పనసపండులో బంగారు బాబు | Telugu Stories | Telugu Moral Stories | Telugu Kathalu | Bedtime Stories

ఒక ఊరిలో శాంతి అనే ఒక ఆవిడ ఉండేది, ఆమెకి మీరా అనే ఒక కూతురు కూడా ఉంది, శాంతి భర్త చనిపోయినప్పటి నుంచి మీరా ని చూసుకుంటూ ఉండేది. శాంతి పండ్లు అమ్ముకున్నటూ వచ్చిన డబ్బులతో  గడుపుతూ ఉండేది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి.

అలా ఉండగా రోజు రోజుకు శాంతి ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. అది తీలుసుకున్న మీరా శాంతి దగ్గరకు వచ్చి ఇలా అంటుందేది

మీరా :  అమ్మ నువ్వు రోజు అడవికి వెళ్లి పండ్లు తీసుకొచ్చి ఊరిలో తిరిగి తిరిగి అమ్మడం పైగా ఇంటి పనులు కూడా చెయ్యడం వళ్ళ నీ ఒంటికి విశ్రాంతి దొరకక పోవడం వల్ల నీ ఆరోగ్యం రోజు రోజుకు ఖీనిస్తూ వస్తుంది . ఇక నుంచి నువ్వు చేసే పనిలో నేను కూడా సహాయపడదాము అనుకుంటున్నాను అమ్మ అని అంటుంది మీరా ఎంతో బాధపడుతూ

శాంతి : వద్దమ్మా నువ్వేం చెయ్యగలవు తల్లి నువ్వు చిన్నపిల్లవి నీతో నేను ఎలా పని చేయిస్తాను తల్లి వద్దు అని అంటుంది.

మీరా : అలా అనకమ్మ నీ ఆరోగ్యం చూస్తుంటే నాకు చాలా భయమేస్తుంది, నాన్న ఎలాగూ లేడు ఇక నీకు కూడా ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను, కనీసం నీ ఆరోగ్యం కుదుట పడే వరకైనా చేస్తానమ్మా ఎదో ఒక పని అని అంటుంది

శాంతి : సరే తల్లి ఏ పని చేస్తావ్వు తల్లి అని అంటుంది

మీరా : అమ్మ నేను అడవికి వెళ్లి పండ్లు తీసుకొస్తాను వాటిని ఇద్దరం కలిసి ఊరిలో అమ్ముదాం అని అంటుంది.

శాంతి కూడా సరే అంటుంది.

మర్నాడు ఉదయం మీరా అడవికి వెళ్లి పండ్లు అన్ని ఒక దగ్గర జమ చేస్తూ ఉంటుంది, మీరా పండ్లన్నీ ఏరుకుంటూ ఉండగా ఆమె దగ్గరకి ఒక పెద్ద మాయ పనస పండు దొర్లుత్తూ దొర్లుతూ వస్తుంది. దొర్లుతూ వస్తున్న పనస పండుని చూసి మీరా చాలా భయపడి పోతుంది. పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది.

మీరా అంత ఆయాసపడుతూ భయ భయంగా పరిగెత్తుకు రావడం చూసిన శాంతి మీరాని దగ్గరికి తీసుకొని అడుగుతుంది.

శాంతి : మీరా అమ్మ మీరా ఏమైంది తల్లి అంతలా భయపడుతున్నావెందుకు ఎం జరిగింది అని అడుగుతుంది.

మీరా : అమ్మ నేను పండ్లు తీసుకురావడానికి అడవికి వెళ్లిన కదా, అక్కడ పండ్లు తెంపి బుట్టలో వేస్తుంటే ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు ఒక మాయా పంజా పండు నా మీదకే దొర్లుతూ వచ్చింది అది చూసి నాకు చాలా భయమేసింది, అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాను అమ్మ అని జరిగిన విషయం అంతా చెప్తుంది.

శాంతి : అలా ఏమి ఉండదమ్మా నువ్వు ఎదో చూసి భయపడి ఉంటావు, నీకు అడవి కొత్త కదా అప్పుడు అప్పుడు అలా భయమవుతుంటాది. అని ధైర్యం చెబుతుంది మీరాకు

తల్లి కూతుళ్లు ఇద్దరు కలిసి ఇంటి ముందుకు వెళ్తారు ఇంతలో మాయ పనస పండు ఇంటి ముందే ఉంటుంది.

మీరా : అమ్మ అమ్మ ఇదే అమ్మ నన్ను అడవిలో వెంట పడిన పనస పండు, అని భయపడుతుంటుంది.

శాంతి : నువ్వేం భయపడకమ్మా నేను చోస్తాను, నువ్వు చెప్తే నువ్వు దేన్నో చూసి భయపడి ఉంటావు అనుకున్న కానీ ఇది చూసాక నమ్మక తప్పడం లేదు ఇదేదో మాయా పనస పండు లా ఉంది, దీన్ని ఏమి చేస్తానో చూడు అని అంటుంది, వెంటనే లోపలి వెళ్లి ఒక పెద్ద కత్తి తీసుకొని వస్తుంది

మీరా : అమ్మ ఎం చేస్తున్నావు అమ్మ అని అంటుంది.

శాంతి : నువ్వు చూస్తునే ఉండు దీన్ని నరికేస్తా అప్పుడు దీని పీడా విరగడై పోతుంది, అని పనస పండు దగ్గరికి వెళ్లి రెండు ముక్కలు చేస్తుంది. పనస పండు మధ్యలో నుంచి ఒక చిన్న బాబు బయటకు వస్తాడు, పనస పండు లోనుంచి బాబు బయటకు రావడం చూసి తల్లి కూతుళ్లు ఱంతో ఆశ్చర్య పోతారు

శాంతి మెల్లగా వెళ్లి బాబుని చేతుల్లోకి తీసుకుంటుంది. పనస పండు నుంచి బాబుని వేరు చేయగానే పనస పండు మొత్తం బంగారు వర్ణం లో మెరుస్తూ ఉంటుంది. దాన్ని చూసి తల్లి బిడ్డలు ఎంతో సంతోషాడతారు

శాంతి : మీరా మనకు దేవుడు మనకి ఇచ్చిన వరమే అమ్మ ఈ బిడ్డ, వీడు వస్తూనే మనకు సంపద ని కూడా ఇచ్చాడు, వీడు మనకి దేవుడు ఇచ్చిన బిడ్డ ఇక నుంచి మనతోనే ఉంటాడు, ఏఈ బంగారు బిడ్డ ఈ రోజు నుంచి నీకు తమ్ముడు వీణ్ణి కంటికి రెప్పలా చూసుకో తల్లి, అని అంటుంది

మీరా : చూసుకుంటానమ్మా తమ్ముణ్ణి చాలా ప్రేమగా చూసుకుంటాను, ఇక నుంచి మన కష్టాలు కూడా తీరినట్టే అమ్మ తమ్ముడు మన అదృష్టం. వస్తు వస్తూనే మన కష్టాలు తీర్చిన దేవుడి ప్రతిరూపం అమ్మ వీడు. కష్టం వీడి దగ్గరకు రాకుండా చూసుకుందాం అమ్మ అని అంటుంది

ఆ రోజు నుచి శాంతి మీరా కలిసి పనస పండులో దొరికిన పిల్లాడిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *