పేదపిల్ల మాయా గౌను | Telugu Stories | Telugu Fairy Tales | Telugu Kathalu | Kattapa Kathalu

ఒక ఊరిలో శోభా అనే పేద అనాధ అమ్మాయి ఉండేది, ఆమె దగ్గర ఒక మాయా గౌను ఉండేది, ఆమె దగ్గర మాయ గౌను ఒకటి ఉంటుంది. దాన్ని వేసుకొని ఏదైనా కోరుకుంటే అది జరుగుతుంది. శోభా మాత్రం తన దగ్గర ఉన్న గౌను గురించి ఎవరికీ చెప్పకుండా ఎవరికీ ఎప్పుడు సహాయం కావాలన్న తనకి తెలియగానే వెంటనే తాను వెళ్లి మాయా గౌను ధరించి వాళ్లకి ఏ సహాయం కావాలో చేస్తూ ఉండేది, అలా ఉండగా ఒకరోజు వీధిలో నడుచుకుంటూ వెల్తూ ఉండగా ఓక్ ముసలావిడ తన రోడ్డు పక్కన కూర్చుని ఏడుస్తూ తనలో తాను ఇలా అనుకుంటూ ఉంటుంది.

ముసలమ్మ : నేను కన్న కొడుకులే నన్ను కాదని వెళ్లారు, కట్టు బట్టలతో నన్ను ఇలా రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయారు నేను ఇప్పుడు ఎలా బ్రతకాలి అయినా నేను ఎవరికోసం బ్రతకాలి నీకు చాలా ఆకలిగా ఉంది నేను ఈ ఆకలితోనే చచ్చిపోయేలా ఉన్నాను దేవుడా నీకు నా పిల్లల ప్రేమని దూరం చేసావు, బ్రతకాలన్న కోరిక కూడా లేదు నా జీవితం లో నేను చెప్పుకోవడానికి ఏ ఒక్క మంచి విషయం కూడా జరగలేదు, నా పెళ్లి అయినప్పటి నుంచి పిల్లల్ని పెంచడం కోసం రాత్రిబవళ్ళు తేడాలు లేకుండా కష్టపడుతూనే ఉన్నాను, పిల్లలు పెరిగి పెద్ద వాళ్ళు అవ్వగానే నన్ను ఇలా రోడ్డున వదిలేసి పోయారు, నా మీద నీకు ఏ మాత్రం జాలి దయ ఉన్నా నన్ను ఇంకా ఇంకా కష్టాలు పెట్టకుండా వీలైనంత త్వరగా చ్చావు వచ్చేలా చూడు తండ్రి అని ఏడుస్తూ ఉంటుంది.

ముసలమ్మా మాటలు విన్న శోభ ఎంతో బాధపడుతుంది.

శోభ : అయ్యో ముసలావిడ పాపం ఎంత నరక యాతం అనుభవిస్తుందో కదా, తల్లి దండ్రులు ఆలనా పాలన లేని నాలాంటి వాళ్ళు వాళ్ళని తలుచుకొని తలుచుకొని రోజు రోజు బాధపడుతుంటే తల్లి దండ్రులు ఉన్న ఇలాంటి కొంత మంది వాళ్ళ విలువ తెలుసుకోకుండా ఇలా రోడ్ల పాలు చేస్తున్నారు, నాకు ఈ ముస్సలావిడకి సహాయం చెయ్యాలి అని ఉంది, నేను ఇప్పుడే వెళ్లి నా దగ్గర ఉన్న మాయ గౌను సహాయం తో తేనెకు ఎలాగైనా సహాయపడతాను అని అనుకుంతుంది.

వెంటనే వెళ్లి శోభ తన ఇంటికి వెళ్ళి మాయా గౌనిని తీసుకుంటుంది.

శోభ : మాయా గౌను ఇప్పటి వరకు నీ సహాయం తో ఎంతో మంది పెద్దవాళ్ళకి సహాయ పడ్డాము ఈ రోజు మల్లి నీతో నాకు అవసరం వచ్చింది పడింది. అని అంటూ ఆ మాయ గౌను ని వేసుకుంటుంది.

మాయా గౌనుని వేసుకున్న తరువాత శోభా

శోభ : కోరిన వరాలు ఇచ్చే మాయ గౌను నేను రోడ్డు పక్కన ఒంటరి గా ఉన్న ముసలావిడకు నేను ఎదో రకంగా సహాయం చెయ్యాలి అనుకుంటున్నాను, తనకి తిండి లేక ఆకలితో చచ్చిపోయేలా ఉంది, నువ్వే తనకి సహాయం చెయ్యాలి అని అనుకుంటుంది.

అలా శోభ అనగానే వెంటనే తన ముందు ఓక్ గిన్నె ప్రత్యక్షం అవుతుంది దాని చూసి ఆశ్చర్య్ర పోయిన శోభ మాయ గౌని విప్పి మాముగా అవుతుంది, వెంటనే మాయా గౌను గాల్లోకి లేచి మెరుస్తూ ఇలా మాట్లాడుతుంది.

మాయ గౌను : శోభ ఇపుడు నేను నీకు ఇచ్చిన పాత్ర మామూలు పాత్ర కాదు, చాలా మహిమలు కలిగిన పాత్ర ఇది ఎవరింట్లో అయితే ఉంటుందో వాళ్ళు గిన్నె దగ్గరకు వచ్చి ఏది కోరుకుంటే ఆ ఆహారం వెంటనే ప్రత్యక్షయం అవుతుంది అని చెపుతుంది మాయ గౌను

శోభా మాయ గౌనుకు కృతజ్ఞతలు తెలిపి చీకటి పడిన తరువాత మాయా గిన్నెని తీసుకెళ్లి ముసలావిడ దగ్గర ఎవరికి తెలియకుండా పెడుతుంది.

తెల్లారి ఎంతో ఆకలితో లేచిన ముసలావిడకు మాయా గిన్నె కనిపిస్తుంది.

ముసలావిడ : అయ్యో ఎవరో ఇటు నుంచి వెళ్తుంటే ఈ గిన్నె ఇక్కడ ఆడినట్టుగా ఉంది.. పాపం ఎవరిదో ఏమో ఇక్కడ పారేసుకున్నారు అని గిన్నెయు చేతిలోకి తీసుకుంటుంది.

ముసలావిడ : ఈ గిన్నె ఎవరిదో నా దగ్గర పడింది కానీ దీంతో పాటు ఎంతో కొంత ఆహారం వచ్చిన బాగుండేది ఈ పూటకి కదుపు నింపుకొని ఉండేదాన్ని అని అనుకుంటుంది ముసలావిడ అలా అనుకోగానే గిన్నెలో కొంత ఆహారం ప్రత్యక్షం అవుతుంది. ముసలావిడ వెంటనే ఆహరం మొత్తము తినేసి తన ఆకలి తీర్చేస్తుంది. అది ఒక మాయా గిన్నె అని ముసలావిడకు అర్థం అవుతుంది. వెంటనే  తనకి ఓక్ ఆలోచన వస్తుంది.

ముసలావిడ : ఇదేదో మాయా గిన్నెలా ఉంది మనం ఏది కోరుకుంటే ఆ ఆహరం ఇందులో దొరికేలా ఉంది. అయితే నేను ఒక పని చేస్తాను  ఈ గిన్నెలో ఎంత ఆహరం వచ్చినా సరే దాన్నంతటిని నా లాగ ఆహారం లేకుండా తిండి కోసం తిప్పలు పడుతున్న ముసలాళ్ళకి మరియు అంగవైపల్యం తో బాధపడుతూ సరిగా పనులు చేసుకోలేని వాళ్లకి కూడా పంచి పెడతాను అని అనుకుంటుంది.

ఇదంతా ఓక్ చెట్టు చాటున ఉంది గమనిస్తున్న శోభ ముసలావిడ ఆలోచనకి ఎంతో ఆనందిస్తుంది.

శోభ : నేను ఈవిడాకు ఒక్కవిడాకు సహాయం చేయాలనుకున్నాను కానీ ఈవిడ ఈమె లాగ బాధపడే వాళ్లందరికీ సహాయ పడాలి అనుకుంది. ఈవిడాకు సహాయం చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అని ఇంటికి వెళ్ళిపోతుంది.

అలా కొన్ని రోజులు గడిచిపోతాయి ఒకరోజు శోభ తన ఇంటి ముందు కూర్చొని ఉండగా ముసలావిడ అక్కడకు వచ్చి ఇలా అంటుంది.

ముసలావిడ : అమ్మ తల్లి నీకు తల్లిదండ్రులు ఎవరు లేరు కదా, ఇంత చిన్న వయస్సులో నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి కదా నీ పేదరికం వాళ్ళ నీ చదువు పాడవ్వ కూడదు కాబట్టి ఈరోజు నుంచి నీకు మూడు పూటలా ఆహారం ఏను ఏర్పాటుకే హిస్తాను నువ్వు రోజు బడికి వెళ్లి చదువుకో అని అంటుంది.

తాను చేసిన సహాయం తనకే తిరి వచ్చినందుకు శోభ ఎంతో సంతోషిస్తుంది.

షార్ట్ స్టోరీ

శోభ దగ్గర ఉన్న మాయ గౌను సహాయం తో ఊరిలో ఎంతో మంది ఆపదల్లో ఉన్న ప్రజలకి సహాయం చేస్తూ ఉంటుంది. అలా ఉండగా ఒకరోజు  రోడ్డు మీద తన పిల్లలు వదిలేసిన ఒక ముసలావిడ కనిపిస్తుంది, తాను కష్టాలలో ఉన్నది అని మాయ గౌను దగ్గరికి వచ్చి సహాయం అడగగా మాయ గౌను కోరుకున్న ఆహార ప్రత్యక్షం అయ్యే ఓక్ మాయా గిన్నెను ఇస్తుంది, దానిని తీసుకెళ్లి ముసలావిడకు ఇస్తుంది శోభ

Add a Comment

Your email address will not be published. Required fields are marked *