పేదవారి దీపావళి 2 Telugu Kathalu | Telugu Stories | Stories in Telugu | Horror Stories | fairy tales

ఆత్మపురం గ్రామంలో రాజు సుజాత అనే దంపతులు ఉండేవారు, వాళ్ళు చాలా పేదవారు, ఉన్న కొంచం పొలాలం లో వ్యవసాయం చేసుకుంటూ బ్రతికేవారు,  వాళ్లకి ఒక కొడుకు ఉండేవాడు అతనిపేరు పవన్, పవన్ ఎప్పుడూ కూడా తల్లి దండ్రుల మాట వినేవాడు కాదు, ఎప్పుడు ఇంట్లో పరిస్థితి కానీ తమ తల్లి దండ్రుల కష్టాన్ని కానీ ఎప్పుడూ అర్ధం చేసుకునేవాడు కాదు, తనకు కావలసిన దానికోసం మొండి పట్టు పట్టి సాదించుకునేవాడు. ఇలా ఉండగా సుజాత ఒకరోజు రాజు దగ్గరికి వచ్చి

సుజాత :- ఏమండి ఈ సరి పంట సరిగా పండడం లేదు కదా, పంట కొంత భాగం పురుగు పట్టింది, మనకి ఈ సరి కూడా పంట మీద లాభం వచ్చేలా లేదు కదండీ.

రాజు :- లాభం కాదు సుజాత కనీసం నష్టం రాకుండా ఉంటె చాలు, ప్రతి సంవత్సరం కొత్త అప్పులు తీసుకురాలేక నేను విసిగిపోతున్నాను, ఆ పంటను కాపాడుకోలేక ఇటు ఇంటిని చూసుకోలేక నేను చాలా అలసిపోతున్నాను, పంట ఎలాగూ పోయింది కనీసం ఇంట్లో అయినా సంతోషంగా ఉందా అంటే అది లేదు, మన కొడుకు మన మాట వినడమే మానేసాడు, వాడు అడిగింది ఇవ్వకపోతే ఎంత మొండిగా ప్రవర్తిస్తున్నాడో?

అని రాజు సుజాత మాట్లాడుకుంటూ ఉండగా పవన్ అక్కడికి వచ్చి

పవన్ :- నాన్న ఇంకా కొన్ని రోజ్జుల్లో దీపావళి పండగా రాబోతుంది కదా ఆ పండుగకు నాకు చాలా టపాసులు, కొత్తబట్టలు, ఇంకా చాలా ఆదుకునే బొమ్మలు కావలి

సుజాత :- నాన్న పవన్, నీకు కొత్త బట్టలు మొన్న పోయిన పండక్కి తీసుకున్నాం కదరా, మల్లి ఇప్ప్పుడు ఇంకా కొత్తబట్టలు ఏంటి? నీ దగ్గర ఇప్పటికే చాలా రక్కాలైన బొమ్మలు ఉన్నాయి, ఇంకా కొత్తగా మల్లి బొమ్మలు ఎందుకు వాటితో ఆడుకో, ఇప్పుడు అవన్నీ తీసుకురావాలంటే చాలా డబ్బులు అవుతాయి అన్ని డబ్బులు మన దగ్గర లేవు రా ఈ ఒక్క సారికి మాములుగా ఆడుకో అని అంటుంది సుజాత

సుజాత మాటలు పవన్ కి అసలు నచ్చలేదు

పవన్ :- చూడు అమ్మ మీరు తెస్తారా లేదా అని నేను అడగడం లేదు, అవన్నీ నాకు కావలి అని అంటున్న, మీరు దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో నాకు సంబంధం లేదు, నా తోటి పిల్లలందఱు ఎంచక్కా కొత్త బట్టలు వేసుకొని టపాసులు పేలుస్తుంటే నేను వాళ్ళని చూస్తూ ఉండాలా? మీరు ఎం చేస్తారు ఎలా చేస్తారు అనేది నాకు అవసరం లేదు, అవన్నీ నాకు కావలి అంతే అని అంటాడు

సుజాత పవన్ కి ఎదో చెప్పాలని చూస్తుండగా రాజు కలగజేసుకొని

రాజు :- సుజాత వద్దమ్మా, వాడు మనం వద్దంటే ఇంకొంచం ఎక్కువ చేస్తాడు, వాణ్ని వదిలేయ్ అని చెప్తాడు,

రాజు పవన్ హెప్పినవాణ్ణి తీఎసుకు రావడానికి ఎంతో ప్రయత్నిస్తాడు కానీ రాజుకు ఎవరూ కూడా డాబు సహాయం చేయక పోవడంతో అతని ఎంతో నిరాశ చెందుతాడు, ఇంట్లో దిగాలుగా కూర్చున్న రాజు దగ్గరికి సుజాత వచ్చి

సుజాత :- చూడండి మీరు ఇంత దిగాలుగా ఎందుకు ఉన్నారో నాకు తెలుసు, నా మందుల కోసం అని ఈ నెల కూడా కొన్ని డబ్బులు దాచిపెట్టాను, ఇవ్వి ఎక్కువ దబ్బులు కాకపోయినా వాడు చెప్పిన వాటిల్లో ఎదో ఒక్కటైనా వస్తుందేమో చూడండి అని తన మందుల కోసం అని దాచుకున్న డబ్బులు తీసి రాజుకు ఇచ్చేస్తుంది.

ఇంతలో దీపావళి రాణే వస్తుంది. పవన్ తాను చెప్పిన వస్తువులన్నీ అమ్మానాన్న తీసుకువచ్చి ఉంటారని ఎదురు చూస్తూ ఉంటాడు.

ఇంతలో రాజు సుజాత ఇచ్చిన డబ్బులతో కొన్ని టపాసులు పట్టుకొని వస్తాడు అది చూసిన పవన్

పవన్ :- నాన్న కేవలం టపాసులు పట్టుకు వస్తున్నవేంటి? బట్టలు బొమ్మలేవి? అవ్వి మిండీ తెచ్చి పెట్టావా లేక వెనుక ఎవరైనా తీసుకొస్తున్నారా? ఏంటి నాన్న ఏమి మాట్లాడడం లేదు అని అంటదు పవన్ చాలా ఆతృతగా

రాజు :- నాన్న ఎంత ప్రయత్నం చేసిన ఎక్కడ డబ్బులు దొరకలేదురా, ఇవ్వి కూడా అమ్మ తను మందులకు అని దాచుకున్న డబ్బులతో తెచ్చాను ఈ సారి డబ్బులు రాగానే మంచి మంచి బొమ్మలు చాలా బట్టలు కొనిస్తాను, ఈరోజు దీపావళి పండగ కదా ఈ టపాసులు కాల్చుకో అని టపాసులు పవన్కి ఇస్తాడు రాజు

పవన్ :- నువ్వు ఎన్నైనా చెప్తావు నాన్న, నీదేం పోతుంది, నా స్నేహితులు ఒక్కొకలు కొత్త కొత్త బట్టలు వేసుకొని టపాసులు రాత్రంతా కాలుస్తూనే ఉంటారు, ఇప్పుడు నేను ఇలా పాత బట్టలతో పండుగ చేసుకుంటే నాకు ఎంత అవమానంగా ఉంటుందో మీకు తెలియదు, ఎప్పుడు నేనే మిమ్మల్ని అర్ధం చేసుకుంటూ ఉండాలి, కానీ న్నా బాధ మీరు ఎప్పుడు అర్ధం చేసుకోరు, అని ఏడుస్తూ మాట్లాడుతూ రాజు తీసుకోసిన టపాసుల్ని కోపంతో బయటకు విసిరేస్తాడు పవన్

పవన్ :- నేను అడిగిన వాటిల్లో ఏదీ తీసుకు రాకుండా ఈ కొన్ని టపాసులు తీసుకొచ్చి పైగా నాకు ఎదో చెప్పాలని చూస్తున్నావా నాన్న, నాకు ఈ టపాసులు వద్దు ఇంకా చాలా కావాలి, ఇంకొక గంట టైం ఇస్తున్నాను మీకు ఆ గంటలో మీరు నేను చెప్పినవన్నీ తీసుకురాకుంటే నా తల్లి దండ్రులు లేరని నేను ఎక్కడికో వెళ్ళిపోతాను అని అంటాడు.

ఆ మాటలకు రాజు సుజాత ఎంతో బాధ పడతారు

సుజాత :- మీరేం బాధపడకండి వాడు చిన్న పిల్లవాడు, తెలిసి తెలియక ఎదో అన్నాడు లెండి అన్నంత మాత్రాన ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాడా? వాడి కోపం తగ్గగానే మల్లి మామూలు అయిపోతాడు లెండి అని రాజుకు నచ చెబుతుంది సుజాత

ఇంతలో గంట గడిచ్చిపోతుంది పవన్ కి తల్లిదండ్రుల మీద చాలా కోపం వస్తుంది.

వెంటనే రాజు ఇంట్లోనుండి వెళ్ళిపోతాడు

పవన్ ఇంట్లో నుండి వెళ్లి పోయాడని కొంత సేపటి తరువాత గమనించిన రాజు పవన్ కోసం ఊరంతా వెతుకుతుంటారు కానీ పవన్ ఎక్కడ కనిపించలేదు, ఊరంతా వెతికి వెతికి తిరిగి ఇంటికి వస్తాడు రాజు

సుజాత :- అయ్యో ఎంత పని జరిఇగిపోయిందండీ ఇలా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు, ఉన్న ఒక్కగానొక్క కొడుకు వాడు కోప్పడా చిరాకు పడినా మన ముందు ఉంటె అది మనకు సంతోషం వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నదో ఎం చేస్తున్నాడో ఏమి తెలియదు, అని ఏడుస్తూ ఉంటుంది సుజాత

రాజు :- ఎం చేస్తాం సుజాత మన కర్మ ఇలానే ఉంది, వాడు ఇలా ఎందుకు చేసాడో అర్ధం కావడం లేదు, కనీసం చెప్పినప్పవుడైనా మనం వాడికి కనిపెట్టుకొని ఉండాల్సిందేమో, ఇప్పుడు వాడు దొరుకుతాడేమో అని వెతకడం, లేదా వాడంతట వాడే వస్తాడని ఎదురు చూడడం తప్ప మనం చేయగలిగినది ఏమి లేదు, అని చెబుతో బాధపడతాడు రాజు

పవన్ ఎప్పటికైనా ఇంటికి తిరిగి వస్తాడని, వాళ అమ్మానాన్నలని అర్ధం చేసుకుని వాళ్ళు  చెప్పిన మాట విని అందరు కలిసి ఆనందంగా బ్రతుకుతారని మనం కూడా ఆశిద్దాము

Add a Comment

Your email address will not be published. Required fields are marked *