పాపం పేద పిల్లలు మాయా నది Episode 160 | Telugu Stories | Telugu Kathalu | Banana Dreams TV

ఒక ఊరిలో కీర్తి బాలు అనే ఇద్దరు అనాధ పిల్లలుఉండేవారు, వాళ్లకి ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ, వాళ్ళు ఉండే ఊరు ఒక నది ఒడ్డున ఉండేది, బాలు ఊరిలో ఒక పాత మెకానిక్ షాప్ లో పని చేస్తాడేవాడు, ఆ మెకానిక్ షాప్ యజమాని శేఖర్ ఎంతో ధనవంతుడు కానీ చాలా పిసినారి వాడు. కీర్తి కూడా శేఖర్ వాళ్ళ ఇంట్లోనే పని చ్చేస్తూ ఉండేది, శేఖర్ మాత్రం బాలు కి గాని కీర్తికి గాని డబ్బులు మాత్రం సరిగా ఇచ్చేవాడు కాదు, ఒకరోజు కీర్తి శేఖర్ దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది.
కీర్తి : అయ్యగారు మేము మీ దగ్గర గత కొన్ని సంవస్త్రాలుగా పని చేస్తున్నాము, ఇక్కడ నేను పొద్దంతా ఎంతో పని చేస్తున్నాను, మీ మెకానిక్ షాప్ లో మా తమ్ముడు బాలు ఒళ్ళు హూనం అయ్యేలా పని చేస్తున్నాడు అయినా కూడా మీరు మాత్రం సరిగా డబ్బులు ఇవ్వడం లేదు, మాకు మీరు డబ్బులు ఇవ్వక పోతే తిండికి ఎక్కడ నుంచి వస్తాయి అయ్యా, ఇప్పటి వరకు ఎలాగోలా నెట్టుకొచ్చాము ఇక మేము తినడానికి ఏదైనా కొనుక్కోవాలన్న ఒక్క పైసా కూడా లేదు అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను, ఎలాగైనా మీరు ఈ రోజు మాకు రావలసిన డబ్బులు లెక్కకట్టి ఈరోజు ఇచ్చి తీరాల్సిందే అని అంటుంది. కీర్తి వచ్చి అందరి ముందు డబ్బులు అడగడం తో శేఖర్ కి ఎంతో అవమానంగా అనిపిస్తుంది.
శేఖర్ : భూమికి జానెడు లేవు, నీకు ఎంత ధైర్యమే నా ముందుకు వచ్చి డబ్బులు అడుగుతున్నావు, నాతో మాట్లాడడానికి జనాలు భయపడతారు, అలాంటిది నువ్వు నా ముందు నించొని నన్ను అవామానించి నట్టు మ్మాట్లాడుతావా అని కీర్తి మీద పట్టుకొని నెట్టేస్తాడు శేఖర్ నీ దిక్కున్న చోట చెప్పుకోపో ఎవడు నీకు పని ఇస్తాడో మీరు ఎలా బ్రతతుకుతారో చూస్తాను అని అంటాడు.
బాలు మెకానిక్ షాపులో పని చేస్తుండగా ఒక చంద్ర అనే వ్యక్తి వచ్చి బాలు తో ఇలా అంటాడు
చంద్ర : ఎరా బాలు ఈరోజు నుంచి నీకు ఇక్కడ పని లేదు వెళ్ళు అని అంటాడు,
బాలు : నాకు పని లేకపోవడం ఏంటన్న ఎం మాట్లాడుతున్నావు నువ్వు, నన్ను ఇక్కడ శేఖర్ సర్ పెట్టించాడు, నను పనికి రావద్దు అనడానికి నువ్వు ఎవరు నువ్వు చెబితే నేనెందుకు వింటాను, అని అంటాడు
చంద్ర : నన్ను తీసెయ్యడానికి నేనెవరిని రా, మీ నిన్ను ఇక్కడ చేర్పించిన మీ శేఖర్ సర్ నిన్ను రావద్దని చెప్పమన్నాడు, మీ అక్కతో ఎదో గొడవ అయ్యిందంట అందుకే ఇలా చేసాడు మీ అక్కని కూడా వాళ్ళ ఇంట్లో పని లో నుంచి తీసేసాడు, పైగా మీకు ఇంకా ఎక్కడ పని దొరకకుండా చేస్తాను అని కూడా మీ అక్కని బెదిరించాడట అని అంటాడదు
బాలు : సరే అన్న నెను వెళ్లి శేఖర్ సర్ తో మాట్లాడతాను అని శేఖర్ దగ్గరికి వెళ్తాడు.
శేఖర్ దగ్గరికి వెళ్లిన తరువాత బాలు శేఖర్ తో ఇలా అంటాడు.
బాలు : సర్ మీరు మా అక్కతో గొడవ పెట్టుకున్నారంట, నన్ను కూడా పనిలోకి రానివ్వద్దు అన్నారంట, పైగా మాకు ఎక్కడ పని దొరకకుండా చేస్తాను అన్నారంట ఏమయ్యింది సర్ అని అడుగుతాడు బాలు.
శేఖర్ : మీ అక్క నోటికి అంతు పంతు లేకుండా పోతుంది, అయినా ఏమయ్యింది అని నన్ను ఆడుతున్నావేంటి మీ పొగరు బోతు అక్కని అడుగు చెబుతుంది వ్వెళ్ళి అని బాలు ని కూడా ఇంటి నుంచి వెళ్ళగొడతాడు.
బాలు కీర్తి దగ్గరికి వెళ్లిన తరువాత కీర్తి ఏడ్చుకుంటూ జరిగిన విషయం అంతా చెబుతుంది.
కీర్తి చెప్పిన అన్ని మాట్లాడు విన్న తరువాత బాలు ఇలా అంటాడు
బాలు : అక్క, మనం పేదవాళ్లం అని అని అందరికి అలుసే అందుకే శేఖర్ దగ్గర డబ్బు ఉండే సరికి అతను ఎలాంటి పనులు చేసినా ఎవ్వరు ఏమి అన్నారు పైగామనదే తప్పు అంటారు.
శేఖర్ ని కాదని మనం ఈ ఊరిలో ఎక్కడ బ్రతకలేము ఇక్కడనే కాదక్కా ఏ ఊరికి పోయిన ఇలాంటి వాళ్ల్లు ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని చూసో, లేదా బలాన్ని చూసో, బలగాన్ని చూసో జనాలు భయపడుతుండటారు, అక్కడ మనలాంటి వాళ్ళ మాట నడవదు అని అంటదు
కీర్త్తి : ఇప్పుడు చేసేదేమి లేదు తమ్ముడు నాకు చ్చాలా ఆకలిగా ఉంది ఎంతో మందిని అడిగి చూసాను ఒక్కరు కూడా శేఖర్ ని కాదని సహాయం చెయ్యడానికి సిద్ధంగా లేరు, ఇపుడు మన ఆకలి తీర్చుకోవాలంటే వేరే మార్గం ఏమి లేదు, నది దగ్గరికి వెళ్లి నీటిని తాగి కడుపు నింపుకుందాం పదా అని నది దగ్గరికి వెళ్తారు. కానీ అది ఒక మాయ నది అని వాళ్లకి తెలియదు,
బాలు : అక్క ఎవ్వరు లేని వాళ్లకి దేవుడే దిక్కు అంటారు కదా ఇప్పుడు మాత్రం మనకి ఈ నది లో ఉన్న నీళ్ళే దేవుడు అని నీరు తాగడానికి నదిలోకి బాలు వంగగానే నది బాలు ని లాగేసుకుంటుంది. అది దూరం నుంచి చూస్తున్న కీర్తి బాలు ఉన్న ప్రదేశానికి వచ్చి బాలు ని బయటకు లాగడానికి ఎంతో ప్రయత్నిస్తుంటుంది,
బాలు : అక్క అక్క ఎంతో భయంగా ఉంది అక్క, నన్ను పైకి లాగు అక్క నన్ను ఎదో లోపలి లాగుతున్నట్టు అనిపిస్తుంది చాలా బలంగా లాగుతుంది అని అంటూనే నీటిలో మునిగిపోతాడు బాలు.
అక్కడే కూర్చొని కీర్తి ఏడుస్తూ ఇలా అంటుంది.
కీర్తి : ఇంత చిన్న పిల్లలని వదిలేసి మా అమ్మ నాన్న వెళ్ళిపోవడం ఏంటి? మేము పిసినారి అహంకారి అయినా శేఖర్ నాదగ్గర కొన్ని సంవత్సరాలుగా బడా చాకిరి చేసి డబ్బులు అడిగితే అతను మమ్మల్ని తన్ని తరిమేయ్యడం ఏంటి? కనీసం నీటితో కడుపు నింపుకుండా అని వస్తే ఈ మాయ నది నా తమ్ముడిని మింగేయ్యడం ఏంటి? నా తమ్మడు లేని నేను బ్రతకలేను అని కీర్తి కూడా నదిలో దూకేస్తోంది. కీర్తి నదిలో దూకగానే బాలు కీర్తి ఇద్దరు నీటి నుంచి బయట పడతారు,
మాయ అనాది మాట్లాడుతూ ఇలా అంటుంది.
నది : చూడండి పిల్లలు నేను ఒక మాయ నదిని, ఇప్పటి వరకు నీకు తీసుకోవడమే తప్ప ఇవ్వడమే తెలియదు, ఇంత వరకు నా దగ్గరికి వచ్చిన ఏ ఒక్కటి కూడా తిరిగి పోయింది లేదు, కానీ మిమ్మల్ని మీ పరిస్థితిని ప్రేమని చూస్తుంటే ఇంత కటికుడిని అయినా నా గుండెనే కరిగి[వుతుంది, అందుకే మల్లి మిమ్మల్ని వదిలేస్తున్నాను, వదిలెయ్యడం తో పాటు మీకు ఒక వరం కూడా ఇస్తున్నాను, మీరు ఈరోజు ఏది కావాలంటే అది జరుగుతుంది, నా మనసు మారకముందే మీరు ఇక్కనుంచి వెళ్లిపోండి అని అంటుంది, బాలు కీర్తి వెంటనే మాయా నదికి దూయరంగా వెళ్లి తమ ఇంటి దగ్గరికి వెళ్లి ఒక మంచి ఇల్లు కావాలని కొంత డబ్బు కావాలని కోరుకుంటారు. అనుకున్న వెంటనే వారు కోరుకున్న ప్రతి ఒక్కటి ప్రత్యక్షం అవుతాయి, ఇక అప్పటి నుంచి బాలు కీర్తి ఎంతో సంతోషంగా బ్రతుకుతుంటారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *