నాగిని కాపాడగలదా 9_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

ఎనిమిదో భాగం లో స్వామీజీ బైరవ కు ఒక మాయా గొలుసుని అందిస్తాడు ఆ తర్వాత ఏం జరిగిందో ఈ భాగంలో తెలుసుకుందాం. స్వామీజీ భైరవుడి కి గొలుసు ని అందించిన తర్వాత భైరవ….. స్వామి చాలా కృతజ్ఞతలు ఇక నేను సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్తాడు. ఆ రోజు రాత్రి సమయం భైరవ ఇంటి బయట అటు ఇటు తిరుగుతూ ఉంటాడు.అప్పుడు ఒక పెద్ద పులి అడవి మార్గం నుంచి తప్పించుకొని ఆ గ్రామం లో కి వస్తుంది అది పెద్ద పెద్దగా అరుస్తూ గందరగోళం చేస్తుండగా ఊరి ప్రజలంతా భయంతో పరుగులు తీస్తూ ఉంటారు.

దానిని గమనించిన బైరవ తన మాయాశక్తి తో పెద్ద ఆకారంలో కి మారతాడు. ఆ తర్వాత అతను పులి దగ్గరకు వెళ్లి…..మిత్రమా నువ్వు మర్యాదగా ఎక్కడినుంచి వెళ్ళు లేదంటే నా చేతిలో చావాల్సిందే. అప్పుడు ఆ పులి….హా హా హా నిన్ను చూసి నేను భయపడతాం అనుకున్నావా నా రూపాన్ని చూసి నువ్వు భయపడాలి. అంటూ ఆ పులి తన శరీరాన్ని మార్చేస్తోంది. ఆపు నీ శరీరం మానవ రూపం లోనూ చూసిన ప్రజలంతా చాలా కంగారు పడిపోతుంటారు. అప్పుడు భైరవ కి ఆ వింత పులి కి మధ్య ఘర్షణ మొదలవుతుంది.
అలా ఒకరితో ఒకరు హోరాహోరీగా పోటీ పడుతూ ఉంటారు. అప్పుడు భైరవుడు…. పరమేశ్వర ఈ మాయాపులి నీ అంతం చేయడానికి నాకు గొప్ప శక్తిని ఇవ్వు.
అని భైరవుని ప్రార్థిస్తాడు అప్పుడే ఆ కుక్క నోటి నుంచి ఒక పెద్ద మాయ అగ్ని వస్తుంది.
అగ్ని ఆ వింత పులికి అంటుకొని ….. కాపాడండి ఎవరైనా నన్ను కాపాడండి. ఎవరైనా నన్ను కాపాడండి అంటూ కేకలు వేస్తూ ఉంటుంది.
అప్పుడే ఆకాశం నుంచి ఒక రాక్షసుడు నవ్వుకుంటూ వచ్చి ఆ మంటలను ఆర్పి వేస్తాడు.
దానంత చూస్తున్న ప్రజలు మరింత భయపడతారు ఆ వింత పులి మళ్లీ ఆ భైరవుడి తో పోటీ పడుతూ ఉంటుంది.
దాన్నంతా చూస్తున్న శ్రీ కన్య….అమ్మ నాగిని స్వామీజీ ఎక్కడున్నారు మీరు త్వరగా ఇక్కడికి రండి అంటూ కేకలు వేస్తోంది.
అప్పుడు వెంటనే నాగినీ అక్కడ ప్రత్యక్షమవుతుంది అక్కడ జరుగుతున్న వింతను చూసి చాలా ఆశ్చర్యపోతుంది.
అప్పుడే ఆ రాక్షసుడు నాగిని తో తలపడటం మొదలుపెడతాడు.
అలా నాగిని ఆ రాక్షసుల మధ్య పోరాటం ఇక్కడ ఇక్కడ భైరవ ఆ వింత పులి మధ్య పోరాటం జరుగుతూ ఉంటుంది.
శ్రీ కన్య స్వామీజీతో…. స్వామి ఏంటి ఆలా చూస్తూ ఉన్నారు ఏదో ఒకటి చెయ్యండి.
స్వామీజీ…. లేదు శ్రీ కన్య యుద్ధం జరగాల్సిందే. ఎందుకంటే ఈ రాక్షసుడు నీకోసం రాలేదు. నాగిని కోసం వచ్చాడు.
అలాగే ఆ వింత పులిని నాగిని కోసం పంపించాడు. ఇందులో విజయం నాగిని కే సొంతమవుతుంది.
అలా జరగని పక్షంలో నేను చేసే పనికి అందరూ బందీగా అయిపోతారు.
అని చెప్తాడు ఆ మాట విన్న శ్రీ కన్యా చాలా ఆశ్చర్యపోతుంది అలా ఒకరి మధ్య ఒకరికి గొడవ పెరిగిపోతూ ఉంటుంది.
ఇంతలో నాగిని ఆ రాక్షసుని తాకిడికి దూరంగా వెళ్లి పడుతుంది.
అలాగే ఆ వింత పులి తాకిడికి బైరవ కూడా దూరంగా వెళ్ళి పడతాడు.
స్వామీజీ దానంత చూసి….. పరిస్థితి చేయి దాటి పోతుంది కానీ ఇది నేను చేయకూడదు.
భగవంతుడా ఏం చేయాలి నేను.
అనుకుంటూ తన చేతిలో ఉన్న మాయాజాలాన్ని వాళ్ళ పైన చల్లడానికి ఆలోచిస్తూ ఉంటాడు.
ఇంతలో శ్రీ కన్యకా జలాన్ని స్వామి దగ్గర నుంచి లాక్కొని వాళ్ళ పైన జరుగుతుంది అప్పుడు నాగిని బైరవ ఇద్దరూ ఒక సీసాలో బందీగా ఉండి పోతారు. అలాగే ఆ వింత పులి రాక్షసుడు ఇద్దరు మరో సీసాలో బందీగా ఉండి పోతారు.
అప్పుడు స్వామీజీ శ్రీ కన్య వైపు చాలా కోపంగా చూస్తూ ఆమెను నేలకేసి కిందకి కొడతాడు. శ్రీ కన్య….. స్వామి ఏమైంది నన్ను దయచేసి పెట్టకండి స్వామి ఎందుకిలా చేస్తున్నారు. అంటూ అక్కడి నుంచి భయంతో
పరుగులు తీస్తూ ఉంటుంది స్వామీజీ పెద్ద ఆకారంలోకి మారుతాడు.
ఆమె అలా పరిగెడుతూనే ఉండి ఒక చోట కింద పడిపోతుంది స్వామీజీ ఆమె పై కాలు మోపి ఆమెను తొక్కేస్తా ఉంటాడు.
ఆమె ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఉంటుంది దాన్ని చూస్తున్న తల్లిదండ్రులిద్దరూ…స్వామి దయ చేసి ఆ బిడ్డని వదిలేయండి ఎందుకలా చేస్తున్నారు ఏమైంది మీకు. అంటూ పెద్ద పెద్దగా ఏడుస్తూ
స్వామి నీ బ్రతిమలాదుతు ఉంటారు.
స్వామీజీ పెద్దగా నవ్వుతూ….హా…హా హా
ఆమెను కాలితో తంతాడు. ఆమె దూరంగా వెళ్ళి పడుతుంది దాన్ని చూసిన శ్రీ కన్య…. అమ్మ అంటూ పెద్దగా కేక వేస్తోంది.
ఆమె తలకి పెద్ద గాయం అయింది….. భగవంతుడా ఈశ్వర నా బిడ్డను నువ్వే కాపాడాలి స్వామీజీ ఎందుకు ఇలా చేస్తున్నాడో మీకు అర్థం కావడం లేదు.అంటూ పెద్ద పెద్దగా రోదిస్తూ ఉంటుంది శ్రీ కన్య కూడా పెద్దగా ఏడుస్తూ…. స్వామి దయచేసి వదిలేయండి నన్ను మీకు పుణ్యం ఉంటుంది.
అంటూ బతిమిలాడు తుం నే ఈశ్వరుని ప్రార్థిస్తుంది.
అప్పుడు అక్కడ ఉన్న ప్రదేశం అంతా చీకటిగా మారిపోతుంది అక్కడ ఉన్న ప్రజలంతా అందరూ సృహ తప్పి కింద పడిపోతారు .
అప్పుడు ఆకాశం నుంచి ఒక పెద్ద వెలుగు భూమి మీదకు వస్తుంది.
ఆ వెలుగు స్వామీజీతో….మాయావి స్వామీజీ శరీరం నుంచి బయటికి రా లేదంటే నేనేం చేస్తానో చూడు.
స్వామీజీ….హా..హా హా పరమేశ్వర నువ్వు నన్ను బంధించి గలదేమో కానీ నా ఆత్మని కాదు.నా ఆత్మ నీ శరీరంలో ఉన్నంతవరకు నన్ను ఎవరు ఏమి చేయలేరు.
ఎవరన్నా చెయ్యాలి అనుకుంటే ఈ స్వామీజీ కూడా బలి కావాల్సిందే. హా…హా…హా
మరి కాసుకో ఈశ్వర.
అని అంటాడు అప్పుడు…. ఇంతమంది మంచి కోసం ఒక ప్రాణం బలి కావడం లో తప్పు ఏమీ ఉండదు అని అంటాడు అప్పుడే ఒక పెద్ద విలువ అక్కడి నుంచి స్వామి శరణం లోకి ప్రవేశిస్తుంది.
అప్పుడు స్వామీజీ శరీరమంతా మంటలు మండుతూ….. వద్దు నన్నేం చెయ్యొద్దు అంటూ కేకలు వినపడతాయి ఇబ్బందిగా ఉన్నా వింత పులి , ఆ మాంత్రికుడు శరీరం కూడా కాలి బూడిదయ్యాయి అక్కడినుంచి మాయమైపోతుంది.ఆ తర్వాత భైరవుడు సామాన్య రూపంలోకి మారి పోతాడు బందీగా ఉన్న భైరవుడు నాగిని ఇద్దరు విడుదల అవుతారు. స్వామీజీ శరీరంలో ఉన్న దురాత్మ అంతమైపోతుంది.స్వామీజీ చావు బ్రతుకుల మధ్య ఉండటంతో నాగిని…. పరమేశ్వర స్వామీజీ పైన దయ చూపించు. నీకు అసాధ్యం అంటూ ఏదీ ఉండదు కదా నాయనా. దయచేసి స్వామీజీ పైనా కృప చూపించు. అంటూ ప్రాధేయ పడుతోంది.
అందుకు ఆ వెలుగు స్వామీజీని మామూలు స్థితిలోకి తీసుకు వచ్చి…. ఇక నేను బయలుదేరుతున్నాను. ఇలాంటివన్నీ జరగడానికి ముఖ్యమైన కారణం విపరీత బుద్ధి లే. మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఎప్పుడు ఏ విధంగా మారుతారో ఎవరికీ తేలియదు.జాగ్రత్త అంటూ జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి వెలుగు మాయమైపోతుంది.
శ్రీ కన్య తన తల్లి దగ్గరికి వెళ్లి….అమ్మ నీకు దెబ్బ తగిలిందా అమ్మా నీకు ఏం కాలేదు కదా.
అటు ఏడుస్తూ తన తల్లిని పిలుస్తూ ఉంటుంది అప్పుడు స్వామీజీ శ్రీ కన్య తల్లి కి ఉన్న గాయాన్ని తర్వాత అక్కడున్న వాళ్లంతా
సృహ నుంచి మేల్కొంటారు.
ఆ తర్వాత స్వామీజీ నాగిని శ్రీ కన్య భైరవ శ్రీ కన్య తల్లిదండ్రులు అందరూ అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తారు.
శ్రీ కన్యా తండ్రీ…. స్వామి ఇప్పుడు జరిగిన ఘోరం చూశాక నాకు చాలా భయం కలిగింది.
భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు కాబట్టి అందరూ ప్రాణాలతో బయట పడ్డారు. లేదంటే పరిస్థితి ఇంకోలా ఉండేది.
భైరవ…. అవును స్వామి ఇంకొక లాగా పరిస్థితి ఉండేది అసలు ఈ భూమి మీద కాకుండా ఎవరికీ తెలియదు ప్రాంతానికి నన్ను శ్రీ కన్య పంపించేయండి.
నాగిని….. అవును స్వామి ఇక్కడ దురుద్దేశం కలిగిన వ్యక్తులతో వాళ్ల కుట్రలతో ప్రశాంతంగా జీవించలేక పోతున్నాం.
దయచేసి నన్ను కూడా వాళ్ళతో పాటే పంపించేయండి.మేము ముగ్గురమే ఉండేలాగా ప్రశాంతమైన వాతావరణం.
కావాలి.
అందుకు శ్రీ కన్య తల్లిదండ్రులు….మాకు కూడా అలాంటి ప్రదేశమే కావాలి స్వామీజీ.
స్వామీజీ… సరే అందరం ఈ ఊరిని విడిచి తూర్పు దిశగా వున్న నదీ తీరంలో ఒడ్డున ఒక పెద్ద అడవి ఉంటుంది.అక్కడ మనకి చాలా ప్రశాంతమైన వాతావరణం లభిస్తుంది ఎవ్వరు ఉండరు. ఇక మనమంతా అక్కడే ఉందాం పదండి అంటూ అందరూ నడ్చుకుంటూ ఆ ప్రదేశనికి ప్రయాణమవుతారు.
ఉన్న వాతావరణం వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది.
ఆ తర్వాత శ్రీ కన్య…. స్వామి ఇక్కడ మనం ఉండడానికి ఏదన్నా ఏర్పాటు చేయండి స్వామి.అని అడుగుతుంది అప్పుడు స్వామీజీ అక్కడ ఒక పెద్ద ఇంటిని నీ ప్రత్యక్షం చేస్తాడు.
దాన్ని చూసిన వాళ్ళు చాలా సంతోష పడతారు అలా అందరూ కలిసి లోపలికి వెళ్తారు. అప్పుడు నాగిని తన రూపాన్ని మార్చుకుని మామూలు మానవరలు గా మారిపోయి…. ఇక నేను ఈ రూపంలోని సంతోషంగా ఉంటాను ఇక్కడ ఎవరూ కూడా మనల్ని పట్టించుకోరు ఎందుకంటే అసలు ఇక్కడ ఎవరూ లేరు కదా. ఇక ఆరోజు నుంచి అందరూ
అక్కడే కలిసి మెలిసి ఉంటూ సంతోషంగా
వాళ్ళ జీవితాలను నూతనంగా మొదలుపెడతారు. అలా రోజులు గడిచాయి.
శ్రీ కన్య తల్లి గర్భం ధరిస్తుంది.
దాన్ని చూసి వాళ్ళు చాలా సంతోష పడతారు.
స్వామీజీ ఆమెతో…అమ్మ ఇన్ని రోజులు నువ్వు కన్న కల నెరవేరబోతోంది.
అప్పుడు ఆమె ఏడుస్తూ…అవును స్వామి ఎన్ని రోజులకి ఆ భగవంతుడికి నా పైన దయ కలిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది.
అంటూ చాలా సంతోషపడుతుంది అలా కొన్ని రోజులు గడిచాయి.
ఆమెకు ఒంట్లో సరిగా ఉండదు.
ఉన్నట్టుండి రక్తస్రావం జరుగుతుంటుంది.
దానిని గమనించిన స్వామీజీ…
ఏమైందమ్మా ఎందుకు నీకు రక్తస్రావం జరుగుతుంది.
అప్పుడు ఆమె పెద్దగా ఏడుస్తూ… స్వామి నేను కొన్ని రోజుల క్రితం మే కదా తల్లిని కాబోతున్నాను అని చాలా సంతోషపడ్డాను.
కానీ నాకు అదృష్టం దక్కదు. నేను పాపిష్టి దాన్ని. నష్ట జాతకాల్ని అంటూ ఆమెను ఆమెను తిట్టుకుంటూ తల బాదుకుంటూ ఉంటుంది.
స్వామి….. అయ్యో తల్లీ ఒక్క నిమిషం మాకు అసలు ఏం జరిగిందో స్పష్టంగా చెప్పు.
ఆమె…. స్వామి మళ్లీనా గర్భం నీలువ లేదు.
నేను ఇంక ఎప్పటికీ గొడ్రాలు గానే ఉండిపోతావు అనుకుంటా. నాకు పుట్టిన బిడ్డ తో అమ్మ అని పిలిపించుకోవాలని ఉంది.
శ్రీ కన్య నన్ను అమ్మ అంటుంది. అందుకు నాకు చాలా సంతోషం. కానీ నా కడుపులో కూడా ఒక బిడ్డ పుడితే శ్రీ కన్య కు తోడుగా. ఉండడమే కాదు నాక్కూడా చాలా సంతోషంగా ఉంటుంది అని చాలా కలలు కన్నాను కానీ అవన్నీ బూడిదలో పోసిన పన్నీరు గానే మిగిలిపోయాయి. కలలు నిజాలు ఎప్పటికీ కావని నిరూపించబడ్డాయి అంటూ బోరున ఏడుస్తుంది.
అమ్మ బాధను చూస్తూ నాగిని ఆమెను హత్తుకొని…. బాధ పడకమ్మా భగవంతుడు నీ పైన దయ చూపిస్తాడు. అంటూ ఆమెను ఓదారుస్తుంది . ఆమె అయినప్పటికీ చాలా బాధపడుతూ లోపలికి వెళ్లి తలుపు వేసుకుంది ఆ తర్వాత ఏం జరిగిందో తరువాయి భాగంలో చూద్దాం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *