పేదవారి డబ్బుల చెట్టు Telugu Kathalu | Telugu Stories | Stories in Telugu| Panchatantra Kathalu

ఒక ఊరిలో సిరి అనే ఒక అమ్మాయి ఉండేది, తన తండ్రి చిన్నప్పుడే చనిపోవడం తో తల్లి అయిన రేవతి తో ఉండేది, వాళ్ళు చాలా పేదవాళ్ళు కావడం తో సిరి చదువుకోకుండా ఎదో ఒక పని చేసుకుంటూ ఉండేది, రేవతి ధనవంతుల ఇళ్లలో పాచి పని చేసుకుంటూ ఉండేది, సిరి కూడా అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకుని వచ్చి ఊళ్ళో అమ్ముతాహో డబ్బు సంపాదించేది, అలా ఉండగా ఒకేరోజు రేవతి సిరి దగ్గరికి వచ్చి

రేవతి : అమ్మ సిరి నా వల్ల నువ్వు కూడా కష్టాలు పడవలసి వస్తుంది, నా కడుపునా పుట్టడమే నువ్వు చేసిన తప్పు, నువ్వు ఎవరో ధనవంతుల కుటుంబం పుట్టి ఉంటె నీకు ఇలాంటి కష్టాలు పడేదానివి కావు తల్లి అని రేవతి ఏడుస్తూ ఉంటుంది.

సిరి : అమ్మ అలా అనకమ్మ నాకు నీతో ఉండడమే ఇష్టం, నేను రోజు పడే ఇబ్బంది కంటే ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలే నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాయి, నేను ఆనందంగా ఉండడం కోసం నువ్వు ఎన్నెన్ని కష్టాలు పడుతున్నావో నాకు తెలుసు, నీలా ప్రేమని పంచేవాళ్ళు ఎంతమంది ఉంటారమ్మ, నేను ఎప్పటికి నీకూతురిగానే పుట్టాలి అని సిరి కూడా బాధపడుతూ అంటుంది

అప్పుడు రేవతి సిరి ని దగ్గరికి తీసుకొని ఇలా అంటుంది

రేవతి : మన కష్టాలు ఎప్పటికి తీరుతాయో ఏమో తల్లి, ఇక నైనా ఆ దేవుడు మన మీద కనికరం చూపించి మన కష్టాలు తీర్చేస్తే బాగుంతుంది అని అంటుంది.

అలా రోజులు గడిచిపోతుంటాయి

రోజు రేవతి  ఇళ్లలో పాచి పనికి వెళ్లడం ఒక వేళా ఎప్పుడైనా ఇంటి వాళ్ళు అన్నమో లేక ఏదైనా పండుగల అప్పుడు ప్రసాదంలో ఇస్తే తీసుకొచ్చి సంతోషంగా సిరికి తినిపిస్తూ ఉండేది, సిరి కూడా రోజు క్రమం తప్పకుండా అడవికి వెళ్లి ఎడిపోయిన చెట్ల దుంగలు కొట్టుకొని ఊరిలోకి తీసుకొచ్చేది, అలా తీసుకొచ్చిన వాటిని ఊరిలో అమ్ముతుండేది, ఎప్పుడైనా అమ్మినప్పుడు కొంత డబ్బులు ఎక్కువ వస్తే ఎంతో సంతోషంగా వచ్చి రేవతికి ఇచ్చేది అలా వాళ్ళ రోజులు గడుస్తున్నాయి.

అలా ఉండగా ఎప్పటిలాగానే సిరి అడవికి కట్టెల కోసం గొడ్డలిపెట్టుకొని అడవిలోకి వెల్తూ ఉండగా ఆమెకి కొన్ని మాటలు వినిపిస్తున్నాయి.

సిరి : ఈ అడవిలో మాటలు ఎక్కడినుంచి  వస్తున్నాయబ్బా అని అనుకుంటూ ఒక చెట్టు చాటున దాక్కొని చూస్తూ ఉంటుంది.

అక్కడ కొందరు దొంగలు ఉంటారు, వాళ్ళను చూసి సిరి భయపడుతుంది కానీ అక్కడ వాళ్ళు ఏమి చేస్తున్నారు చూడాలని అక్కడే దాక్కొని చూస్తూ ఉంది,

దొంగలలో లీడర్ ఇలా అంటాడు

లీడర్ : అరేయ్ రమేష్, నువ్వు అడిగావు కదా మనం ఎందుకు ఇలా మన మకాం ఇక్కడికి మార్చాల్సి వచ్చిందని ఇప్పుడు చెబుతా విను, మనం మన డబ్బు దాచే చోటు పోలీస్ లకు తెలిసి పోయింది అప్పటి నుంచి వాళ్ళు మన మీద నిఘా పెట్టారు, ఒకవేళ మనం గనక దొరికిపోతే డబ్బు పోతుంది మనల్ని అరెస్ట్ చేస్తారు, ఇక మన బ్రతుకు జైలు పాలే అవుతుంది అని అంటాడు

రమేష్ : అవునా బాస్ సరే మన డబ్బులు ఎక్కడ సురక్షితంగా ఉంటాయో నాకు తెలుసు, నేను మీకు ఒక మంచి చోటు చెబుతాను మన డబ్బులన్నీ అక్కడే దాచేద్దాం అని అంటాడు.

లీడర్ : సరే రా చెప్పు అని అంటాడు

రమేష్ : బాస్ మనం డబ్బు దాచిన తరువాత మనంతట మనమే పోలీస్ లకి దొరికేలా ప్లాన్ వేద్దాం అప్పుడు వాళ్ళు మన దగ్గర డబ్బు ఉందని అరెస్ట్ చేయడానికి వస్తారు, అప్పుడు మన దగ్గర డబ్బు లేదని పోలీసులు వెళ్ళిపోతారు అని అంటాడు,

లీడర్ : శబ్బాష్ రా ఇక నువ్వు డబ్బులు దాచే పనిలో ఉండు పోలిసుల పని నేను చూసుకుంటాను అని అంటాడు

ఈ మాటలన్నీ విన్న సిరి ఊళ్లోకి వెళ్లి పోలీస్ లను తీసుకొస్తుంది, పోలీసులు వచ్చ్చే విషయం గమనించని దొంగలు ఇలా మాట్లాడుకుంటారు

రమేష్ : బాస్ మన డబ్బు దాదాపు అంతా దాచేసాను ఈ కొంత డబ్బే మిగిలిపోయింది, ఇంకొక పది నిమిషాలలో మన పని అయిపోతుంది అని అంటాడు

పోలీస్ : పది నిమిషాలలో కాదు మీ పని నా చేతుల్లో ఇప్పుడే అయిపోతుంది అని పిస్తోలు చూపిస్తాడు

దొంగలందరిని పట్టుకొని వాళ్ళది గ్గర డబ్బు కూడా స్వాధీనం చేసుకుంటాఋ పోలీస్ లు

సిరి దగ్గరికి పోలీస్ వచ్చి ఇలా అంటాడు

పోలీస్ : అమ్మ సిరి నువ్వు చిన్నపిల్లవే అయినప్పటికీ నువ్వు చాలా దైర్యవంతురాలివి ఇక్కడ జరుగుతున్నడి అన్యాయం అని తెలిసి నీ వంతుగా నువ్వు చేసిన పనికి చాలా సంతోషం నీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్న నన్ను అడుగు అని చెప్పి దొంగలను తీసుకొని వెళ్ళిపోతాడు

పోలీస్ లు వెళ్లిపోయిన తరువాత సిరి గొడ్డలి తీయసుకొని కట్టెలు కొట్టడానికి వెళ్తుంది

కొంత దూరం వెళ్ళాక ఆమెకి కొన్ని దుంగలు కనిపిస్తాయి వాటిని చూసి సిరి ఇలా అనుకుంటుంది

సిరి : అమ్మయ్య ఈరోజు ఎక్కువగా వెతికే పని లేకుండా ఒకే దగ్గర చాలా కట్టెలు ఉన్నాయి ఇవన్నీ ఈరోజు కొట్టుకొని వెళ్లి అమ్మగలిగితే చాలు చాలాడబ్బులు వస్తాయి అని అనుకుంటుంది

వెంటనే వెళ్లి ఒక దుంగని గొడ్డలితో కొట్టగానే అందులో నుంచి డబ్బులు బయటకు వస్తాయి

సిరి : ఆమ్మో ఇదంతా డబ్బా? అంటే ఆ దొంగలు డబ్బులు దాచిపెట్టిన రహస్య పరేషాం ఇదే కావొచ్చు, అని ఇంకో దుంగని నరకగానే దాంట్లో కూడా డబ్బులు ఉంటాయి

సిరి : అంటే ఇక్కడ ఉన్న అన్ని దుంగలలో డబ్బే ఉంది ఈ డబ్బులు నేను ఇంటికి తీసుకెళ్తాను కానీ అమ్మకి డబ్బులు దొరికినవి అంటే ఒప్పుకో ఎదో ఒకటి చేసి అమ్మని ఒప్పించాలి అని అనుకోని డబ్బునంతా ఇంటికి తీసుకెళ్తుంది

అంత డబ్బు ఒకేసారి చూసిన రేవతి ఆశ్చర్యంతో ఇలా అంటుంది

రేవతి : సిరి ఇంత డబ్బు నీదుకు ఎక్కడిది?

సిరి : అంటే అమ్మ అది ఆ నేను రోజు లాగే అడవిలో దుంగలని నరుకుతూ ఉండగా అనుకోకుండా వనదేవత ప్రత్యేక్షం అయ్యి 

పాపా సిరి నువ్వు ఇలా రోజు చెట్లు నరికి అడవి సంపదని నాశనం చేస్తున్నావు, నీ కుటుంబం కష్టాల్లో ఉండదని నాకు తెలుసు కానీ నువ్వు ఇలా చేయడం సరైంది కాదు, అందుకే నీ కష్టాలు తీరిపోయేంత డబ్బు నీకు ఇస్తున్నాను ఇంకోసారి చెట్లని నరక వద్దు అడవికి రావొద్దు అని చెప్పి ఈ డబ్బు నాకు ఇచ్చింది అని చెబుతుంది

సిరి మాటలు మమ్మిన రేవతి నిజంగానే వనదేవత చెట్టులో ప్రత్యక్షం అయ్యి డబ్బు ఇచ్చిందని అనుకుంటుంది, అలా డబ్బుతో రేవతి సిరి ఎంతో ఆనందంగా బ్రతుకుతూ ఉంటారు

Add a Comment

Your email address will not be published. Required fields are marked *