పీచు మిఠాయి అమ్మేపాప New Story 2021 | Telugu Kathalu | Telugu Stories | Moral Stories | Fairy Tales

బేబీ తండ్రి కృష్ణయ్య ఒక స్కూల్ దగ్గర పీచు మిఠాయి అమ్ముతూ ఉండేవాడు తన వ్యాపారం చాలా చక్కగా సాగిపోతూ ఉండేది. బేబీ అక్కడ స్కూల్లోనే చదువుతూ ఉండేది. కృష్ణయ్య భార్య శారద ఆరోగ్యం సరిగా ఉండేది కాదు. ఆమెను చూసుకోవడం పాపని చదివించు కోవడం. తను సంపాదించిన డబ్బు మొత్తం. పాప స్కూల్ కి ఆమె ఆరోగ్య ఖర్చులకే సరిపోతోఉంటాయి. అలా రోజులు గడుస్తున్నాయి. అనుకోకుండా తండ్రి గుండెపోటుతో మరణిస్తాడు. ఇక ఉన్న ఒక్క ఆధారం పోవడంతో ఆ కుటుంబ పరిస్థితి చిన్నా భిన్నం గా మారిపోతుంది.
ఇక చేసేదేమి లేక పాప తన తల్లిని బతికించుకోవడం కోసం. ఆమె చదువుతున్న స్కూల్ ముందే పీచుమిఠాయి అమ్మాలని నిర్ణయించుకుంటుంది. తాను అనుకున్న విధంగానే వాళ్ల నాన్న బండి తీసుకువెళ్ళి. పీచు మిఠాయి అమ్మడం మొదలు పెడుతుంది. ఆమె వ్యాపారం బాగానే సాగిపోతూ ఉంటుంది. దాన్ని చూసిన ఒక వ్యక్తి…. ఓ హో.. వీళ్ళ నాన్న లేకపోయిన పాప మాత్రం ఏ మాత్రం తగ్గేది లేదు అన్నట్టుగా. చేస్తుంది . ఇదే మనకి మంచి అవకాశం. నేను కూడా ఇలాంటి బండి సరిపోతుంది.
అనుకుంటాడు ఆ మరుసటి రోజే తను కూడా ఆమెకి ఎదురుగా. ఒక బండి పెట్టుకుంటాడు. పాప దాన్ని చూసి చాలా బాధపడుతూ….. అంకుల్ నాకు పోటీగా మీరు ఎందుకు బండి పెట్టుకున్నారు. నా పొట్ట మీద కొట్టాలి అనుకుంటున్నారా.
అతను…..హా హా హా నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు ఎవరు వ్యాపారం వాళ్ళది.
ఇక్కడ పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. వ్యాపారం బాగా సాగి పోతుంది అనే ఉద్దేశంతో పెట్టాను. నీకు నేను పోటీ అవుతాను అని అస్సలు కాదు. ఎవరు వ్యాపారం వాళ్ళకే ఉంటుంది.
అని అంటాడు. అందుకు పాప ఏమీ మాట్లాడకుండా అలా ఉండి పోతుంది తర్వాత పిల్లలందరూ అక్కడికి వస్తూ ఉంటారు. పాపం వాళ్లకి పీచు మిఠాయి అందిస్తూ ఉంటుంది. కానీ పాప ఎదురు ఉన్న రామయ్య పాప కంటే చాలా తొందరగా వాళ్ళందరికీ ఇవ్వడంతో పాప దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా. ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో అతని వైపు కి మగ్గుతున్నారు. దాన్ని చూసి పాప చాలా బాధపడుతుంది. ఇక వాళ్ళ వ్యాపారం ముగిసిన తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు.
పాపా ఇంట్లో కూర్చొని చాలా బాధపడుతూ…. అయ్యో ఈరోజు డబ్బులు చాలా తక్కువ వచ్చాయి ఇలాగే రోజు వస్తే. మా అమ్మ మందులకి ఇబ్బంది అయిపోతుంది. భగవంతుడు ఎందుకు ఇలాంటి పరిస్థితి తీసుకోవచ్చా మాకు. అంటూ ఎంతగానో బాధపడుతుంది.
ఇక రోజులు గడుస్తున్నాయి తన వ్యాపారం పూర్తిగా దెబ్బతింటుంది . పాపకు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడుతుంది.
పాప ఏడుస్తూ తీవ్రంగా దిగు లోకి జారి పోతుంది.
ఆమె గుడి దగ్గరికి వెళ్లి భగవంతుని ప్రార్ధిస్తూ….. స్వామి నీకు న్యాయంగా ఉందా . నా తల్లిని మంచోడా పడేసావ్ నా తండ్రిని దూరం చేశావు.
ఆకలి బతికించుకోవడం కోసం చేస్తున్న వ్యాపారానికి అడ్డంకులు తీసుకువచ్చి పెట్టావు. ఇంక మేము ఎలా బ్రతకాలి చెప్పు. భగవంతుడా అంటూ ఏడుస్తూ…… నీకు మమ్మల్ని ఇలా చూడ్డం ఇష్టమా దానికంటే బదులు మా ప్రాణాలు తీసుకు వెళ్ళచ్చు కదా. అంటూ బాగా ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఒక ఆమె అటుగా వెళుతూ …. ఇప్పుడు పాప నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు. అని అడుగుతుంది అందుకు పాప జరిగిన విషయమంతా చెబుతోంది. పాప మాటలు విన్న ఆమె….. చూడు పాప దుర్మార్గాలు ఎప్పుడైనా సరే మొదట పచ్చగడ్డి లాగా పెరుగుతూ ఉంటారు.
ఆ కలుపుకుని ఎలాగ తీసివేయాలో ఆ భగవంతుడికి బాగా తెలుసు. నువ్వు అయితే ఎలాంటి భయాలు పెట్టుకోకు నీకు అంతా మంచి జరుగుతుంది.
ఒకరిని నాశనం చేయాలి అనుకుంటే. వాళ్లే నాశనమైపోతారు అనేది సృష్టి ధర్మం.
అంటూ ధైర్యం చెబుతుంది పాప అయినప్పటికీ కూడా చాలా బాధ పడుతూ ఉంటుంది.
ఇక ఆమె…. చెడు పాప నీ మెడలో ఈ గొలుసు వేస్తున్నాను. ఇది నీకు అంతా మంచి చేస్తుంది అని ఒక గొలుసు ఆమె మెడలో వేస్తోంది. పాపా సరే అని చెప్పి అవి చాలా సేపు మాట్లాడుతుంది తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు.
ఆ వచ్చిన ఆమె ఒక మంత్రగత్తె చాలా మంచి ఆమె. తన మాయాశక్తి తో ఆ గొలుసు మీ పాపకు ఇచ్చింది.
పరిస్థితి రోజు పాప ఎప్పట్లాగే తన వ్యాపారం చేసుకుంటూ ఉంటుంది. అయితే ఆ పీచు మిఠాయి రంగు రంగుల వాహనంలోకి మారుతూ ఉంటుంది. రంగురంగుల బొమ్మలు వస్తాయి కార్లు, లారీ, రైలు సైకిల్. ఇలా వాహనాలు ఆకారంలో బొమ్మల రావడంతో పిల్లలు అందరూ చాలా, సంతోషపడుతూ…. బలే బలే నాకు కారు బొమ్మ కావాలి నాకు రైలు బొమ్మ కావాలి అంటూ పాప దగ్గర అందరూ కొరుక్కుంటూ ఉంటారు దానివల్ల చూసి రావయ్య…. ఏంటి వింత ఈ పాప ఏంటి ఇంత చేస్తుంది. ఈ బొమ్మలు ఎక్కడ నుంచి వస్తున్న ఎలా వస్తున్నాయి అంటూ కంగారు పడిపోతూ వుంటాడు.
ఇక పిల్లలు అందరు కూడా వాటిని చూసి పాప దగ్గరే
వాటిని తీసుకుంటూ ఉంటారు ఇక రాబోయే వ్యాపారం పూర్తిగా దెబ్బతింటుంది.
రోజులు గడిచాయి ప్రతి రోజు కూడా పాప రకరకాల బొమ్మలు చేసి ఇవ్వడంతో పిల్లలు అందరూ చాలా ఆశపడుతూ అక్కడికి వస్తూ ఉంటారు. పాప కూడా చాలా సంతోష పడుతూ….. ఈ రెండు రోజులు నేను చాలా డబ్బు సంపాదించాను. ఆ భగవంతుడే ఆమె రూపంలో వచ్చి నాకు సహాయం చేశాడు. అంటూ ఆమె కంటతడి పెట్టుకుంటుంది. రోజులు గడుస్తున్న మీ పాప రోజురోజుకీ చాలా మంచి డబ్బు సంపాదించి తన తల్లిని మంచి హాస్పిటల్ లో చేర్పించి . వైద్యులు కూడా ఆమెకు వైద్యం చేస్తూ ఉంటారు. పాప హాస్పిటల్ లో తన తల్లిని చూసుకుంటూ. అలాగే తన వ్యాపారం చేసుకుంటూ రోజులు గడుపుతూ ఉంటుంది.
పూర్తిగా నష్టపోయారు రామయ్య ….. ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు అని. గుడి దగ్గర అది తన వ్యాపారం పెట్టుకుంటాడు అక్కడ తన వ్యాపారం బాగా సాగి పోతుంది. ఇక ఎవరి వ్యాపారం వాళ్ళు చక్కగా చేసుకుంటూ ఉంటారు.
కొన్ని రోజులు గడిచాయి పాప తల్లి ఆరోగ్యం కుదుటపడుతుంది.
అప్పుడు పాప జరిగిన విషయం అంతా తల్లి చెబుతుంది. తల్లి చాలా సంతోష పడుతూ…. పాప ఇక నుంచి నేను వ్యాపారం చూసుకుంటాను. నువ్వు చక్కగా చదువుకో. ఆ మెడలో ఉన్న హారం నాకు ఇవ్వు అని అంటుంది. పాప సరే అని చెప్పి హారము తనకి ఇస్తుంది. ఇక ఆమె వ్యాపారం చేసుకుంటూ
ఉంటుంది. ఆమె మహిమ గల హారాన్ని ధరించడంతో ఆమె కూడా వాహనాల పీచుమిఠాయి ఆమ్ముతూ. బాగా డబ్బు సంపాదిస్తుంది పాప చక్కగా చదువుకుంటూ ఉంటుంది ఇక అలా వాళ్ల జీవితం కష్టాలనుండి సుఖాల లోకి మారిపోయి, వాళ్ల జీవితాలు చక్కగా సాగిపోతయి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *