పేదల ఆక్సిజన్ కష్టాలు | Telugu Stories | Telugu Kathalu | Bedtime Stories | Panchatantra kathalu

అమే పేరు వసుధ . ఆమె కొడుకు పేరు కిరణ్. భర్త శ్రీనివాస్ కొన్ని రోజుల క్రితమే చనిపోవడంతో ఆ కుటుంబం శోకసంద్రం ఉంటుంది. కొడుకు చిన్నవాడు కావడంతో ఆమె ఏదో ఒక పని చేసుకొని తన బిడ్డని బాగా చదువుకోవాలని అనుకుంటుంది.
దానికోసం ఆమె నాలుగు ఇళ్ళల్లో పాచి పని చేసుకుంటూ వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని కొడుకుని చదివిస్తూ ఉంటుంది. అలా కొన్ని రోజులకి ఆమె ఆరోగ్యం బాగోక ఇంటి దగ్గరే ఉండాల్సి వస్తుంది. దాన్ని చూసి నా కొడుకు కిరణ్…. అమ్మ ఇప్పుడు నీ పరిస్థితి అస్సలు బాలేదు కదా . కొన్ని రోజులు నేను పనికి వెళ్లి సంపాదిస్తాను . మనం అంతా బావుంటే తర్వాత నేను బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించాను . ముందు మన కుటుంబం గడవాలి నీ మందులు కి డబ్బులు కావాలి అంటే నేను పని చేయాలి అని అంటాడు అందుకు ఆమె ఏం మాట్లాడకుండా ఉంటుంది. అతను పని కోసం వెళ్తాడు.
అప్పుడే ఒక చోట ఒక బోర్డు ఉంటుంది.
ఆ బోర్డు మీద పనివాళ్ళు కావాలి అని.
వెంటనే దాన్ని చూసి కిరణ్ ఆ యజమానితో మాట్లాడడానికి వెళ్తాడు.
ఆ యజమాని తో…. సార్ బయట బోర్డు చూశాను పని వాళ్ళు కావాలి అన్నారు .
అందుకే వచ్చాను ఏదైనా పని ఉంటే చెప్పండి.
అందుకు అతను….. సరే బాబు మాది చీరల వ్యాపారం . బాగా సాగుతుంది అందుకే పని వాళ్ళ కోసం వెతుకుతున్నాము. మీకు 8000 రూపాయలు నెలకు ఇస్తాను పని చేస్తావా అందుకు అతను…. సర్ పని ఏంటో చెప్పలేదు
యజమాని….. పని అంటే కస్టమర్లు వస్తారు వాళ్ళకి ఏం చీరలు కావాలో వాటిని చూపించాలి. చాలామంది అది నచ్చలేదు ఇది నచ్చలేదు అది ఇవ్వండి ఇవ్వండి అని అడుగుతూనే ఉంటారు . మీరు సహనంగా ఓర్పుగా ఎలాంటి కోపం తెచ్చుకోకుండా. కస్టమర్ ఎంతో జాగ్రత్తగా మాట్లాడి వాళ్ళకి చూపించాలి.
అందుబాటును సరే అంటాడు. ఆ రోజే పనుల్లో కి వెళ్తాడు ఇక ఆరోజు నుంచి అతను అక్కడే పని చేస్తూ ఉంటాడు వచ్చేపోయే వాళ్లు అందరితో సున్నితంగా మాట్లాడుతూ.
ఉంటాడు ….. మేడం ఏం కావాలి.
ఆమె….. కొత్త వెరైటీ చీరలు ఏమైనా ఉంటే చూపించండి. అని అడుగుతుంది అందుకు అతను సరే అని రక రకాల చీరలు చూపిస్తూ ఉంటాడు . వాళ్ళు అది బాగోలేదు ఇది బాగోలేదని వంకలు చెబుతూ ఉంటాడు అతను మాత్రం ఏమాత్రం విసుక్కోకుండా వాళ్లకు చూపిస్తాడు దాన్ని చూసిన యజమాని చాలా సంతోషపడ్డాడు.
తర్వాత వచ్చిన ఆమె కావాల్సిన వాటిని తీసుకొని వెళ్ళి పోతుంది యజమాని అతనితో…. మాకు ఎలాంటి పని వాడు కావాలనుకున్నామో అలాంటి పని వాడు దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు. ఆ రోజు సాయంత్రం కిరణ్ యజమానికి చెప్పి ఇంటికి వెళ్ళి పోతాడు.
ఇంటి దగ్గర తల్లి…. ఎక్కడికి వెళ్లావు బాబు ఇంత సమయం వరకు.
అతను… అమ్మ నాకు పని దొరికింది నెలకు ఎనిమిది వేలు జీతం. ఇంకా మరి ఇలాంటి బాధ ఉండదు. ఆమె…. అయ్యో చదువుకోవాల్సిన వయస్సులో పనికి వెళ్తున్నావా నాకు చాలా బాధగా ఉంది.
అని అంటూ బాధపడుతుంది. అందుకు అతను ఆమె ఓదారుస్తాడు.
అలా రోజులు గడిచాయి ఒక రోజు ఆమె టీవీ చూస్తూ ఉండగా…. బ్రేకింగ్ న్యూస్ . కొత్త వ్యాధి దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఎక్కడ చూసినా ఇదే ఘటన హాస్పిటల్లో .
బెడ్ లు లేక ఆక్సిజన్ అందక చాలా మంది మృత్యువాత పడుతున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండండి మాస్కులు ధరించండి . చేతులను శుభ్రంగా కడుక్కోండి శానిటైజర్లు తప్పనిసరిగా వాడండి. అని చెప్తూ ఉంటుంది దాన్ని విన్న తల్లి కొడుకు తో…. బాబు చూసావా కొత్త వ్యాధి ఏదో వచ్చిందట . కొంచెం జాగ్రత్తగా ఉండు బాబు ముఖానికి మాస్కు చేతికి శానిటైజర్ వేసుకో. అందుకు తను సరే అంటాడు మాస్క్ పెట్టుకొని బయటికి వెళ్తాడు. ఇక అలాగే అతను తన పని చేసుకుంటున్నాడు అక్కడికి రకరకాల వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు.
అలా వాళ్ళ పని సమయం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం తనతో పాటు ఉన్న పని వాళ్లతో కూర్చుని భోజనం చేస్తాడు.
అలా అతను తరచుగా ఆ పని చేస్తూ ఉంటాడు అక్కడికి కొత్త కొత్త వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు. అతను వాళ్లకి ఆ చీరల ని చూపిస్తూ ఉంటాడు . అలా కొన్ని రోజులు పడుతుంది ఒకరోజు అతనికి తీవ్రమైన జ్వరం తలనొప్పి వస్తుంది. అదే విషయం యజమానికి చెప్పి…. సార్ నాకెందుకో ఒంట్లో సరిగ్గా లేదు రేపు నేను పనికిరాను కొంచెం తగ్గిన తర్వాత వస్తాను అప్పటివరకు నాకు సెలవు ఇప్పించండి.
యజమాని…. సరే కిరణ్ ఇంటిదగ్గర రెస్ట్ తీసుకో . నీ తగ్గిన తర్వాతే రా అందుకు తను సరే. అని అంటాడు ఇంటికి తిరిగి వెళ్ళాడు.
అక్కడ తల్లితో…. అమ్మ నాకు ఒళ్లంతా నొప్పులు తలనొప్పిగా ఉంది జ్వరం . అని అంటాడు తల్లి…. సరే బాబు నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో. నీకు నేను వేడి నీళ్లు కాపడం పెడతాను. వేడినీళ్ళతో కాపడం పెడుతుంది.
అలా రెండు రోజులు గడిచాయి. అతని వ్యాధి మాత్రం ఏమాత్రం తగ్గలేదు పైగా విపరీతమైన దగ్గు. చాలా దగ్గుతూ ఉంటాడు తల్లి…. ఏమైంది బాబు . అంటూ చాలా బాధపడుతూ అడుగుతుంది అతను ఏం సమాధానం చెప్పకుండా దగ్గుతూ ఉంటాడు తల్లి కి ఏం చేయాలో అర్థం కాదు.
అలా ఉండగా టీవీలో….. రోజురోజుకు పెరుగుతున్న వ్యాధి . దాని కారణంగా ప్రభుత్వం లాక్కొని ప్రకటించింది . ఇది అంటువ్యాధి కావడంతో ఒకరి ద్వారా ఒకరికి సులువుగా వ్యాప్తి చెందుతుంది. ముసలి వాళ్లు ఈ వ్యాధి బారినపడి ఊపిరి అందక చనిపోతున్నారు . ఇకనుంచి ఎక్కడ దుకాణాలు తెరవబడును . సినిమా హాలతో సహా అన్నీ బంద్ .
ఆ తల్లి ఆహారం కోసం కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇంతలో కొడుకు…. అమ్మ నాకు ఊపిరి ఆడటంలేదు అమ్మా అమ్మా నాకు ఊపిరి ఆడటంలేదు అమ్మా అంటూ తనని పిలుస్తూ ఉంటాడు దాన్ని చూసిన తల్లి ఏం చేయాలో అర్థం కాక….
బాబు హాస్పిటల్ కి వెళ్దాం పదా. అంటూ అతన్ని తీసుకొని హాస్పిటల్ కి బయల్దేరుతుంది అక్కడ బయట ఎక్కడా కూడా కూడా ఆమెకు వాహనాలు కనపడవు . అంత లాక్ డౌన్ కారణంగా ఆ తల్లి కి ఏ ఒక్క వాహనం కూడా కనపడదు చాలా బాధపడుతూ అటూ ఇటూ చూస్తుంది.
అప్పుడే ఆమెకు అక్కడ ఒక ఖాళీ కూరగాయల బండి కనబడుతుంది వెంటనే ఆమె అతన్ని దానిపైన పడుకోబెట్టుకుని ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకు వెళుతుంది అక్కడ చాలా మంది పిల్లలు పెద్దలు దగ్గుతూ
కనబడతాడు కొంతమంది శవాలు ముందు తల్లిదండ్రులు ఏడుస్తూ. కనిపిస్తారు ఆమె చాలా బాధపడుతూ హాస్పటల్ లోపలికి వెళ్తుంది అక్కడే డాక్టర్ అమ్మతో ….. అమ్మ ఒకసారి నా బిడ్డను చూడండి ఏం జరిగిందో ఏమీ అర్థం కావడం లేదు జ్వరం తలనొప్పి అంటున్నాడు శ్వాస అందడం లేదు అని బాధ పడుతున్నాడు నా బిడ్డను మీరే కాపాడమ్మా అంటూ ఏడుస్తుంది .
డాక్టర్…. అమ్మ ఇది కొత్త వ్యాధి లక్షణం . మీరు మాస్కునీ ధరించండి అని అంటుంది అందుకు ఆమె తన చీర కొంగు ని maskal ఆకట్టుకుంటుంది . డాక్టర్… బయట చూడండి అమ్మ ఎంత మంది ఉన్నారో వాళ్ళందరూ ఆక్సిజన్ అందక చనిపోయినవాళ్ళ. హాస్పిటల్ పూర్తిగా నిండిపోయింది బెడ్లు కూడా లేవు . కొంచెం సేపు ఇక్కడే ఉండండి ఏదైనా దొరికితే మీ అబ్బాయిని లోపలికి తీసుకు వెళతాను అని సమాధానం చెబుతుంది.
అతనికి ఎంతో బాధపడుతూ అక్కడే…. భగవంతుడు ఇలాంటి పరిస్థితి తీసుకు వచ్చినందుకు నిన్ను ఏమనాలి. ఈ వ్యాధి వల్ల ఎంత మంది చనిపోతున్నారో చూడు.
తల్లి బిడ్డ ని కోల్పోయింది . బిడ్డ తల్లిని కోల్పోయి భార్య భర్తను కోల్పోయి . భర్త భార్యను కోల్పోయి ఇలా ఎంత రోదిస్తున్నారు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు అంటూ ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది .
ఆ బిడ్డ ఊపిరాడక ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు.
ఆమె….. అయ్యో భగవంతుడా నా బిడ్డ ప్రాణాలను నువ్వే కాపాడాలి ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకెళ్ళి స్తోమత నాకు లేదు .
నా బిడ్డ నే కాదు ఇక్కడికి వచ్చిన వాళ్ళందర్నీ నువ్వే కాపాడాలనీ ఏడుస్తూ ఉంటుంది.
కిరణ్ ఊపిరాడక ఎంతో బాధపడుతూ అలా శ్రమ తప్పి పడిపోతాడు .
ఆమెకు ఏం చేయాలో అర్థం కాక డాక్టర్ నీకోసం వెతుక్కుంటూ….. డాక్టర్ ఒకసారి రండి . నా కొడుకు వులుకు పలుకు లేకుండా పడుకున్నాడు . రండి డాక్టర్ ఒకసారి రండి అంటూ కేకలు వేస్తూ డాక్టర్ కోసం వెతుకుతుంది ఇంతలో డాక్టర్ కనిపిస్తుంది ఆమె …. అమ్మ వస్తున్నాము ఇక్కడ చూశారు కదా ఎంతమంది ఉన్నారో . ఒక్క నిమిషం అన్నా ఒక్క నిమిషం తల్లి ఒక్క నిమిషం దయచేసి మమ్మల్ని అర్థం చేసుకో . నీకు పుణ్యం ఉంటుంది. అని అంటుంది .
ఆ తల్లి ఆవేదననీ ఆ డాక్టర్ అర్థం చేసుకున్న అంతమందిని చూసుకోవడం ఆ డాక్టర్లకి నర్సులకు చాలా కష్టం గా అనిపించి వాళ్లు కూడా భగవంతుని సాధిస్తారు.
ఇంతలో ఒక ఆమె ఏడుస్తూ కిరణ్ కి ఆక్సిజన్ అందిస్తుంది. కిరణ్ ఆక్సిజన్ తీసుకుంటాడు.
ఆ తల్లి ఆమెతో…… అమ్మ నీకు చాలా కృతజ్ఞతలు నా బిడ్డ ప్రాణాలు కాపాడిన గొప్ప వ్యక్తి మీరు అంటూ ఏడుస్తుంది ఆమె…. ఏడుస్తూ మరేం పర్వాలేదు అమ్మ నా బిడ్డను ఇక్కడికి తీసుకు వచ్చాము . నా బిడ్డ మా అందరి విడిచిపెట్టి పై లోకానికి వెళ్ళాడు .
అలాంటి పరిస్థితిని మరి ఏ బిడ్డకు కూడా రాకూడదు. ఇప్పుడు ఈ బిడ్డకు అవసరం అందుకే అందించాను . నా బిడ్డ బిడ్డ ఖాళీగా ఉంది . మీ బిడ్డను అక్కడికి తీసుకు వెళ్ళండి అని అంటుంది అందుకు ఆమె ఏడుస్తూ ఆ బిడ్డని అక్కడికి తీసుకెళుతుంది.
ఆ తల్లి అక్కడే కొన్ని రోజులు ఉంటుంది.
అతనికి డాక్టర్లు కావాల్సిన మందు ని . ఆహారాన్ని అందిస్తూ ఉంటాడో కొన్ని రోజులు గడిచాయి. అతని ఆరోగ్యం కుదుటపడుతుంది . ఇక తల్లి ఆ బిడ్డని తీసుకొని సంతోషంగా ఇంటికి వెళ్తుంది కిరణ్ తల్లితో…. అమ్మ భగవంతుడు ఆ వ్యాధి నీకు రాకుండా చేసేందుకు సంతోషంగా ఉంది.
అని అంటాడు తల్లి… భగవంతుడు మన మీద కృప చూపించాడు లేదంటే మన పరిస్థితి ఎలా ఉండేదో . పాపం హాస్పిటల్ లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అంటూ ఏడుస్తుంది.
అతను…. ఇంత జరిగినా కూడా మనుషులు బయట తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళు తినకుండా ఉండి వ్యాధి త్వరగా అంతం కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అని అంటాడు. అందుకు ఆమె కూడా భగవంతుని ప్రార్థిస్తు ఇక వాళ్ళు కష్టమో నష్టమో ఇంట్లోనే ఉంటూ ఉన్నది తింటూ జీవిస్తారు .

Add a Comment

Your email address will not be published. Required fields are marked *