పిల్లల కృష్ణాష్టమి Telugu Story – Telugu Kathalu -Telugu Fairytales -Kattappa Kathalu | Fairy tales

కిషన్ పూర్ అనే ఊరిలో రాము, సీత అనే దంపతులు ఉండేవారు. వాళ్లకి ఒక పాప ఉండేది ఆమె పేరు రాధ, వాళ్ళది చాలా పేద కుటుంబం. కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. వాళ్ళకి దేవుడి ఏ ఒక్క రకంగా కూడా సహాయపడలేదు అని, వాళ్ళ ఈ దుస్థితికి కారణం దేవుడే అని ఒక అభిప్రాయం ఏర్పడింది రాముకి, అందుకే వాళ్ళ ఇంట్లో దేవుణ్ణి పూజించడం కానీ దేవుడిని తలుచుకోవడం కానీ చేయకూడదు అని తన భార్యకి కూతురికి చెప్పేవాడు, ఇంట్లో ఉన్నప్పుడు రాధ కానీ సీత కానీ రాము మాటకి ఎదురుచెప్పేవారు కాదు. కానీ రాధకి కృష్ణుడు అంటే ఎంతో ఇష్టం, రాధ గదిలో ఒక ట్రంకు పెట్టెలో ఒక కృష్ణుడి విగ్రహం పెట్టుకొని రోజూ పూజిస్తూ ఉండేది, ఈ విషయం వాళ్ళ అమ్మా నాన్నలకి కూడా తెలియదు.

రాధ ప్రతి రోజు స్కూల్ కి వెళ్ళేటప్పుడు తన గదిలో ఉన్న కృష్ణుడికి దండం పెట్టుకుని వెళ్లడం అలవాటు. కృష్ణుడు అంటే ఆమెకు అమితమైన భక్తి.

అలా రోజులు గడుస్తుంటాయి. అనుకోకుండా ఒకరోజు రాము కోపం తో ఇంటికి వస్తాడు

రాము :- చూడండి, మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు మల్లి చెబుతున్నాను, ఎప్పుడు రాబోయే కృష్ణాష్టమి వేడుకలు మన ఇంటిముందు చేయాలనీ ఊరందరు కలిసి నిర్ణయించుకున్నారు, నేను ఖరాకండిగా వద్దని చెప్పాను, మల్లి మిమ్మల్ని అడుగుతారేమో మీరు కూడా అదే మాట చెప్పండి అని చెబుతాడు,

ఇద్దరు కూడా సరే అని చెబుతాడు

అప్పుడు రాధ తన గదిలో ఉన్న కృష్ణుడి విగ్రహం దగ్గరికి వెళ్లి ఆ విగ్రహం తో మాట్లాడుతుంది

రాధ:- అయ్యా, క్రిష్నయ్య నేను నిన్ను ఎప్పడూ ఏమి అడగలేదు, ఈసారి నేను ఒకటి అడగాలి అనుకుంటున్నాను క్రిష్నయ్య అని అంటుంది

అప్పుడు ఆ విగ్రహం లో నుండి మాటలు వినిపిస్తాయి

విగ్రహం :- పాప రాధ నేను నీ కృష్ణయ్యని, నీ భక్తికి నేను మెచ్చాను, నీవు నా పై చూపించే భక్తి శ్రద్దలకి నేను ఎప్పుడూ ఆనందంగా ఉంటాను, ఎంతలా నన్ను ప్రేమించే నువ్వు ఎప్పుడు నా దగ్గరినుంచి ఏమి ఆశించలేదు, మొట్టమొదటి సారి నా భక్తురాలు నన్ను నోరారా పిలిచి ఎదో కోరుకోవాలి అనుకుంటుంది. నేనెలా కాదనగలను చెప్పు, చెప్పు రాధా నీ కోరిక ఎలాంటిదైనా నేను తీర్చగలను చెప్పు అని మాటలు వినిపిస్తాయి ఆ విగ్రహం నుంచి

ఆ మాటలకు ఎంతో సంతోషపడిన రాధ

రాధ :- కృష్ణా నువ్వు నా కోసం వచ్చావా? చాలా సంతోషంగా ఉందయ్యా, నాకు ఒక కోరిక ఉంది, దానికంటే ముందు నాకు ఒక ప్రశ్న ఉంది . సమాధానం చెప్పగలవా కృష్ణయ్య అని అడుగుతుంది

విగ్రహం :- అడుగమ్మా నీ కోసం నేను ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం ఉంది నా దగ్గర..

రాధ :- మా నాన్న ఎప్పుడు ఏ దేవుడిని కూడా నమ్మాడు కదా పైగా తిడుతుంటాడు కూడా, మా నాన్న అలా చేయడం వళ్ళ నువ్వు మా నాన్న మీద ఏదైనా చేదు అభిప్రాయం తో ఉన్నావా క్రిష్నయ్య

విగ్రహం :- నాకు మీలాగా పర మాత బేధాలు ఉండవు తల్లి అందరూ న పిల్లలే, నా పిల్లల పై నేను కోపంగా ఉండడం ఏంటి చెప్పు? నన్ను పూజించినా పూజించకున్నా మీ అందరు నాకు సమానమే, అని అంటాడు

రాధ :- నీ ఈ సమాధానం చాలా మందికి తెలియాల్సిన అవసరం ఉంది. అలాగే నా కోరిక ఏంటంటే మా నాన్న నిన్ను ఎప్పుడు ఎదో ఒకటి అంటూ ఉంటాడు కదా, నువ్వే ఎలాగైనా మా నాన్నని మార్చాలి స్వామి, ఎప్పుడు మా ఇంటి దగ్గర జరిగే కృష్ణాష్టమి వేడుకల్ని ఈ సంవత్సరం జరగనివ్వమని మొండి పట్టుతో భీష్మించుకుని కూర్చున్నాడు, ఊరి వాళ్ళు వచ్చి మా అమ్మని అడిగితే కూడా మాకు ఇష్టం లేనట్టుగా చెప్పమంటున్నాడు. దయచేసి మా నాన్న మనసు మార్చగలవా క్రిష్నయ్య అని అడుగుతుంది.

విగ్రహం :- రాధ నేను మనుషులని మాత్రమే సృష్టుస్తాను వారి అలవాట్లను కాదు, నేను వారి అలవాట్లను మార్చడం పొరపాట్లను సరిదిద్దడం లాంటివి చేయలేను, అలా చేస్తే వారి స్వేచ్ఛకి కలిగించినట్టే, నేను అలా ఎప్పటికి చేయలేను కానీ నా ప్రియమైన భక్తురాలివి అడుగుతున్నావు కాబట్టి నేను మీ నాన్న స్వచ్ఛకి భంగం కలగకుండా నా వంతు కృషి చేస్తాను అని చెప్తాడు.

రాధ :- చాలా సంతోషం స్వామి అని చెబుతుంది

ఇంతలో ఆ గదిలోకి రాము రావడం గమనించిన రాధా పెట్టె మూసివేస్తుంది

రాము :- అమ్మ రాధా, నేను నీకో విషయం చెప్పాలని అనుకుంటున్నాను అని అంటాడు

రాధా :- చెప్పు నాన్న

రాము :- ఏమి లేదమ్మ నేను చిన్నప్పటినుండి ఎంతగానో దేవుడిని నమ్మే వాడిని కానీ దేవుడు ఎన్నడూ కూడా నా శ్రమకి తగిన ఫలితం ఇవ్వలేదు, కారణం ఏంటో ఎప్పుడూ దేవుడిని అడగలేదు, ఎప్పుడు నాకు ఏ ఆశించినడి దొరకలేదు, నా జీవితం మొత్తమ్ కష్టాలతోనే గడిచిపోయింది, అందుకే దేవుడంటే నమ్మకం పోయింది, అదే కోపం తో ఈ సరి కృష్ణాష్టమి వేడుకలు కూడా జరిపించొద్దు అని చెప్పను కానీ, ఎదో మాయ జరిగినట్టు నాకు దేవుడు కలలో వచ్చి రాము నేను ఎప్పుడు నీ కోసం ఏమి చేయలేదు వాటికి బ్బదులుగా ఈ  ఉంచుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. కళ్ళు తెరిచి చూసేసరికి నిజంగానే బంగారం ఉంది అని చెప్పి రాధ ని తీసుకెళ్లి ఆ బంగారం అంతా చూపిస్తాడు.

రాము :- దేవుడు నాకు ఎప్పుడు ఏమి ఇవ్వలేదని బాధపడ్డాను కానీ, ఎప్పుడు పోరాడే శక్తిని ఇస్తూనే ఉన్నాడు, ఇప్పుడు ఈ బంగారం తో మన ఇంటి ముందే ఎంతో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు జరిపిస్త్తను, నేను వెళ్లి ఊరి ప్రజలకు క్షమాపణలు చెప్పి నా వంతు సహాయంగా ఈ బంగారం ఇస్తాను అని చెప్పి అక్కడనుండి వెళ్ళిపోతాడు

నాన్న వెళ్ళిపోగానే రాధ కృష్ణుడి విగ్రహం దగ్గరకు వెళ్లి

రాధ :- కృష్ణయ్య నీ లీలలు ఎన్నటికీ ఎవ్వరికి అర్ధం కావు తండ్రి, ఇదేం అయినా మా నాన్నలో వచ్చిన ఈ మార్పుకి నేను ఎంతో సంతోషిస్తున్నాను . నీకు కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అని చెప్పి వాళ్ళ ఇంటి బయట జరుగుతున్న వేడుకలు చూద్దాడానికి వెళ్తుంది రాధా

రాధా ఇంటి బయట శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా, గోపికల వేషాలు వేసుకున్న ఆడపిల్లల సమక్షం లో ఉట్టి కొట్టడం, లాటి ఎన్నో రకాల కార్యక్రమాలు జరుగుతాయి

ఆరోజు నుంచి రాము, సీతా, రాధ ఎంతో సంతోషంగా బ్రతుకుతుంటారు

Add a Comment

Your email address will not be published. Required fields are marked *