పాపం మాయకుండా Magical Pot Telugu Story | Telugu Stories | Stories In Telugu | Maya Kathalu

          ఆది  కృష్ణాపురం అనే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో శోభ అనే ఒక చిన్న పాప ఉండేది. తనకు ఎవరూ లేరు ఒంటరి. చుట్టుపక్కల వాళ్ళు ఆమెకు తినడానికి ఆహారం ఇస్తూ ఉండేవాళ్ళు. కొద్దిమంది పాడైపోయిన అన్నాన్ని కూడా తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. అది బాగా పోయినప్పటికీ తప్పనిసరని తినేది. తను చాలాసార్లు బాధపడుతూ…… ఇలాంటి ఆహార నేను తినాల్సిన పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది భగవంతుడా. నాకు తల్లిదండ్రి ఉంటే ఇంత కష్టం వచ్చేది కాదు. ఇలా ఎంతకాలం అని చెప్పి నేను ఈ కుటుంబాల మీద ఆధారపడి ఉంటాను మీరు అందరు నన్ను చాలా చిన్నచూపు చూస్తున్నారు. నేను ఏదో ఒక పని చేసుకొని బతుకుతా నా కాళ్ల మీద నేను నిలబడతాను. అని ఏడుస్తూ పని కోసం వెళ్తుంది. తను పని కోసం వెతుకుతూ ఉంటుంది ఒక వ్యక్తి దగ్గరికి వెళుతుంది. అతనితో……. దయచేసి నాకు ఇక్కడ ఏమైనా పని ఉంటే ఇప్పించండి నాకు చాలా ఇబ్బందిగా ఉంది.

అందుకు అతను ఆ పాప మీద జాలిపడి….. నువ్వు చాలా చిన్న పిల్లవి నీకు ఏం పని ఇవ్వాలి చెప్పు కావాలంటే నీకు నేను భోజనం ఇస్తాను. నువ్వు ఉచితంగా ఇక్కడికి  ఇక్కడికి వచ్చి భోజనం చేయొచ్చు. అని అంటుంది అందుకు పాపా…… చూడండి నాకు ఇప్పటికీ చాలామంది భోజనం పెడుతున్నారు కానీ అలా తీసుకోవడం నాకు ఇష్టం లేదు దయచేసి నా కాళ్లమీద నిలబడ్డానికి ఏదైనా పని చూపించండి అది చేసినందుకు నాకు తృప్తిగా ఉంటుంది నాకు దానికి తగ్గ డబ్బులు ఇస్తే చాలు ఎక్కువ వద్దు.

అందుకు తను ….. సరే పాపా నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా రావచ్చు. ఇక్కడ ఈ హోటల్ ను శుభ్రం చేయడానికి నీళ్లు కలగాలంటే ఈ చిన్న చిన్న పనులు చేసుకో నువ్వు చేయగలిగినంత వారికి పని చేసుకో అని అంటాడు.

ఆ మాట వినగానే ఈ పాప చాలా చాలా సంతోష పడుతూ తప్పకుండా చేస్తాను. అని చెప్పి తన పని చేయడం మొదలుపెడుతుంది.

అలా పని చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్లేటప్పుడు అతను డబ్బులు ఇస్తాడు. అలాగే తాను తినడానికి భోజనం కూడా ఇస్తాడు చాలా రోజులు గడుస్తున్నాయి. పాప తన కాళ్ళ మీద తను నిలబడింది అని చాలా సంతోష పడుతూ ఉంటుంది.

ఒకరోజు పాపా ఆ హోటల్ కి వెళ్ళే సమయానికి అతను మొక్కలు నాటుతూ ఉంటాడు రకరకాల పూలమొక్కలు చూసి పాప ….. బాబు గారు ఇలా ఇవ్వండి నేను వాటిని నాటు తాను అని చెప్పి ఆ మొక్కలు నాటుతోంది అతనికి ఒక మొక్క చాలా బాగా నచ్చుతుంది. దానికి కొమ్మ కొమ్మకి పూలు ఉంటాయి. పాప అతనితో…… బాబు గారు ప్రతిరోజు నాకు ఈ చెట్టు చాలా బాగా నచ్చింది దీనిని నాకు ఇస్తారా అని అడుగుతుంది. అందుకు అతను …… సరే అమ్మ తీసుకొని వెళ్ళు అని అంటాడు పాపం ఈ పని ముగించుకొని తర్వాత ఆ ముక్కను తీసుకొని వెళుతుంది. తను ఇంటికి వెళ్లి …… ఈ మొక్కలను ఇక్కడ నాటాలి అనిశెట్టి గుంటని తవ్వుతూ ఉంటుంది. ఇంతలో తనకి గట్టిగా ఏదో తగిలింది.

అసలు ఏంటి ఇది అని మరింత లోతుగా తవ్వుతుంది. తనకి ఒక పెద్ద బంగారు కుండ  కనబడుతుంది. దాన్ని చూసి పాప చాలా ఆశ్చర్య పోతూ ….. ఏంటిది బంగారుకుండ లాగా ఉంది. అని చెప్పి దాన్ని బయటకు తీసుకుంది.  ఆ బంగారు కుండ చూసి చాలా ఆశ్చర్యపోతుంది.

పాప ఆ మొక్కని నాటి ఆ కుండని తీసుకుని లోపలికి వెళ్ళింది . ఆ కుండ ని ఒక చోట పెట్టి అలా చూస్తూ ఉంటుంది.

ఇంతలో కుండ మాట్లాడటం మొదలు పెడుతుంది….. పాపా నీకు ఎలాంటి సహాయం కావాలో చెప్పు నేను చేస్తాను నేను మాయా కుండని

అని అంటుంది పాప దాన్ని చూసి చాలా కంగారు పడుతూ…… నిజంగా నువ్వు మాయ కుండ వా  నాకు చాలా భయంగా ఉంది.

కుండ….. భయం ఎందుకు నేను సహాయం చేస్తాను అని చెప్పాను కదా నీకు ఏం కావాలి. అని అంటూనే గాల్లోకి ఎగురుతుంది.. పాప ఎగురుతున్న మాయ కొండని చూసి….. నువ్వు నిజంగా ఎలాంటి సహాయమైనా చేయగలవా. అందుకు కుండా ఆవును చేస్తాను అని అంటుంది.

అప్పుడు పాప బయట ఒక పూల చెట్టు ఉంది కదా ఆ పువ్వులు చెట్టు ని బంగారు పువ్వు చెట్టు లాగా మారుస్తా వా.

కుండా….. తప్పకుండా నాతో నీటిని తీసుకెళ్లి ఆ చెట్టుకు పోయి ఆ తర్వాత నీకే అర్థమవుతుంది.

అని అంటుంది అందుకు తను సరే అని చెప్పి ఆ కుండలో నీటిని తీసుకొని వెళ్ళి ఆ చెట్టుకి పోస్తుంది. ఆ చెట్టుకు పూసిన వెంటనే చెట్టు నిండా బంగారు పువ్వులు కాయలు వస్తాయి.

పాపా చాల సంతోషపడుతూ…… నువ్వు ఏది అడిగినా ఇస్తావా నాకు చాలా ఆకలిగా ఉంది భోజనం చేసావా నాకు డబ్బు కావాలి డబ్బులు ఇస్తావా నాకు కొత్త బట్టలు కావాలి ఇస్తావా.

నేను అందర్లాగే బడికి వెళ్లాలి నన్ను చదివిస్తావా.

అని అంటుంది అందుకు మాయ కుండా …… ఇవన్నీ తప్పకుండా జరుగుతాయి మరి నేను చెప్పినట్టు నువ్వు చేస్తావా. పాపా…… తప్పకుండా చేస్తాను ఏం చేయాలో చెప్పు.. అందుకు మాయ కుండా…… నలుగురికి నీ వంతు సహాయం చెయ్యి అప్పుడు నీకు కూడా మంచి జరుగుతుంది అని అంటుంది అంటుంది పాపా ప్రతి ఒక్కరికీ బంగారు పువ్వులు చెట్లు నుంచి వస్తున్న బంగారాన్ని ఇస్తుందని అలాంటి ఎంతోమందికి దానం చేస్తుంది. ఖచ్చితంగా మూడు నెలల తరవాత తన జీవితం అంతా పూర్తిగా మారిపోయింది.

తను చక్కగా చదువుకుంటూ ప్రతి రోజు ఇంటికి వస్తే తనకు కావలసిన ఆహారాన్ని మాయ కుండా ప్రత్యక్షం చేస్తుంది. పాప దానిని తిని …… ఓ మాయ కుండా నీవల్ల నా జీవితం పూర్తిగా మారిపోయింది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతోమంది నాకు సహాయం చేశారు కానీ నిజంగా నాకు పని ఇచ్చి. నాకు ఎంతగానో సహాయం చేసిన ఆ హోటల్ యజమాని దగ్గరికి వెళ్ళాలని ఉంది అక్కడికి వెళ్లి వస్తాను.

నీ గురించి కూడా చెబుతాను అని దాన్ని తీసుకుని అక్కడికి వెళుతుంది. అతను అక్కడ ఏడుస్తూ ఉంటాడు ఎందుకంటే తన భార్య చనిపోయింది.

తన హోటల్ పూర్తిగా పడిపోయింది కొంతమంది కావాలని అతని మీద లేనిపోని అభాండాలు మోపారు. అవమానం తట్టుకోలేక భార్య చనిపోయింది. అదే విషయాన్ని అతను ఏడుస్తూ…… పాపా నా భార్య చావడానికి కారణం నీ మనుషులే. వీళ్ళ సూటిపోటి మాటలతో నన్ను అవమాన పరచి మమ్మల్ని ఇలా చేశారు. పెళ్లి వేసుకొచ్చిన నా కూతురు. లబోదిబోమంటూ ఏడుస్తూ బాధపడుతుంది. దాని కట్నం కోసం దాచిన డబ్బు తో సహా అంతా గుల్ల అయిపోయింది.

నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది అంటూ ఏడుస్తారు ఆ మాట వినగానే పాప చాలా బాధ పడుతూ….. ఇన్ని రోజులు నేను ఇక్కడికి రాకపోవడం పెద్ద పొరపాటు జరిగింది.

ఇదిగోండి ఇది చూడండి మాయా కుండా ఇది

మీకు తప్పకుండా సహాయం చేస్తుంది.

మీరు ఏది కోరుకుంటే అది నీకు వస్తుంది.

అని ఆ కొండ నీ చేతికి ఇస్తుంది.

దాంతో అతను ఎన్నో అద్భుతాలు చేస్తాడు. పోగొట్టుకున్న తన డబ్బు మొత్తం తిరిగి వస్తుంది తన ఉపాధి హోటల్ కి యజమాని అయిపోతాడు.

ఒంటినిండా నగలు డబ్బు చాల ఆస్తిపరుడు అవుతాడు. మంచి డబ్బు ఉన్న వ్యక్తి తో తన కూతురికి పెళ్లి చేశాడు. అదంతా చేసినా ఆ పాపతో…. పాపా  నువ్వు చేసిన మేలు నేను అస్సలు మర్చిపోలేను. నీవల్ల నేను మళ్ళీ పూర్వవైభవాన్ని పొందడం ఒక నా భార్య లేదు అన్న బాధ తప్ప మరో బాధ లేదు. ఇప్పుడు నేను చేయగలిగింది ఒకటే నీకు తండ్రిలాగా మరి నిన్ను బాగా చూసుకోవడం.

తండ్రి ప్రేమను నీకు అందించడం. ఇదంతా నువ్వు చేసినదానికి కృతజ్ఞతగా అనుకుంటావో మరి ఏదన్న అనుకుంటావో అది నీ ఇష్టం. అని పాపని దగ్గరకు తీసుకుంటాడు పాపా చాల సంతోషపడుతూ….. తప్పకుండా నాన్నగారు అంటూ అతని దగ్గరకి వెళ్తుంది. ఇక ఆ మాయ కుండా చాల సంతోషపడుతూ….. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది నేను ఎన్నో మాయలు చేయగలిగాడు కానీ మనుషుల ప్రాణాలు మాత్రం తీసుకురాలేకపోయాను. కానీ మీరిద్దరూ కలిసి చాలా గొప్ప పని చేశారు. తండ్రి లేని ఆ పాప బాధ కొంతవరకు తీరినది అని సంతోషపడతాను. అంటూ చాలా సంతోషపడుతుంది. ఇక వాళ్ళు సంతోషంగా ఆ మాయ సహాయంతో ఎంతో హాయిగా బతుకుతారు

Add a Comment

Your email address will not be published. Required fields are marked *