పిచ్చి తల్లి కూతురి బాధ | Telugu Stories | Telugu Kathalu | Bedtime Stories | Panchatantra kathalu

అది ఒక గ్రామం ఆ గ్రామంలో . మహేష్ శ్రావణి అనే దంపతులు ఉండేవాళ్ళు వాళ్లకి ఒక పాప కోమలి. వాళ్లది ధనవంతుల కుటుంబం. వాళ్లు చాలా సంతోషంగా ఉంటారు. అలా ఉండగా ఒక రోజు మహేష్ చాలా హడావిడిగా ఇంటికి వచ్చి…. చి నా అనుకున్న వాళ్లు నన్ను మోసం చేశారు. ఇలా చేస్తారా అని అస్సలు ఊహించలేదు. నాకు చాలా బాధగా ఉంది అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. ఇంతలో భార్య అక్కడికి వచ్చి అతనితో….. ఏమైందండీ ఎందుకు అలాగా ఉన్నారు. ఏం జరిగింది.
అతను…. నా స్నేహితులు నన్ను చాలా డబ్బులు వ్యాపారం లో పెట్టాను చాలా నష్టపోయాను. తీవ్రమైన నష్టం వచ్చింది. అని చాలా బాధపడుతూ చెప్తాడు.
ఆమె బాధ పడుతూ…. ఊరుకోండి భగవంతుడు అన్నీ చూస్తున్నాడు. మనల్ని మోసం చేసిన వారిని దేవుడు వదిలిపెట్టడు . అంటూ అతన్ని ఓదారుస్తుంది.
అతను ఒంటరిగా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు రాత్రి సమయం అవుతుంది భార్య ….ఏమండీ మీరు అలా పొద్దున్నుంచి ఏమీ తినకుండా కూర్చుంటే ఎలా చెప్పండి.
అతను…. నాకు ఏం తినాలని లేదు నేను నా ప్రాణ స్నేహితులు అని నమ్మాను ఇంతటి మోసం చేస్తారు అని అస్సలు ఊహించలేదు. నేను ఎక్కువగా నమ్మేది స్నేహితుల నీ భార్యని తల్లిదండ్రులని వాళ్లు కూడా మోసం చేస్తారా అని తెలిసిన తర్వాత. బ్రతికి ఉండి ఏం లాభం అంటూ చాలా బాధగా చెబుతూ ఉంటాడు.
ఆమె చాలా కంగారు పడుతూ….. ఏంటండీ అలా మాట్లాడుతారు డబ్బు పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు కదా. మీరు పిచ్చి పిచ్చిగా ఆలోచించకుండా . దాని గురించి వదిలేయండి. అతను సరే అంటాడు ఆ రోజు గడిచి పోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం భార్య అతని ని నిద్రలేపడానికి వెళ్తుంది.
ఆమె…. ఏమండీ నిద్ర లేవండి నిద్ర లేవండి. ఏమండీ అంటూ ఎంతసేపు పిలిచిన అతను పలకడు. ఆమె చాలా కంగారు అతన్ని పరీక్షగా చూస్తూ ఉంది . అతను అప్పటికే చనిపోయి ఉంటాడని . తెలుసుకుంటుంది.
ఆమె పెద్ద పెద్దగా ఏడుస్తూ…. ఏమండీ నన్ను నా కూతుర్ని ఒంటరి వాళ్ళనీ చేసి వెళ్లిపోయారా. అంటూ ఎంతగానో బాధ పడుతుంది. ఆమె గుండె పగిలేలా పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో కూతురు అక్కడికి వచ్చింది…. అమ్మ ఏమైందమ్మా అమ్మ నాన్నకు ఏమైందమ్మా అంటూ ఏడుస్తూ ఉంటుంది తల్లి…. నాన్న దేవుడి దగ్గరికి వెళ్లారా అమ్మ. నాన్నను కదిలించకూడదు అంటూ ఏడుస్తూ సమాధానం చెప్పండి ఆ తర్వాత జరగాల్సిన ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది. రోజులు గడిచాయి ఒకరోజు ఒక వ్యక్తి ఆమె దగ్గరికి వస్తాడు. అతను కొన్ని పేపర్లు తీసుకో వచ్చి ఆమెతో….. అమ్మ చూడండి . మీ భర్త నాకు ఇవ్వాల్సిన అప్పు కింద ఇంటికి రాసిచ్చాడు. అంటూ కాగితాలు చూపిస్తాడు దాన్ని చూసి ఆమె చాలా బాధపడుతు….. ఉన్నట్టుండి వెళ్ళమ్మ అంటే అక్కడికి వెళ్లాలి బాబు . నాకు కొన్ని రోజులు గడువు ఇవ్వండి.తర్వాత ఇక్కడి నుంచి వెళ్తాను అని సమాధానం చెప్పండి . అందుకు అతను ఏమాత్రం పోసుకోడు. ఇక తప్పనిసరై పాపను తీసుకుని ఆమె అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఆమె ఎక్కడికి వెళ్లాలో తెలియక
ఒక రోడ్డు పక్కన ఉన్న చెట్టు దగ్గర కూర్చుంది.
ఆమె దాని గురించే ఆలోచిస్తూ ఆలోచిస్తూ ….. ఏవండీ మమ్మల్ని ఎంత అన్యాయం చేసి వెళ్ళిపోయారు. మేము రోడ్డున పడ్డాం. నీకు కొంచెం కూడా జాలి లేదా . ఎలాగ బ్రతికిన కుటుంబం మాది ఎలాగ వీధి పాలయింది . అంటూ ఏడుస్తూ దాని గురించి ఆలోచిస్తూ ఆమెకు మతిస్థిమితం పోతుంది. ఆమె పిచ్చిదాని లాగా మారిపోతుంది. తన కూతురు చిన్న పిల్ల కావడంతో ఆమెకు పిచ్చి పట్టిందని ఆమెకు అర్థం కాక ఆమెతో…. అమ్మ నాకు చాలా ఆకలిగా ఉంది . తినడానికి ఏమన్నా ఇవ్వమ్మా అంటూ జాలిగా అడుగుతుంది.
కానీ తల్లి పిచ్చిది కావడంతో ఆమె మాటలు ఏమీ పట్టించుకోలేదు. పాప అలాగే. … అమ్మ ఏం మాట్లాడవేంటి అమ్మ ఆకలి అమ్మ చాలా ఆకలిగా ఉంది అమ్మ. అమ్మ ఆకలిగా ఉంది అమ్మా అంటూ పొట్ట పట్టుకొని ఏడుస్తూ చాలా బాధపడుతుంది.
అప్పుడే ఆమె యొక్క బాధలను దూరం నుంచి ఏనుగు చూస్తుంది. ఆ ఏనుగు తన లో…. పాపం ఈ చిన్న పాప వాళ్ళ అమ్మకి మతిస్థిమితం లేదు అనుకుంటా . పాప ఏమో చాలా బాధపడుతుంది. నేనేం చేయాలి. పాపకు తినడానికి ఏమైనా అందించాలి. అయితే నేను ఇప్పుడు మా సరోజ దగ్గరికి వెళ్లి బ్రతిమిలాడు కోవాలి.
అని అనుకొని తన యజమానురాలు అయినా saroja దగ్గరికి వెళ్తుంది ఆమె ఒక పండ్ల వ్యాపారి . ఆమె దగ్గర రకరకాల పండ్లు ఉంటాయి. ఏనుగు…. saroja saroja నాకు అరటిపండు ఇయ్యవా అంటూ సైగా చేస్తుంది.
సరోజ… అయ్యగారికి ఆకలి అయినట్టుంది. పొద్దున ఏదో అన్నావు నేను ఇంకా ఎక్కడ ఉండను నువ్వు నా చేత పనులు చూపిస్తున్నావు.నేను వెళ్తాను అన్నావ్ గా మరి వెళ్లినట్టు వెళ్లి మళ్లీ వచ్చావా ఎందుకు .
అందుకు ఏనుగు….నాకు ఆకలవుతుందని రాలేదు పాపం అక్కడ ఒక చిన్న పిల్ల . ఒక పిచ్చి పట్టిన తల్లి ఉన్నారు వాళ్ళ కోసమే అడుగుతున్నాను అని అర్థం అయ్యేలాగా సైగలు చేసి చెప్తుంది saroja…. ఏంటి నువ్వు అంటుంది . మరి ఇంకొకరి కోసమా పద వాళ్ళు ఎవరో చూద్దాం. అని అంటుంది.
ఏనుగు వెళదాం పద అని ఆ పండ్ల బండి ని తోసుకుంటూ వస్తుంది. ఇంతలో సరోజకి ఆ తల్లి కూతుర్లు ఇద్దరు కనబడతారు.
వాళ్ళని చూసి….. ఏరా భీముడు నువ్వు చెప్పింది వీళ్ళ గురించేనా. ఏనుగు అవును అని తల వూపుతుంది.
ఆమె వాళ్ల దగ్గరకు వెళ్లి పాపతో….. పాపా ఈమె ఎవరు అని అడుగుతుంది. అందుకు పాపా… ఈమె మా అమ్మ నాకు ఆకలవుతుంది అన్న కూడా ఇప్పుడు ఎందుకు సరిగ్గా నాతో మాట్లాడటం లేదు. అని చాలా జాలిగా చెప్తుంది.
ఆమె ఒక పరిస్థితిని చూసిన సరోజా తన మనసులో….విల్లును చూస్తుంటే బాగా డబ్బున్న కుటుంబం లాగా ఉంది . కానీ రోడ్డుమీద కి ఎందుకు వచ్చారో అర్థం కావడం లేదు . ఈమె పరిస్థితి చాలా ఘోరంగా ఉంది పాపం ఎందుకు ఏమిటి మతిస్థిమితం లేకుండా పోయిందని అర్థం కావటం లేదు అని అనుకోని ఏనుగుతో….. రేయ్ భీముడు కొన్ని అరటి పండ్లు ఎలా తీసుకొని రా అని అంటుంది. ఏనుగు బండి మీద ఉన్న అరటి పండ్లు తీసుకుని సరోజకి అందిస్తుంది saroja …. పాపా ఇదిగో ఈ అరటి పండ్లు తీసుకో నీ ఆకలి తీరిపోతుంది . మీ అమ్మ కూడా ఇవ్వు అని చెబుతుంది ఆ తర్వాత అక్కడి నుంచి. ఏనుగు saroja ఇద్దరు వెళ్ళిపోతారు. పాప అరటి పండ్లు తింటూ వాళ్ళ అమ్మకి కూడా తినిపిస్తుంది.
అలా రోజులు గడిచాయి . saroja, ఏనుగు ప్రతి రోజు వాళ్ళకి తినడానికి భోజనం పండ్లను అందిస్తూ ఉంటారు.
ఒకరోజు ఏనుగు… సరోజ ఆ తల్లి కూతురు ఇద్దరు చూస్తుంటే చాలా బాధగా ఉంది.
వాళ్ళకి ఏదైనా సహాయం చెయ్యొచ్చు కదా.
సరోజ… నాక్కూడా వాళ్లని చూస్తుంటే గుండె తరుక్కు పోతుంది. కానీ వాళ్ళు ఎవరో ఏమిటో మనకు తెలియదు . ఇక్కడికి తీసుకొద్దామంటే . మన ఇల్లే అంతంత మాత్రంగా ఉంది. ఇంకా వాళ్ళకి ఏం సరిపోతుంది. కానీ మనసు మాత్రం చెప్పిన మాట వినడం లేదు వాళ్ళకి సహాయం చేయమని చెప్తుంది .
ఏనుగు…. సరోజ ఈరోజు నుంచి నువ్వు ఏ పని చెప్పినా చేస్తాను. రోజు బండి శుభ్రం చేస్తాను . పండ్లు మొత్తం సర్ది పెడతాను . నాకు మూడు పూట్ల కూడా ఆహారం పెట్టొద్దు. ఒక్క పూట పెట్టు చాలు . మిగిలిన రెండు పుట్ల వాళ్ళు ఇక్కడికి తీసుకు వచ్చి వాళ్ళ కడుపు నింపు saroja . పాపం వారిని చూస్తుంటే చాలా జాలిగా ఉంది.
ఏనుగు యొక్క సైకల్ని చూసి సరోజ . .. ఒక మూగ జంతువు . తన కడుపు మాడ్చుకొని మరి మనుషులకి సహాయం చేయమని ప్రాధేయ పడుతుంది దాన్ని చూసిన తర్వాత కూడా నేను వాళ్లకు సహాయం చేయకపోతే . మనిషి అన్న పదానికి అర్థం లేకుండా పోతుంది . మానవత్వం పూర్తిగా మంటగలిసి పోతుంది.
సరే నువ్వు చెప్పినట్టే వాళ్ళకి మనం సహాయం చేద్దాం . ఉన్నదాంట్లోనే అందరం తిందాం. వాళ్ళు ఎక్కడున్నారో ఇక్కడికి తీసుకొని రా. అని అంటుంది అందుకు ఏనుగు చాలా సంతోష పడుతూ…. ఇదిగో ఇప్పుడే వెళ్లి మనం తీసుకొని వస్తాను.
అని చెప్పి వారిని వెతుక్కుంటూ వెళుతుంది.
అలా వెళ్తూ ఉండగా ఆ తల్లి కూతురు ఇద్దరూ ఒకచోట కనబడతారు. ఏనుగు పాప దగ్గరికి వెళ్లి… ఆమె చేయి పట్టుకొని రా అని పిలుస్తూ ఉంటుంది పాప చాలా భయపడుతూ వాళ్ళ అమ్మని పట్టుకుంటుంది. ఏనుగు…. భయపడకు భయపడకు. అని వాళ్ళిద్దర్నీ తన మీద ఎక్కించుకొని. సరోజ దగ్గరకు బయలుదేరుతుంది. ఏనుగు మీద ఉన్న పాప…. భలే భలే సరదాగా ఉంది అంటూ చప్పట్లు కొడుతూ ఉంటుంది. కొంత సమయానికి ఏనుగు సరోజ ఇంటికి వాళ్ళని చేరుస్తుంది. సరోజ పాపతో….. పాపా మీ అమ్మ నువ్వు ఇక్కడే నాతోపాటు ఉంటారా. ఇక్కడ మీకు మూడు పూటలా అన్నం ఉంటుంది . నిన్ను బాగా చదివిస్తాను. మీ అమ్మ నిన్ను బాగా చూసుకుంటాను.
ఇక్కడే ఉంటావా అని అడుగుతుంది అందుకు పాపా….. అంటాము అమ్మ అని ఉంటుంది.
అమ్మ అన్న మాట వినగానే సరోజ కళ్ళ వెంబడి నీళ్ళు తిరుగుతాయి.
దాన్ని చూసిన పాప… ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావ్. అని అడుగుతుంది ఏనుగు… ఏమైంది saroja ఎందుకు ఏడుస్తున్నావు అని సైగ చేస్తుంది saroja….. భీముడు పాప నన్ను అమ్మ అని పిలిచింది కదా. చనిపోయిన నా కూతురు గుర్తుకొచ్చింది.నా భర్త నా కూతురు ఇద్దరూ యాక్సిడెంట్ లో చనిపోతే . ఎంతో బాగుండేది నాకు ఇంత కష్టం వచ్చేది కాదు.
ఈ పాటికి నా కూతురు ఈ పాప లాగే పెరిగి ఉండేది అంటూ బాధపడుతుంది.
ఏనుగు ఆమెను ఓదారుస్తుంది.
saroja…. కానీ అందరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళినా కూడా భీముడు నువ్వు మాత్రం నన్ను వదిలి పెట్టలేదు . మీ అమ్మ చనిపోయి ఒంటరిగా నువ్వు బాధపడుతుంటే . నిన్ను నా భర్త తీసుకువచ్చాడు. నీకు కడుపు పంపినందుకు నాకు తోడు నీడ గా ఉన్నావు. ఏ జన్మ రుణము కానీ ఇలా కలిసాము అంటూ బాధపడుతుంది.
పాప…. అమ్మ బాధ పడకమ్మా నేను కూడా నీ కూతుర్ని . ఈరోజు నుంచి నాకు ఇద్దరు అమ్మాలు. అని వాళ్ళిద్దరిని పట్టుకుంటుంది.
దానికి సరోజ , ఏనుగు చాలా సంతోష పడతారు ఆ రోజు నుంచి. saroja ఆ పిచ్చి తల్లి మరియు పాపను బాగా చూసుకుంటూ
భీముడు తో కలిసి ఎంతో సంతోషంగా వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. సరోజ లాంటి మంచి వ్యక్తి లో ఉండడం వల్లే. మానవత్వం అన్న పేరు ఇంకా మిగిలి ఉంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *