పేదల లాక్ డౌన్ | Telugu Stories | Telugu Kathalu |Bedtime Stories |Panchatantra kathalu

కృష్ణాపురం అనే గ్రామంలో. ఆదిత్య శారద అనే దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ల కూతురు పేరు దివ్య. వాళ్ళది చాలా పేద కుటుంబం. అదే ఊర్లో ధనవంతులైన కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో లో కిరణ్ వర్షిని అనే దంపతులు ఉండేవాళ్ళు. వాళ్లకి శ్యామ్ అనే ఒక బాబు ఉన్నాడు. శ్యాము దివ్య ఇద్దరూ స్నేహితులు. ఆదిత్య , శారదా ఇద్దరూ పనులు చేసుకుని కుటుంబాన్ని నడుపుతూ ఉండేవారు ఆదిత్య పొలం పని చేసుకుంటూ ఉంటే. శారదా కిరణ్ వాళ్ళ ఇంట్లో పాచి పని చేసుకుంటూ ఉండేది.
అలా వచ్చిన డబ్బుతో దివ్యాని మంచి స్కూల్లో చదివిస్తున్నారు . మిగిలిన డబ్బుతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. అలా వాళ్ళ జీవితాలు సాగిపోతూ ఉన్నాయి. అలా వుండగా ఒక రోజు పేపర్లలో టివిలలో ఈ విధంగా తెలియని వ్యాధి గురించి చెబుతూ ఉంటారు….. ఏదో తెలియని వ్యాధి సంభవిస్తుంది. కాబట్టి మీరందరూ బయటికి వెళ్ళేటప్పుడు. ముక్కు నోరుకి రోమాలు కట్టుకొని. ఎక్కడికైనా వెళ్లండి అలాగే మీ చేతులని పరిశుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి ఈ నియమాలు ఖచ్చితంగా మీరు పాటించండి లేదంటే వ్యాధి సోకే ప్రమాదం ఉంటుంది ఇది అంటువ్యాధి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉంటారు ప్రజలంతా దానిని విని చాలా భయపడుతూ అలాగే చేస్తూ ఉంటారు మరి కొన్ని రోజులు గడిచాయి. టీవిలో….. బ్రేకింగ్ న్యూస్. తెలియని వ్యాధి సోకడంతో దేశమంతా
భయబ్రాంతులకు గురి అవుతుంది అందుకే ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని చేపట్టింది. వ్యాధి తగ్గించే వరకు లాక్ డౌన్ విధిస్తుంది ప్రజలు ఎవరూ కూడా బయటికి రావడానికి వీల్లేదు.
రోజుకు ఒక గంట మాత్రమే నిత్యావసర సరుకులు తీసుకోవడానికి పర్మిషన్ ఉంటుంది.
అని చెప్తారు దాని గురించే ప్రజలంతా మాట్లాడుకుంటూ ఉంటారు.
దాన్ని తెలుసుకున్న ఆదిత్య శారద దంపతులిద్దరూ….. ఎవడి ఏంటండీ ఇది ఇలా చెబుతున్నారు. ఇలా అయితే మన పూట గడవడం కష్టంగా ఉంటుంది. అయినా ఈ వ్యాధి ఏంటో గాని ప్రజలనీ భయబ్రాంతులకు గురి చేస్తోంది. వామ్మో అంటూ చాలా బాధపడుతూ చెప్తుంది అతను….. అవును మన దగ్గర ఉన్న కొంత డబ్బులతో ముందుగానే కావలసిన ఆహార పదార్థాలు తీసుకొచ్చి ఇంట్లో ఉంచుదాం.
అని అంటుంది అందుకు ఆమె సరే అంటుంది వాళ్ళకి కొన్ని రోజులకు తగ్గట్టుగా మాత్రమే ఆహారాన్ని సమకూర్చుకుంటారు ఎందుకంటే వాళ్ల దగ్గర డబ్బులు లేని కారణంగా కొంత వాటికి మాత్రమే వాళ్ళ కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకుంటారు.
ఇది ఇలా ఉండగా ఆ ధనవంతులైన కుటుంబ భార్యాభర్తలిద్దరూ ఇలా మాట్లాడుకుంటారు.
భార్య… ఏంటండీ ఎక్కడ వింటున్నా అవే వార్తలు ఎక్కడ చూస్తున్న అదే వార్తలు. తెలియని వ్యాధితో ప్రజలు చాలా భయపడుతున్నారు. ఇక ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది మీరైతే మన ఇంట్లో కావాల్సిన అన్నింటిని సమకూర్చి పెట్టండి . ఇది ఎప్పటికీ ఎలా ఉంటుందో ఏమో. వీలైతే రెండు నెలలకు తగ్గ సరుకు మొత్తాన్ని ఇంట్లో ఉంచండి పిల్లవాడికి ఎలాంటి లోటు ఉండదు. అలాగే మనం కూడా ఎలాంటి ఇబ్బంది పడకూడదు అని అంటుంది.
అతను… సరే నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా నేను అదే పని చేస్తాను అని బజారుకు వెళ్లి వాళ్లకు కావలసినవన్నీ తీసుకుంటారు . రెండు నెలలకు తగ్గట్టుగా సరుకులు తీసుకుని ఇంటికి వెళ్తారు.
ఆరోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయాన్నే శారద ధనవంతుల కుటుంబంలో ఇంటికి వెళ్తుంది. అక్కడ పనులు చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో వర్షిని అక్కడికి వచ్చి…. శారద రేపటి నుంచి మొత్తం లాక్ డౌన్ అంటున్నారు కదా ఇంక నువ్వు మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు . ఆ వ్యాధితో కొత్తగా ఉంది అంటువ్యాధి . అది వచ్చిన వాళ్ళు చాలా మంది చనిపోతున్నారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఇంకా ఎక్కడికి వెళ్ళద్దు. ఇదిగో ఈ నెల మీకు రావాల్సిన డబ్బులు. అది డబ్బులు చేతిలో పెడుతుంది.
ఆమె తీసుకొని సరే అంటుంది.
ఆమె తన పని ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతుంది. ఇంటిదగ్గర భార్య భర్తలు దివ్య
కూర్చొని ఉంటారు . వాళ్లంతా భోజనం చేసి
విశ్రాంతి .తీసుకుంటారు ఆ మరుసటి రోజే
లాక్ డౌన్. ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటికి రారు. ఉన్న వాటితోనే సర్దుకొని తింటూ ఇంట్లోనే ఉంటారు.
అలా రెండు వారాలు గడిచాయి పోతుంది.
శారద ఆదిత్య దంపతులు కుటుంబం చాలా దారుణం లోకి జారి పోతుంది.
వాళ్లు తినడానికి తిండి లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక రోజు దివ్య తల్లిదండ్రుల తో ఇలా అంటుంది….అమ్మ మా బడిలో వాళ్ళందరూ కూడా ఫోన్ కొనుక్కోవాలి అంటున్నారు మాకు ఆన్లైన్ క్లాసులు చెప్తారంట. అని అంటుంది.
తండ్రి ఆ మాటలు విని …. ఇప్పుడు మన పరిస్థితి తినడానికి తిండి లేకుండా ఉంది. ఇప్పుడు నువ్వు చదువుకోడానికి అవన్నీ కావాలంటే చాలా కష్టం. ఈ సంవత్సరం బడి లేదు ఏమీ లేదు. అని అంటాడు ఆ మాటలకి దివ్య ఏం చేయలేక అలాగే ఉండిపోతుంది.
అలా రోజులు గడుస్తున్నాయి వాళ్ల కుటుంబ పరిస్థితి మరింత దిగజారి పోతుంది. తినడానికి తిండి లేని పరిస్థితి అయిపోతుంది దివ్య ఏడుస్తూ…. అమ్మ నాకు చాలా ఆకలిగా ఉంది అమ్మ నేను ఆకలికి తట్టుకోలేక పోతున్నాను అమ్మ అంటూ ఏడుస్తూ ఉంటుంది తల్లి ఏం చేయలేక …. అయ్యో ఏం చేయాలి ఇంట్లో ఏమీ లేవు అంటూ పాత్రలు అన్ని చూపిస్తూ ఉంటుంది.
తండ్రి…. దివ్య బయటికి వెళ్లి పని చేయడానికి లేదమ్మా. దేశమంతటా లాక్ డౌన్ విధించారు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళలేదు ఏ పని చేయలేము.
దివ్య…. అయితే మనం ఆకలితో ఇలాగే చచ్చిపోవాల నాన ఉంటుంది.
ఆ మాటలకి ఆ తల్లిదండ్రులు ఇద్దరూ చాలా బాధపడుతూ ఆమెనీ హత్తుకుంటారు.
వాళ్లంతా ఖాళీపాత్ర లో ముందు పెట్టుకొని
ఎంతో బాధపడుతూ అలా ముగ్గురు కూర్చుని ఉండిపోతారు. ఈ కుటుంబ పరిస్థితి ఇలా ఉంటే ఆ ధనవంతులు ఆయన కుటుంబం లో. శ్యామ్ ఆ తల్లిదండ్రులతో ఆడుకుంటూ. కావాల్సినది తింటూ ఎంతో సంతోషంగా ఉంటాడు . వాళ్లంతా ఏ పని లేక పోవడంతో ప్రశాంతంగా కూర్చుని ఆడుకుంటూ ఉంటారు శ్యామ్…. అమ్మ నాకు బిర్యానీ కావాలి అమ్మ.
వరుణ్…. వర్షిని ఈరోజు నాకు డబల్ క మీఠా తినాలని ఉంది అని అంటాడు వర్షిని…. సరే మీకు కావాల్సిన అన్ని నేను తయారు చేసి పెడతాను . అని అంటుంది అలా వాళ్లు కావలసిన తయారు చేసుకుంటూ సంతోషంగా వాటిని తింటూ. ఆ తర్వాత ముగ్గురు కలిసి ఆటలు ఆడుకుంటూ వాళ్ల జీవితాన్ని సుఖంగా గడుపుతుంటారు.
ఆ విధంగా ఆ పేదరికంలో కుటుంబం కష్టాలు పడుతూ ఉంటే. ధనవంతులైన కుటుంబం ఎంతో సంతోషంగా ఉంది.
అలా రోజులు గడుస్తున్న వి ఇక ఆ పేదరికంలో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటుంది దివ్య ఆకలితో నీరసంగా పడుకొని ఉండడంతో తల్లికి భయం వేసి భర్తతో ….. ఏవండీ పాపా చాలా నీరసంగా పడుకుంది ఇలా అయితే మళ్ళీ ఏదో ఒకటి జరిగి హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. వీరయ్య గారి కొట్లో కనీసం అప్పు అయినా తీసుకురండి. లేదంటే ఆకలితో ముగ్గురం చచ్చిపోవాలి వస్తుంది. షాప్ లన్ని ఒక గంట మాత్రమే తెరుస్తారు త్వరగా వెళ్ళండి అంటుంది అతను సరే అని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్తాను. అతను సర సరీ వీరయ్య కొట్టు కి వెళ్లి….. వీరయ్య ఒక బస్తా బియ్యము కొన్ని కూరగాయలు పప్పు దినుసులు అన్ని ఇవ్వు . డబ్బులు నీకు ఈ లాక్ డోన్ అంతా పూర్తి అయి మళ్లీ పనులు మొదలు పెట్టిన తర్వాత ఇస్తాను ఇంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది.
అని అంటాడు అతను…. చూడు అదిత్య నేను ఇప్పుడు ఎవరికి అప్పు ఇవ్వడం లేదు. ఎందుకంటే పరిస్థితులు అస్సలు బాగోలేదు. తీసుకున్న వాళ్ళు ఇస్తారా ఎవరు అని నాకు చాలా భయం పట్టుకుంది. ఒకవేళ నువ్వు ఇచ్చిన ధైర్యం చేసి ఇచ్చే మనసు నాకు లేదు మా పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది ఈ సరుకును తీసుకురావడానికి చాలా కష్టపడుతున్నాను ఈ సమయంలో అప్పులు ఎట్టి పరిస్థితిలో నేను ఇవ్వలేను అర్థం చేసుకో.
అని అంటాడు ఆ మాటలు అతను చాలా బాధ పడుతూ….. అయ్యో వీరయ్య ఇంతగా బ్రతిమలాడు తున్నను అంటే.ఇంటి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకో నా కూతురు ఆకలితో చచ్చిపోయే లాగ ఉంది అంటూ ఏడుస్తూ చెప్తాడు. ఆ మాటలకి వేయకు జాలి కలుగుతుంది కానీ సహాయం చేయడానికి అతని చేయి మాత్రం ముందుకు రాదు. అప్పుడే అక్కడికి కిరణ్ వస్తాడు వాళ్ళ సంభాషణ వింటాడు. ఇంతలో ఆదిత్య అక్కడి నుంచి చాలా బాధపడుతు అక్కడనుంచి వెళ్ళి పోతాడు.
ఆదిత్య వీరయ్య తో….. ఏంటి ఆయన అలా అంటున్నాడు . ఇతను శారద వాళ్ళ భర్త కదా అని అంటాడు.
వీరయ్య…. అవును కిరణ్ గారు ఇంటి పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది అంటున్నాడు కానీ నేను అప్పు ఇవ్వడానికి నా పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా సరుకులు తీసుకోవడానికి ఎంతగానో ఇబ్బంది పడుతున్నాము బిజినెస్ అంతంత మాత్రంగానే ఉంది. ఈ లాక్ డౌన్ లో అందరికీ చాలా కష్టం వచ్చి పడింది.
అంటూ అతను కూడా బాధపడతాడు కిరణ్…. సరే నాకు కొన్ని సరుకులు ఇవ్వు అని చెప్పి ఒక లిస్టు ఇస్తాడు. అతను ఆ లిస్టులో ఉన్న వాటన్నిటిని అతనికి అందజేస్తాడు అతను వాటిని తీసుకుని ఇంటికి వెళ్ళి పోతాడు.
అక్కడ అతని భార్య తో…. మన దగ్గరికి పనికివచ్చే శారద వాళ్ళ కుటుంబం చాలా ఇబ్బందిగా ఉండటం వల్ల శారద భర్త వీరయ్య దగ్గరకు వచ్చి తన కష్టాలు చెప్పుకుంటున్నాడు నాకు చాలా బాధేసింది.
మన కంటే కొంత డబ్బు ఉంది కాబట్టి ఇలాంటి టైమ్ లో అయినా నెట్టుకొని వస్తున్నాం కుటుంబాన్ని కానీ వాళ్ల పరిస్థితి ఎలా ఉందో ఏమో పాపం.
అని చాలా బాధ పడతాడు ఆమె….. అయ్యో అవునా అండి . అయితే మనకు తోచిన సహాయం వాళ్ళకి చేద్దాం అంటారా. భర్త…. నేను అదే అనుకున్నాను ఒక రెండు నెలలకు తగ్గ సరుకులు యిచ్చి వద్దాం అనుకుంటున్నాను. అందుకు ఆమె సరే అంటుంది ఆ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సరుకులు తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తారు.
ఆ కుటుంబం ఎంతో బాధతో అలా కూర్చుని ఉంటుంది. వాళ్ళని చూసిన ధనవంతుడు చాలా బాధ పడతారు ఇంతలో వారిని గమనించిన శారద…. రండి రండి అని వాళ్ళ ఆహ్వానిస్తుంది ఇక ఆదిత్య కూడా వాళ్ళని ఆహ్వానిస్తాడు. వాళ్లు తీసుకు వచ్చిన సరుకులు శారదకు ఇచ్చి …. శారదా ఇంత ఇబ్బంది పడే టప్పుడు నాతో ఒక మాట కూడా చెప్పకుండా ఎందుకు ఉన్నావు. అని ఆమె అంటుంది శారద ఏడుస్తూ… ఏం చేయాలో మాకు అర్థం కాలేదు అమ్మ. కానీ మీరు మా పరిస్థితి తెలుసుకొని ఇక్కడికి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు అదిగో నా కూతురు చూడండి ఆకలితో అల్లాడి పోతు నీరసంతో పడుకుంది. అంటూ ఏడుస్తుంది వాళ్లు ఆమెను చూసి చాలా చాలా బాధ పడతారు. ఆదిత్య…. మీకు చాలా కృతజ్ఞతలు . నా ప్రాణాలు కాపాడారు అంటూ ఏడుస్తూ చెప్తాడు. ఆ భార్యాభర్తలు ఇద్దరూ వాళ్లకు ధైర్యం చెప్పి …. ఇలాగే ఎంతో మంది చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకంటే మీ భర్త వీరయ్య తో మాట్లాడటం చూసి తెలుసుకున్నాను కాబట్టి సరిపోయింది లేదంటే ఈ విషయం కూడా మాకు తెలిసేది కాదు అని జరిగిన విషయం చెప్పి బాధపడుతూ ….. భగవంతుని దయవల్ల ఇలాగే ఎంతో మందికి ధనవంతుడు పేద వారికి సహాయం చేయాలని కోరుకుంటున్నాము. అని అనుకొని అక్కడనుంచి వెళ్ళి పోతాడు.
ఆ విధంగా ఆ కుటుంబానికి తనవంతులు చేసిన సహాయం తో వాళ్లు కొన్ని రోజులు బతకడానికి వాళ్లు దారి చూపించిన వాళ్లు అవుతారు. ఇలాగే లేని వాళ్ళకి సహాయం చేసి ఆదుకో గలరని కోరుకుంటున్నాము.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *