పేదవారి సబ్బుల పంట | Telugu Kathalu | Telugu Stories | Stories in Telugu | Moral Stories

రాజేంద్రపురం అనే గ్రామానికి కొత్తగా వెళ్ళాడు మహేష్,  అక్కడ అతనికి ఒక విషయం ఎంతో ఆశ్యర్యాన్ని కలిగిస్తుంది, అదేంటంటే అక్కడ  కొంతమంది ప్రజలు పొలం లో ఏపుగా పెరిగిన చెట్లకు పండిన సబ్బులని తెంపుకొని వెళ్తుంటారు, ఆ విషయం మహేష్ కి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

మహేష్ : అరే ఎక్కడైనా చెట్లకి పండ్లు, పువ్వులు పెరుగుతాయి కానీ విచిత్రంగా సబ్బులు పండడం ఏంటి అసలు ఏమి జరిగిందో ఎవరినైనా అడిగి తెలుసుకోవాలి  అని అనుకోని ఊరిలో ఎవరినైనా అడగ్గలని బయలుదేరుతాడు.

ఇంతలో రాజయ్య అనే ఒక వ్యక్తి బుట్టలో సబ్బులు పెట్టుకొని వెళ్తుంటాడు.

మహేష్ : ఇదిగో పెద్దాయన ఎక్కడికి వెళ్తున్నావు, నీతో కొంచం మాట్లాడాలి అని అంటాడు

రాజయ్య : ఇదిగో చూడయ్యా నేను మా ఊరి పొలంలో పండిన సబ్బులని పట్టణం లో అమ్మడానికి తీసుకెళ్తున్నాను, ఇవ్వి అమ్మినంకా వచ్చి తీరిగ్గా నీతో మాట్లాడతా ఇప్పటికైతే నన్ను పోనియ్యయ్య అని అంటాడు

మహేష్ : నేను నీతో మాట్లాడాలి అనేది ఆ సబ్బుల పంట గురించే

రాజయ్య : ఆమ్మో ఈ పంట గురించా? అదొక పెద్ద కథ ఇప్పుడు ఎవ్వడు కానీ సాయంత్రం మీ ఇంటికి వచ్చి చెబుతా అని  చెప్తాడు,

మహేష్ : సరేలే ఎలాగూ సాయంత్రం చెబుతాను అన్నాడు కదా, సాయంత్రం వరకు చూద్దాం అని అనుకుని ఇంటికి వెళ్ళిపోతాడు

అదే ఊరిలో ఉంటున్న సిరి అనే ఒక అమ్మాయి ఊరిలో హడావిడిగా తిరుగుతూ కనిపిస్తుంది మహేష్ కి

మహేష్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి

మహేష్ : పాప ఎవరు నువ్వు? ఎందుకంత కంగారుగా తిరుగుతున్నావు? నీకు ఏమి కావలి అని అడుగుతాడు

సిరి : నా పేరు సిరి అంకుల్ నేను మా ఊరి తోటలు పండిన సబ్బులని ఒక తోపుడు బండి మీద తీసుకెళ్లి పట్టణంలో అమ్ముతూ ఉంటాను, ఇప్పుడు ఆ తోపుడు బండి కనపడడం లేదు, దానికొసమే వెతుకుతున్నాను, యిప్పుడు ఆ బండి లేకపోతే నేను సబ్బులు అమ్మలేను, అవి అమ్మకపోతే నాకు డబ్బులు రావ్వు, అని ఏడుస్తూ చెబుతుంది మహేష్ కి

మహేష్ : చూడమ్మ నేను నీ సబ్బులన్నీ అమ్మి పెడతాను, దాంతో పాటు నీకు కొంత డబ్బు కూడా ఇస్తాను కానీ దానికి బదులుగా నువ్వు నాకు ఒక సహాయం చేసి పెట్టాలి అని అడుగుతాడు.

సిరి : నిజంగా అమ్మి పెడతారా? సరే మీకు నా నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తాను, చెప్పని అని అంటుంది.

మహేష్ : సరే మీ ఊరిలో పొలం లో సబ్బులు పండుతున్నాయి కదా? సబ్బులు అలా పొలం లో పండడానికి కారణం ఏంటో చెబుతావా అని అడుగుతాడు.

సిరి : అంకుల్ మీకు సబ్బుల పంట గురించి చెప్పాలంటే మీకు ఒక నాలుగు సంవత్సరాల క్రితం ఏమి జరిగిందో చెప్పాలి ఏమి జరిగిందో చెబుతాను వినండి.

(flash back)

రమ్య : ఏమండి, మన ఊరిలో ఏ పంటలు సరిగా పండడం లేదు, ఎప్పుడు కరువుల్లోనే బ్రతుకుతున్నాం, మన ఊరు ఎలా బాగుపడుతుందండి, మన ఊరి బాగు కోసం మనం కూడా ఎదో రకంగా పాటు పడాలండి. ఏమి చెయ్యాలో ఆలోచించాలండి.

కృష్ణ : నేను దాని గురించే ఆలోచిస్తున్న రమ్య, ఊరు ఇలా కరువులో విలవిలలాడుతుంటే ఊరి పెద్దగా ఉన్న నేను ఏమి చేయలేక పోతున్ననని ఎంతో బాధపడుతున్నాను. ఎదో ఒకటి చేసి నేను ఊరి కరువు పోయేలా చేస్తాను, నువ్వు మన పాపని జాగ్రత్తగా చూసుకో నేను ఊఱ్ఱిలోకి వెళ్లి వస్తాను అని చెప్పి వెళ్తాడు

అలా కృష్ణ ఊరిలో వెళ్తుండగా రాజయ్య ఎదురవుతాడు,

రాజయ్య : అయ్యా మీ మీదనే భారమంతా వేసి బ్రతుకుతున్నాము, ఈ కరువు మహమ్మారి నుంచి ఎలా తప్పించుకోవాలో ఉపాయం చెప్పండయ్యా, అని అడుగుతాడు

కృష్ణ : రాజయ్య నేను దానిగురించే ఆలోచిస్తున్నాను, ఊరికి మంచి జరుగుతుంది అంటే నా ప్రాణాలనైనా ఫణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను, మీరేం కంగారు పడకండి వీలున్నంత తొందరగా ఎదో ఒకటి చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు అక్కడనుండి.

అలా వెళ్లిన కృష్ణ కి ఒక దేవుడి విగ్రహం కనిపిస్తుంది, ఆ విగ్రహం దగ్గరికి వెళ్లి

కృష్ణ : స్వామి ఏంటయ్యా మా ఊరికి ఈ పరిస్థితి? ఇంతకు పూర్వం మా జిల్లాలో సగానికి ఎక్కువ సబ్బులు మా ఊరిలో తయారు చేసినవే పోయేవి, కానీ ఇప్పుడు ఈ కరువు వల్ల ప్రజలు బ్రతకడమే చాలా కష్టాంగా ఉంది, అని అడుగుతుండగా ఒక స్వామిజి అక్కడకు వస్తాడు,

స్వమిజీ : నాయ ఎవరు నువ్వు? నేను నా పూజ కోసం పెట్టుకున్న దేవుడి విగ్రహం దగ్గర నువ్వు ఎదో కోరిక కోరుకుంటున్నావు, నీ కొరిక ఏంటో నాకు చెప్పు నేను తీర్చగలనెమో చూస్తాను, అని అంటాడు

కృష్ణ ఊరి పరిస్థితి గురించి మొత్తం స్వామిజి కి వివరిస్తాడు,

స్వామిజి : ఊరి కోసం నువ్వు ఆలోచిస్తున్న విధానం నాకు ఎంతో నచ్చింది, ఊరి కరువు వాతావరణ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. దానికి నేను ఏమి చేయలేను కానీ ఒక వరమైతే ఇవ్వగలను, మీరు ఇంతకు పూర్వం సబ్బుల తయారీ మీద ఆధార పది బ్రతికే వారు అని చెప్పినావు కదా, ఇప్పుడు నువ్వు కోరుకున్న పొలం లో చెట్లకి సబ్బులు పండుతాయి, ఆ సబ్బులనే అమ్ముకుని ఊరి ప్రజలందరూ బ్రతక వచ్చు.. అని చెప్పి స్వామిజి మాయమవుతాడు.

కృష్ణ ఊరి మధ్యలో ఉన్న ఒక పొలం లోకి వెళ్లి ఈ పొలం లోకి కావాలని కోరుకుంటాడు.

present

సిరి : అలా మా నాన్నకి స్వమిజీ ఇచ్చిన వరం వల్ల ఈ సబ్బుల పొలం వచ్చింది అంకుల్

మహేష్ : అవునా ఇప్పుడు మీ అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారమ్మా ? అని అడుగుతాడు

సిరి : ఒక సంవత్సరం క్రిందనే మా అమ్మ నాన్న చనిపోయారు, అప్పటి నుండి నేను ఇలా సబ్బులు అమ్ముకొని బ్రతుకుతున్నాను, అని చెబుతుంది,

ఆ మాటలకు మహేష్ ఎంతో బాధ పడతాడు.

మహేష్ : అమ్మ సిరి నేను ఒంటరి వాడినే నువ్వు నేను కలిసి ఉందాం, నిన్ను నా పాప లా చూసుకుంటాను చేబుతాడు.

అలా ఆరోజు మహేష్ కూడా పొలం లోకి వెళ్లి చెట్లకు పండిన సబ్బులని తెంపుకొని పట్టణం వెళ్లి అమ్మి డబ్బులు సంపాదిస్తుంటాడు, అలా వచ్చిన డబ్బులతో సిరి ని ఒక మంచి స్కూల్ లో చేర్పించి చదివిస్తుంటాడు.

ఆలా ఉండగా ఒకేరోజు సిరి మహేష్ దగ్గరకు వచ్చి

సిరి : అంకుల్, ఆ దేవుడు మా అమ్మానాన్నలని నా దగ్గర నుచ్చి దూరం చేసినందుకు మిమ్మల్ని నా దగ్గరికి పంపించి ఉంటాడు,  మీరు నాకు దేవుడు ఇచ్చిన వరం అనుకుంటా అంకుల్ అని అంటుంది ఎంతో ఆనందంగా

మహేష్ : అవునమ్మా నాకు ఆ దేవుడు కుటుంబాన్ని దూరం చేసి అన్యాయం చేసాడు అనుకున్నాను కానీ నీలా ఒక కూతురును ఇచ్చి నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది అని చెబుతాడు.

అలా మహేష్ సిరి ఉన్నంతలో సంతోషంగా బ్రతుకుతుంటారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *