పేదవారి ఆకలి కష్టాలు | Telugu Kathalu | Bedtime Stories | Panchatantra kathalu | Comedy Videos

కృష్ణాపురం అనే గ్రామంలో ఒక పెద్ద విలాస్ ఉండేది. దానికి యజమాని అయినా ఒక వ్యక్తి ఎప్పుడూ తన స్నేహితులు బంధువులతో అక్కడ పార్టీలు అని ఫంక్షన్లు అని అక్కడ ఎంతో విలాసంగా జరుపుతూ ఉంటారు. అయితే అక్కడ దగ్గరలో ఒక చిన్న గుడి ఉంటుంది ఆ గుడిసెలో పవిత్ర అనే ఆమెతో పాటు వాళ్ళు ఇద్దరు పిల్లలు బేబీ బాబి . వాళ్లది చాలా పేద కుటుంబం పని ఉన్నప్పుడు తల్లి పనికి వెళ్తే ఉంటుంది పని లేని సమయంలో ఖాళీగా ఉంటుంది ఆరోజు కుటుంబమంతా పస్తులు ఉండాల్సిందే . అలా కష్టాల్లోనే వాళ్ళ రోజులు గడుస్తూ ఉంటాయి ఒక రోజు తల్లి పిల్లలతో….. బేబీ బాబి మీరిద్దరూ ఇక్కడే ఉన్నాను అమ్మ నేను దొరుకుతుందేమో అని బయటకు వెళ్తున్నాను. డబ్బులు తీసుకొని మన కోసం తినడానికి తీసుకొస్తాను. అని చెప్పి బయటకు వెళ్తుంది తల్లి . బాబీ బేబీ ఇద్దరు కూడా ఇంట్లో ఉంటారు . అప్పటికి ఆ పిల్లలు కానీ తల్లి కానీ రెండు రోజుల నుంచి ఏమీ తినలేదు . తల్లి బయటికి వెళ్ళింది ఏదో ఒకటి కచ్చితంగా తీసుకు వస్తుంది అని ఆశతో పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. చాలా సమయం పడుతుంది తల్లి ఇంటికి తిరిగి వస్తుంది పిల్లలు ఇద్దరు ఆశగా తల్లి దగ్గరకు పరుగులు తీసి…. అమ్మ ఏమన్నది తీసుకు వచ్చావా.
అని జాలిగా అడుగుతారు తల్లి ఏడుస్తూ ఖాళీ చేతులు చూపిస్తుంది .
పిల్లలిద్దరూ దానిని చూసి చాలా బాధ పడతారు. ఆరోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు వాళ్ల పక్కన ఉన్న విలాస్ నుంచి గుమగుమలు వస్తూ ఉంటాయి. ఆ వాసన పీల్చుకొని తల్లి ఆ పిల్లలిద్దరూ చాలా ఆనందపడ్డారు . పిల్లలిద్దరూ తల్లి వైపు చూసి….. అమ్మ చాలా మంచి వాసన వస్తుంది. ఈ వాసన పీల్చుకొని మన కడుపు నింపుకోవక్క్చి అమ్మ ఖాళీగా అంటారు ఎందుకు తల్లి మరింతగా ఏడుస్తూ…. ఎందుకు మా జీవితాలు ఎలాగా చేసావు నా భర్త బ్రతికి ఉంటే మాకు ఈ కష్టం వచ్చేది కాదు. పనికి వెళ్లడానికి పనిలేదు. అడుక్కొని తిందాము అంటే మనసు ఒప్పుకోవడం లేదు . ఎందుకు మమ్మల్ని ఇలా చేశావు అంటూ ఏడుస్తూ చాలా బాధపడుతుంది.
ఆ పిల్లలిద్దరూ…. అమ్మ ఏడవకు అమ్మ అంటూ తల్లి కన్నీరు తుడుస్తారు.
ఆ తల్లి….. పిల్లలు మీరు ఇక్కడే ఉండండి నేను ఈ రోజు మీకోసం ఖచ్చితంగా భోజనం తీసుకు వస్తాను . అని అంటుంది ఎందుకు పిల్లలు సారి అంటారు ఆమె సరాసరి విలాస్ వెనుక భాగానికి వెళుతుంది అక్కడ వాళ్లు తిని మిగిలినది బయట పడేస్తూ ఉంటారు . తల్లి వాళ్లు తిని మిగిలిన మొత్తాన్ని పోగు చేసుకొని మొత్తం విస్తరిలో తీసుకొని చాలా సంతోష పడుతూ ఇంటికి వెళ్తుంది పిల్లలిద్దరూ దానిని చూసి మరింత సంతోషపడుతూ….. అమ్మ నువ్వు కూడా తిందువు రా అంటూ ముగ్గురు దారిని తింటారు. వాళ్ళ కడుపు నిండుతుంది పిల్లలు ….. అమ్మ ఈరోజు కడుపునిండా తిన్నావా అమ్మ రోజూ ఇలాగే ఉండక పోయినా కనీసం వారానికి ఒకసారి అయినా ఇలాగే ఉంటే చాలు అమ్మ. అని అంటారు అందుకు ఆమె….. కచ్చితంగా గా రోజు మన కడుపు నిండుతుంది బాబు .
అని సమాధానం చెబుతుంది అందుకు పిల్లలు మరింత సంతోషపడుతూ …. ఐ ….ఐతే మనకి ఆకలి బాధలు ఉండదు అనుకుంటా .
అని సంబర పడిపోతారు వాళ్ళిద్దరు కొంత సమయానికి ఆడుకొని అక్కడే విశ్రాంతి తీసుకుంటారు తల్లి… ఒక్కరోజైనా బిడ్డల కడుపు నింపిన అందుకు చాలా సంతోషం ఇక నేను ఎవరి కోసం ఆలోచించను. పని ఉన్నప్పుడు పనికి వెళ్తాను లేని సమయంలో ఆ విలాస్ దగ్గరికి వెళ్లి అక్కడ మిగిలిన ఆహారమైనా నా బిడ్డల కోసం తీసుకో వచ్చి.
నా ఇద్దరు బిడ్డల్ని కాపాడుకుంటాను.
తల్లిగా నేను చేయగలిగింది ఇదే అంటూ ఏడుస్తూ బాధపడుతుంది .
ఆ రోజు గడిచి పోతుంది ఆ మరుసటి రోజు కూడా అక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతుంది తల్లి మళ్ళీ అక్కడికి వెళ్లి పడేసిన భోజనం మొత్తం పోగు చేసుకొని ఇంటికి తిరిగి వస్తుంది అలా అక్కడ ప్రతి రోజు ఫంక్షన్ పార్టీలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆమె మిగిలిపోయిన వాటిని ఇంటికి తీసుకు వచ్చి ఆమె మరియు పిల్లల ఆకలి తీరుస్తుంది.
అలా రోజులు గడిచాయి కొన్ని రోజుల తర్వాత అక్కడ ఫంక్షన్ లో పార్టీలో జరగడం ఆగిపోతుంది . అలా మూడు రోజులు గడిచింది మూడు రోజుల నుంచి ఎటువంటి ఆహారం లేక పిల్లలు ఆకలితో అల్లాడి పోతున్నారు. ఆమె… ఏంటి ఇక్కడ ఏమి ఫంక్షను జరగడం లేదు . కొన్ని రోజుల నుంచి సంతోషంగా కడుపు నిండుతుంది అని అనుకున్నాను మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. అంటూ చాలా బాధపడుతుంది.
ఆరోజు కూడా గడిచిపోతుంది ఆ మరుసటి రోజు మళ్ళీ అక్కడ చిన్న ఫంక్షన్ జరుగుతుంది . అక్కడ పెద్దగా బయట పడేసింది ఏమీ లేదు ఆమెకు ఏం చేయాలో అర్థం కాదు ఎలా అయినా పిల్లలు ఆకలి తీర్చాలి అని చిన్నగా ఎవరికి తెలియకుండా లోపలికి వెళ్తుంది. అక్కడ ఉన్న చికెన్ లెగ్ పీస్ ఇల్లు తీసుకొని బయటకు పరిగెడుతుంది. దానిని చూసిన వాచ్మెన్….. పట్టుకోండి దొంగ దొంగ అంటూ వెంట పడతాడు. కొంత దూరం పరిగెత్తి ఆమెను పట్టుకుంటాడు.
ఆమె ఏడుస్తూ …. బాబాయ్ గారు నన్ను వదిలి పెట్టండి . నేను దొంగని కాదు అని అంటుంది.
అతను….దొంగ కాకపోతే ఎందుకు చేతిలో ఏంటది అంటూ బలవంతంగా తెరిచి చూసాడు. అన్నం చికెన్ ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు . ఆమె ఏడుస్తూ….. నా పిల్లలు ఆకలితో ఉన్నారు బాబోయ్ . ఏం చేయాలో అర్థం కాక దొంగతనం చేశారు అంటూ జరిగిన విషయం చెప్పింది. ఆ మాటలు విన్న అతను చాలా బాధపడుతూ… అమ్మ బాధపడకు ఇక్కడ ఎప్పుడు పని ఉంటుంది ఇక్కడికి వచ్చావంటే నెలకు 25 వేలు ఇస్తారు . నువ్వు నీ పిల్లలు సంతోషంగా ఉండొచ్చు అని అంటాడు అందుకు ఆమె సంతోషపడుతు సరే అని ఆయన కాళ్ళకు ముక్కుతుంది ఆ మరుసటి రోజు నుంచి. ఆమె పనికి వెళుతూ అక్కడ భోజనం తీసుకెళ్లి పిల్లలకు నెల జీతం వచ్చినప్పుడు సంతోషంగా గడుపుతూ ఉంటుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *