పేదపిల్ల బెలూన్స్ | Telugu Stories | Telugu Moral Stories | Telugu Kathalu | Bedtime Stories

బేబీ రైల్వే స్టేషన్ లో   బెలూన్లు అమ్ముకుంటూ ఉంటుంది…… అమ్మ బెలూన్ తీసుకోండి అమ్మా మీ పిల్లలు ఆడుకోవడానికి పనికొస్తుంది. ఆ బాబు తీసుకోండి బెలూన్స్ . అంటూ వచ్చే పోయే వాళ్ళకి చెబుతూ వాటిని అమ్ముతూ ఉంటుంది. అలా వచ్చిన డబ్బుతో తన అవిటి తల్లిని చూసుకుంటూ ఉంటుంది. కానీ ఎండాకాలం రావడంతో వాళ్ల పరిస్థితి చిన్నాభిన్నం అయిపోతుంది ఎందుకంటే ఎండ తాకిడికి బుడగలు తేలిపోతూ ఉంటాయి. దానివల్ల బేబీకి తీవ్రమైన నష్టం కలుగుతుంది బేబీ చాలా బాధ పడుతూ.

తన మనసులో………… భగవంతుడా ఎందుకు నాకు ఇలాంటి జీవితాన్ని ప్రసాదించావు. మంచి వ్యాపారం చేసుకుందామనుకున్న కూడా డబ్బులు లేవు ఉన్న వ్యాపారం సరిగా సాగడం లేదు. ఇలా అయితే నేను నా తల్లి ఎలా బ్రతకాలి. అంటూ చాలా బాధపడుతుంది. అలా కొన్ని రోజుల తర్వాత ఆమె ఆ రైల్వే స్టేషన్లో తన వ్యాపారాన్ని చేయడం ఆపేస్తుంది. ఇక అక్కడే కూలీగా పని చేస్తూ ఉంటుంది. వచ్చే పోయే వాళ్ళ దగ్గర సామాను తీసుకుని . వాళ్ళ ఇంటిదగ్గర వాటిని దించి వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకొని అలా కొత్తగా మొదలు పెడుతుంది కానీ పాప చిన్న పిల్ల కావడంతో ఎక్కువమంది పాప చేత పని చేయించుకోవడానికి పెద్దగా ఇష్టపడే వాళ్ళు కాదు. అలా కూడా పాపా విఫలమవుతుంది. అలా ఉండగా ఒక రోజు ఒక పెద్దాయన చాలా సామాన్లు మోస్తూనే ఉంటాడు పాప….. తాతగారు తాతగారు దయచేసి మీ సామల నాకు ఇవ్వండి. నేను మీ ఇంటి దగ్గర వాటిని చేరుస్తాను. అందుకు అతను…… చిన్న పిల్లల చేత పని చేపిస్తే నన్ను జైల్లో వేస్తారు అమ్మ. నేను ఆ పని చేయలేను. అని అంటాడు ఆ మాట వినగానే పాప ఏడుస్తూ….. అందరూ అలా అనుకుంటే మాలాంటి వారి జీవితం ఎలా గడుస్తుంది తాతగారు. చదువుకోవలసిన వయసులో నేను పనిచేస్తున్న అంటే నా ఇంటి బాగో లేదని ఎవరూ ఆలోచించరు ఏంటి. రెండు రోజుల నుంచి మా అమ్మ జ్వరంతో అల్లాడుతుంది. ఆమె మందులు కూడా నా దగ్గర

డబ్బులు లేవు పైగా ఆమె ఏమిటిది. మా నాన్న బ్రతికి ఉంటే ఇన్ని కష్టాలు ఉండేవి కాదు. అంటూ ఏడుస్తూ ఉంటుంది. అతను పాప పైన జాలిపడి…… ఇదిగో అమ్మ ఈ డబ్బులు తీసుకో. అని డబ్బులు చేతిలో పెడతాడు పాప నేను పని చేయకుండా డబ్బులు తీసుకొని తాతగారు. నేను పనిచేసిన తర్వాత డబ్బులు తీసుకుంటాను. అలా అయితే డబ్బులు ఇవ్వండి లేదంటే నా మీద జాలిపడి మాత్రం డబ్బులు ఇవ్వకండి. అని అంటుంది పాప అలా చెప్పడం తో అతనికి పాప పైన ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. అతను తన మనసులో ….. ఈ పాప స్థానంలో మరి ఎవరైనా ఉంటే కచ్చితంగా డబ్బులు తీసుకునే వాళ్ళు . కానీ పాప అలా లేదు. కచ్చితంగా ఇలాంటి వాళ్లు దేశానికి చాలా అవసరం. వీళ్లే నిజాయితీగా పనిచేసే జాబితాలో చేరుతారు. ఈ పాపను నేనెందుకు చదివించ కూడదు. ఈ పాపకు ఉన్న తెలివితేటలు కి సహనానికి మంచి స్థాయిలో ఆ అమ్మాయి ఉంటుంది. అని అనుకుంటాడు. ఆ తర్వాత పాపకి పెట్టే ఇచ్చి తన ఇంటి దగ్గరికి పదం అంటాడు ఇద్దరు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తారు.

అక్కడ తాత గారు వాళ్ళ కొడుకు కోడలు ఉంటారు.

వాళ్లతో జరిగిన విషయం అంతా చెప్తాడు.

అతను….. దాందేముంది నాన్న మనకి ప్రైవేట్ స్కూలు చాలా ఉన్నాయి. ఏదో ఒక స్కూల్లో పాపని ఉచితంగా చదివించ వచ్చు. అని అంటాడు.

అందుకు పాప చాలా సంతోష పడుతూ….. మీరు నన్ను కలుస్తాను అన్నందుకు చాలా సంతోషంగా ఉంది కాని నేను చదువుకోడానికి వెళ్తే మా ఇల్లు ఎలా గడుస్తుంది. మా ఇల్లు కట్టడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకు ఆ తాత వాళ్ళ కొడుకు శంకర్…. చూడు పాప నీకు ఎలాంటి కష్టం ఉండదు. ఎందుకంటే అక్కడ నీకు మూడు పూటలా భోజనం పెడతారు నువ్వు హాస్టల్లో ఉండి చదువుకోవచ్చు.

పాపా….. నేను అంటుంది అది కాదండి మా అమ్మ ఒంటరిగా అక్కడే ఉంటుంది కదా. ఆమె బాగోగులు ఎవరు చూసుకుంటారు. అందుకు అతను….. మీ అమ్మ మీ ఇంట్లో ఎందుకు ఉంటుంది. మీ అమ్మను ఆశ్రమంలో అక్కడ వాళ్ళు మీ అమ్మని బాగా చూసుకుంటారు.

అందుకు పాపా సరే అంటుంది అతను భార్యను కూడా చాలా సంతోష పడుతూ ఒప్పుకుంటుంది.

అతని భార్య…. ఇంతకీ మీ అమ్మగారికి అవుదు అని చెప్పావు. ఏమైంది అసలు.

అందుకు ఆ పాప….. మా అమ్మ మనం చనిపోయిన తర్వాత రైల్లో సమోసాలు అమ్ముతూ ఉండేది.

ఆ వ్యాపారం అంతంత మాత్రంగానే ఉండేది. ఆమె అలా అమ్ముతూ ఒకసారి రైలు దిగేటప్పుడు ప్రమాదవశాత్తు రైలు కింద పడింది అమ్మ ప్రాణమైతే దక్కింది కానీ ఒక కాలు తీసేయాల్సి వచ్చింది.

అంటూ ఏడుస్తూ జరిగిన విషయం చెప్తుంది ఆ మాటలు విన్న వాళ్లు కూడా చాలా బాధ పడతారు. కొన్ని రోజుల తర్వాత స్కూల్లో చక్కగా చదువుకుంటూ . అక్కడే తింటూ సంతోషంగా ఉంటుంది. తల్లి ఆశ్రమంలో ఉంటుంది కానీ ఆశ్రమంలో ఉన్న వార్డెన్ సరిగ్గా చూసుకునేది కాదు ఆమెతో చాలా దురుసుగా ప్రవర్తించే ది.

ఆమెను ఎప్పుడూ ఆవటి దానా అని తిడుతూ ఉండేది.

అలాగే అక్కడ ఆ తల్లి బాధపడుతూ శంకర్ అతని భార్యకు ఆ విషయం చెప్పుకోలేక బాధపడుతూ ఉంటుంది. రోజులు గడుస్తున్నాయి సంక్రాంతి సెలవులు రావడంతో పాపా తన తల్లి దగ్గరికి వెళుతుంది. అక్కడ ఉన్న వార్డెన్ తల్లితో….. ఒసేయ్ avati దాన ప్లేటులు కడక్కుండా వదిలి పెట్టావు అంట. నీకు ఈ మధ్య బాగా పొగరెక్కి కొట్టుకుంటున్నావు. అంటూ ఆమెని తిడుతుంది.

పాపం ఆ తల్లి….. నేను ఉదయాన్నే మొత్తం అన్ని శుభ్రం చేశాను. ఇవి మళ్లీ ఎవరు తిన్నారు నాకు తెలియదు.

వార్డెన్….. ఎవరి తింటే ఏమైంది అడిగితే నీ చేతిలో ఏమైనా అరిగిపోతాయా. లేదంటే నీ కాలు పోయినట్టుగా నీకు చేతులు కూడా పోతాయి అనుకుంటున్నావా.

ఆ మాటలు వింటున్నా బేబీ చాలా బాధ పడుతూ….. మా అమ్మ ని పట్టుకొని ఇన్ని మాటలు అంటున్నాడు ఎందుకు నా తల్లి అవుటిది  అనే కదా.

మీరు మా అమ్మ ని ఇలా మాట్లాడుతున్నారు అంటే అందరితో కూడా అలాగే మాట్లాడుతున్నారా.

ఈ విషయం శంకర్ బాబు గారికి చెప్తాను.

అందుకు వార్డెన్…. అయ్యో పాప అలా ఏం లేదు. మీ అమ్మగారి కొంచెం పని చేసుకోలేకపోతున్నారు అందుకే నేను అలా అరిచాను మరో ఉద్దేశం లేదు.

నువ్వు అలా చెబితే నా ఉద్యోగం పోతుంది.

నువ్వలా చెయ్యకు అంటూ ఉండగానే శంకర్ తండ్రి ముసలాయన అక్కడికి వస్తాడు.

అతను జరిగిన విషయం అంత తెలుసుకొని….. వార్డెన్ నువ్వు ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండదు. నువ్వు మంచిదానివి అనుకున్నానే కాని ఇలాంటి దానివి అనుకోలేదు. ఇక వెళ్లొచ్చు అని గట్టిగా అరుస్తాడు ఆమె…. అది కాదండి నేను చెప్పేది ఒకసారి వినండి.

అందుకు అతను….. ఇంక నాకు ఏమి చెప్పకు. ఇంకా ఎక్కువ మాట్లాడావంటే నేను ఏం చేస్తాను నాకు తెలియదు మర్యాదగా ఎక్కడ నుంచి వెళ్లి పోతే నీకు నాకు ఇద్దరికీ మంచిది.

అని అంటాడు ఇక ఆమె అక్కడి నుంచి వెళ్లి పోతుంది. అతను ఆ రోజు నుంచి వార్డెన్ గా. బేబీ తల్లి శారదని ఉంచాడు.

ఆమె ఆ వివిటి ది అయినా కూడా అందరికీ సహాయం చేస్తూ. అందర్నీ ప్రేమగా పలకరిస్తూ. అందరి బాగోగులు చూస్తుంది.

అక్కడ ఉన్న వాళ్లు కూడా శంకర్ కి అలాగే శంకర్ భార్యకి శంకర్ తండ్రికి ఆమె ఒక గొప్ప మనసు గురించి చెబుతారు. దాన్ని విని వాళ్లు చాలా సంతోష పడతారు.

బేబీ కూడా సంతోషపడుతుంది. ఆమె శంకర్ కి భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకొని చక్కగా చదువుకుంటూ ఉంటుంది. తన తల్లి కూడా అందరికీ తలలో నాలుకలా గా మారిపోయి. అందర్నీ చూసుకుంటూ సంతోషంగా ఉంటుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *