పాపం బంగారు ఏనుగు పిల్ల Black Elephant vs Golden Elephant | Best animal Stories Telugu

అడవిని పాలించే బంగారు ఏనుగు కి ఒక చిన్న ఏనుగు పిల్ల కూడా ఉంటుంది. చిన్న బంగారు ఏనుగు పుట్టగానే తల్లి ఏనుగు చనిపోవద్దం తో పిల్ల ఏనుగు ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది, అడవిలో మిగిలిన జంతువులు కూడా బ్యాన్గరు ఏనుగు పిల్లని ఎంతో ప్రేమగాక చూసుకుంటూ ఉంటాయి. అదే అడవిలో ఒక నల్ల ఏనుగు కూడా ఉంటుంది. నల్ల ఏనుగు కి రాజు అవ్వాలనే కోరిక చాలా ఉంటుంది.

నల్ల ఏనుగు : ఎన్ని రోజులుగా  చూస్తున్న రాజు సింహాసనం ఇప్పటికి నాకు దక్కుతుంది అనుకున్న కానీ ఇప్పుడు పిల్ల ఏనుగు వచ్చింది, బంగారు ఏనుగు తరువాత ఆ స్థానం పిల్ల ఏనుగు కి వచ్చేలా ఉంది ఎలాగైనా దాన్ని పక్కకు  తప్పియ్యాలి దానికి ఎదో ఒక ఉపాయం ఆలోచించాలి అని అనుకుంటుంది.

అలా రోజులు గడుస్తూ ఉంటాయి.

ఒకరోజు పిల్ల ఏనుగుకి అడవి తిప్పి చూపించడానికి కుందేలు పంది కలిసి పిల్ల ఏనుగుని అడవంతా తిప్పుతుంటాయి. పిల్ల ఏనుగు తండ్రి ఏనుగు లేకుండా ఉండడం చూసి ఇలా అనుకుంటుంది.

నల్ల ఏనుగు : హమ్మయ్య ఈరోజు నా ఎన్నాళ్ళ కోరిక నెరవేర బోతుంది, పంది ని మరియు కుందేలు ని మెల్లగా పక్కకు పంపించ గలిగితే పిల్ల ఏనుగు పీడా వదిలించుకోవచ్చు, పిల్ల ఏనుగుని గనక తప్పించినట్లయితే ఇక నాకు తిరుగు లేదు ఇక అడవికే నేనే రాజు అయిపోవచ్చు.

కొంత సేపటి తరువాత పిల్ల బంగారు ఏనుగుని చూడడానికి అడవిలో ఉన్న జంతువులన్నీ అక్కడకు వస్తాయి,

పాండా : తండ్రి తేజస్సు మొత్తం చిన్న రాజు మొహం లోనే కనిపిస్తుంది, మన అడవికి రాజు గారి అనంతరం చిన్న బ్యాన్గరు ఏనుగుకు  రాజు అయ్యే అన్ని రకాల లక్షణాలు ఉన్నాయి, అని అంటుంది.

మిగతా జంతువులు కూడా యువరాజ వారు బంగారు ఏనుగుకి జై బంగారు ఏనుగుకి జై అని అరుస్తుంటాయి.

జంతువులన్నీ అలా అరవడం నల్ల ఏనుగు కి బంగారు ఎనుగ్గు పిల్ల మీద కోపం ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉంటుంది.

అలా రోజులు గడుస్తూ ఉంటాయి, ఒకరోజు పిల్ల ఏనుగు ఒంటరిగా అడవిలో నడుచుకుంటూ వెల్తూ ఉంటుంది. నల్ల ఏనుగు పిల్ల బంగారు ఏనుగు వెంటే వెల్తూ ఉంటుంది.

అదే సమయం లో బంగారు ఏనుగు జంతువులన్నింటితో సమావేశం ఏర్పాటు చేస్తుంది.

బంగారు ఏనుగు : చూడండి మిత్రులారా! గత కొన్ని ఏళ్లుగా మా తాతలు తండ్రులు ఈ అడవికి రాజులుగా ఉన్నారు, తరతరాలుగా మా వాళ్ళే ఈ అడవిని పాలిస్తూ వస్తున్నారు, కానీ నేను ఆ పద్దతిని ఇప్పుడు మార్చుదాం అనుకుంటున్నా మీలో ఎవరికీ రాజు అయ్యే అర్హత ఉందొ వాళ్ళని రాజుగా ఎన్నుకుందాం అనుకుంటున్నాను, రాజయ్య అర్హత ఎవరికీ ఉందొ మీరే నిర్ణయించుకోండి అని అంటుంది,

పాండా : జంతువులం అందరం ఇక్కడే ఉన్నాము కానీ చిన్న బంగారు ఏనుగు మరియు నల్ల ఏనుగు మాత్రం కనిపించడం లేదు అని అంటుంది.

పులి  : నల్ల ఏనుగుకి రాజు అవ్వాలనే కోరిక బాగా ఉంది, మనలో ఉన్న అన్ని జంతువుల్లో నల్ల ఏనుగు బలం లోనూ తెలివిలోనూ అందరి కంటే ఒక మెట్టు ఎక్కువే ఉంటుంది, కాబ్బట్టి నల్ల ఏనుగుకి రాజు అయ్యే అర్హత ఉంది అని నా అభిప్రాయం అని అంటుంది.

కుందేలు : రాజా మీ అబ్బాయి చిన్న బంగారు ఏనుగు ఉంది కదా తనకి రాజు అయ్యే అన్ని లక్షణాలు ఉన్నాయి కదా తననే రాజుగా ప్రకటించవచ్చు కదా అని అంటుంది

బ్యాన్గరు ఏనుగు : నేను ముందే చెప్పాను కదా మా కుటుంబీకులు కాకుండా వేరే వాళ్ళని రాజుగా ప్రకటిస్తాను అని, పులి చెప్పినట్టుగా నల్ల ఏనుగు ని రాజు గా ప్రకటిస్తున్నాను, వెంటనే వెళ్లి ఈ విషయం నల్ల ఏనుగుకి చెప్పి ఇక్కడకు తీసుకురండి, రాజసింహాసనం లో కూర్చోబెట్టాలి అని అంటుంది బంగారు ఏనుగు.

జంతువులు నల్ల ఏనుగు ఎక్కడ ఉందొ వెతుకుతూ ఉంటాయి.

నల్ల ఏనుగు పిల్ల ఏనుగుని పట్టుకొని కొడుతూ ఉంటుంది.

నల్ల ఏనుగు : ఇంతే మీ తాతల నుంచి మీరే ఈ అడవికి రాజులుగా ఉంటారా ఇప్పటి వరకు మీ నాన్న రాజు తరువాత నువ్వే రాజు అని అందరు అంటున్నారు, ఇలా అయితే నేను ఎలా రాజు అవ్వాలి, నేను రాజ్కు అవ్వడానికి నువ్వు ఒక్కడివే నాకు అడ్డంగా ఉన్నావు నిన్ను చంపేస్తే నాకు ఇక తిరుగు ఉండదు అని అంటుంది.

పిల్లఏనుగు :చూడు నాకు రాజు అవ్వాలని కోరిక లేనే లేదు, జంతువులన్నీ కోరుకున్న వాడే అసలైన రాజు అని అంటుంది.

నల్ల ఏనుగు బంగారు ఏనుగుని కొట్టడం మొదలు పెడుతుంది.

బంగారు ఏనుగు  :అయ్యో అయ్యో కొట్టొద్దు, నేను చచ్చిపోయేలా ఉన్నాను, నాకు రాజు అవ్వాలని కోరిక లేదని చెప్పను కదా అని అంటూ  ఏడుస్తూ ఉంటుంది.

కొంత సేపటి తరువాత పిల్ల ఏనుగు దెబ్బలకి తట్టుకోలేక చనిపోతుంది. నల్ల ఏనుగు గురించి అడవి మొత్తం వెతుకుతున్న జంతువులు

 సరిగ్గా అప్పుడే జంతువులు అక్కడికి వస్తాయి, పిల్ల ఏనుగు ని నల్ల ఏనుగు చంపడం చూస్తాయి.

పంది : దుర్మార్గురాలా, అక్కడ రాజు బంగారు ఏనుగు తన కన్నా కొడుకుని కాదని నిన్ను రాజుగా చేయాలని అనుకుంటున్నాడు, మేమంన్దరం పిల్ల ఏనుగుని రాజుగా చేయమన్న వినకుండా నిన్ను రాజుని చేస్తా అన్నాడు నువ్వు మాత్రం అత్యాశతో అభం శుభం తెలియని ఈ పసిగుడ్డును చంపేసావు, నీలాంటి నీచుడు రాజు అవ్వడానికి అర్హుడు కాదు అని అంటుంది.

జంతువులు చనిపోయిన ఏనుగుని బ్యాన్గరు ఏనుగు దగ్గరికి తీసుకు వస్తాయి, బంగారు ఏనుగు చనిపోయిన తన కొడుకుని చూసి గుండెలు అవసిపోయేలా ఏడుస్తుంధీ, బంగారు ఏనుగు మంచితనం తెలుసుకోలేక పోయినందుకు నల్ల ఏనుగు కూడా ఎంతో బాధ పడుతుంది. అలా కొన్ని రోజు గడిచిపోతాయి.

ఒక రోజు బంగారు ఏనుగు జంతువులన్నింటితో సమావేశం ఏర్పాటు చేస్తుంది.

బంగారు ఏనుగు : ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది, తెలిసో తెలియక నల్ల ఎనుగ్గు తప్పు చేసినంత మాత్రాన మనం తనని వెలేసినట్టు చూడడం సరైంది కాదు, మీ అందరికి నచ్చినా నచ్చకున్నా ఈ అడవికి రాజునైన నేను చెప్తున్నాను ఇక నుంచి నల్ల ఏనుగే ఈ అడవికి రాజు, నా కొడుకు చనిపోయిన బాధలో నేను సరైన నిర్ణయాలు తీసుకోలేక పోతున్నాను అని అంటుంది బంగారు ఏనుగు.

నల్ల ఏనుగు : మహారాజా మీ గొప్ప మనసు అర్ధం చేసుకోలేక నేను రాజుని అవ్వాలన్న అత్యాశతో చిన్న వాడు అని కూడా చూడకుండా మీ కొడుకుని చంపేషాను నాకు రాజు అయ్యే అర్హతే లేదు, మీరు ఉన్నన్ని రోజులు మీరే మాకు మహారాజు గా ఉండాలి, అని అంటూ నల్ల ఏనుగు ఎంతో అధపడుతూ ఉంటుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *