పేదపిల్ల రంగుల పానీపూరి వ్యాపారం | Stories In Telugu | Telugu Kathalu | Telugu Fairy Tales

ఒక ఊరిలో సునీతా అనే ఒక ఒంటరి మహిళా ఉండేది, ఆమె కి ఒక కూతురు ఉండేది ఆమె పేరు సోని, సునిత తన భర్త చేసే పానీపూరి వ్యాపారాన్ని ఇప్పటికి నడిపిస్తూ వస్తుంది, సోని కూడా అప్పుడప్పుడు సునీత కి సహాయంగా ఉండేది, అలా ఒకరోజు సునీత పానీపూరి తాయారు చేస్తూ ఉండగా సోని తన దగ్గరికి వచ్చి ఇలా అంటుంది.

సోని : అమ్మ నువ్వు ఇంత కష్టపడుతూ కూడా ఎలా అమ్మ అప్పుడు నవ్వుతూనే ఉండగలుగుతున్నావు, నీ మొహం లో ఎప్పుడు నేను బాధనే చూడలేదు, నీకు అస్సలు ఎవ్వరి మీద కోపమే రాధా అమ్మ,  నీ లా ఉండడం అందరికి సాధ్యం ఎవ్వదు అమ్మ నీ ప్రశాంతత నీ ఓపిక ప్రతి ఒక్కరికి ఉంటె ఎంత బాగుండేది అమ్మ అప్ప్పుడు ప్రపంచం లో కోపాలు బాధలు ఉండేవే కావు, అని అంటుంది.

సునీత : అమ్మ సోని నేను ఇప్పుడు ఎలా ఉన్నానో మాత్రమీ నీకు తెలుసు, నేను కూడా అందరి లాగానే నవ్వుతూ ఏడుస్తూ అన్ని రకాలుగా మొహం లో అన్ని భావాలు కనిపించేలా ఉండేదాన్ని, మీ నాన్న నన్ను కంటికి రెప్పలా చూసుకునే వాడు కష్టం అన్న మాటని కూడా నా దగ్గరకు రానిచ్చేవారు కాదు, నాకు మీ నాన్న తప్ప వేరే ప్రపంచం ఉండేది కాదు, అలా ఆనందంగా సాగిపోతున్న నా జీవవితం పిడుగు లాంటి వార్త అదే మీ నాన్న మరణం, మీ నాన్న చనిపోయాడని తెలియగా నా కాళ్ళు చేతులు ఆడలేదు, ఏడ్చి ఏడ్చి నా కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి, కొంత కాలానికి ఏడవడానికి కన్నీళ్లు కూడా లేకుండా అయిపోయాయి, అప్పుడు నా చేతుల్లో నువ్వు ఒక చిన్న పిల్లలా ఉంన్నావు. నిన్ను చూసుకోవడమే నాకు లక్ష్యం లా కనిపించిందే తప్ప ఇంకా ఏమి కనిపించలేదు నాకు, కొండత బాధని నా మొహం లో కనిపించనీయకుండా ఒక నకిలీ నవ్వును నా మొహం మీద కనిపించేలా ఉంచాను, అందరికి ఆ నవ్వే కనిపించాలని అనుకున్నాను ఎందుకంటే మనం బాధపడుతున్నాం అని తెలిస్తే మన పక్కన ఉన్న ప్రజలు ఆ సమయం లో మన మీద జాలి చూపించినప్పటికీ పక్కకు వెళ్ళగానే మనల్ని చులకనగా సీచూస్తారు అందుకోసమే నేను అలా నవ్వుని నా మొహం మించి చెదరనీకుండా ఉంచుతాను అని అంటుంది.

సోని : అమ్మ నీ నవ్వు వెనుక ఇంత బాధాకరమైన కథ ఉందా అమ్మ, కొన్నదంతా బాధని గుండెల్లో మోస్తూ కూడా ఇన్ని పనులు చక్కపెడుతున్నావంటే  నువ్వు చాలా గ్రేట్ అమ్మ అని అంటుంది.

అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. సునీత పానీపూరి వ్యాపారం బాగా సాగుతూ ఉంటుంది, కొంచం డబ్బులు ఎక్కువగా రావడం మొదలవుతుంది. సునీత పానీపూరి దగ్గర ఎప్పుడు ప్రజలు వస్తూ తింటూనే ఉండెవ్వారు,

సోని : అమ్మ మన పైపురి వ్యాపారం దినదినాభి వృద్ధి చెందుతుంది. గత కొన్ని రోజులుగా మనకి డబ్బులు ఎక్కువగా రావడం మొదలవుతుంది కదా అని అండుగుతుంది.

సునీత : నిజమే తల్లి ఏఈ మధ్య మన పానీపూరి వ్యాపారం చాలా గొప్పగా సాగుతుంది, ఎన్నడూ లేని విధంగా మన వ్యాపారం సాగుతుంది, ఈ 10 రోజులలో వచ్చినన్ని డబ్బులు నేను ఇప్పటివరకు చూడలేదు, కానీ ఒక్క విషయం ఎప్పటికైనా గుర్తుపెట్టుకో మన వ్యాపారం ఇంతలా అభివృద్ధి అవుతుంది అంటే మనకి పోటీదారులు కూడా ఎక్కువ అవుతారు, కావాలంటే నువ్వే చూడు ఇప్పడు ప్రజలు చాలా మనది పానీపూరి తినడానికి మొగ్గు చూపితున్నారు కదా  ఇంకా కొన్ని రోజుల్లో మన చుట్టూ చాలా పని పురీ బండ్లు ప్రత్యక్షం అవుతాయి చూడు, మనకి అసలైన పరీక్షా అప్పుడు మొదలవుతుంది. అని అంటుంది

అలా కొద్దీ రోజుల్లోనే సునీత పానీపూరి బండి పక్కనే చాలా పానీపూరి బండ్లు ప్రత్యక్షం అవుతాయి. అన్నాయి పానీపూరి బండ్లు ఉండడం తో ఏ బండి దగ్గర కూడా జనాలు ఎక్కువగా ఉండేవారు కాదు, ఎవ్వరికి ఎక్కువగా లాభాలు వచ్చేవి కావు, సునీత వాళ్ళకి డబ్బులు రావడం రోజు రోజుకు తగ్గుతూ వస్తుంది.

సునీత : చూసావా తల్లి నేను ముందే చెప్పాను కదా, ఇలా జరుగుతుంది అని  ఇప్ప్పుడూ ఈ పోటీని తట్టుకోవాలి అంట ప్రజలని మనం ఆకర్షించాలి అంటే మన దగ్గర అందరి దగ్గర ఉన్న దానికంటే ఏదైనా ఇంకా కొంచం ఎక్కువ ఉండాలి, అని అంటుంది.

సోని : అమ్మ మన దగ్గర అందరికంటే పానీపూరి చాలా రుచిగా ఉంటుంది కదా అది సరిపోదా అమ్మ వాళ్ళు మన దగ్గరికి రావడానికి, అయినా ఒక పని చేద్దామా అమ్మ ఇప్పటి వరకు మనం 10 రూపాయలకే పిల్లాతె పానీపూరి అమ్ముతున్నాం కదా ఇప్పుడు 15 రూపాయలు చేద్దామా అని అంటుంది.

సునీత : వద్దు తల్లి అది మోసం పదిహేను రూపాయలు చేస్తే మన దగ్గరికి రావడానికి ఆలోచిస్తారు ప్రజలు, ఇంకా మన దగ్గర రుచి అంటావా అది వచ్చి తింటే తప్ప తెలియదు కదా వాళ్లకు మన రుచి తెలియాలంటే మన దగ్గరికి రావాలి కదా ఆ రావడం కోసంఏమి చెయ్యాలో ఆలోచించాలి  అని అంటుంది.

అలా కొద్దీ రోజులు గడిచిపోతాయి సునీత వాళ్ళ వ్యాపారం పూర్తిగా దివాలా తీసే పరిస్థితి వస్తుంది. కేవలం ఇక్కరిద్దరు మాత్రమే వస్తూ ఉంటారు వాళ్ళ పానీపూరి తినడానికి సునీతకి ఏమి చెయ్యాలో అర్ధం కాదు అలా రోజులు గడుస్తుండగా ఒకరోజు సోని తన తల్లి దగ్గరకు వచ్చి ఇలా అంటుంది.

సోని : అమ్మ నిన్న మా టీచర్ ఒక పాఠం చెప్పింది, ఫుడ్ కలర్ అని ఒక టి ఉంటుందిట అది వాడితే మనం చేసే ఆహరం రంగు మారుతుందంట అది ఆరోగ్యానికి కూడా నష్టం ఏమి చెయ్యదంట మనం ఫుడ్ కలర్ వాడి రంగురంగుల పని పూరీలని తాయారు చేద్దామా అమ్మ అని అంతుంది.

సోని ఇచ్చిన ఐడియా సునీతక్కి ఎంతగానో నచ్చుతుంది, ఆరోజు నుంచి రంగుంగుల పానీపూరీలని తయారీలు చెయ్యడం ప్రారంభిస్తుంది సునీత

ప్లేట్ 15 రూపాయలు చేసినా కూడా అందరు రంగురంగుల పానీపూరీలు తినడానికి మొగ్గు చూపుతారు అలా కొద్దీ రామోజుల్లోనే సునీత పానీపూరి వ్యాపారం మల్లి ఊపు అందుకుంటుంది. తల్లి బిడ్డలు మల్లి ఆనందంగా జీవిస్తుంటారు.

షార్ట్ స్టోరీ

ఓక్ ఊరిలో సునీత అనే ఒంటరి మహీళ మరియు ఆమె కూతురు సోని తో కలిసి ఉండేది, వాళ్లకి ఒక పానీపూరి వ్యాపారం ఉండేది, వాళ్ళ ఊరిలో అది ఒక్కటే పానీపూరి బండి అవ్వడం వళ్ళ వాళ్లకి డబ్బులు బాగానే వస్తుండేవి, ఆలా కొద్దిరోజుల్లో వాళ్ళ చుట్టూ చాలా పానీపూరి బండ్లు రావడంతో ఎవ్వరికి డబ్బులు సరిగా వచ్చేవి కాదు ఒకసారి సోని ఇచ్చిన ఐడియా తో సునీత రంగురంగుల పానీపూరీలు తాయారు చేయడం మొదలు పెడుతుంది, రంగురంగుల పానీపూరీల వల్ల వాళ్ళ వ్యాపారం మల్లి ఊపందుకుంటుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *