఎవరూ ఏమీ చేయలేరు అన్న భావంతో గర్వపడుతూ ఉంటారు.అలాంటి వాళ్లకీ భగవంతుడు విధించే శిక్ష ఇది భగవంతుని ఆయుధం ఎవరో కాదు ఈ ప్రకృతి భగవంతుని ఆయుధం. ఆయన తలుచుకుంటే మనం చీమలు లాగా వరదల్లో కొట్టుకుపోయి గలము . భూమిలో
ఇరుక్కుపో గలము. భయంకర వ్యాధులతో
కుప్పలుతెప్పలుగా మరణాలు సంభవించిన గలవు.ఆయన తలుచుకుంటే అన్ని జరుగుతాయి అవి తెలిసి కూడా మితిమీరి ప్రవర్తిస్తే. ఇలాంటివి తప్పదు. అని అంటాడు అందుకు వాళ్లు…. అవును స్వామి మీరు చెప్పింది అక్షరాల నిజం.
స్వామీజీ…. సరే ఇక నేను బయలుదేరుతున్నాను నేను చెప్పినట్టు శ్రీ కన్య కు మంగళ స్నానం చేపించి. భిక్షాటనకు పంపించండి. అని స్వామీజీ అక్కడనుంచి వెళ్ళి పోతాడు.
వాళ్లు స్వామి చెప్పినట్టుగా శ్రీ కన్యకు మంగళ స్నానం చేపించి. బిక్షాటన కు పంపిస్తారు.
శ్రీ కన్యకూ తోడుగా కుక్క కూడా వస్తుంది వాళ్ళిద్దరూ కలిసి ఒక్కొక్క ఇంటింటికి తిరిగి… భవతీ భిక్షాందేహి భవతీ భిక్షాందేహి అంటూ అందర్నీ అడుగుతారు కొందరు… పో పోవమ్మా అందరు రోగాలతో అల్లాడి పోతుంటే. మధ్యలో నువ్వు ఒక దానివి వచ్చావు . నిన్ను ఎక్కడో చూసినట్టుంది అని అంటారు.
శ్రీ కన్య జరిగిన విషయం అంతా చెబుతుంది అయినప్పటికీ వాళ్లు నమ్మకుండా….. ఓయమ్మో పిల్ల ఇంత లేదు మాటలు మాత్రం ఎలా చెబుతోందో చూడండి. అని అంటారు శ్రీకన్య ఎంత చెప్పినా ఆమె మాట అస్సలు పట్టించుకోరు.
శ్రీ కన్య పట్టించుకోని వాళ్ల గురించి వదిలేసి అక్కడి నుంచి మరో ఇంటికి వెళ్లి అక్కడ బిక్షం అడుగుతుంది కొందరు పాపం ఎవరో పాప
బిక్షు అడుగుతుంది అని ఆమెకు భిక్షం దానం చేస్తారు. అలా ఇచ్చిన వాళ్ల దగ్గర వాటిని సేకరించి వాటిని స్వామిజీ దగ్గరికి తీసుకెళ్తుంది ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాతి భాగంలో చూద్దాం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *