పేదపిల్ల-మాయ చెరుకు మిషన్ | Stories In Telugu | Telugu Kathalu | Telugu Moral Stories | Telugu Story

రాజపురం అనే గ్రామంలో చెరకు పంట విపరీతంగా పండేది, వేరే వేరే రాష్ట్రాల ప్రజలు కూడా రాజపురం వచ్చి చెరకు కొనుక్కెళ్లేవాఋ, రాజపురం చెరకు  నాణ్యత చాలా ఎక్కువ మరియు ఎక్కువా కాలం తాజాగా ఉంటుంది అందుకే ఇక్కడి చెరకు కి అంత డిమాండ్ ఉండేది, కానీ అదంతా ఒకప్పటి కథ ఇప్పుడు రామాపురం కరువు తో బాధపడుతుంది,

అదే ఊరిలో ఉండే ఒకప్పుడు రంగయ్య కి చేతినిండా పంట ఉండడం తో చాలా డబ్బులు సంపాదించేవాడు, అతనికి ఒక భార్య ఒక కూతురు చిన్ని ఉన్నారు, ఇప్పడు కరువు కాటకాల వల్ల తన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి దారుణంగా మారిపోయింది, అలా ఉండగా రంగయ్య తన భార్య లక్ష్మి దగ్గరకు వెళ్లి ఇలా మాట్లాడుతుంటాడు

రంగయ్య : ఏంటి లక్ష్మి మన పరిస్థితి ఇంత దారుణంగా మారిపోయింది, ఒకప్పుడు మన దగ్గర ఉనన డబ్బులు అడిగిన వారికల్లా ఇచ్చేసాము, ఇప్పుడు మనకి ఎవరు బ్రతిమాలినా కూడా ఇవ్వడం లేదు, అని బాధపడుతుంటాడు

లక్ష్మి : ఎవరైనా ఏమి చేయగలరండి అందరి పరిస్థితి మనలాగానే ఉంది కదా, ఈ సారి పంటలు కూడా పండలేదు

రంగయ్య : అవును లక్ష్మి సరే మన పంట పోయినా ఎవరిదగ్గరైనా పనికి పోయి అయినా డబ్బులు సంపాదించుకుందాము అనుకున్న ఎవరికీ కూడా పంట లేదు, మనమంటే ఎలాగోలా ఆకలికి ఓర్చుకుంటూనో బాధపడుతూనే తట్టుకోగలము కానీ చిన్ని పసి పిల్ల దాన్ని ఇలా ఆకలికి బాధపెట్టడం మంచిది కాదు అని అంటాడు

ల్లక్ష్మి : నాకు మాత్రం దాన్ని ఆకలితో ఉంచాలంటే మనసు ఒప్పుకోవడం లేదండి కానీ ఒక్కోసారి తప్పడం లేదు అని అంటుంది

రంగయ్య : సరే లక్ష్మి ఇంకొక వారం రోజులు చూడ్డ ఏ వర్షాలు పడకపోతే వేరే దగ్గరికి వెళ్లి ఏ కూలో నాలో చేసుకుని బ్రతుకుదాం అలాగైనా చిన్ని కి కడుపునిండా అన్నం పెట్టవచ్చు అని అంటాడు

లక్ష్మి : సరే అంది మీ ఇష్టం అని అంటుంది

ఈ మాటలన్నీ చిన్ని చాటుగా వింటుంది

చిన్ని : అమ్మ నాన్న నా గురించి ఎంతో కష్టపడుతున్నారు, నాకోసమే కేవలం నాకోసం చిన్నప్పటినుంచి పెరిగిన ఊరుని, ప్రాణం లా చూసుకున్న పొలాలని కూడా వదిలి ఎక్కడికో వెళ్ళడానికి సిద్ద పడ్డారు నాకోసం వాళ్ళ ఇష్టాలను నేన్ను దూరం చేయలేను ఎలాగైనా సరే అమ్మ నాన్నలని ఇక్కడే ఉండేలా చేయాలి అని అనుకుంటుంది

అలా రెండు మూడు రోజులు గడిచిపోతాయి కానీ చిన్ని కి ఊరు వదిలి వెళ్లకుండా అమ్మానాన్నలని ఎలా ఆపాలో అర్ధం కావడం లేదు ఇంతలో లక్ష్మి చిన్ని దగ్గరకు వచ్చి ఇలా అంటుంది

లక్ష్మి : అమ్మ చిన్ని మనం ఇంకో రెండు మూడు రోజులలో ఈ ఊరు వదలి వెళ్ళిపోతున్నాము, నీ వస్తువులు ఎవరి దగ్గరైనా ఉంటె తెచ్చుకో అని చెబుతుంది

చిన్ని : అమ్మ మనం ఏఈ ఊళ్ళోనే పుట్టి పెరిగాము మనకి ఈ ఊరు తప్పా ఇంకా ఏమి తెలియదు అక్కడికి పోయి మనం ఎక్కడ ఉంటాము ఏమి చేస్తాము అమ్మ ఇక్కడే ఉంది ఎదో ఒకటి చేసుకుందాము అని అంటుంది

ఇంతల వీరయ్య అక్కడికి వస్తాడు చిన్ని మాటలు వ్విన్న వీరయ్య చిన్ని తో

వీరయ్య : అమ్మ చిన్ని కన్నా ఊరుని విడిచిపోవాలని ఎవరికీ మాత్రం ఉంటుంది చెప్పమ్మా? కానీ పరిస్థితులు అలా వచ్చాయి, మన ఊరు మన ఇల్లు అని కూర్చుంటే ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాము అందుకే నా మాట విని మొండి చేయకుండా పోదాం అమ్మ అని అంటాడు

వీరయ్య మాటలకు చిన్ని కూడా ఏమి మాట్లాడలేకపోతుంది.

చిన్ని : ఇంకా రెండు మూడు రోజుల్లో ఎలాగూ వెళ్ళిపోతాము, ఒక సరి పొలం దగ్గరికి వెళ్లి వస్తాను అని పొలం దగ్గరికి వెళ్తుంది, పొలం లో చుట్టూ తిరుగుతూ ఉన్న చిన్నికి ఒక చిన్న మొక్క అకనిపిస్తుంది

చిన్ని : ఏంటి కరువు  ఊరిలో వక్క చెట్టుకు కూడా నీరు లేక ఎండిపోతుంటే ఇది ఒక్క మొక్క మాత్రం ఇంకా పచ్చగానే ఉంది అని తన చేతిలో ఉన్న బాటిల్ ఉన్న నీటిని కొన్నింటిని మొక్కకి పోస్తుంది చిన్ని

చిన్ని నీరు పోయగానే చిన్న మొక్క పెద్ద చెరకు మొక్క అవుతుంది, వెంటనే చిన్ని ఇంకా కొన్ని నీళ్లు పోస్తుంది చెరకు చెట్టు చుట్టూ ఇంకా కొన్ని చెరకు మొక్కలు వస్తాయి

చిన్ని వాటిని చూసి ఎంతో సంబర పడిపోతుంధీ,

చిన్ని : ఇది ఎదో మాయ చెరకులు మొక్కల్లా ఉన్నాయి, మాయ అయినా ఏదోకటి కానీ నేను ఇప్పుడు ఈ చెరకు మొక్కలని తీసుకెళ్లి చెరకు రసం చేసి ఊరందరికీ పోస్తాను దాని వల్ల ఆకలితో బాధపడుతున్న ఎందరో ప్రజల ఆకలి తీర్చిన దానిని అవుతాను అని కొన్ని చెరకు గడాలని తీసుకొని వెళ్లి తమ ఇంట్లో ఉన్న చెరకు మెషిన్ దగ్గరకు వెళ్తుంది

జరిగిన విషయం అంత తమ తల్లి దండ్రులకి చెబుతుంది

రంగయ్య : ఎంత గొప్పగా ఆలోచించావు తల్లి సరే నువ్వు ముందు చెరకు రసం తీయి నెను వెళ్లి అందర్నీ పిలుచుకొస్తాను అని అంటాడు

చిన్ని ఎంతో ఆనందంగా చెరకు గడలని మెషిన్లో పెడుతుంది, ఆశ్కార్యంగా బయటకు బంగారు నాణాలు వస్తూ ఉంటాయి దాని చూసిన రంగయ్య లక్ష్మి ఎంతో ఆశ్చర్య పోతారు,

చిన్ని : అమ్మ నేను చెప్పను కదా ఇది మాయ చెరకు లా ఉందని అందుకే ఇందులో నుంచి చెరకు రసానికి బదులుగా బంగారు నాణాలు వస్తున్నట్టు ఉన్నాయి, వచ్చింది ఏదైతే ఏముందమ్మా మన వాళ్ల ఊరి ప్రజలు బాగుపడుతున్నారంటే మనకి అంత కన్నా ఇంకేం కావలి వచ్చిన బంగారు నాణాలని ఊరందరికీ పంచుదాం వీటి వాళ్ల వచ్చిన డబ్బుతో అయినా అందరు హాయిగా బ్రతుకుతారు అని అంటుంది చిన్ని

చిన్ని చెప్పినట్టుగానే రంగయ్య లక్ష్మి కలిసి ఊరందరికీ బంగారు నాణాలు పంచుతారు, వీటిని డబ్బు చేసుకొని ఊరి ప్రజలు సంతోషన్గా ఉంటారు

రంగయ్య ఊరి వదిలి పెట్టి వెళ్లాలన్న ఆలోచన మానుకోవడం తో చిన్ని కూడా చాలా ఆనందంగా ఉంటుంది, అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. కొని రోజులకి ఊరిలో వర్షాలు కురుస్తాయి, ఊరు మల్లి పూర్వ వైభవం సంతరించుకుంటుంది, ఊరి ప్రజలు అందరు సంతోషంగా జీవిస్తుంటారు

1 మినిట్ స్టోరీ

ఒకప్పుడు చీరకు కి పెట్టింది పిఱైనా రాజపురం వరుస కరువులతో అలమటిస్తుంటుంది, రెండు మూడు సంవస్త్రాలుగా పంట పండక పోవడం ఊరి ప్రజలందరి దగ్గర దాచుకున్న డబ్బులు కూడా అయిపోతాయి, అది ఊరిలో ఉంటున్న రంగయ్య వలస వెళ్లాలని అనుకుంటాడు తనకూతురు చిన్ని ఊరు వదలలేక చివరి సారిగా పొలాన్ని చూసి రావడానికి వెళ్లగా అక్కడ తనకు ఒక మాయ చెరకు సీకనిపిస్తుంది, దాన్ని తీసుకొచ్చి మెషిన్ లో పెట్టగా చెరకు రసానికి బదులు బంగారు నాణాలు వస్తాయి, వాటిని ఊరందరు పంచుకుని కాంత సంతోషంగా జీవిస్తుంటారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *