పేద అన్న చెల్లెలు రాఖి – POOR vs Rich Telugu Story- Telugu Kathalu-Stories inTelugu -Kattapa Kathalu
రంగాపురం అనే ఊరిలో రాజయ్య, రమణమ్మ అనే పేద దంపతులు ఉండేవారు, రాజయ్య రోజు కూలి పనులకి వెళ్ళేవాడు, రమణమ్మ ఆ ఊరిలో ఉన్న జమీందారు ఇంటిలో పాచి పని చేస్తూ జీవనం గడిపేవారు. వారికి అరుణ్, దీప్తి ఇద్దరు పిల్లలు. అరుణ్, దీప్తి లకు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. తల్లి దండ్రులు ఎంత కష్ట పడుతున్నా ఇల్లు గడవడమే కష్టంగా ఉండేది. జమీందారు భార్య అప్పుడప్పుడూ మిగిలిపోయిన ఆహార పదార్ధాలు ఇస్తూ ఉండేది. అలా ఇచ్చిన రోజు పిల్లలకి కడుపునిండా పెట్టి మిగిలిన దాంతో భార్య భర్తలు సర్దుకుపోయేవారు. పిల్లల్ని చదివించడం చాలా కష్టంగా ఉండేది.
ఇలా ఉండగా ఒకరోజు రమణమ్మ, రాజయ్య దగ్గరికి వచ్చి
రమణమ్మ :- అయ్యా, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో పిల్లలను చదివించడం ఎంతో కష్టం అవుతుంది కదా? వాళ్ళని బడి మాన్పించేద్దాం, దీనికి నువ్వేమంటావ్?
రాజయ్య :- పిల్లలకు పెద్దలు ఇచ్చే గొప్ప ఆస్తే చదువు, కానీ ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ చదువు ఆపెయ్యాల్సి వస్తుంది,. ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదు అంటూ ఏడుస్తాడు రాజయ్య
ఇదంతా దీప్తి పక్కన ఉండి వింటుంది. వెంటనే దీప్తి తల్లిదండ్రుల ముందుకు వచ్చి ఏడుస్తూ
దీప్తి :- అమ్మా, మీరు మాట్లాడే మాటలు అన్ని నేను విన్నానమ్మా, మీరు తమ్ముడిని నన్ను చదువు మాన్పించాలి అనుకుంటున్నారు కదా. కాని చాలా బాగా చదువుతాడు అమ్మ కనీసం వాడినైనా చదివించుదాం అమ్మా, ఇబ్బంది కాకుండా ఉండడానికి నేను నీతో పాటు పనికి వస్తానమ్మా. ఇద్దరం పని చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి కదమ్మా తమ్ముడిని చదివించొచ్చు,
రాజయ్య :- తల్లి దీప్తి తమ్ముడి చదువు కోసం నీ జీవితాన్ని త్యాగం చేస్తున్నావ్, నీలా తమ్ముణ్ణి ప్రేమించే అక్క ప్రతి ఒక్కరికి ఉండాలమ్మ అని అంటాడు
అలా దీప్తి తల్లి తో పాటు జమీందారు ఇంట్లో పని చేస్తూ తమ్ముణ్ణి చదివిస్తుంటుంది.
ఒకరోజు అరుణ్ దీప్తి దగ్గరికి వచ్చి
అరుణ్ :- అక్క నువ్వు చేసింది ఏమి బాలేదు. ఈ రోజు మా స్కూల్ దగ్గరికి వచ్చి నా గురించి అడిగావంట, నీ బట్టలు నిన్ను చూసి నన్ను గేలి చేశారు, ఇలా చేశావేంటి అక్క అని అక్క మీద అరుస్తాడు
అంతలో రమణమ్మ అక్కడికి వచ్చి
రమణమ్మ :- అరేయ్ అరుణ్ ఏంటి రా అక్క మీద అరుస్తున్నావ్
అరుణ్ :- చూడమ్మా అక్క ఈ చిరిగిపోయిన బట్టలతో మా స్కూల్ కి వచ్చి నా పరువు తీస్తుంది.
రమణమ్మ:- ఏంట్రా అది నీ పరువు తీసేది. నువ్వు కొత్త పుస్తకాలు అడిగావని అక్క ఈ వారం అంత ఎంతో కష్టపడి డబ్బులు పోగేసి నీ కోసం బుక్స్ తెస్తే నువ్వు ఇలా అరుస్తున్నావ్
అయినా ఆ రోజు మేము మీ ఇద్దరినీ స్కూల్ మాన్పించాలి అనుకున్నపుడు మీ అక్క పని చేస్తూ నిన్ను చదివిస్తాను అన్నది అలాంటిది నువ్వు ఇప్పుడు అక్క మీదే అరుస్తున్నావ్ అని చెప్తుంది అరుణ్ కి
అరుణ్ ,దీప్తి దగ్గరికి వెళ్లి
అరుణ్ :- నన్ను క్షమించి అక్క నేను నిన్ను తప్పుగా అర్ధం చేసుకున్నాను, నీ ప్రేమని నేను అర్ధం చేసుకోలేక పోయాను. అని ఏడుస్తూ చెప్తాడు
అలా రోజులు గడుస్తుండగా అనుకోకుండా రాజయ్య పక్షవాతం తో మంచాన పడతాడు.
దీప్తి కి ఇంటి బాధ్యత ఇంకా పెరుగుతుంది. వచ్చిన డబ్బు ఏమాత్రం సరిపోయేది కాదు ఇంట్లో తినడానికి కూడా ఏమి ఉండేవి కావు.
ఇదంతా గమనించిన అరుణ్ చాలా బాధపడతాడు.
ఇంతలో రాఖి పౌర్ణమి దగ్గరకు వస్తుంది.
దీప్తి :- హయ్యో దేవుడా ఏమిటి ఈ పరిస్థితి? ఎప్పుడూ తమ్ముడికి సంతోషంగా రాఖి కట్టేదానిని, ఈ సారి కనీసం రాఖి కొనడానికి కూడా డబ్బులు లేవు, నాన్న పరిస్థితి చూస్తే అలా ఉంది. ఏమి చెయ్యాలి దేవుడా అని ఎంతో బాధపడుతూ ఉంటుంది.
సాయంత్రం జమీందారు గారి ఇంట్లో మని ముగించుకొని వచ్చిన దీప్తి వాళ్ళ అమ్మకి ఒక మూట చూపిస్తూ
దీప్తి :- అమ్మ ఇవ్వి జమీందారు గారి పూర్వీకులకు సమందించినవి అంట, ఇందులో ఏవైనా అవసరం వచ్చేవి ఉంటె వాడుకోమని జమీందారు గారి భార్య నాకు ఇచ్చింది. పోయినసారి మనకు వచ్చిన డబ్బులన్నీ నాన్న మందుల ఖర్చులకే అయిపోయాయి, ఇప్పుడు రాఖి పండుగ వస్తుంది కదా అమ్మ తమ్ముడికి రాఖి కోడమూ అంటే డబ్బులు లేవు అందుకే వీటిలో ఉన్న వస్తువులతో రాఖి తాయారు చేసి తమ్ముడుకి కట్టాలి అనుకుంటున్నాను అమ్మ
రమణమ్మ :- సరే అలాగే కానీ అమ్మ తమ్ముడు కూడా చాలా సంతోషిత్తాడు అని అంటుంది
ఆరోజు రాత్రంతా కూర్చొని ఆ పథ వస్తువులతో ఒక మంచి రాఖి తాయారు చేస్తుంది.
ఆ పథ వస్తువులలో కొన్ని శక్తులు ఉండడం వాళ్ళ అది ఒక మాయ రాఖీ గా మారుతుంది.
ఆ తయారు చేసిన రాఖి ని చూస్తూ దీప్తి
దీప్తి :- అబ్బా ఎంత బాగుందో నిజంగా కొన్న రాఖి లాగానే ఉంది, రాఖి తో పాటు కొన్ని మిఠాయిలు కూడా ఉంటె ఇంకా బాగుండేది అని అనుకుంటుంది
ఇంతలో ఆ మాయ రాఖి నుండి కొన్ని మిఠాయిలు వస్తాయి, అది చూసిన దీప్తి ఎంతగానో భయపడుతుంది
మాయ రాఖి :- భయపడకు దీప్తి, నేనొక మాయ రాఖి ని, నీ కష్టాలు చూస్తుంటే నాకెంతగానో బాధేసింది, అందుకే ఇలా చేశాను. ఇక నుంచి నీకు ఏ విధమైన సహాయం కావాలన్నా నన్ను అడగొచ్చు కానీ అత్యాశకి పోతే మాత్రం మొదటికే మోసం ఇది గుర్తుంచుకో సుమా అని చెప్తుంది మాయ రాఖి
దీప్తి ఎంతో సంతోషం తో మిఠాయిలు మరియు రాఖీని తీసుకెళ్లి ఇంట్లో పెడుతుంది
రాఖి పొర్ణమి రానే వచ్చింది దీప్తి ఎంతో సంతోషం తో రాఖి ని తీస్కొని తమ్ముడి దగ్గరికి వెళ్తుంది, తమ్ముడికి రాఖి లట్టి మిఠాయి పెడుతుంది.
అరుణ్ వెంటనే ఒక పెద్ద బహుమతి తీసి ఇస్తాడ దీప్తి కి
దీప్తి :- తమ్ముడు ఇది ఎంతో విలువైన బహుమతి ఇది కొనడానికి నీకు డబ్బులెక్కడివి? ఐ అడుగుతుంది
అరుణ్ :- మాస్ స్కూల్ కి సెలవులు ఉన్న రోజు మన ఊరు చివరి మామిడి తోటలో పని చేసి డబ్బులు సంపాదించి ఈ బహుమతి కొన్నాను అని చెప్తాడు
దీప్తి అరుణ్ ని చూస్తూ
ఇక మన కష్టాలు తొలిగిపోయినట్టే తమ్ము డు, నీకు కట్టింది ఒక మాయ రాఖి ని అది మనం అత్యాశకు పోకుండా ఏది అడిగిన ఇస్తుంది. దానితో మన కష్టాలన్నీ తీరిపోతాయి అని చెప్తుంది
ఆ రోజు నుండి ఎవరు అత్యాశకి పోకుండా మాయ రాఖి ఇచ్చే దానితో తృప్తి పడుతూ సంతోషన్గా జీవిస్తారు
Related Posts

బీదల రాఖీ పండుగ POOR vs Rich Telugu Story- Telugu Kathalu-Stories inTelugu -Kattapa Kathalu

పేదపిల్ల అండర్ గ్రౌండ్ డబ్బు Telugu Kathalu | Telugu Stories | Fairy Tales
