పిల్లల్ని దొంగలించే దెయ్యం | Telugu Kathalu | Moral Stories | Bedtime Stories | Panchatantra kathalu

అది ఒక పెద్ద అడవి ఆ అడవి పక్కన సింహాచలం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలోని ప్రజలు ఆ అడవి మీద ఆధారపడి నివసించే వాళ్ళు. అయితే ఆ అడవికి ఫారెస్ట్ ఆఫీసర్ గా శంకర్ అనే వ్యక్తి ట్రాన్స్ఫర్ అవుతాడు. అతడు అతడి భార్య శాంతి . కూతురు బేబీ తో కలిసి ఆ గ్రామానికి వస్తాడు. వాళ్ళు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం వాళ్ళు ముందుగానే ఒక ఇంటిని ఏర్పాటు చేసి ఉంచుతారు. వాళ్ళు అక్కడికి వెళ్తారు.
వాళ్లు ఇల్లు చేరుకున్న తర్వాత భార్య…. ఏమండీ ఏంటి ఊర్లో ఆడవాళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఎక్కువ మగవాళ్ళ కనబడుతున్నారు.
అతను…. అది నాకు అర్థం కాలేదు బహుశా ఆడవాళ్ళు కట్టెలు కొట్టుకోవడానికి వెళ్లి ఉంటారు.
అని అంటాడు ఉన్నట్టుండి శాంతి ఒక్కసారిగా కింద పడిపోతుంది . ఆమె నీరసంతో వాంతులు చేసుకోవడం మొదలు పెడుతుంది. దాన్ని చూసి కంగారు పడి పోతాడు శంకర్….. ఏం జరిగింది శాంతి ఏమైంది అంతా బాగానే ఉంది కదా.
శాంతి … లేదండి నిన్నటి నుంచి నీరసం వాంతులు. ఇక అతను…. సరే దగ్గర్లో హాస్పిటల్ కి వెళ్దాం అని చెప్పి కొంత సమయం తర్వాత పాపతో సహా హాస్పిటల్కి చేరుకుంటారు. వైద్యురాలు లలిత ఆమెను పరీక్షించి చాలా భయం తో కంగారుపడుతూ శంకర్ దగ్గరికి వస్తుంది….. శంకర్ మీరు తండ్రి కాబోతున్నారు. కానీ చాలా భయంగా ఉంది ఇక్కడ నుంచి మీరు వెళ్లిపోండి. లేదంటే చాలా ప్రమాదం
జరిగిపోతుంది.
శంకర్….. ఏం మాట్లాడుతున్నారు అండి ఏం జరుగుతుంది. ఎవరైనా ఇది గుడ్ న్యూస్ అని చెప్తారు మీరు ఈలా చెప్తున్నారు.
డాక్టర్….. అది ఒక పెద్ద కథ దయచేసి మీ ఫ్యామిలీ తీసుకొని ఇక్కడినుంచి వెళ్లిపోండి.
అని అంటుంది వెంటనే అతను చాలా అనుమానంగా చూస్తూ ఉంటాడు ఇంతలో ఒక్కసారిగా డాక్టర్ నిలబడిన గోడ నుంచి ఒక చేయి బయటకు వచ్చి ఆమె గొంతు పట్టుకుంటుంది.
దాన్ని చూసిన శంకర్ భయపడి పోతాడు పాప ఏడుస్తూ….. నాన్న ఓ నాన్న నాకు చాలా భయంగా ఉంది. ఆంటీ ఏడుస్తూ ఉంటుంది పాప.
డాక్టర్….. నా గురించి ఆలోచించండి దయచేసి మీరు ఇక్కడినుంచి వెళ్లిపోండి. అని అంటుంది
శంకర్ అతని భార్యని తీసుకొని పాపను తీసుకుని అక్కడి నుంచి పరుగులు తీస్తాడు.
డాక్టర్ చనిపోతుంది. వాళ్ళు ముగ్గురు కూడా సరిగ్గా ఊరి పొలిమేర దాటే సమయానికి వాళ్ల ముందు పెద్ద చెట్టు విరిగి పడుతుంది.
వాళ్లు చాలా భయపడతారు ఉరుములు మెరుపులతో వర్షం మొదలవుతుంది.
శంకర్ పాప ని తీసుకొని చెట్టు దాటి వెళ్తాడు ఇంకా అతను భార్యను తీసుకోవడానికి వెళితే ఆమె అక్కడి నుంచి కథల లేక పోతుంది.
భార్య…. ఏం జరుగుతుంది అండి నేను ఇక్కడినుంచి కథల లేక పోతున్నాను.
ఇంతలో ఒక స్వరం వినపడుతుంది …. ఏ గర్భిణీ స్త్రీ ఊర్లోకి వచ్చిన తర్వాత ఊరు దాటి వెళ్ళలేదు అది వెళ్తే తన బిడ్డ లేకుండానే వెళ్లాలి . హా హ హా…. అని నవ్వుతూ ఆ స్వరం మాయమైపోతుంది. వాళ్ల ముందున్న చెట్టు మళ్లీ ఒక్కసారి గా నిలబడుతుంది.
అతను పాప భార్యని తీసుకొని మళ్ళీ ఇంటికి పరుగులు తీస్తాడు.
వాళ్లు ఇల్లు చేరుకొని చాలా భయంతో
ఉంటారు వాళ్ళు ఇంతలో అతను…. ఏంటి ఇదంతా. ఎవరు అంత మాట్లాడింది భయంగా ఉంది.
అని అంటాడు.
భార్య అతని పట్టుకొని….. నాకు చాలా భయంగా ఉంది. అంటూ ఏడుస్తూ ఉంటారు ముగ్గురు కూడా ఒకరిని ఒకరు పట్టుకొని చాలా ఏడుస్తూ ఉంటారు.
ఆ రోజు గడిచి పోతుంది ఆ మరుసటి రోజు చుట్టుపక్కల వాళ్ళుతో ఆ కుటుంబం మాట్లాడుతుంది ఎవరు కూడా ఆ స్వరం గురించి కానీ అక్కడ ఏం జరుగుతుందో అనేది ఎవరు చెప్పారు. దాంతో ఆ కుటుంబానికి మరింత భయం ఏర్పడుతుంది.
రోజులు గడిచాయి అది ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయం. బయటి నుంచి పెద్ద పెద్ద కేకలు వినబడుతూ ఉంటాయి ఆ కుటుంబం ఒక్కసారిగా
ఉలిక్కిపడి నిద్ర నుంచి లేచి బయటకు వస్తారు.
అక్కడ ఒక గర్భిణీ స్త్రీ పొట్ట భాగం తెగిపోయి స్రావం జరుగుతుంది ఆ కుటుంబం వాళ్లంతా…… అయ్యో భగవంతుడా ఎంతపని జరిగిపోయింది. ఆ మాయదారి దయ్యం నా కోడలి బిడ్డను కూడా దొంగిలించింది. అయ్యో అంటూ పెద్దగా అత్తగారు ఏడుస్తూ ఉంటారు . ఆ ఊర్లో ఉన్న డాక్టర్ ని కూడా దెయ్యం చంపేయడం తో. ఆ గర్భిణీ స్త్రీకి సహాయం అందక ఆమె చనిపోతుంది. చుట్టూ ఉన్న వాళ్ళు అంతా దాన్ని చూస్తూ ఉంటారు. చాలా భయపడుతుంటారు ఒక్కసారిగా ఆమె ముందు దెయ్యం ప్రత్యక్షమై…. నా గురించి తెలియని వాళ్లకు కూడా తెలిసి చెప్తున్నావ్ కదా నువ్వు. నేనేం చేస్తానో చూడు అంటూ అత్త గారిని గట్టిగా పట్టుకొని…… ఈ రోజుతో నీ పని అయిపోయింది చాప వే.
అంటూ గట్టిగా పట్టుకుంటుంది ఆమె ….బదులు దయచేసి నన్ను వదిలి పెట్టు. దయచేసి నన్ను వదిలి పెట్టు అంటూ కేకలు వేస్తూ భయపడుతూ మరణించింది. ఆ దృశ్యం చూసిన వాళ్లంతా ఇంట్లోకి పరుగులు తీస్తారు.
శంకర్ కుటుంబం కూడా ఇంట్లోకి పరుగులు తీస్తుంది.
ఆ దెయ్యం ఇంటి ముందుకు వచ్చి….. త్వరలో నువ్వు కూడా అలాగే నా చేతిలో చస్తావు.
అని పెద్ద పెద్దగా అరుస్తూ అక్కడ్నుంచి మాయమైపోతుంది.
లోపల ఉన్న వాళ్ళు మరింత భయపడిపోతారు ఆ రోజు గడిచి పోతుంది ఆ మరుసటి రోజు మాట్లాడుకుంటూ….. ఈ దెయ్యం గర్భిణీ స్త్రీల బిడ్డని దొంగిలి స్తుంది. ఆమె గురించి ఎవరన్నా తప్పుగా మాట్లాడినా కూడా వాళ్లని చంపేస్తుంది.
భార్య….. ఏవండీ నా కడుపులో బిడ్డను కూడా అది మాయం చేస్తుంది గా నన్ను చంపేస్తుంది.
నా కూతురు బేబీ మీరు జాగ్రత్తగా చూసుకోండి.
మీరు జాగ్రత్త అంటూ ఏడుస్తూ బాధపడుతుంది.
బేబీ….. అమ్మ ఏడవకు నువ్వు ఏడిస్తే నేను చూడలేను అమ్మా. అంటూ బాధపడుతుంది శంకర్…. మీకు ఏమీ కాదు నేను ఉన్నాను కదా. నేను చూసుకుంటాను. ఎవరూ భయపడకండి నా ప్రాణాలకు తెగించి దీనికి పరిష్కారం వెతుకుతాను. అంటూ ధైర్యం చెబుతాడు.
రోజులు గడుస్తున్నాయి ఆ దెయ్యం ఏదో ఒక ఆదివారం వచ్చి నెలలు నిండిన గర్భిణీ స్త్రీల గర్భం నుంచి పిల్లలు దొంగలించి వెళ్తుంది.
అలా నాలుగు నెలల్లో ఆరుగురు పిల్లల్ని దొంగలించి తీసుకువెళుతుంది. దాన్ని చూసి చాలా భయపడుతుంది శంకర్ కుటుంబం.
శాంతి కి కూడా నెలలు నిండు తూ ఉంటాయి.
శంకర్ కి ఏం చేయాలో అర్థం కాదు. అతను ఆ దెయ్యం అంతు చూడడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. చివరిగా అతను అనుకున్నట్టుగానే ఎంతో కష్టపడి ఒక స్వామీజీని కలుస్తాడు.
స్వామీజీతో జరిగిన విషయం అంతా చెబుతాడు.
ఆ స్వామీజీ …. చూడు శంకర్ ఆ దెయ్యం ఎవరో కాదు నా భార్య. నేను ఒక వైద్యుడిని ఎలాంటి
వ్యాధినైనా తగ్గించగల ను.ఆ భగవంతుని కృప తో నేను ఎన్నో వరాలు పొందాను. నా భార్య పేరు మోహిని . ఆమెకు అందమంటే చాలా మక్కువ. తను అందంగా ఉండడం కోసం రక రకాల మూలికలు తయారు చేసుకొని వాడుతూ ఉండేది.
అందంగా ఉండడం కోసం పాత కాలంలో రాసిన తాళపత్ర గ్రంధాలు అవి చదువుతూ ఉండేది .
కొన్ని రోజుల తర్వాత మకు బిడ్డ కలిగింది.
బిడ్డ కలిగిన తర్వాత నా భార్య అందం తగ్గిపోయింది.
అప్పుడు ఆమె నాతో…. ఏవండీ నాకు బిడ్డ పుట్టిన తర్వాత నా అందం తగ్గిపోయింది. నేను చాలా వికారంగా కనబడుతున్నాను . నా అందం తగ్గకుండా పెట్టకుండా శాశ్వత పరిష్కారం ఏదైనా చెప్పండి.
అప్పుడు నేను…. చూడు అందం అనేది ఆశాశ్వతం. ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే జీవితానికి. అందం అందం అంటే ఎందుకు పాకులాడుతున్నవూ. నీ అందం ఎవరో కాదు అదిగో మన కలిగిన ఆ బిడ్డ అది నీ ఆస్తి అది నీకు గౌరవం అది నీ అందం. అని చెప్పాను ఆమె…. ఇలాంటి నీతులు నాకు చెప్పకండి అని కోపంగా లోపలికి వెళ్ళిపోయింది. నేను పని మీద వేరే గ్రామానికి వెళ్ళవలసి వచ్చింది. నేను ఆమెకు జాగ్రత్తలు చెప్పి
అక్కడి నుండి వెళ్ళిపోయాను.
కొన్ని రోజుల తర్వాత ఆమె తాళపత్ర గ్రంధం లో ఉన్న ఒక రహస్యాన్ని చదివింది అది ఏంటి అంటే. నెలలు నిండని పసిబిడ్డ రక్తాన్ని
అమృత జననం అనే ఒక మూలిక తో కలిపి
తీసుకుంటే వాళ్లు ఆరోగ్యంగానూ. యవ్వనం గాను. అందంగానూ ఉంటారు. అలా సంవత్సరానికి ఒకసారి చేయడం ద్వారా వాళ్ళ అందం మరింత ఎక్కువ అవుతుంది. వయసు కనిపించదు. ఆయుష్షు పెరుగుతుంది. మరణం సంభవించదు. పూర్తి అందగత్తెగా మారిపోతుంది.
అని రాసి ఉంటుంది అది తెలుసుకొని నా భార్య
తన కడుపున పుట్టిన బిడ్డను చంపి ఆ మూలికతో
తన ముఖాన్ని రంగరించుకున్నది. అలా ఊర్లో ఉన్న బిడ్డలు దొంగిలించి చంపేస్తూ తన స్వార్థానికి దానిని ఉపయోగించింది. కొన్ని రోజుల తర్వాత నేను తిరిగి వచ్చాను. పిల్లలని ఎవరు తీసుకెళ్తున్నారు ఎవరికి అర్థం కాలేదు. నేను ఇల్లు చేరుకున్నాను అప్పుడు నా భార్య నాతో…. మన బిడ్డను కూడా ఎవరో తీసుకు వెళ్లి పోయారు బిడ్డ కనపడలేదు అని నాతో నాటకం ఆడింది. అదే దాని పొరపాటు నేను దివ్య దృష్టితో ఏం జరిగిందో తెలుసుకున్నాను.
నాకు చాలా కోపం వచ్చింది.
స్వామీజీ…. నీ స్వార్థం కోసం ఇంతమంది పసి బిడ్డల ప్రాణాలు తీసినందుకు అందం అందం అనుకున్న నువ్వు. దెయ్యం గా మారిపోయి తిరుగుతూ ఉంటావూ. ఇక నీ చావు కూడా దగ్గర పడింది . ఈ ఊర్లో ఎవరైతే బిడ్డ భూమ్మీద పడతాడో
అప్పుడు నీ అంతం కాయం. అని శపించెను ఆ రోజు నుంచి అది దెయ్యంగా మారిపోయింది.
నేను చేసిన తప్పు అదే. అది అప్పటికే ఎన్నో శక్తులు సంపాదించింది . నేను ఆ విషయం ఆలస్యంగా తెలుసుకున్నాను. ఆ రోజు నుంచి పెరుగుతున్న బిడ్డ భూమ్మీద పడకముందే. తల్లి కడుపులో ఉన్న బిడ్డ ను తీసుకొని ఆమె చంపేస్తోంది.
అని జరిగిన విషయం చెప్పాడు.
శంకర్ కి స్వామియే చెప్పింది పూర్తిగా అర్థమవుతుంది. అతడు అతని భార్య ని తీసుకొని వచ్చి స్వామియా గృహంలో ఉంచుతాడు.
సరిగ్గా నెల రోజుల తర్వాత ఆమె ప్రసవ వేదన పడుతూ ఉంటుంది.
ఆ దెయ్యం ….. ఆ బిడ్డ బయటకు వచ్చాడు అంటే నా ప్రాణం పోతుంది. నేను ఏమీ చేయలేక పోతున్నాను నేను ఆ గృహలోకి వెళ్లలేక పోతున్నాను.
అంటూ గృహ చుట్టూ తిరుగుతూ కంగారు పడుతూ ఉంటుంది.
ఇంతలో స్వామీజీ అక్కడకు వచ్చి…. నీ పని పూర్తి అవుతుంది. బిడ్డ భూమి మీద పడడం నీకు మరణం
కాయం. అని అంటాడు ఆ మాటలకి దెయ్యానికి కోపం వచ్చి…. నిన్ను చంపేస్తాను. నిన్ను బ్రతుకవివ్వును. అంటూ స్వామీజీ గొంతు పట్టుకుంటుంది.
స్వామీజీ ఆమె నుంచి తప్పించుకోడానికి ప్రయత్నిస్తారు. కానీ అది సాధ్యం కాదు ఇంతలో శాంతి బిడ్డకు జన్మనిస్తుంది. బిడ్డ భూమి మీద పడిన వెంటనే ఆ దెయ్యం శరీరమంతా మంటలు మండుతూ కేకలు వేస్తూ…. వద్దు ఈ మంటలు భరించలేకపోతున్నాను. వద్దు కాపాడండి కాపాడండి అంటూ అరుస్తూ మాయమైపోతుంది.
ఆ రోజు నుంచి ఆ దెయ్యం పీడా వదిలిపోతుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *