నాగిని కాపాడగలదా12_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

పదకొండవ భాగం లో శ్రీ కన్య తండ్రి ఆత్మ వాళ్ల దగ్గరకు వచ్చి వాళ్ళ చేత భోజనం తినిపిస్తుంది. వాళ్లు భోజనం చేసిన తర్వాత ఆత్మ చాలా సంతోష పడుతూ అక్కడ నుంచి మాయమైపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ భాగంలో తెలుసుకుందాం. రోజులు గడిచాయి వాళ్లు జరిగిన విషయం మర్చిపోయి సంతోషంగా జీవిస్తూ ఉంటారు

అలా వుండగా ఒక రోజు శ్రీ కన్య భైరవ తో…. భైరవ మనం అలా అడవిలో తిరిగి వద్దాం పద. ఇక్కడే నాకు ఏం పాలుపడడం లేదు.
అందుకు భైరవ…. సరే మిత్రమా వెళ్దాం పదా అని అంటాడు ఇద్దరూ కలిసి అలా వెళ్తూ ఉంటారు. మార్గమధ్యలో శ్రీ కన్య కు ఒక ఉంగరం కనపడుతుంది. వెంటనే శ్రీ కన్య బంగారం తీసుకొని… అరే భైరవ చూడు ఎంత బాగుందో ఈ బంగారం. దగ దగ మెరిసిపోతుంది నాకు చాలా బాగా నచ్చింది.
అని చెప్పి దాన్ని తీసుకొని తన వేలుకి పెట్టుకుంటుంది. ఆమె అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్లకు దూరంగా మూడు తలల దిష్టిబొమ్మ కనబడుతుంది.
దాన్ని చూసిన భైరవ…. శ్రీ కన్య ఆ దిష్టి బొమ్మ చూడు ఎలా ఉందో. మూడు తలలు చాలా వింతగా ఉంది.
శ్రీ కన్య…. అవును చాలా వింతగా ఉంది. కానీ ఇక్కడ దీనిని ఎవరు వుంచి ఉంటారు.
అని ఆలోచిస్తూ ఉంటుంది.
అప్పుడు భైరవ … కానీ అది చూడటానికి చాలా బాగుంది. మనుషులు కూడా అలా వస్తే ఎలా ఉంటుందో నాకు చూడాలని ఉంది.
అప్పుడు ఆమె…. నాక్కూడా అలాగే ఉంది నాకు ఒక మూడు తలల వస్తే. ఒక తల తో మాట్లాడ వచ్చు ఒక తలతో తినొచ్చు ఒక తలతో అన్ని చూడొచ్చు. భలే ఉంది కదా అని అనుకోగానే వెంటనే ఆమెకు మూడు తలలు వస్తాయి.
దాన్ని చూసిన బైరవ ఆమె ఇద్దరు ఆశ్చర్యపోతారు. శ్రీ కన్య భయపడుతూ…. అయ్యో ఏంటి ఇలా జరిగింది. చచ్చాను భగవంతుడా అంటూ బాధపడుతుంది.
అప్పుడు భైరవ…. మిత్రమా నేను నాగిని నీ తీసుకొని వస్తాను ఇక్కడే ఉండు ఎక్కడికి వెళ్ళకు. అని అంటుంది అందుకు ఆమె…. వెళ్లి త్వరగా తీసుకుని రా. ఈరోజు నాగిని స్వామీజీ ఆశ్రమంలో పూజ చేస్తూ ఉంటారు మనం తలుచుకున్న ఇక్కడ ప్రత్యక్షం కారు నువ్వు ఇక్కడ జరిగిన విషయం చెప్పు.
అని అంటుంది.
భైరవ సరే అని చెప్పి అక్కడి నుంచి అరుస్తూ పరుగులు తీస్తుంది.
శ్రీ కన్యా చాలా భయపడుతు….. అసలు ఇదంతా ఎలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు. అయ్యో నాకు భయం తో నోరు ఎండి పోయి దాహంగా ఉంది. ఎక్కడైనా నీళ్లు కనబడితే బాగుండు. అనుకోగానే ఆకాశ ద్వారాలు తెరుచుకొని నీళ్ళు దారాళంగా కురుస్తూ ఉంటాయి. దాన్ని చూసిన ఆమె మరింత ఆశ్చర్యపోతుంది. అప్పుడు ఆమె అనుమానంతో తన చేతికి ఉన్న ఉంగరం వైపు చూసి…. బహుశా దీని వల్ల ఇలా జరుగుతుంది అనుకుంటా ఇది ఏదో మాయ ఉంగరం లాగా ఉంది. దీనివల్ల కాదా అని నేను పరీక్షిస్తాను. అని అనుకోనీ ఇప్పుడు నాకు వచ్చిన రెండు తలలు మాయం కావాలి అని అంటుంది అలా అన్న వెంటనే ఆ రెండు తలలు మాయమవుతాయి. అప్పుడు ఆమెకు పూర్తిగా అర్థమవుతుంది…. ఓహో ఇది మామూలు ఉంగరం కాదు మాయ శక్తి గల మాయా బంగారం. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.అని అనుకుంటుంది అప్పుడే bairavaa నాగిని నీ తీసుకుని అక్కడికి వస్తాడు.
ఆమె రెండు తలలు మాయమైపోవడం చూసిన బైరవ….. శ్రీ కన్య నీ రెండు తలలు ఏమైపోయాయి నాకు అంతా ఆశ్చర్యంగా ఉంది.అప్పుడు శ్రీ కన్య జరిగిన విషయం అంతా చెప్పింది. దానిని విన్నవాళ్ళు ఆశ్చర్యపోతారు నాగిని ఆ బంగారం తీసుకొని…. ఇది ఒక అద్భుతమైన ఉంగరం ఇది ఇక్కడిది కాదు ఆకాశం నుండి దిగివచ్చిన దేవకన్యది అనుకుంటా ఆమె ఇప్పుడు సామాన్య స్త్రీగా మారి ఉంటుంది వెంటనే దీన్ని ఆమె దగ్గరకు చేర్చాలి.
అనుకుంటుంది అందుకు శ్రీ కన్య…. అయితే పదండి వెళదాం ఆమె ఎక్కడుందో. అప్పుడు నాగిని… నా దివ్యదృష్టితో చూస్తాను మనం ఆమె దగ్గరికి వెళ్లి తిరిగి ఇచ్చేద్దాం.
నాకు నీ తన దివ్యదృష్టితో చూడగా అనే ఒక చోట కూర్చుని…. అయ్యో పాపం కదా నేను అనవసరంగా భూలోకం చేద్దామని వచ్చాను . కానీ నా బంగారం పోగొట్టుకొని నా శక్తులు పోనీ నేను తిరిగి అక్కడికి వెళ్ళ లేక పోతున్నాను. అయ్యో నేను ఏం చేయను అంటూ ఏడుస్తుంది.
దానంతట తన దివ్య దృష్టితో చూసిన నాగిని…. పాపం ఆ దేవకన్య చాలా బాధపడుతుంది. వెంటనే మనం ఆమె దగ్గరకు వెళ్లి ఈ ఉంగరాన్ని ఇచ్చేద్దాం పదండి అంటూ అందరితో మాయమైపోయి అక్కడ్నుంచి సరాసరి ఆ దేవకన్య దగ్గరికి వెళుతుంది.
ఆమెకు సామాన్య స్త్రీగా ఉంటుంది అప్పుడు నాగిని జరిగిన విషయం చెప్పి…. దీని కోసమే కదా మీరు బాధపడుతుంది తీసుకోండి సంతోషంగా తిరిగి మీ లోకానికి వెళ్ళండి.
అని అంటుంది అందుకు ఆమె చాల సంతోషపడుతూ…. వెళ్తాను భూలోక అందాలు చూద్దామని వచ్చాను. ఇంతలో నా అగులికం పోగొట్టుకొని సామాన్య స్త్రీగా మారి చాలా బాధపడుతున్నాను. ఉంగరాన్ని తీసుకొని తన వేలికి ధరించుకు oటుంది .
వెంటనే ఆమె దేవకన్యగా మారి రెండు రకాల వచ్చి ….. మిత్రులారా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా తిరిగి నా లోకం కి వెళ్తాను కానీ భూలోకం నేను ఏమి చూడలేదు కేవలం నా అంగులికం పోయిందన్న బాధ లోనే ఉండిపోయాను. కానీ ఇప్పుడు సంతోషంగా ఉంది నేను ఎప్పుడైనా మళ్లీ ఎక్కడికి వస్తాను. అప్పుడు అంతా తిరిగి చూద్దాం. అందుకు భైరవ…. అమ్మ మీరు రాక రాక భూలోకానికి వచ్చారు. అలాంటప్పుడు ఇక్కడ ఉన్న అందాలు చూసి సంతోషంగా వెళ్ళండి. మళ్లీ మీరు ఎప్పుడు వస్తారో ఏమిటో మాతో పాటు వస్తే నీకు భూలోకం మొత్తం తిప్పి చూపిస్తాము అని అంటుంది
అందుకు ఆమె చాల సంతోషపడుతూ..
.సరే అయితే పదండి వెళదాం అని అంటుంది ఆ తర్వాత అందరూ కలిసి ఆకాశంలో ఎగురుతూ కింద అందాలను ఆస్వాదిస్తూ ఉంటారు మరి కొంత సమయం అందరూ భూమిపై నడుస్తూ సంతోషంగా ఉంటారు. అలా రాత్రి సమయం పడుతుంది.
ఆ దేవకన్య వాళ్లతో…. ఇంకా చాలా సమయం అయ్యింది ఈ సంతోషం నాకు చాలు. ఇంకా నేను వెళ్లి వస్తాను. అని చెబుతుంది అందుకు వాళ్ళు సంతోషంగా ఆమెకు వీడ్కోలు చెప్తారు. అమె తాన రెక్కలతో ఆకాశం వైపు దూసుకు వెళ్తుంది. వాళ్లు కూడా అక్కడనుంచి వెళ్ళి పోతారు. రాత్రి సమయం గడిచిపోతుంది మరుసటి రోజు ఉదయం . శ్రీ కన్య నిద్రలేచి చూస్తుంది ఆమె పక్కన దేవకన్య సామాన్య స్త్రీ రూపంలో ఉంటుంది. దాన్ని చూసి నా శ్రీ కన్య ….. ఆశ్చర్యంగా ఆమెనీ లేపుతూ….. ఒకసారి నిద్ర లేవండి. అంటూ కేకలు వేస్తోంది. ఆమె నిద్ర నుంచి లేచి….. ఏమైంది శ్రీ కన్య ఎందుకు నన్ను నిద్ర నుంచి లేపావు.
శ్రీ కన్య… మీరు నిన్ననే కదా ఇక్కడ నుంచి వెళ్లిపోయారు మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చారు .
ఎందుకు వచ్చారు.
అప్పుడు ఆమె…. శ్రీ కన్య నాకు ఈ భూలోకం చాలా బాగా నచ్చింది. నాకు ఇక్కడే ఉండాలని ఉంది అందుకే తిరిగి వచ్చేసాను.
నేను ఇక్కడే మీతో పాటు ఉంటాను.
శ్రీ కన్య…. అయితే ముందు నాగిని దగ్గరికి వెళ్దాం పద ఆ తర్వాత ఆమె చెప్పినట్టు చేద్దాం అని అంటుంది అందుకు దేవకన్య…. సరే పద ఇప్పుడే వెల్దాం. అంటూ అక్కడి నుంచి నాగిని దగ్గరికి వెళుతూ ఉంటారు. అప్పుడే ఒక వ్యక్తి అక్కడకు వచ్చి…. దేవకన్య భూమ్మీదికి వచ్చి పెద్ద పొరపాటు చేశావు. ఇక్కడి వాళ్లు అంతా సులువుగా నిన్ను వదిలి పెట్టరు. నా మాట విని ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళిపో. నిన్ను నువ్వు కాపాడుకో ఈ భూలోకo మీకు అంత మంచిది కాదు. అడిగి అంటాడు అందుకు ఆమె అతని వైపు చూస్తూ… ఎవరు నువ్వు ఎందుకు నాకు మంచి చెప్తున్నావు.
అని అడుగుతుంది అందుకు అతను పెద్దగా నవ్వుతూ…హా హా హా నేను ఎవరో ముందు ముందు నీకే తెలుస్తుంది. ఆ తర్వాత నువ్వు లోకం విడిచి వెళ్లక తప్పదు సుమీ. అని అక్కడి నుంచి మాయమైపోతాడు.
అతని మాటలు విన్న శ్రీ కన్య… అతను ఎవరో కానీ సరిగ్గా చెప్పాడు. మీరు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. నా మాట విని వెళ్లిపోండి ఇంక నాగిని దగ్గరకు కూడా
అవసరం లేదు. అంటూ ఆమె అక్కడి నుంచి పరుగులు తీసి ఇంటికి వెళ్తుంది.
అక్కడ దేవకన్య నాగిని వెతుక్కుంటూ వెళ్తుంది. నాగిని ఆమెను చూసి చాలా ఆశ్చర్య పోయి… మీరు మళ్లీ ఇక్కడికి ఎందుకు వచ్చారు. దయచేసి మీ లోకానికి తిరిగి వెళ్ళండి.
అప్పుడు ఆమె… లేదు నేను వెళ్ళను నేను మీతో పాటు ఇక్కడ ఉంటాను. ఈ భూలోకం చాలా అందంగా ఉంది. ఇక్కడి వాతావరణం ఇక్కడ మనుషుల మధ్య ప్రేమ చాలా బాగుంది. దయచేసి నన్ను మీతో పాటు ఉండనివ్వండి. అని ప్రాధేయ పడుతోంది.
నాగిని… సరే అయితే ఈ విషయం గురించి స్వామీజీతో మాట్లాడదాం. ఆయన ధ్యానం లో ఉన్నారు . కొంత సమయం తర్వాత వెళ్దాం. అని అంటుంది అందుకే ఆమె సరే అంటుంది. కొంత సమయం పడుతుంది అప్పుడే స్వామీజీ అక్కడికి వస్తాడు.
స్వామీజీ ఆమెను చూసి….. చూడమ్మా దేవకన్య నువ్వు ఇక్కడికి వచ్చి చాలా పెద్ద పొరపాటు చేశావు. ఇక్కడ నీకు అంత సురక్షితం గా ఉండదు నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపో.
అని అంటాడు అందుకు ఆమె…. నేను దేవకన్య నేను మీకు ఎలా తెలుసు స్వామి మేము ఇంకా ఏమి చెప్పకుండానే అన్ని మీరు ఇలా చెప్పగలుగుతున్నారు.
స్వామీజీ….. మాకు సర్వమూ తెలుసు. మనిషిని చూసి ఏంటి అనేది చెప్పగలం.
అప్పుడు ఆమె…. అయితే స్వామి ఇందాక ఒక వ్యక్తి నన్ను హెచ్చరించి వెళ్లడు అతను ఎవరో చెప్పగలరా .
అప్పుడు స్వామీజీ అతని రూపంలోకి మారతాడు.ఆ రూపాన్ని చూసిన వాళ్ళు ఇద్దరూ చాలా ఆశ్చర్యపోతారు.
దేవకన్య… స్వామి మీరు ఇందాక నా దగ్గరికి వచ్చి నన్ను హెచ్చరించారా.
అందుకు అతను మళ్లీ స్వామీజీ రూపంలోకి మారి… అవును నేనే హెచ్చరించాను ఎందుకంటే నువ్వు భయపడి భూలోకాన్ని వదిలిపెడతామని కానీ నువ్వు బలంగా ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నావ్వు. కొంచెం కూడా నీ కళ్ళల్లో భయం చూడలేదు.
అందుకు ఆమె…స్వామి ఏ నిజం చెప్తున్నాను నాకు ఇక్కడ చాలా బాగా నచ్చింది. నేను ఇక్కడే మీతో పాటు ఉంటాను కాదనకండి. అంటూ ప్రాధేయ పడుతోంది అందుకు స్వామీజీ… సరే ఇక నువ్వు ఇక్కడే ఉండొచ్చు అని సెలవిస్తాడు. అందుకు ఆమె చాలా సంతోషపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తరువాయి భాగంలో చూద్దాం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *