పేదవాళ్ల అదృష్టం | Telugu Stories | Telugu Fairy Tales | Telugu Kathalu | Kattapa Kathalu
శివ ఒక మత్యకారుడు, చేపలు పట్టుకొచ్చి ఊరిలో అమ్మడం అతని జీవన విధానం, అతనికి ఒక భార్య కావేరి, కూతురు విద్య, రోజు చెరువుకు వెళ్ళి చేపలు తీసుకొని వచ్చి కావేరి ఇచ్చేవాడు శివ, కావేరి వాటిని ఒక బుట్టలో పెట్టుకొని ఊరంతా తిరుగుతూ చేపలమ్మ చేపలు తాజా తాజా చేపలు అని అరుస్తూ అమ్ముతూ ఉండేది, అలా వాళ్ళ రోజులు గడుస్తూ ఉంటాయి.
విద్య : అమ్మ నాన్న రోజులు చేపలు పట్టుకొని వస్తూ ఉన్నాడు, నువ్వేమో వాటిని అమ్మడానికి వెల్తూ ఉన్నావు, ఇద్దఱు చెరొక పని చేస్తూ ఉన్నారు, నాకు మాత్రం ఏ పని లేదు, కనీసం బడి కూడా లేదు నాకు ఇంటి దగ్గర ఉంటె చాలా విసుగ్గా ఉందమ్మా నేను పోదునా నాన్నతో వెళ్లి మళ్ళీ నీతో వస్తాను ఎంచక్కా ఊరంతా తిరగవచ్చు, నేను వస్తానమ్మా అని మారం చేస్తూ ఉంటుంది విద్య
విద్య తల్లి మాట వినకుండా మారం చేయడం చూసిన శివ విధ్య దగ్గరికి వచ్చి
శివ : అమ్మ విద్య నువ్వు చిన్నపిల్లవి, మాకంటే కుటుంబ బాధ్యతలు ఉన్నాయి కాబ్బట్టి ఇవన్నీ మాకు తప్పవు, నువ్వు చక్కగా చదువుకుంటూ తోటి పిల్లలతో ఆడుకోవచ్చు కదా తల్లి, ఇవన్నీ నీకెందుకమ్మా అని అంతో మృదువుగా చెప్తాడు శివ
విద్య : నాన్న మీరు నా దగ్గర లేకుంటే నేనూ ఎలా సంతోషంగా ఉండగలను, మీరు ఎక్కడ ఉంటె అక్కడే నా సంతోషం అని అంటుంది.
విద్య మాటల కి శివ కళ్ళు చెమ్మగిల్లాయి.
శివ : తల్లి ఒక పని చేద్దాం, నేను రోజు పొద్దునే చెరువు దగ్గరికి వెళ్తాను కూడా నువ్వు కూడా నాతో పాటు రా, వచ్చి చెరువు ఒడ్డున కూర్చొని నేను చేపలు ఎలా పడుతున్నానో చూడు, అమ్మ ఎండకు తిరుగుతూ ఉంటుంది కదా తల్లి నువ్వు అంత ఎండలో వద్దులే, నాతో పాటు రా అని అంటాడు
విద్య కూడా సరే అని చెప్పి వెళ్ళిపోతుంది
మర్నాడు ఉదయం శివ మరియు విద్య కలిసి చేపలు పట్టడానికి చెరువుకు వెళ్తారు, శివ చేపలు పత్తియాన్ తరువాత ఇద్దరు కలిసి ఇంటికి వేంచేస్తారు.
చెరువు దగ్గరికి పోయినందుకు విద్య చాలా సంతోషంగా ఉంటుంది.
అలా రోజు చేపలు పట్టడానికి శివ విద్య కలిసి పోతూ ఉంటారు అలా కొద్దీ రోజులు గడిచిపోతాయి, అలా ఒకరోజు శివ వేరే ఊరిలో పని ఉంది వెళ్తాడు, అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదం లో శివ చనిపోతాడు.
తరువాత జరగాల్సిన కార్యక్రమాలన్నీ కావేరి జరిస్తుంది.
ఒకరోజు విద్య కావేరి దగ్గరికి వచ్చి
విద్య : అమ్మ ఇన్నిరోజులు నాన్న ఉన్నపుడు ఎప్పుడు నాన్నని ఎదో ఒకటి అడిగి విసిగిస్తుండేదానిని ఇప్పుడు కనీసం మాట్లాడాలన్నా కూడా నాన్న లేదు అమ్మ, ఇక నాన్న ఎప్పటికి తిరిగి రాడా అమ్మ అని అడుగుతుంది ఏడుస్తూ
కావేరి : ఏడువకు తల్లి, దేవుడి లాంటి నాన్న చనిపోయాడు, ఇప్పుడు మనం దేవుడి మీదే భారం వేసి బ్రతకాల్సిందే, నాన్న చనిపోయాడని మనం కూడా పోలేము కదా తల్లి, బ్రతికి ఉండాలంటే కడుపు నింపుకోవాలి కడుపు నింపుకోవడం కోసం ఎదో ఒకటి చేసి డబ్బులు సంపాదించుకోవాలి అని విద్యకి ధైరం చెబుతుంది తల్లి.
విద్య : అమ్మ డబ్బులు సంపాదించడానికి నా దగ్గర ఓక్ ఉపాయము ఇది చెప్పాలా?
కావేరి : నువ్వు డబ్బులు సంపాదించడానికి ఉపాయం ఆలోచించావా? నీ చిన్ని మెదడుకి ఏ ఉపాయం వచ్చిందో చెప్పు తల్లి అని అంటుంది
విద్య : అమ్మ నేను రోజు నాన్నతో చేపలు పట్టడానికి చెరువుకు వెళ్లేదాన్ని కదా, అక్కడ చేపలు ఎలా పెట్టాలో నేను నేర్చుకున్నాను నాకు చేపలు పట్టడం వచ్చు అమ్మ అని అంటుంది
కావేరి : చేపలు పట్టడం అంత తేలికైన విస్షయం కాదు తల్లి నా మాట విని ఆ ఆలోచన మానుకో నేను ఎదో ఒకటి చేసి డబ్బులు సంపాదిస్తాను అని అంటుంది కావేరి
విద్య : అమ్మ నాకు చేపలు పట్టడం వచ్చు అంటే నువ్వు నమ్మడం లేదు కదా, నేను రేపు వెళ్లి చేపలు పట్టుకు వస్తాను ఒకేవేళ ఆకు చేపలు పట్టడం నిజంగానే రానట్టయిది నా అంతటా నేనే మానుకుంటాను అని అంటుంది
కావేరి తన మొండి తనాన్ని కాదనలేక ఒప్పుకుంటుంది
తెల్లారి చేపలు పట్టడానికి వెళ్లిన విద్య చాలా చేపలు పట్టుకు వస్తుంది,
విద్య : అమ్మ చాలా చేపలు కాకపోయినా నాకు చేతనయినాన్నై పట్టాను అమ్మ అని చెబుతుంది.
కావేరి : అమ్మ విద్య ఈ కొన్ని చేపలను అమ్మితే మనకు ఏ మాత్రం డబ్బులు కూడా రావు, మనం ఈ చేపలతో డబ్బులు సంపాదించాలంటే మన అందరి కంటే మనం ఎదో ఒకటి కొత్తగా చేయాలి అని అంటుంది. ఆలోచించగా కావేరి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే విద్య దగ్గరికి వచ్చి
కావేరి : అమ్మ విద్య నువ్వు నిన్న లాగానే చేపలు పట్టుకొని రా, అందరు చేపలు అలాగే తీసుకెళ్లి అమ్ముతున్నటారు కదా, చాలా మంది వాటిని శుభ్రపరుచుకోలేని వారు, మన దగ్గర కొనకుండా పట్నం వెళ్లి శుభ్రపరిచి చేపలను తెచ్చుకుంటున్నారు, మనం ఇక్కడ ఉంది చేపలను శుభ్రపరుచుకోలేక తినకుండా ఉండేవాలనికి శుభ్రరపరిచి అమ్ముదాం. అప్పుడు మన దగ్గర చాలా మంది కొనుక్కుంటారు అని అంటుంది.
ఆరోజు నుంచి విద్య పొద్దునే చెరువుకు వెళ్లి చేపలు పట్టుకొని రాగానే కావేరి వాటిని తీసుకొచ్చి ఇంట్లో కూర్చుని ఒక మొద్దు మీద చేపలను పెట్టి కూర వండుకోవడానికి వీలుగా శుభ్రపరిచి ముక్కలు చేసేది, అలా ముక్కలు చేసిన చేపలను ఊరిలోకి తీసుకెళ్లి అమ్ముతుండేది.
కావేరి : చేపలమ్మ చేపలు, తాజా తాజా చేపలు, శుబ్రము శుభ్రం చేసి ముక్కలుగా చేసిన చేపలు, అని అంటూఅమ్ముతూ ఉండేది, కావేరి వచ్చిన చిన్న ఉపాయం వల్ల వాళ్ళ చేపలు తొందరగా అమ్ముడు పోతుంటాయి.
విద్య : అమ్మ ఇలానే మన చేపలు రోజు అమ్ముడు పోతూ డబ్బులు వస్తే మన కష్టాలు తొందర్లోనే తీరిపోతాయి కదా అమ్మ అని అంటుంది.
అలా వాళ్ళ రోజులు గడుస్తుంటాయి, ఎప్పటిలాగానే విద్య చెరువు నుంచి చేపలు పట్టుకొని వచ్చి కావేరి ముందు పెడుతుంది. కావేరి ఒక పెద్ద ఆక్తితో ఒక చేపని మధ్యలోకి నరకగానే అందులోనుంచి ఒక చిన్న బాబు బయటకి వస్తాడు. చేప కడుపునుంచి వచ్చిన బాబుని చూసి విద్య కావేరి ఎంతో ఆశ్చర్య పోతారు,
కావేరి : అమ్మ దేవుడు మనకి ఈ బాబు ఇచ్చిన వరం ఏమో తల్లి, మనతో పాటే ఈ బాబు కూడ ఉంటాడు, మన కుటుంబం లో ఇంకొక వ్యక్తి వచ్చాడు తల్లి అని అంటుంది కావేరి.
ఆరోజు నుంచి బాబుని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు విద్య కావేరి.
షార్ట్ స్టోరీ
చేపలు అమ్ముకుంటూ బ్రతికేవారు శివ వాళ్ళ కుటుంబం, శివ కి కావేరి అనే భార్య మఱియు విద్య అనే కూతురు ఉండేది, ఒకరోజు పని మీద పక్క ఊరు వెళ్లిన శివ ఒక రోడ్డు ప్రమాదం లో చనిపోతాడు, అప్పటి నుంచి విద్య చేపలు పట్టుకొస్తే వాటిని శుభ్రపరిచి ముక్కలుగా చేసి కావేరి, ఊరిలో అమ్ముతూ ఉండేది, అల్లా ఒకరోజు విద్య తెచ్చిన చేపలను కావేరి శుభ్రపరుస్తుండగా చేప కడుపు నుండి ఒక పిల్లడు బయటకు వస్తాడు, పిల్లాడిని చూసి విద్య కావేరి ఆశ్చర్యపోతారు, అప్పటి నుంచి ఆ బాబుని తమ పిల్లాడి లానే చూసుకుంటూ ఎంతో సంతోషంగా చూసుకుంటారు.
Related Posts

దెయ్యాల కూర | Telugu Kathalu | Bedtime Stories | Panchatantra kathalu | Horror Stories |Fairy Tales

నదిలో మాయా చేప | Telugu kathalu | Telugu Stories | Bedtime Dreams Telugu | Kattapa kathalu
