పక్షుల హోలీ పండుగ | Telugu Stories | telugu Fairy Tales | Best Birds Stories Telugu
రకరకాల పక్షులు నివసిస్తుండేవి, అందులో యున్న తుని పిచ్చుక తాను చాలా అందంగా ఉంటుంది అని తనకంటే అందంగా ఈ అడవిలో ఎవరు ఉండరని అనుకుంటూ ఉండేది, అదే అడవిలో ఉండే లూసీ పావురం మిగతా పక్షులతో చలాకీగా మాట్లాడుతూ ఉండేది, ఎవరు ఏ కష్టాల్లో ఉన్నారని తెలిసిన నిమిషాలలో అక్కడికి వెళ్లి తన వంతుగా ఎదో ఒక సహాయం చేస్తూ ఉండేది, ఒకరోజు తన ఇంట్లో అద్దం ముందు కూర్చొని మేకప్ వేసుకుంటున్న తుని పిచ్చుక తనలో తాను ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంది,
తుని పిచ్చుక : వామ్మో ఇక ఎండాకాలం మొదలవుతుంది, నేను బయటకు వెళ్లడం తగ్గించాలి లేదంటే ఎండకు నా అందం పాడైపోతుంది. అసలే నా కోమలమైన అందానికి చాలా మంది ఫాన్స్ ఉన్నారు, ఒక వేళా నా అందం పాడైపోతే వాళ్ళందరూ ఏమైపోతారు అందుకే వాళ్ళ కోసమైనా నేను నా అందాన్ని కాపాడుకోవాలి అని అనుకుంటుంది తుని పిచ్చుక.
కొంత సేపటి తరువాత సూర్యుడు తన ప్రభావాన్ని తగ్గించిన తరువాత బయటకు వస్తుంది తుని పిచ్చుక, తుని పిచ్చుక వెళ్లే మార్గం లో చోటు చిలుక, లూసీ పావురం మాట్లాడుకుంటూ ఉంటాయి, అప్పుడే అక్కడ కనిపించిన తుని పిచ్చుకాని చూసిన లూసీ పావురం ఇలా అంటుంది.
లూసీ పావురం : ఏమమ్మా తుని ఈ మధ్య అస్సలు బయట కనిపించడమే మానేసావు, రెండ్రోజులుగా కనిపించక పోయే సరికి పేపర్ లో వేయిద్దాం అనుకుంటున్నాను అని అంటుంది వెటకారంగా.
తుని పిచ్చుక : అంత వెటకారం ఎందుకు లే కానీ ఎండా కాలం వచ్చింది గా అందుకు ఎక్కువగా బయటకు రావడం లేదు అని అంటుంది.
చోటు చిలుక : ఇదంతా సరేలే కానీ హోలీ పండుగ వస్తుంది కదా, రంగులతో సిద్ధంగా ఉండు ఈ సారి చాలా బాగా ఆడుదాం అని అంటుంది.
తుని : ఏమి హోలీ నో ఏమో రంగులన్నీ రసాయనాలు కలిపి తాయారు చేస్తున్నారంటా, అలాంటి రంగులు వాడితే అందం పాడైపోదూ అని అంటుంది.
లూసీ పావురం : అబ్బో నీ సోకులకేం తక్కువలే కానీ, ఒక్క రోజు రంగులు పడితే పాడయ్యే అంత బలహీన మైన చర్మమా నీది, ఎల్లుండే పండుగ సిద్ధంగా ఉండు అని అంటుంది.
రెండు రోజులు గడిచిపోతాయి, హోలీ పండుగ రానే వచ్చింది, లూసీ పావురం చాలా రకాల రంగులని తన దగ్గర ఉన్న ఒక పైప్ లో నింపుకొని తహుని పిచ్చుక ఇంటికి వెళ్తుంది, అక్కడికి చోటు చిలుక కూడా వస్తుంది.
లూసీ పావురం : హోలీ శుభాకాంక్షలు మిత్రమా, మన స్నేహితురాలు తుని పిచ్చుకకి చెప్పాము కదా హోలీ చాలా మంచిగా ఆడుదాం అని తాను మాత్రం బయటకు రావడం లేదేంటి? అని అంటుంది
చోటు చిలుక : తాను హోలీ ఆడదానికి బయటకు రావడానికి కూడా మేక్ అప్ వేసుకోవాలి, తన మేకప్ పూర్తయ్యే లేపు మన హోలీ సంబరాలు కూడా అయిపోయేలా ఉన్నాయి. అని అంటుంది
ఇంతలో తుని పిచ్చుక అందంగా మేకప్ వేసుకొని బయటకు వస్తుంది. తుని పిచ్చుక బయటకు రాగానే చోటు చిలుక, లూసీ పావ్వురం ఒక్క సారిగా తుని పిచ్చుక మీద రంగు మొత్తమ్ చల్లేస్తాయి. లూసీ పావురం, చోటు చిలుక ఒక్కసారిగా రంగు చల్లడం తో తుని పిచ్చుక మొత్తం రంగులో మునిగి పోతుంది.
తుని పిచ్చుక : అయ్యయ్యో నా మేకప్ అంత పోయింది, నేను ఈ రంగులన్నీ పూసుకొని మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళాలి, ఏంటి మిత్రులారా ఇలా చేశారు నేను ఎంతో అందంగా తయారయ్యి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను మీరు ఇలా చేశారు నేనెలా వెళ్ళను? పోండి మీరు ఎప్పుడు ఇంతే ఏ పని ముందుకు పోనివ్వరు అని కోపంగా అంటుంది.
చోటు చిలుక : ఏంటి మిత్రమా అలా అంటావు? నీకు ఇంతకు ముందే చెప్పాము కదా, హోలీ పపండుగ జరుపుకుందాము అని నువ్వు ఎలా చేస్తావని మీ అమ్మమ వాళ్ళ ఇంటికి వెళ్తావని మాకెలా తెలుస్తుంది ఎమన్నా కలగంటామా మేము అని అంటుంది
లూసీ పావురం : అయిందేదో అయ్యిందిలే గాని ఇంతకీ నువ్వు మీ అమ్మమ్మ వాళ్ళ ఊరికి ఎందుకు వెళ్తున్నావో చెప్పలేదు? అని అడుగుతుంది
తుని పిచ్చుక : నాకు మా మామయ్యా పెళ్లి సంబంధం ఒకటి చూశాడంట, పెళ్లి చూపులకి వెళ్తున్నాను, మీరు పాడు చేశారు మల్లి ఇంత అందంగా తయారవ్వాలంటే ఎంత టైం పడుతుందో తెలుసా? అని అంటుంది
లూసీ పావురం : అంత కష్టం నీకెందుకు మిత్రమా నువ్వు చాలా అందంగానే ఉంటావు అంత అందంగా ఉంది కూడా మల్లి ఈ మేకప్ లు ఎందుకు? అయినా రసాయనాలు ఉన్నాయని పండుగ రోజు ఒక్కరోజే రంగులే వాడను అన్న దానివి అంత కన్నా ఎక్కువ రసాయనాలు ఉన్న మేకప్ ఎలా వేసుకుంటున్నావు? నీ అందం కానీ అందం తో నువ్వు అందంగా ఉన్నవని ఎలా మురిసిపోతున్నావు అని అంటున్నది.
లూసీ పావురం అన్న మాటలు విన్న తరువాత తుని పిచ్చుక ఇలా అంటుంది.
తుని పిచ్చుక : అవును మిత్రమా నువ్వు అన్నది నిజమే, ఇప్పటికి నా కళ్ళు తెరిపించావు, ఇక నుంచి నేను మేకప్ వెయ్యడమే మానేస్తాను, దేవుడు ఇచ్చిన సహజమైన అందం తోనే తిరుగుతాను, అని లోపలికి వెళ్లి తన మేకప్ డబ్బా తీసుకొచ్చి బయట పడేస్తుంది. కొంత రంగు తీసుకొని లూసీ పావురం మీద మరియు చోటు చిలుక మీద రంగు చెల్లుతుంది. ఇక లూసీ పావురం, తుని పిచ్చుక, చోటు చిలుక కలిసి ఎంతో సంతోషంగా హోలీ పండుగ చేసుకుంటాయి.
తుని పిచ్చుక ఇలా అందరితో సంబరంగా ఉండడం చూసి అడవిలో మిగతా పక్షులు ఆశ్చర్యపోతాయి, ముగ్గురు స్నేహితుల ఆనందంతో అడవంతా సంతోషంగా మారిపోతుంది.
Related Posts

చందమామ దొంగతనం | Telugu Kathalu | Bedtime Stories | Panchatantra kathalu |Comedy Videos |Fairy Tales

వరదల్లో చేపలు Fish in floods | Telugu Kathalu |Telugu Story | Bedtime Stories | Panchatantra kathalu
