పేదపిల్ల అండర్ గ్రౌండ్ డబ్బు Telugu Kathalu | Telugu Stories | Fairy Tales

అది అది రాత్రి 12 గంటల సమయం. అందరూ నిద్రపోతుండగా ముగ్గురు దొంగలు క్రిష్ణ పురం గ్రామం లో ప్రవేశించి అక్కడ ప్రజలు దాచుకున్న డబ్బు మొత్తాన్ని. మూట కట్టుకొని అక్కడ్నుంచి పారిపోతారు. వాళ్లు దాచుకున్న డబ్బు మొత్తాన్ని ఒక అండర్ గ్రౌండ్ లో దాచి పెడతారు. అయితే వాళ్లు ముగ్గురూ కూడా ఎవరెవరు ఎంత సంపాదించారు అని తెలుసుకోవడం కోసం  వాళ్ళు తెచ్చిన మూటలు మొత్తం విప్పుతూ ఉంటారు అయితే ఒక మూట నుంచి ఒక పాప బయటకు వస్తుంది.

పాపను చూసి వాళ్ళు చాలా కంగారు పడతారు….. పాప ఎవరు నువ్వు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు.

పాప ఏడుస్తూ…. మాది కృష్ణాపురం గ్రామం నా సవతి తల్లి నన్ను హింస పెట్టేది. ఆమె నన్ను చంపాలి అని నన్ను గోతములో మూట కట్టి పెట్టింది . మీరు నన్ను తీసుకొని వచ్చారు నా ప్రాణాలు కాపాడారు.

అంటూ ఏడుస్తూ ఉంటుంది.  ఆ ముగ్గురు దొంగలు కూడా చాలా ఆశ్చర్య పోతారు.

తల్లి  స్థానంలో ఉండి చిన్న పిల్లల్ని కాపాడాల్సింది పోయి. ఇలా చంపాలని చూస్తుందా. చి చి అంటూ వాళ్ళు కూడా ఆమెని అసహ్యించుకుంటారు.

వాళ్ళు ముగ్గురు కూడా….. పాపా నువ్వేం బాధపడకు మీ నాన్న ఎక్కడ ఉంటాడు . మేము ఆయన దగ్గరకి తీసుకు వెళ్తాము.

అందుకు పాప…… మా నాన్న  బ్రతికి ఉంటే ఎన్ని కష్టాలు ఎందుకు  వస్తాయి చెప్పండి.

ఆ సౌవతి  తల్లి కష్టాలు ఎందుకు పడతాను. చెప్పండి. అంటూ పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది.

అందుకు ఆ దొంగలు ఊరుకో పాపా ఊరుకో అని సర్దిచెప్పారు ……. ఇకనుంచి నువ్వు ఇక్కడ ఏ సంతోషంగా ఉండొచ్చు నీకు ఎలాంటి బాధ ఉండదు.   అని చెప్తారు ఎందుకు ఆ పాప చాలా సంతోషపడుతుంది.

ఆ పాప మరి కొంచెం లోపలికి వెళ్తుంది అక్కడ అంతా డబ్బు తో కూడిన గోడలు ఉంటాయి.

పాప వాటిని చూసి చాలా ఆశ్చర్యపోయాను ఇదంతా డబ్బునా  అని అడుగుతుంది.

అందుకు ఆ ముగ్గురు దొంగలు అవునని సమాధానం చెబుతారు….. ఇదంతా డబ్బే ఎంతోమందిని మేము దాచుకున్నాము.

పాపా ఆ మాట వినగానే చాలా పెద్దగా నవ్వుతూ ఉంటుంది…..హా హా హా వాళ్లు పాప నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అని ఆశ్చర్యంగా అడుగుతారు అందుకు పాప…. ఒకడి కష్టాన్ని మీరు దోచుకుంటున్నారు. కానీ మీరు సంతోషంగా ఉన్నది ఎక్కడ ప్రతిరోజు పోలీసులని వాళ్లని వీళ్ళని వాళ్ళ గురించి కంగారు పడుతూనే ఉంటారు. మీరు

ప్రశాంతంగా బతికింది ఎక్కడ.

మీ వల్ల నీకు సుఖం లేదు మీ ఇంట్లో వాళ్లకి సుఖం లేదు ఎంత సంపాదించి కూడా ఏం చేయాలనుకుంటున్నారు. మీరు గనక పోలీసులకు దొరికితే . మీరందరూ కూడా జైలుకు వెళ్తారు ఎవరికి. మీ తల్లి భార్య పిల్లల గురించి ఒక్కసారి ఆలోచించండి.

వాళ్ళ జీవితాలు ఏమవుతాయో ఆలోచించండి తండ్రి లేని జీవితం ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. నేను ఎన్ని కష్టాలు పడుతున్న నాకు మరింత బాగా తెలుసు అంటూ ఏడుస్తుంది.

ఆ మాటలు వినగానే దొంగల్లో ఇద్దరికీ కనికరం కలుగుతుంది మరో వ్యక్తి మాత్రం…. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టుగా నీతులు చెప్పడానికి వచ్చావా ఇక్కడికి. పాపా నువ్వు ఇక్కడికి వచ్చావు కొన్ని రోజులు ఉండడానికి

అంతేగాని మా అందరి మనసులు మార్చడానికి కాదు.

ఇంతలో మరో వ్యక్తి….. రేయ్ అమ్మాయి చెప్పింది నిజమే అనిపిస్తుంది మనం ఇన్ని రోజులు చాలా తప్పు చేశామని అనిపిస్తుంది ఎవరు సంపాద వాళ్లు కి తిరిగి ఇచేద్దాము.

అందుకు వాళ్ళిద్దరూ ఒప్పుకుంటాను కానీ ఆ వ్యక్తి మాత్రం ఒప్పుకోడు .

అతను….. చూడండి మీరు ఏదైనా చేసుకోండి నేను మాత్రం నా డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాను అని ఎంత చెప్పినా వినకుండా.

వాటిని తీసుకొని అక్కడనుంచి వెళ్ళి పోతాడు. మిగిలిన వాళ్ళిద్దరూ కూడా అతని ఆపడానికి చాలా ప్రయత్నిస్తారు. ఒకరినొకరు కొట్టుకోవడం తిట్టుకోవడైం మొదలవుతుంది.

పాపా వాళ్ళు కొట్టుకోవడం చూసి చాలా కంగారు పడుతూ…… వద్దు ఎవరు పెట్టుకోకండి దయచేసి ఆగండి . వద్దు ఆగండి అంటూ వారిని ఆపడానికి ప్రయత్నిస్తుంది . కానీ వాళ్ళు ఆ పాప మాట వినకుండా పాపను పక్కకునెట్టి.

వాళ్లు ఘర్షణ పడుతూ ఉంటారు ఆ ఘర్షణలో వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి మరో వ్యక్తి ఇద్దరు కూడా మరణిస్తారు.

దాన్ని చూసి మిగిలిన వ్యక్తి….. అయ్యో ఏంటి ఇదంతా ఏదో అనుకుంటే ఏదో జరిగింది.

అంటూ ఏడుస్తూ బాధపడతాడు పాపా…. అయ్యో నిజంగా అంకుల్ ఇలా జరుగుతుందని అనుకోలేదు.

అతను…. పాపా మనం ఈ డబ్బు మొత్తాన్ని అందరికీ తిరిగి ఇచ్చేద్దాం.

అందుకు పాప సరే అంటుంది ఆ డబ్బు మొత్తాన్ని తీసుకొని వాళ్ళ ఊర్లో పoచడం మొదలు పెడతారు.

అందరూ కూడా చాలా సంతోషపడుతూ వాటిని తీసుకుంటారు.

డబ్బు మొత్తం ఊరూరు తిరిగి ఎవరికి ఎంత ఇవ్వాలో అంత అతని ఇచ్చేస్తాడు.

పాప…. అంకుల్ చూశారా పోగొట్టుకున్న డబ్బు వాళ్ళకి తిరిగి వస్తే వాళ్ళు ఎంత సంతోష పడుతున్నారో.

అందుకు అతను….. నిజమే తల్లి అని అంటాడు. కొన్ని రోజులు గడిచాయి పాప అతనితో పాటే ఉంటుంది. అతను పాపని ఇంటికి తీసుకెళ్తాడు తన భార్యతో జరిగిన విషయమంతా చెప్తాడు.

అతని మాటలు వినగానే భార్య చాలా సంతోష పడుతూ…… ఎన్నో సంవత్సరం నుంచి దొంగ పనులు మానుకుని చెప్పాను కానీ అసలు మానలేదు . నువ్వు ఒక్కసారి చెప్పావు లేదో మొత్తం మానేసి నందుకు చాలా సంతోషంగా ఉంది.

అని ఎంతో సంతోష పడుతూ పాపకి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది.

ఇక ఆమె భర్త పాప గురించి ఆమె సౌవ తి తల్లి తలపెట్టిన కష్టాల గురించి చెప్తాడు దాన్ని విని ఆమె…. అయ్యో ఇలాంటి కసాయి వాళ్లు ఎందుకు ఉంటాడో ఏమో నాకు పిల్లలు లేరని ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతున్నాము.

నిన్ను సొంత బిడ్డలా చూసుకుంటాను తల్లి అని  అంటుంది పాప కూడా చాలా సంతోషపడుతుంది కొన్ని రోజులు గడిచాయి వాళ్ళు చిన్న కూరగాయల వ్యాపారం . చేసుకుంటూ కుటుంబాన్ని గడుపుతుంటారు.

కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఒక చిన్న ఇంటిని కొనుగోలు చేస్తారు  . వాళ్లు చిన్నగా దినదినాభివృద్ధి చెందుతూ ఉంటారు .

అయితే వాళ్లు డబ్బు కొంత సంపాదించుకున్న తర్వాత     వాళ్ళు మంచి ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటారు . వాళ్లు ఇంటి కోసం పునాది తవ్వునపుడు.  వాళ్లకి స్వరంగ మార్గం కనబడుతుంది. వాళ్ళు ముగ్గురు చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు .

లోపలి కి వెళ్తారు వాళ్లకి చాలా డబ్బులు కనబడతాయి.

అక్కడ అంత డబ్బు ఎలా ఉందో వాళ్ళకి అర్థం కాదు ఇక ముగ్గురు కూడా భగవంతుని ప్రార్ధిస్తూ….. నిజంగా భగవంతుడి మనకు ఇదంతా చేశాడు. ఎవరు ఎందుకు ఎక్కడ పెట్టారో మనకు తెలియదు . మనం ఎవరికైనా ఇస్తే మళ్ళీ నిందలు మన మీద పడతాయి.

ఇక్కడ వాళ్ళు కూడా అంత మంచి వాడిని కాదు గుట్టుచప్పుడు కాకుండా మనమే దీనిని తీసుకొని సంతోషంగా ఉందాం అని భార్య భర్తలు అంటారు.

అందుకు పాప…. అదే మంచిది మనుషులను బట్టి మనం కూడా ప్రవర్తించడం చాలా మంచిది. అని అంటుంది ఇక వాళ్ళు ఆ డబ్బుతో చాలా గొప్ప వాళ్ళు వెళ్ళిపోతారు ఇక వారి జీవితంలో అంత సంతోషామే.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *