పేదవాళ్ల అదృష్టం | Telugu kathalu | Telugu Stories | Telugu Moral Stories | Kattapa kathalu

కుమ్మరి పల్లి అనే గ్రామంలో శారద అనే ఒక ఆమె ఉండేది. ఆమె తన మనవరాలు అయిన రాదతో నివసిస్తూ ఉండేది. శారదా ప్రతిరోజూ ఇళ్ళల్లో పని చేసుకొని . వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని గడిపేది . రాధా చిన్న పిల్ల కాబట్టి. ఇంటిదగ్గర ఆడుకుంటూ ఉండేది.
అలా వాళ్ళ జీవితం సాగిపోతుంది అనుకోకుండా శారద ఆరోగ్యం పాడై పోయిన సారి పడుతుంది శారద దాన్ని చూసిన మనవరాలు చాలా ఏడుస్తూ….. నాయనమ్మ నీకు ఏమైంది నిన్ను చూస్తుంటే నాకు చాలా ఏడుపొస్తుంది. అలాగే నాకు భయంగా కూడా ఉంది.
ఆ మాటలు విన్న శారద… ఎందుకమ్మా భయపడుతున్నావు ఇప్పుడు నాకు ఏం జరిగింది రెండు రోజుల్లోనే నయం అవుతుంది నువ్వేమీ కంగారు పడకు.
భయపడకు.
ఆ మాటలు విన్న రాధా…. భయపడకుండా ఎలా ఉంటాం నాయనమ్మ నువ్వు కూడా మా అమ్మ నాన్న లాగా నాకు చెప్పకుండా నన్ను వదిలి పెట్టి వెళ్ళిపోతావు అని భయంగా ఉంది అంటూ ఏడుస్తుంది.
ఆ మాటలు విన్న ఆమె చాలా బాధపడుతుంది రోజులు గడిచాయి ఆమె ఆరోగ్యం మరింత చెడి పోతుంది ఇంట్లో తినడానికి తిండి ఉండదు డబ్బులు ఉండవు.
దానిని అంతా చూస్తున్నా పాపకి ఏం చేయాలో అర్థం కాదు.
ఆమె ఏడుస్తూ వంటరిగా బయట కూర్చొని…. భగవంతుడా ఇప్పుడు నేను ఏం మా నాయనమ్మ పరిస్థితి అస్సలు బాలేదు మా ఇంట్లో ఒక రూపాయి లేదు. డబ్బులు కావాలి మా నాయనమ్మ నేను హాస్పిటల్లో చూపించుకోవాలి లేకపోతే మా నాయనమ్మ కి ఏమన్నా అవుతుందేమో అంటూ ఏడుస్తుంది.
అప్పుడే ఒక వ్యక్తి వలలో చేపలు తీసుకొని అటుగా వెళుతూ ఉంటాడు.
దాన్ని చూసిన పాప…. నేను కూడా చేపలు పడతాను మా ఇంట్లో మా నాన్న ఉంచిన వల ఉండాలి. దానితో నేను చేపలు పట్టి వాటిని అమ్మి డబ్బులు సంపాదిస్తాను.
అని అనుకోని ఇల్లు మొత్తం వెతకడం మొదలు పెడుతుంది. అప్పుడే ఆమెకు ఒక చోట వల కనబడుతుంది పాప వెంటనే వలను తీసుకొని. చాలా సంతోష పడుతూ నది దగ్గరికి బయలు దేరుతుంది.
ఇక అక్కడ అనే వల వేసి చేపలు కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. కానీ ఆ వలలో ఒక చేప కూడా పడదు. ఆమె ఎండలో అలాగే ఎంతో బాధపడుతూ చేపల కోసం ఎదురుచూస్తూ ఉంటుంది అప్పుడే ఒక చేపలు పట్టే వ్యక్తి అక్కడికి వస్తాడు.
అతను ఆ పాపను చూసి…. ఎవరు పాప నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు.
పాప చాలా భయపడుతూ జరిగే విషయం చెబుతోంది.
ఆ మాటలు విన్న అతడు చాలా పెద్దగా నవ్వుతూ…. ఏంటి నువ్వు మాట్లాడేది అసలు మాలాంటి పెద్దవాళ్ళకి చేపలు పడడమే అంతంత మాత్రంగా ఉంది అయినా ఒకవేళ చేపలు పడిన అంతా బరువుని నువ్వు ఒక్కదానివే . ఎలా లాగలవు చెప్పు.
అందుకు ఆమె ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండి పోతుంది .
అతను ఇక ఆ పాపతో ఏం మాట్లాడకుండా పొలం విసురుతాడు కొంత సమయానికి అతని వలలో చేపలు చుకిక్కుంటాయి..
వెంటనే అతను బలంగా దాన్ని లాగి చేపలను బయటకు తీసుకు వస్తాడు
పాప చేపలు చూసి చాలా ఆశ్చర్య పోతుంది.
పాప అలాగే అతని వైపు జాలిగా చూడడంతో అతని కి జాలి కలిగి … ఇదిగో పాపా కొన్ని చేపలు నువ్వు తీసుకో . వాడి ఆమ్ముకుని డబ్బు సంపాదించుకో అని జాలి పడి చేపలు ఇచ్చే అక్కడనుంచి వెళ్ళి పోతాడు పాపా చాల సంతోషపడుతూ అవ్వాలని తీసేసి చేపలు వాలని తీసుకుని అక్కడి నుంచి
మార్కెట్ కి వెళ్తుంది అక్కడ ఒక చోట చేపలు నుంచి పంపడం మొదలు పెడుతుంది.
చాలామంది పాప దగ్గరికి వస్తారు కానీ పాప చెప్పే బేరం వాళ్ళకి నచ్చదు.
ఆమె తన మనసులో…. అయ్యో వచ్చిన వాళ్లు చూసి అలా వెళ్ళిపోతున్నారు నాకు ఎందుకు అర్థం కావట్లేదు బహుశా నేను ఎక్కువ రేటు చెబుతున్నాన. ఈసారి వచ్చే వ్యక్తికి ఎంత అడిగితే అంత ఇచ్చేస్తాను ఇప్పుడు నాకు డబ్బులు చాలా అవసరం లేదంటే.
ఆ డబ్బులతో మందులు తీసుకెళ్ల పోతే మా నాయనమ్మ బ్రతక దు అని అంటూ చాలా బాధ పడుతూ. ఉంటుంది అప్పుడే ఒక ఆమె అక్కడికి వచ్చి….. పాప ఈ చేపలు కేజీ ఎంతకి ఇస్తున్నావు.
పాపకు ఏం చెప్పాలో అర్థంకాక మీరు ఎంతో కొంత యిచ్చి తీసుకు వెళ్ళండి అని అంటుంది ఆమె రెండు చేపలు తీసుకొని 200 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోతుంది.. పాప వాటిని తీసుకొని అక్కడి నుంచి ఇంటికి
ఇంటికి వెళ్లడానికి సిద్ధమవుతోంది ఇక అలా వెళుతూ ఉండే మార్గమధ్యలోనీ మందుల షాప్ లో మందులు తీసుకుంటుంది ఆ తర్వాత మార్కెట్ కి వెళ్తుంది . తన నాయనమ్మ ఆరోగ్యానికి కావలసిన పదార్థాలు .
తీసుకొని అక్కడనుంచి ఇంటికి వెళ్తుంది. ఇక ఆమె స్వయంగా వంట తయారు చేసి తన నాయనమ్మ కి అందిస్తుంది దాన్ని చూసి ఆమె చాలా సంతోషపడుతుంది పాప జరిగిన విషయం చెప్పి….. నాయనమ్మ అలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు కదా వాళ్లు అందరూ నాకు సహాయం చేస్తే . మన కుటుంబం బాగుపడుతుంది కదా అని జాలిగా అడుగుతుంది అతను…. తప్పమ్మ వాళ్లకి ఇలాంటి పరిస్థితి ఉందో మనకు తెలియదు కదా అలా చేశారు అంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది . ప్రతిసారీ వారికి సహాయం చేయాలి అంటే కష్టం. అయినా ఇప్పుడు నిన్ను చేపలు పట్టేమాని ఎవరు చెప్పారు.
అందుకు పాప…. ఎవరూ చెప్పడం ఏంటి నా అంతట నేనే వెళ్లాను మన పరిస్థితి బాగోలేదు కదా నాయనమ్మ నీకు ఆరోగ్యం బాగుంటే అన్ని నువ్వు చూసుకుంటావు.
ఇప్పుడు నీ ఆరోగ్యం బాగోలేదు కాబట్టే నేను చూసుకోవాలి కదా. ఉంటుంది ఆ మాటలకి ఆమె చాలా సంతోషపడుతుంది కానీ ఏం చేయాలో అర్థం కాక ఏం మాట్లాడకుండా ఉంటుంది.
ఆ రోజు గడిచి పోతుంది ఆ మరుసటిరోజు పాపా నది దగ్గరకు వల నీ తీసుకొని వెళుతుంది .
ఆమె వాళ్ళ విసురుతుంది చాలా సమయం తర్వాత ఆమె వల
బరువుగా తగలడంతో దానిని బయటకు గట్టిగా లాగుతుంది. కానీ చేపలకు బదులు ఆమెకు అక్కడ ఉన్న చెత్త అంతా బయటకు వస్తుంది.
దాన్ని చూసి ఆమె చాలా బాధగా ముఖం పెట్టి ఉంటుంది అప్పుడు వెనకాల ఉన్న ఒక ఒక అతను పెద్దగా నవ్వుతూ…హా హా హా చిన్న పిల్లలవి చిన్న పిల్లల్లాగా ఉండక . ఇవన్నీ నీకు ఎందుకు . ఇంటికి వెళ్ళక పాపం వలలో పడిన చేపలు చాలా వింతగా ఉన్నాయి నేను ఇంతవరకు అలాంటి చేపలు చూడలేదు.
అని ఎగతాళిగా మాట్లాడతాడు పాప అతని మాటలు పట్టించుకోకుండా . మళ్లీ వలన విసురుతుంది.
చాలా సమయం తర్వాత ఆ వ్యక్తి చేపల పట్టుకొని అక్కడనుంచి వెళ్ళి పోతాడు.
పాప మాత్రం అక్కడే ఉండి. ….. మొన్న వచ్చిన ఒక అంకుల్ చాలా మంచివాడు.
అవును చేపలు పడితే కొన్ని నాకు ఇచ్చాడు .
అలాంటి మంచి వ్యక్తులు మళ్ళీ ఎప్పుడు కనబడతారు ఏమో అని అనుకొని బాధపడుతూ ఉంటుంది అప్పుడే
ఆమె వలలో చేపలు పడతాయి.
ఆమె వాటిని బయటికి లాగి చాలా సంతోష పడుతూ…… చాలా కృతజ్ఞతలు భగవంతుడా . నువ్వు నాకు సహాయం చేశావు అంటూ చాలా సంతోష పడతూ వాటిని అమ్మడానికి వెళుతుంది.
ఆమె మార్కెట్కు వెళ్ళేటప్పటికి మార్కెట్ అంతా మూత వేసి ఉంటుంది ఎవరు కూడా ఉండరు. ఆమె చాలా బాధ పడుతూ తన మనసులో…. మార్కెట్ టైం అయిపోయినట్టుంది. అబ్బా అనీ బాధపడుతూ ఆ చేపలు తీసుకొని ఇంటికి వెళుతూ ఉంటుంది అప్పుడే ఒక బిచ్చగాడు…. అమ్మ తల్లి తిండి తిని రెండు రోజులు అవుతుంది అమ్మ ఏమన్నా ఉంటే నాకు బిక్షం వెయ్యి తల్లి.
అని అడుగుతాడు ఆ మాటలు విన్న పాపా…. తాత నా దగ్గర ఈ చేపలు తప్ప బిక్షం చేయడానికి ఏమీ లేవు.
ఈ చేపలు తీసుకోండి.
అతను…. వాటిని తీసుకొని ఏం చేయాలి పాపా. పాప…. పాప వీటితో నువ్వు కూర తయారు చేసుకోవచ్చు.
అతను పెద్దగా నవ్వి….. కూర తయారు చేసుకోవడానికి నాకు ఇల్లు వాకిలి నా వాళ్ళు అంటూ ఎవరూ లేరు.
పాపా…. అయ్యో తాత నీకు ఎవరూ లేరా అయితే మా ఇంటికి పద నీకు వీటితో కూర చేసి అన్నం పెడతాను.
అని అంటుంది అతను….. మరి ఏం పర్వాలేదు లే తల్లి. నువ్వు ఈసారి ఎప్పుడన్నా వచ్చేటప్పుడు నాకోసం ఏదైనా తీసుకొని రా అని అంటాడు అందుకు ఆమె…. తాత మాదే చాలా పేద కుటుంబం మరి నీకోసం నేను తీసుకు రావాలి అందుకే మీరు మా ఇంటికి రా అని నీకు నేను వీటితో భోజనం తయారు చేసి పెడతాను. అంటుంది.
అతను ఆ చేపను తీసుకొని …. పాపా ఇప్పుడు నీ ఇస్తున్న కదా చేపలు . వీటిని మీ ఇంటికి తీసుకు వెళ్ళు ఆ తర్వాత నువ్వే నన్ను మళ్లీ వెతుక్కుంటూ వచ్చి నేను అడిగింది ఇస్తాఉ. అని చెప్పి ఆమెకు తిరిగి చేపలు ఇస్తాడు. తాత ఏం చెప్పాడో ఆ పాప కి ఏమీ అర్థం కాదు … ఆమె ఆశ్చర్యంగా నాకు ఏమీ అర్థం కాలేదు తాత . సరే నేను వెళ్తాను తాత మా నాయనమ్మ నా కోసం ఎదురు చూస్తుంది . ఒకవేళ ఈ సారి నువ్వు కనపడితే నీకు తప్పకుండా సహాయం చేస్తాను తాతా అని చెప్పి.ఇక పాప ఆ చేపలు తీసుకొని ఇంటికి వెళ్తుంది. అక్కడ చేపలతో కూర తయారు చేయడం కోసం . వాటిని కోస్తుంది . అలా కోసిన వెంటనే వాటి నుంచి వజ్రాలు వస్తాయి. వాటిని చూసి ఆమె చాలా ఆశ్చర్య పోయి….. నాయనమ్మ ఇవి చూడు అంటూ ఆమె దగ్గరికి తీసుకు వెళుతుంది .
ఆమె వాటిని చూసి …. అమ్మ ఈ వజ్రాల అమ్మ ఇవి ఎక్కడినుంచి వచ్చాయి .
అప్పుడు పాప తాత చెప్పిన మాటలు గురించి
మొత్తం పూర్తిగా వివరిస్తుంది. ఆమె…. అమ్మ రాధ ఆయన ఎవరో కాదు ఆ భగవంతుడే అతని రూపంలో వచ్చి సహాయం చేశాడు.
మన కష్టాలు తీర్చాడు అంటూ చాలా సంతోషపడుతుంది . అప్పుడు పాప అతన్ని వెతుక్కుంటూ వెళ్తుంది అక్కడ ఎవరూ కనపడరు. ఒక పాప అక్కడి నుంచి ఇంటికి వెళ్తుంది ఇక వాళ్ళు కొన్ని రోజులకి
ఆ వజ్రాలతో చాలా ధనవంతులవుతారు అప్పటినుంచి పాపా వాళ్ళ నాయనమ్మ కనపడిన ప్రతి బిచ్చగాడికి సహాయం చేస్తూ సంతోషంగా జీవిస్తారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *